2, జూన్ 2019, ఆదివారం

న్యస్తాక్షరి - 63

సరస్వతీ దేవిని స్తుతిస్తూ ఆటవెలది వ్రాయండి.
నాలుగు పాదాల యతిస్థానంలో వరుసగా 'స-ర-స్వ-తీ' అనే అక్షరాలుండాలి. 
(లేదా...)
సరస్వతీ దేవిని స్తుతిస్తూ చంపకమాల వ్రాయండి.
న్యస్తాక్షరములు.....
1వ పాదం 1వ అక్షరం 'స'
2వ పాదం 6వ అక్షరం 'ర'
3వ పాదం 15వ అక్షరం 'స్వ'
4వ పాదం 21వ అక్షరం 'తీ'

83 కామెంట్‌లు:

  1. జగతి నేలు తల్లి సరిలేరు నీకంట
    లక్ష్య బెట్టి మమ్ము రక్ష జేసి
    చదువు నేర్పి మాకు స్వశక్తి నీయగ
    తెలివి గలిగి బ్రతుక తీరు మలచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'స్వశక్తి' అన్నచోట గణదోషం. "చదువు నేర్పి తెలివి స్వచ్ఛత నీయగ" అందామా?

      తొలగించండి
  2. శరణు గోరుచుండ్రి సకలజనులు నిన్ను
    అక్షరమ్ము నిచ్చి రక్ష జేయు
    ఆస్తికులను బ్రోచి స్వస్తత జేకూర్చ
    ధరణి నేలుమమ్మ తిరము గాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'స్వస్థత' అన్నది సాధురూపం.దానివల్ల ప్రాసయతి తప్పుతుంది. చివరి న్యస్తాక్షరం 'తీ'. మీరు హ్రస్వంగా ప్రయోగించారు.

      తొలగించండి


  3. చదువుల జవరాల! సముచితముగ నహ
    రహము వలయు నమ్మ రహియు తల్లి!
    వాణి! కరుణ జూపు స్వనితపు మెరుపుల
    తెఱగు పల్కు లమర తీరు గాన


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    సరస్వతీ దేవిని స్తుతిస్తూ ఆటవెలది వ్రాయండి.
    నాలుగు పాదాల యతిస్థానంలో వరుసగా 'స-ర-స్వ-తీ' అనే అక్షరాలుండాలి.

    సకలవేదసారసరసిజాసనవీవె !
    రమ్యవర్ణభావరసశుభాంగి !
    వాణి ! యజుని రాణి ! స్వరసుధావర్షిణి !
    దేవి ! గొను సరస్వతీ ! ప్రణతులు !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సరస్వతీ దేవిని స్తుతిస్తూ చంపకమాల వ్రాయండి.
      న్యస్తాక్షరములు.....
      1వ పాదం 1వ అక్షరం 'స'
      2వ పాదం 6వ అక్షరం 'ర'
      3వ పాదం 15వ అక్షరం 'స్వ'
      4వ పాదం 21వ అక్షరం 'తీ'

      సతతము నీ పదాంబురుహసన్నిధి నా మది నిల్చినంత , వి...
      శ్రుతమగు సారవాఙ్మయము శోభిలు నా రసనాగ్రసీమ ! భా...
      రతి ! కరుణాపయోనిధి ! సరస్వతి ! సుస్వరదివ్యదీధితీ !
      స్థితమతి గోరుచున్ దలచితిన్ కరుణింపవె ! మంగళాకృతీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

      తొలగించండి
  5. సరసత జిల్క నుంచి,కడు
    చక్కని గ్రంథము చేత దాల్చుచున్,
    మురిపెము దీర వీణియను
    మ్రోగగజేయుచు,బద్మహస్తవై,
    మెరసెడి యక్షమాల గొని,
    మేదురభాస్వరనేత్రదృష్టితో,
    జిరముగ మమ్ము గాంచగదె!
    చిన్మయి!ధాతృనిరాణి!భారతీ!

    రిప్లయితొలగించండి
  6. చదువు లి చ్చి మాకు సరస భావము లిచ్చి
    రక్ష జేయు మమ్మ రహి ని తల్లి
    వరములిచ్చి నీవు స్వర వీణ పాణి వై
    తి ర ము గాను కోర్కె తీర్చు మమ్మ

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. కాని మొదటి, మూడవ పాదాలు తేటగీతి, రెండవ, నాల్గవ పాదాలు ఆటవెలది అయ్యాయి. సవరించండి.

