5, జులై 2019, శుక్రవారం

సమస్య - 3066 (పూరణఁ జేయంగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే"
(లేదా...)
"పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే"
(జిలేబీ గారికి ధన్యవాదాలతో....)

66 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    బోరును కొట్టగా తినుచు ప్రొద్దున రాతిరి రాజభోగులన్
    కోరిక తీరగా కలిపి కొబ్బరి కోరును పంచదారతో
    తీరుగ వంగదేశమున త్రిప్పలు పెట్టెడి కజ్జికాయలన్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే!

    (రాజ్ భోగ్ = కేసరి రసగుల్లా)

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "తిప్పలు పెట్టగ స్వీయకుక్షినిన్ । పూరణఁ జేయగా..." అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  3. సారము తెలిసిన చాలును
    భారము గాదనుచు మిగుల భాషా మృతమున్
    మీరిన సంతస మందున
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁ డికిఁ దరమే

    రిప్లయితొలగించండి
  4. వారింటను చేరినదట
    దారిద్ర్యమ్మొసగు తల్లి తాండవ మాడన్
    కోరిన ఫలమేమి యచట
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    పారె కురీతులు సరిపడ
    పోరెదరే పాలసీల(policies) పుణ్యము చేతన్
    మారునె కవితల వలనన్
    బూరణ జేయంగ బలుకు బోడికి దరమే!?

    రిప్లయితొలగించండి
  6. ధారణ జేయువా రలకు ధాత్రిని ఖ్యాతిని తెచ్చిపెట్టునే
    పారణ జేసిజేసి పలు భాషల రీతుల కావ్యమల్లగన్
    నేరము లెంచకుం డగను నీమము తోడుత పద్యసౌ రులున్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రమ్మకునైన సాధ్యమే

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    తీరని కోర్కెలన్ గలగి తిమ్మని రీతిని కొమ్మకొమ్మకున్
    పారగ లాభమే? నిహిత భైరవ రూపము వీడకుండియున్
    చారెడు యోగ సిద్ధి గను చాడ్పున మెల్గకె యాత్మ బోధనన్
    బూరణ జేయగా బలుకు బోడికి బ్రహ్మకునైన సాధ్యమే?!

    రిప్లయితొలగించండి
  8. చారుతరార్థసుందరవచస్సముదీరితమాధురీలస
    త్సారనిరస్తదోషకవిసన్నుతరీతుల శంకరార్యుచే
    వారక శంకరాభరణవర్గమునందిడు నాసమస్యలన్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న రాత్రి కందపద్యాలతో విష్ణుపరంగా 'వరద శతకం' వ్రాయలని సంకల్పం కలిగింది. దానిని ఒక్కరోజులో పూర్తి చేసి రేపు ముద్రణకు ఇచ్చి ఈనెల 13న బెంగుళూరులో జరిగే 'ప్రజ - పద్యం' సమూహం ఆత్మీయ సమావేశంలో ఆవిష్కరిస్తున్నాను. మీ శుభాశీస్సులు కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధ్భుతము గురువర్యా!మీ సంకల్పబల మమోఘము!! మీకు "సద్యః శతకకర్త" బిరుదు తగియున్నది!!
      వందన శతములు!!

      తొలగించండి
    2. ఒక్క దినము లోనె యక్కరుణాళుని
      వరద శతక మల్ల గురువు గారు
      తగును మీకె వినుడు తదుపరి యొక గంట
      ధ్యేయ మగును చేయ దివ్య కృతిని.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారు వందనములు. మీ యేక దిన శతక పూరణాభిలాష నిర్విఘ్నముగా జయప్రద మైనందులకు సంతోషాంతరం గాభినందన సంయు క్తాశీర్వచనములు (వయోవృద్ధుని గనుక).

