10, జులై 2019, బుధవారం

సమస్య - 3071 (కవివర్యున్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్"
(లేదా...)
"కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్"
(ఈరోజు నేను కోరుట్లలో అందె వేంకటరాజము స్మారక పురస్కారం 
అందుకుంటున్న సందర్భంగా....)

34 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కవనం బింతయు చేయలేని శఠులే గర్వమ్ము జంబమ్ముతో
    భవనం బొక్కటి యద్దెకున్ దొరకగా బ్రహ్మాండమౌ తీరునన్
    చెవిలో పూవులు బెట్టగా నగవుచున్ చెండాడి కొండాడుచున్
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి
  2. అవధాన రసికత నెరుగక
    కవనము వ్రాయంగ పిచ్చి గాసి వడంగ
    న్నవమా నించగ నీసున
    కవిని బురస్కృతునిఁ జేయఁగా వ్యర్ధ మగున్

    రిప్లయితొలగించండి


  3. అవిరళముగ నా కైపద
    పు విద్య పెంపొందగ సలుపు యతన మాయెన్
    సవరింపుడీ యెటుల నా
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్?


    శుభాకాంక్షలతో
    కంది వారికి


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. గు రు మూ ర్తి ఆ చా రి
    """""""""""""""""""" """""""""""""

    గురుభ్యోనమః ( నిన్నటిపూరణ స్వీకరించ మనవి )


    సత్యభామ కోపగృహప్రవేశము
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    అచ్చపు ప్రేమ లోన గలదంతయు వెల్లడి సేయు రీతిగా :--

    " త్రచ్చెద భామరో ! ద్వదను రాగసుధాంబుధినే " యటం చహా !

    పచ్చి యసత్యవాక్యముల బల్కితి వప్పుడు | కాని నేడు నీ

    పొచ్చపు బుధ్ధి బైటపడెపో ! యభిమానము బుగ్గి పాలయెన్ |

    మచ్చిక మీర తియ్యనగు మాట - లెదన్ గన కాలకూటమే ! !

    ' మచ్చరి బొమ్మ ' భీష్మసుత మానసకారగృహంబునందునన్

    ‌నిచ్చలు బందిగీడు వగు నిన్నిక నేనెటు విశ్వసించెదన్

    వచ్చన దారి బట్టుచు నివర్తిలు మంచు నిరస్తభూషయై

    హెచ్చిన బాధతోడ బవళించెను ‌కోపగృహంబునందునన్


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  6. బ్లాగ్ లోకము లో చక్కర్లు కొడుతున్న భడవాయ్ పల్కు గా :)

    అవసరము ప్లంబరులు సూ
    వె వర్ధిల సమాజమమ్మ! వెన్కటి బుచికీ
    కవులు జిలేబులు వలదోయ్
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. అవమానించుచు దైవము
    గవనమ్ముల వ్రాసి ధర్మ కంటకు లగుచున్
    నవనిని చెలంగు నట్టికు
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    కవి శ్రీనాథుడు పల్క "భాగవతసత్కావ్యమ్మునందింపగా
    భువి రాజేంద్రులు సొమ్ములిత్తు" రనుచున్ , పోతన్న దానిట్లనున్
    భవబంధమ్ముల ద్రుంచు దాశరథిసద్భావమ్ముకంటెన్ నృపుల్
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరు సవరణ..🙏శ్రీ వెలుదండ వారికి వందనములు

      శంకరాభరణం.. సమస్యాపూరణం..

      కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

      కవి శ్రీనాథుడు పల్క "భాగవతసత్కావ్యమ్మునందింపగా
      భువి రాజేంద్రులు సొమ్ములిత్తు" రనుచున్ , పోతన్న దానిట్లనున్
      "భవబంధమ్ముల ద్రుంచు దాశరథిసద్భావమ్మె మేలౌ ,! నృపుల్
      కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్" !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  10. కవిగాంచక రవిగాంచడు
    కవిసామాజిక ప్రగతికి కవితలుగూర్చున్
    అవివేకముతలబోసిన
    కవిని బురస్కృతునిఁ జేయఁగా వ్యర్ధ మగున్

    రిప్లయితొలగించండి
  11. నవులుచు తికమక కవితను
    చెవులారన్ వినగఁజెప్పు 'చిన్న'ను సభలో
    చివరికి వెఱ్ఱిని,కుఱ్ఱను,
    కవినిఁబురస్కృతునిఁజేయగా వ్యర్ధమగున్