      తొలగించండి
    2. సకల విద్యలసతి సరసిజు ముఖవాసి
      రమ్యమైన వాక్కు రసనయందు
      వరలజేయగ మృదు స్వనంబుదోడుత
      దేవి నిన్నుగొల్తు తీరుగాను

      తొలగించండి
    3. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      'మృదు స్వనము' అన్నచోట 'దు' గురువై గణదోషం. "వరలగన్ మృదువగు స్వనంబు..." అనండి.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

      సకల విద్యలసతి సరసిజ ముఖవాసి
      రమ్యమైనవాక్కు రసనయందు
      వరలగన్ మృదువగు స్వనంబు దోడుత
      దేవి నిన్నుగొల్తు తీరుగాను!

      తొలగించండి

  8. ఆటవెలది
    చదువులమ్మ నెపుడు సద్భక్తి సేవింప
    లాల నీయ శీలి రక్ష సేయు
    జ్ఞానియై వరలిల స్వస్తి చేకూరును
    ధీజ నాళి చే ప్రతిష్ఠ నొందు
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజలింగం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి న్యస్తాక్షరం 'తీ'. మీరు హ్రస్వంగా ప్రయోగించారు.

      తొలగించండి
  9. శ్రీ గురుభ్యోన్నమః🙏
    వా.చ.స్ప. తీ స్వరూపులకు వందనములు.
    మిమ్ము యతులతో బంధించే ప్రయత్నము చేసితిని.. తప్పైయిన మన్నించ ప్రార్థన!

    వయసు మీద బడిన వాగ్మయమ్మీడని
    శంకరార్యు మనకు చదలుకెంపు*
    పట్టి ప్రాస యతుల స్పష్ట బఱచి యెప్డు
    తెనుగుభాష నున్న తీపి దెలిపె

    చదువు మొదలు బెట్ట సరసవాఙ్మయమునుఁ
    రాగయుక్త మౌచు రయము బెంచి
    సర్వ జనులు మెచ్చి స్వజనులు గొలువగా
    తెలుగు భాష కింత తీపి గూర్చె

    *చదలుకెంపు-సూర్యుడు

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    [స]తతము నిన్నుఁ గొల్తు ఘన సంస్తుతిఁ; బ్రేమను నిత్తు నెప్డు హా
    రతి; కవితల్ [ర]చింపఁ బిసరంతయు సేగి హుళక్కిగా సర
    స్వతి యిడి, కావుమమ్మ! సరసస్థిర స[స్వ]ర శాంతిఁ గూర్చు గీ
    తి తిరముగా వెలుంగ, వినుతించెదఁ బద్దెములందు భార[తీ]!

    రిప్లయితొలగించండి
  11. చ. (స)రళమె విద్యలెల్ల మన సారగ మ్రొక్కగ నిన్ను శారదా!
    వరములు కో(ర)నెన్నడును ప్రార్ధన చేసెద నమ్మకమ్ముతో
    నిరతము పూజలొడ్డెదను , నెందున హ్ర(స్వ)ము చూడ బోకు! నా
    కరమును వీడ వద్దు ! కనికారము జూపుము తల్లి భార(తీ)!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కనికరము'ను 'కనికారము' అన్నారు.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. [స]కల కళా విభూషిత ప్రశస్త కవిత్వ విరాజమాన ధీ
      ర కర ఝరీ [ర]సోజ్జ్వలిత రమ్య సుకీర్తిత కావ్య రాజమున్
      స్వకర విభాసమానముగ వ్రాయఁగ స[స్వ]ర గాత్ర మానసాం
      తికమున నీవు వెల్గుచు విధేయుని నన్ గనుమమ్మ భార[తీ]!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  13. సత్య వాక్కు గరిమ సతతము నాయొక్క
    రసన పైన నిలిపి రక్ష జేసి,
    సత్కవితలనిచ్చి స్వరభావ జగతిలోఁ
    దిప్పి నాదు కోర్కె తీర్చవమ్మ..��

    రిప్లయితొలగించండి
  14. ఆ. వె. చదువు లమ్మ గాదె! సకల కళల రాణి
    రాగ మొలికి విద్య రమ్య మవగ
    సర్వ కళల నేలు స్వర రాణిఁ నమ్మెద
    తేట నిచ్చి నుదట తిలక మద్దు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి న్యస్తాక్షరాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.

      తొలగించండి
  15. శాబ్ది గొల్చు వాడె సర్వతో ముఖుడౌను
    రాగ మోహములను రగుల నీక
    శాంత మెపుడు మదిని స్వస్థత జేకుర
    దేవి! వాణి! భారతీని గొలువు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భారతిని' అనడం సాధువు. అక్కడ "భారతీ నమామి" అనండి.

      తొలగించండి
  16. చదువులమ్మ నిన్ను 'స' న్నుతించెదమమ్మ
    రక్తి గట్టెడి పద ''ర' త్నములను
    సముచితముగ నీవె 'స్వ' యముగ నందించ
    తెలుగు భాష యింక 'తీ' పినొందు

    రిప్లయితొలగించండి
  17. సకల కళలయందు సమదృష్టి సారించి
    రక్తి గొలుపు నటుల రసధుని నిడ
    చక్కనైనయట్టి స్వరముల సృష్టించి
    తీవె వాణి భగవతీ నమోస్తు !

    రిప్లయితొలగించండి
  18. సరస చతుర సాధు సంభాషణా యుక్తి
    రమ్య భవ్య కావ్య రచన శక్తి
    స్వజన సుజన మైత్రి సద్బుద్ధి సద్భక్తి
    తీరు నొసగి వాణి తీర్చి దిద్దు 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం యతిస్థానంలో 'స్వ' రాలేదు.

      తొలగించండి
  19. సమసిబోవ జన్మ సన్నుతి చేసెద
    రావె నొసగుమది, పరమపదమును
    శాశ్వతముగ జేర అస్వతంత్రుడు, కోరె
    తిమిర నాశ విద్య తీవ్రముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతిదోషం.సవరించండి.

      తొలగించండి
  20. చదువులజవరాలు-సరసభాషణమును
    రాగసుధలనొసగ-రమ్యగతుల
    వరముకోరుకొందు-స్వజనము మెచ్చగ
    తీయతేనెలొలుక-తిరముగాను

    రిప్లయితొలగించండి
  21. జగతి నేలు రాజు "స"రసుడౌ స్వార్ధాన
    లక్ష్మి మూట గట్ట "ర"క్ష మరచు
    చదువు లేక తాను "స్వచ్ఛత వీడుచు
    తెలివి వదలు భార"తీ" నమోస్తు

    రిప్లయితొలగించండి
  22. సదమలాత్మ నలిన సల్లలిత మృదు క
    ర నలినజ హృదంతర నిజ దార
    స్వర వరాధి నేత్రి స్వంగ విలాసవ
    తీ దయా సరస్వతీ ప్రణతులు


    సరసిజ పుస్త కాక్ష సర చారు శుకస్థిత హస్త రాజితా
    వర సిత శార దాంశునిభ వక్త్ర విభూషణ దీప్త విగ్రహా
    సురుచిర పాండ రాంబర విశుద్ధ ససుస్వర భావ నాక సం
    చర చతురానన ప్రణయ జాయ నతుల్ గొనుమా సరస్వతీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 31/10/2017 నాటి పద్యము:

      (స)(ర)స మృదు సు(స్వ)రము ల(తి)శయముగఁ దన
      (ర)గను గించిదప(స్వ)ర సంగమ మ(తి)
      (స్వ)యముగ స(తి) మాన్పంగను వరము నిమ్ము
      (తి)విరి కృపఁ జూడుమ (సరస్వతీ) సతతము

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      శబ్దాలతో ఆటాడుకున్నారు కదా! అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  23. సమసిబోవ జన్మ సన్నుతి చేసెద
    రావె నొసగుమది, పరమపదముల
    సవరదనము జూడ, స్వస్తిముఖుఁడు వేడె
    తిమిర నాశ విద్య తీవ్రముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రావె యొసగు' అనండి.

      తొలగించండి
  24. జన్మసార్ధకతకు సలలిత భావాలు
    రక్ష గూర్చునట్టి రచనలొసగి
    జాతి మెచ్చునట్టి స్వజనుల మేలెంచు
    దివ్యమైనచదువు తిప్పు దశకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి న్యస్త్రాక్షరాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.