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  10. తీరును దెన్నును గానని
    సారము లేనట్టి దగుచు జటిల పదములన్
    పేరుకు సమస్యయనగా
    పూరణ జేయంగ బలుకు బోడికి దరమే

    రిప్లయితొలగించండి
  11. ధారణఁజేసి పద్దెముల ధన్యత కోమలులందెవేసి యిం
    పారగ సర్వ శక్తుల నహర్నిశలున్ తళుకొత్త నేర్వగా
    వారల కెందు లేదెదురు-వాస్తవమియ్యది యంచుఁబల్కగా
    పూరణఁజేయగా బలుకుఁబోడికి బ్రహ్మకు నైనసాధ్యమే.

    రిప్లయితొలగించండి
  12. (బ్రహ్మదేవుని మునిమనుమడు మంకుపట్టువీడని లంకేశుని మార్చటం అసాధ్యం)
    ఆరయ బద్మసంభవున
    కందరు మెచ్చిన ముద్దుమన్మడే!
    ప్రేరణ మీరగా కడుపు
    ప్రేగుల రుద్రునివీణ జేసెనే!
    నేరపు రావణున్;దనుజ
    నేతను;శీర్షము బట్టి సన్మతిన్
    బూరణ జేయగా బలుకు
    బోడికి,బ్రహ్మకు నైన సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    [రంధ్రయుక్తమైన ఘటమున నీర పూరణము సేయుట వాణీ బ్రహ్మలకుఁ గూడ నసాధ్యమే యనుట]

    చేరఁగఁబోయి చక్కనగు చిన్నఘటమ్ములయందు రమ్యమై
    తీరుగ నున్న భాండమునుఁ దెచ్చి తధోముఖరంధ్రయుక్త; నే
    నీరము నింపఁ జూడఁగను, నిల్వక కాఱుచునుండె! నందులోఁ

    బూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  14. ప్రేరణ రాముని దైనను
    తీరుగ కృష్ణుని కథలను తెనిగించెనుగా
    మీరుచు పోతన శైలిని
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారలు వీరలంచు సహపాఠుల నందర బోల్చి చూచినన్
      సారఘ ధారలౌననగ జాలెడి పద్యములల్లుటన్నచో
      కారణ జన్ముడైన కవి గాక మరెవ్వరికైన నివ్విధిన్
      పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే

      తొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    ధీరతరాంతరంగుడయి దీటుగ దత్తసమస్య గాంచి , స...
    త్పూరణ జేయనెంచ పరిపూర్ణత గూర్చును వాణి ., కాని నే
    నేరనటంచు గద్దె దిగు నిర్ణయమున్ గొనువాని పల్కులన్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే !?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. పేరుకు రామకృష్ణుడట పెద్దగు హాస్యపు చేష్టితమ్ములన్
    గేరుచు పండితాళినట కేళిగ వాదములన్ని దీర్చుచున్
    మారిన మేకతోకలను మాటలగారడి జేయుపద్యపుం
    బూరణసేయగా బలుకుబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  17. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ధారుణి మరి మరి జన్మల
    కారణమయి నరుని మదిని
    కడ లెత్తుచు పెన్
    భారం బగు కామ వితతిఁ
    బూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  18. సారూ! కందివరార్యా
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
    మీరీరీతి యనుదినం
    బేరాలము కైపదముల వేయగ సభలోన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  19. సోరణి దివ్వె వెల్గులు రజోరసమున్ భళి పార ద్రోలగా
    ధారణ తోడు యత్నమిక తత్వము బుద్ధిని చేర్చుకొంచునా
    పూరణఁ జేయఁగాఁ, బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
    ప్రేరణ గూర్చి దీవనల భేషుగ నీకొసగన్ జిలేబియా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. ఒక్కరోజునశతకముజక్కగాను
    వ్రాయుమీచతురతకునావందనములు
    శతసహస్రములనిడుదుశంకరార్య!
    యందుకొనుమయ్యదయతోడహర్షమొదవ

    రిప్లయితొలగించండి
  21. శ్రీ గురుభ్యోన్నమః🙏

    ఘోర రణంబైనను సం
    హారము*న జయింప వచ్చు హరిమది దలపన్
    మీఁరొసగు మారుపాటగు^
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే!