    రిప్లయితొలగించండి
  12. కవులం గోరి సమాదరించి ఘనసత్కారమ్ములం జేసి త
    త్కవితాస్వాదనతృప్తచిత్తగతులై ధన్యాత్ములౌ వారకిన్
    హవణిన్ సత్కృతి నంద జేయు తరి నీ యా వాక్కు లే రీతి స
    త్కవివర్యున్ బిలిపించి యిచ్చు పురస్కారమ్ము వ్యర్థంబగున్?.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  13. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    సందర్భము: పురస్కారాలే ప్రధానంగా భావించే కవుల వద్దనుండి కవిత్వం క్రమంగా పలాయనం చిత్తగిస్తుంది. వారు సన్మానాలగురించే ఆలోచిస్తూ వాటికే అలవాటు పడిపోతారు. కవిత్వంలో మరింత లోతుకు వెళ్ళటంగురించి ఆలోచించరు.
    (అంటే పేరు ప్రచారాలకోసమే సమయ మంతా వెచ్చిస్తూ సారస్వ తాధ్యయనానికి సమయా న్నీయరు. వాళ్ళ కెంతసేపూ సన్మానాలూ శాలువలూ ఫోటోలూ వాట్సపులూ.. వీటిమీదే వుంటుంది కదా! ఇలాంటి కవులే ఈ నా డనేకులు.)
    అటువంటి కవులను పురస్కృతులను జేయటం వ్యర్థమే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అవని పురస్కృతులే ము
    ఖ్య విషయము లటంచు నెంచ
    గవనము జారున్
    భువి నలవా టగు నవి.. తత్
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా
    వ్యర్థ మగున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  14. తవిలియు బహువిధ రూపుల
    కవనములన్ సృజన జేసి ఘనుడై యుండన్
    ప్రవిమలు లొసగెడి దెట్టుల
    కవిని బురస్కృతుని జేయగావ్యర్థమగున్

    రిప్లయితొలగించండి


  15. చవులూరంగ సుధామయంబుగ సదా సాఫల్యమున్ గోరుచున్
    కవితామాధురి వెల్లువై వరలెడా కావ్యమ్ములన్ వ్రాయగా
    జవసత్వమ్ముల చేర్చి యెల్లరకు విజ్ఞానమ్ము చేగూర్చెడా
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. (విజయనగరసామ్రాజ్య చక్రవర్తి ప్రౌఢదేవరాయలవారి
    ఆస్థానదుర్మదకవిమత్తేభం అరుణగిరినాథడిండిమభట్టు)
    అవమానించెడి దారి బట్టుచు;మహా
    హంకారియై;యెందరో
    కవులన్ బండితులన్ దిరస్కృతపు ఘీం
    కారాల యంధత్వసిం
    ధువుగా రేగెడి డిండిమున్;బరమమౌ
    దుర్భావసంభావు;దు
    ష్కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పుర
    స్కారమ్ము వ్యర్థంబగున్.
    (పురస్కారము-గౌరవము;అంధత్వసింధువు-గ్రుడ్డియేనుగు)

    రిప్లయితొలగించండి
  17. కవి తాఁ వ్రాసిన కావ్యమున్ జదివి సత్కావ్యమ్మటంచున్ భువిన్
    సువిధానమ్మునఁ బాఠకాళి కడు సుశ్లోకించినన్ జాలదే,
    యవనీజానులె కీర్తికాముకతతో నార్భాటమున్ జూపుచున్
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ గురుభ్యోన్నమః🙏

    వివరముగ విష్ణుఁ దలపని
    కవనము లవణముఁ దగలని కలఁగూరఁ గదే
    అవిరల రచన సలిపెడి కు
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టా సత్యనారాయణ
    కవియను తెల్లని కాకిదె
    సవరిత సత్కోర్తె యొకటి సాగెనొ ముందే
    కవివరులకు గణనలె? సరి!!
    కవిని బురస్కృతుల జేయగా వ్యర్థమగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా నుండి
      2వ పాదం లో *సత్కోర్కె*గా చదువ గలరని మనవి