      తొలగించండి
  25. సకల విద్య లొసగు సత్యమ్ముగా దాను
    రసన యందు నిలిచి రహిని గూర్చు
    స్వనములన్ని దాను స్వర రాజ్ఞియే దాను
    తీరు నొసగు దాను తీపి పలుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (స)రస రసజ్ఞ సంచరిత శారద నా మది గొల్వు దీరుమా
      సురసములూ(ర) నా పలుకు శోభను గూర్చు వరంబు లీయుమా
      వర శుభ రాగ మాలికల భక్తిగ సు(స్వ)ర హారతిత్తునే
      నిరతము నీదు పూజలను నీమము దప్పక జేతు భార(తీ)

      తొలగించండి
    2. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. సరసిజాసనుసతి సకలవిద్యాదాయి
    రమ్యమైన మతిని రయము నిమ్ము
    వాక్కునకధి దేవి స్వరరాణి వీవమ్మ
    తిరము గనిను భారతీ కొలుతును.

    రిప్లయితొలగించండి
  27. సరసిజురాణి శారద విశాలవిలోచని విశ్వసాక్షిణీ
    వరశృతిసారరూపిణి శుభాంగిని మంజుల వాగ్విలాసినీ
    విరివిగ మాకునీయవె వివేకము,సుస్వరగాత్రమాధురుల్
    తరగని పెన్నిధీ!నిను సతమ్ము మనమ్మునగొల్తు భారతీ!

    రిప్లయితొలగించండి

  28. సరసిజభవు రాణి సద్విద్య లొసగుచు
    నహరహమ్ము మనకు రహిని కూర్చు
    చక్కని గళమొసగి స్వరమెత్తి పాడెడి
    తీరు నేర్పి సన్మతీయ వమ్మ

    రిప్లయితొలగించండి
  29. చదువులమ్మ నిన్ను *స*ద్భక్తి మ్రొక్కెద
    రమ్ము నన్ను బ్రోవ *ర*యముగాను
    సతము నీవు నిలువ *స్వ*యముగ మది వ్రాసి
    తెలుగు పదముల కుతి *తీ*ర్చు కొందు

    రిప్లయితొలగించండి
  30. ఆటవెలది
    పతికి మోము నందు సతిగ నీవొదుగగా
    శ్రుతుల వేల్పు ననవరతము మెరసె
    పలుకు లమ్మ నాదు స్వరమందు కొలువైన
    వ్రాయఁ బాడి కవిత తీయనగును

    రిప్లయితొలగించండి
  31. మరొక పూరణ

    చదువు సంధ్య లొసగు సరసిజ భవురాణి
    రాగమలర మనకు రయము గాను
    సర్వకళల రాణి స్వరమెత్తి పాడెడు
    తీరు నేర్పవమ్మ తిరము గాను

    రిప్లయితొలగించండి
  32. చదువులమ్మ!యిడవె సహృదయ భావన
    రమ్య కవన ధార రసన నిలువ
    వాగ్విలాస గరిమ స్వరనిధాన మహిమ
    స్థిరమగుమతి సుస్థితియు ప్రతీతి

    రిప్లయితొలగించండి
  33. శాబ్ది,బాణ,బ్రహ్మ( స)తి, చదువుల జవ

    రాలు,బాస,అంచ (ర)వుతు భార్య

    స్వంజు గృహిణి, శుక్ల, (స్వ)చ్ఛమాత,పలుకు

    దేవి,దయను జూపు (తీ)గ బోడి

    రిప్లయితొలగించండి
  34. సన్నుతింతు నిన్ను సరసిజ భవురాణి
    అక్షరమ్మునిచ్చి రక్ష జేయు
    భక్త జనుల కీవు స్వస్తిని గూర్చుచున్
    బ్రోవరావె ధరణి తీవ బోడి.

    రిప్లయితొలగించండి
  35. సరసిజ నేత్రివంచు నిను సత్కృప గోరి భజించువాడనై
    ధరణిని జేరరమ్మనుచు తల్లిని గోరెద, హంసవాహినిన్
    గరములు మీటఁ వీణియయె క్వాణన సుస్వర నాదమీనగన్
    భరమని యెంచబోకుమిక భక్తులఁ బ్రోవగ తల్లి భారతీ

    రిప్లయితొలగించండి
  36. డా
    పిట్టా సత్యనారాయణ
    సన్న నన్నము పులుపు రసమ్ము కొరకు
    రాత పూత నొనర నీదు రచన నెరు గ
    వరుస నా చా ర్య వరు ని నిస్వనము నివ్వ
    తిండి ,గుడ్డ, గూడుల నస తీరే వాణి!

    రిప్లయితొలగించండి