    *నేర్పు,అభ్యాసం
    ^తారుమారు, తికమక

    రిప్లయితొలగించండి
  22. ధారుణి తిరుగుటకే యా
    ధారము దొరకొనెనటంచు తనయుండడుగన్
    పోరని. యా సందేహపు
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే

    రిప్లయితొలగించండి
  23. (కుచేలుని భార్య వామాక్షి తన భర్తతో)

    శారద కొలువగ నిచ్చెను
    కోరిన ఘనవిద్యలెల్ల కూరిమితోడన్
    మూరెడు నుదరపు నాకలి
    పూరణజేయంగ బలుకుబోడికి దరమే!

    - యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

    రిప్లయితొలగించండి
  24. ధారుణి కవిత్ర యాదిగ
    భారత రామాయణాది భాగవత కథా
    కారుల నిజమగు వెలితిని
    బూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే?

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. పూరణయనునదియొకకళ
    పూరణదాజేయువారుబుధవరులగుచున్
    మీరకఛందమునెపుడును
    బూరణజేయంగబలుకుబోడికితరమే.

    రిప్లయితొలగించండి
  27. సరదాగా
    చీరలు సారెలున్ కొనగ చేడియతోడను నేగసంతకున్
    సారెకు సారెకున్ దనదు శ్రద్ధనుమార్చుచు పెక్కుకొట్టులన్
    బేరములాడుచున్ దిరిగి వేసటబెట్టెడి నూత్నవాంఛలన్
    బూరణసేయగా బలుకుబోడికి, బ్రహ్మకునైన సాధ్యమే?
    self goal

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. కారణము లెన్ని చెప్పిన
    గారవ మతిశయిలఁ బద నికాయము తోడం
    బూరుష వరేణ్యునకునుం
    బూరణఁ జేయంగఁ బలుకుఁ, బోఁడికిఁ దరమే


    సార ధరా సతీపతి విశాల చతుర్భువ నాధినేతృ మా
    యా రమణీ సురూప ధరణైక విలోల వినీల దేహ స
    త్సారస లోచ నాక్షధర శార్ఙ్గధ రాంచిత వర్ణనీయ స
    త్పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే

    రిప్లయితొలగించండి
  30. పూరణజేయగానగునుపూర్ణమనస్కులునైనవారికిన్
    వారలుజాగరూకతనభావనజేసియువ్రాయుచోదగన్
    నేరికినైనసాధ్యమదియీపుడమిన్ మఱియీవిధంబుగా
    బూరణజేయగాబలుకుబోడికిబ్రహ్మకునైనసాధ్యమే

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తీరుగ కంది శంకరులు త్రిప్పలు పెట్టెడి కైపదమ్మునున్
    కోరిక తీరగా నిడుచు కోరగ ఘాటగు పూరణమ్ములన్
    మీరిన రాజకీయముల మెండుగ దోపెడి శాస్త్రిదౌ యథా
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే!

    రిప్లయితొలగించండి
  33. సారవిహీన పదముల న
    పారముగా చేర్చుచు నిక పద్యము లెల్లన్
    తీరుగ త్వరితగతిన నిట
    పూరణ చేయంగ బలుకుబోడికి తరమే


    రిప్లయితొలగించండి
  34. కోరిన చాలు తక్షణమె కోమలమౌ స్వర మందు పద్యముల్
    భూరిగ చెప్పు పండితుడు, పొంతన లేని పదాలు ఛందమొ
    ప్పారగ లేని వాక్యమును పద్యపు పాదము నివ్వగా యనెన్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబొఁడికి బ్రహ్మకు నైన హాధ్యమే.

    రిప్లయితొలగించండి
  35. మీరిన ప్రేమన్ఁ దల్లౌ
    భారతి వొడిలో సతతము బాలుని భంగిన్
    ప్రేరణ నొందుచు మీరిడు
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే!

    రిప్లయితొలగించండి


  36. ప్రేరణ గూడి పద్యముల భేషుగ వ్రాయన కోరగా జిలే
    బీ, రస రమ్య మాధురి సువిస్తృత మయ్యెడు‌రీతి దక్కునే
    బూరె జిలేబి గారెలని బువ్వల నివ్వ మటంచు కోరగా
    బూరణ సేయగా బలుకుబోడికి, బ్రహ్మకునైన సాధ్యమే?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. ధారణచేసి సత్కవులధార్మిక కావ్యవిశేషముల్ మదిన్
    పూరణకుద్యమించపరిపూర్ణతఁజేకురు, యల్పబుద్ధితో
    దారుణమైననర్ధరహితంబగుపద్యపుపాదమిచ్చినన్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే

    రిప్లయితొలగించండి
  38. శ్రీగురుభ్యోనమః,🙏
    ఇయ్యది నా మొట్టమొదటి ఉత్పలమాల వృత్త ప్రయోగము. శంకరార్య పాదార్పణమస్తు🙏🌺

    ధారగ పద్యముల్ యొసగ ధారణ నార్యులు గల్గియుండటన్
    మేరు నగమ్ము రీతిగను మేధను మెర్గులు దిద్దఁ బూనగా
    చోరులు దోచలేరు గద చోద్యముఁ జూడగ పద్య పాదముల్
    పూరణ జేయగా పలుకుబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  39. వరద శతకము పరమోత్కృష్టమై వరలుగాక!వాస్తు!!

    రిప్లయితొలగించండి
  40. కారణ మిద్దియంచు గన కష్టతరమ్ము సుమా!జగమ్మునం
    దేరికి గాని సాధ్యపడ దెప్పటికయ్యది చూడ చిత్రమౌ
    కోరికలెన్ని తీరినను గుట్టగ కూడెడు లోభి వాంఛలన్
    పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే

    రిప్లయితొలగించండి
  41. ప్రారబ్ధమేమొ నాకిది
    ప్రేరణ గలిగెన్ పదములు వీడక నన్నీ
    తీరున తికమక పెట్టగ
    పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే!!

    రిప్లయితొలగించండి
  42. హమ్మయ్య! దేవుని దయతో మీ అందరి అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులతో శతక రచన పూర్తి అయింది. అందరికీ ధన్యవాదాలు.
    ఏకదిన శతక లేఖన
    మీ కరణిం బూర్తి చేసి తిది యెల్ల కృపా
    సాకల్యమూర్తి శ్రీహరి
    ప్రాకటముగ నాకు దోడుపడుటం గాదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అభినందన మందారమాల గురువర్యా!"ఏకదిన శతకశేఖర" బిరుదు అందుకోండి!నమస్సులు!!

      తొలగించండి
    2. వర దాయకుడా హరి కరి
      వరదుని వరముగ వరలును వరదా శతకమ్
      సరగున నొక్క దినమ్మున
      పరుగిడె శంకరుల కలము ప్రతిభా ప్రభలన్

      శుభాభివందనములు 🙏

      తొలగించండి


    3. వ్రాసితి నా శ్రీ హరియే
      రాసిగ తోడ్పడ పదముల రాశుల తో వా
      రాశిగ శతకము నొక్కటి
      వాసిగ సిగకొప్పునమర ప్రజ-పద్యమునన్


      సెబాసో

      శుభాకాంక్షలతో

      జిలేబి

      తొలగించండి
    4. రంగని శతకము వ్రాయఁగ
      లింగడు తలపెట్టినంత ప్రేరణ కొదువే?
      భృంగము తేనియ నిడు సా
      రంగమును నుతిoచ నెంచ రాగము కొదువే?

      తొలగించండి
  43. నా ప్రయత్నం : ( స్వానుభవం)

    కందం
    నూరు దినాల వయస్సున
    మారాముగ పలకరించు మామనుమనివౌ
    కేరింతల కర్థమ్మునుఁ
    బూరణ జేయంగ పలుకు బోడికిఁ దరమే?

    ఉత్పలమాల
    నూరు దినాల ప్రాయమున నున్నటి బుగ్గల పట్టిపట్టికై
    దారిక రామ కీర్తననుఁ దన్మయమొందుచు పాడుచుండ సిం
    గారము మీర రాగముల కైవడి కేకల నవ్వుకర్థమున్
    బూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే?

    రిప్లయితొలగించండి