      తొలగించండి
  20. కవి కులమున కింపొదవగ
    కవితా సుమముల నలదెడి కవులకు గాకన్
    అవివేకియు మూర్ఖుడగు కు
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    రిప్లయితొలగించండి
  21. అవమానించుచుగవులను
    నవుబాలుగవ్రాయుచుండి నవ్వులబాలై
    కవనము జేయగరానికు
    కవినిబురస్కృతినిజేయగావ్యర్ధమగున్

    రిప్లయితొలగించండి
  22. డా. పిట్టా సత్యనారాయణ
    అవినాశంబగు కావ్య సృష్టికి యిలన్నట్లిట్లు తారాడగా
    బవరంబందున జ్ఞాన పీఠమునకై పారాడు వారే నిటన్
    కవనంబీగతి పైరవీల గలగన్ కాల్జాచె సంతృప్తికిన్
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి
  23. చవిగల కావ్యములల్లెడు
    కవయితునిగ పల్కి రోత కలుగు విధమునన్
    కవితల నందించెడి యా
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    రిప్లయితొలగించండి
  24. కవివర్యున్ బిలిపీంచియిచ్చెడిపురస్కారమ్ము వ్యర్ధంబగున్
    గవికిన్ వ్యర్ధము గాదుగాసకృతియెక్కాలంబునందైనసూ
    కవికిన్ గౌరవమీయగా దగునుసత్కావ్యంబువ్రాయంగగా
    గవియేనేర్వుముమౌనిగాధరనుదాకావ్యాభిలాషిండుచో

    రిప్లయితొలగించండి
  25. అవి యివి యేల ననంగ సు
    కవీంద్ర నిర్జర వరేణ్య కాయమ్మున కెం
    చ వర బృహస్పతిని వదలి
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    [కవి = శుక్రుఁడు; పురస్కృతుఁడు = ముందు నుంచఁ బడిన వాఁడు]


    సన్మానమునకు నోచుకొనని యొక కవి మనోభావము:

    భువి వీక్షించమె సర్వ వేదచయ సంపూర్ణార్థ విద్వాంసులన్
    సవి చెప్పంగ విరోధులం చకట తాత్సారంపుఁ జిత్తమ్ము నుం
    చి విచారించక పండితబ్రువుని, నాక్షేపించి సంభావ్య స
    త్కవివర్యుం, బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    లవలేశమ్మును నాంధ్రమున్ చదువకే రమ్యంపు కావ్యమ్ములన్
    దివినుండిన్ దిగి వచ్చుచున్ చిలిపిగా దివ్యంపు రూపంబునన్
    భువిలో నెచ్చట చిక్కనన్ని సరదా పూర్ణంబులన్ చేసెడిన్
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి
  27. వ్యవధానము లేక వడిగ
    నవివేకియునైన మనుజు డవనీ స్థలిలో
    వివరములేవి యడుగక కు
    కవినిబురస్కృతిని జేయఁగా వ్యర్థమగున్"*


    మరొక పూరణ
    కవితా శిల్పము నెరిగిన
    కవివరులను గౌరవింప ఘనతయు కలుగును
    కవితా గంధ మెరుగని కు
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    రిప్లయితొలగించండి
  28. అవిరళముగ నీతిని విడిచి
    చవిగొని చెడుదారిఁ బొందు సంపాదనపై
    న వికృతముల నొన రించు కు
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అవిరతముగ బీద పదముల
    రవణించెడి కవితలల్లి రస శూన్యంబౌ
    యవధానమ్ము లొనర్చెడి
    కవిని బురస్కృతుని జేయగా వ్యర్థమగున్.

    రిప్లయితొలగించండి


  30. అవియివి యేవో వ్రాయగ
    నవి సరి యాయని తెలుసుకొనక పొగుడుచు పై
    రవి చేయంగ తెలుసుకొన
    క, వినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. కందం
    అవిధేయుండుగ జాతికి
    నవమానంబుఁ గలిగించు వ్యంగోక్తులతోఁ
    గవనంబంచును బల్కు కు
    కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్

    మత్తేభవిక్రీడితము
    అవిధేయుండుగ మాతృభూమికి నపాయంబెంచు ప్రత్యర్థికిన్
    జవసత్త్వంబులఁ గూర్చనెంచు విధి శిక్షార్హుండు, నఫ్జల్గురున్
    స్తవనీయుండని పోల్చి చెప్పు పగిదిన్సారించు నున్మాదియౌ
    కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి