28, జులై 2019, ఆదివారం

సమస్య - 3088 (సదయుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్"
(లేదా...)
"కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో"

28 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    స్వీయ చరిత్ర (1965):👇

    అరెవో బీచిని వీడుచున్ చనగ తా హైరాన నొందంగటన్
    కరువై పోవగ కూడు గుడ్డలికనున్ కాషాయ వస్త్రాలతో
    పరువున్ బెట్టగ ఖర్గపూరునకహో బ్రహ్మాండమౌ తీరునన్
    కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వల్ప సవరణ:

      స్వీయ చరిత్ర (1965):👇

      అరెవో బీచిని వీడుచున్ చనగ నేన్ హైరాన నొందంగటన్
      కరువై పోవగ కూడు గుడ్డలికనున్ కాషాయ వస్త్రాలతో
      పరువున్ బెట్టగ ఖర్గపూరునకుహో బ్రహ్మాండమౌ తీరునన్
      కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో!

      తొలగించండి
  2. ఉదయము లేచిన తదుపరి
    పదపద మనిపరుగు లీను బహువే గమునన్
    కదనము ద్రొక్కుచు రొప్పుచు
    సదయుఁడు గంటం బడఁడు విశాఖ నగరిలోన్

    రిప్లయితొలగించండి
  3. ముదముగ సింహాచలమున
    కుదురుగ కొలువైనవాని కోరి భజించన్
    కదలగ నగరంబంతయు
    సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్!!


    యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

    రిప్లయితొలగించండి


  4. ఉదయంబాయెను విడుచుచు
    నిదురను జాగింగులన్ చనెడు మానవులే
    ను! దరిమి లా చూడంగ న
    సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్!

    హిడింబి

    రిప్లయితొలగించండి
  5. ముదమున ధనసంచయమును
    పదిమందికి బంచగోరి బహుయత్నములన్
    వెదకిన దీనుని కొరకై
    సదయుఁడు, గంటం బడఁడు విశాఖనగరిలోన్.


    నిరతానందము నందగోరి ధనమున్ నిష్ఠాగరిష్ఠాత్ముడై
    పరమాత్మప్రియులందు బంచుటకునై బల్రీతులన్ యత్నముల్
    నెరపన్ దీనజనాల కోస మచటన్ నిత్యంబు సద్బుద్ధితో
    కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ, గన్పట్ట డొక్కం డయో.

    హ.వేం.స.నా.మూర్తి.


    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    ఒక కరుణాత్ముడు విశాఖపట్టణములో తన ఔదార్యము చాటాలని వెళ్లి....... ఇలా అనుకుంటున్నాడు...


    వరపాథోనిధితీరవాసులగుటన్ భాగ్యాన్వితుల్ చిన్న జా..
    లరియైనన్ ధనవంతుడే కనకమాలక్ష్మీదయాపాత్రుడే !
    వరదాతల్ గలరిట్టిచోట గొననెవ్వండంచు దానిట్లనున్
    కరుణాత్ముండు., విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో" !!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. శరణం బంచును వేడినన్ వినరు సంస్కారం బుసూన్యం బహో
    బరువై పోయెను బంధనం బులిక సంభావిం పగాచో ద్యమౌ
    మరుగై నాయట మాననీ యవిలు వల్మంత్రిం చెనేమో యనన్
    కరుణా త్ముండు విశాఖ పట్టణము లోఁగన్పట్ట డొక్కండయో

    రిప్లయితొలగించండి
  8. త్రాగుబోతు ఆవేదన :

    బరువైపోయెను నాదు జీవితము నా ప్రాణమ్ముపోచుండె నా
    కరువైనన్ ధనమీయరెవ్వరును మద్యమ్మింత లేకున్నచో
    నరముల్ లాగుచునుండె మద్యమును దానమ్మిచ్చి రక్షించునే
    కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో

    రిప్లయితొలగించండి

  9. శంకరాభరణం 28/07/2019

    సమస్య

    సదయుడు గంటం బడడు విశాఖనగరిలోన్

    నా పూరణ. కం
    *** *** ***

    వదులుచు స్వగ్రామంబును

    కదిలితిని విశాఖ నగరి కడకు బ్రతుకగన్

    వెదకిన పనికల్పించెడు

    సదయుడు గంటం బడడు విశాఖనగరిలోన్


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  10. వదలక నింటింటను తా
    ముదితలతో పందెమాడి మూర్ఖుని కొరకై
    వెదకెనట పట్టు దలతో
    సదయుఁడు, గంటం బడఁడు విశాఖనగరిలోన్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుభ్యోన్నమః🙏

    మదిలో వరాహ సింహుడు,
    ముదమున సింహాద్రి నేగి, మ్రొక్కన్ గొలవన్,
    వెదకంగానోయన్నా!
    సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్.

    రిప్లయితొలగించండి
  12. ఇదిమల్లెల వేళ యగుటఁ
    నదియే కైలాస కొండఁ నట పొదరింటన్
    ముదమున జంటలు జంటలు
    సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్.

    రిప్లయితొలగించండి

  13. శంకరాభరణం 28/07/2019

    సమస్య

    కరుణాత్ముండు విశాఖ పట్టణములో గన్పట్ట డొక్కం డయో

    నా పూరణ. కం
    *** *** ***
    కరువే తాండవమాడె గ్రామము ,నికన్ నేనెట్లు జీవించెదన్?

    పరువున్ బెట్టితి భార్య బిడ్డలను నే పాలింప పట్నంబుకే

    అరె!గాలించుచు వీధులన్ని పనినిన్ యాచించ పుణ్యాత్ముడున్

    కరుణాత్ముండు విశాఖ పట్టణములో గన్పట్ట డొక్కం డయో

    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  14. వీధుల బిచ్చము నడుగుచు |
    ఖేదము నబతుకు బుడతల ,వేదన తొలగన్ |
    ఆదర మున పో షించెడి |
    "సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్"

    రిప్లయితొలగించండి
  15. సదసద్వివేకమెరిగిన
    సదయుఁడు, గంటం బడఁడు విశాఖ నగరిలోన్
    వెదుకగ వివేకహీనుడు,
    సదమలవర్తనులపురముశాంతికి నిలయం

    రిప్లయితొలగించండి
  16. ఎదనిండవెదకిజూచిన
    సదయుడుగంటంబడడు విశాఖనగరిలోన్
    వదరుంబోతుగ నుండుచు
    దిరుగుదు రుమొఱటు లటనుచు దేవకి చెప్పెన్

    రిప్లయితొలగించండి
  17. వదలడు ఆటో వాలా
    కదలడు బస్సును దిగంగ గడుసుగ వెంటన్
    గదులుచు, లగేజి నిడుకొను
    సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్!!

    రిప్లయితొలగించండి
  18. కరుణాత్ముండు విశాఖపట్టణములోగన్పట్టడొక్కండయో
    కరుణాత్ముండనునేనటంచునటయొక్కండైన గన్పించునా?
    నరయన్ వెర్రితనంబుతోదమరునూహాలోకమందుంటిరే
    కరుణాత్ముండనువాడునెప్పుడునుదాగర్వంబుజూపించడే

    రిప్లయితొలగించండి
  19. హృద యానందము గూర్చును
    సదమల పట్టణము చన విశాలతర మహా
    సదనములను విగ తాయా
    సదయుఁడు గంటం బడఁడు విశాఖ నగరిలోన్

    [ఆయాసము = ఉత్సాహము;]


    సమీప పట్ట ణేతర వాసి మనోగతము:

    ధరణీ దేవులు వేదవాఙ్మయులు నిత్యంబుండ గానమ్ములన్
    వర చేలాంచల మానినీ మణులు వే వామాక్షులం జూతుమే
    గురు రోషావృత చంచలద్వపువు దుర్గోత్రుండు శోధించ నా
    కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో

    [నాకు +అరుణాత్ముండు]

    రిప్లయితొలగించండి
  20. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    విశాఖవాసి 2014:👇

    బరువౌ నాంధ్ర ప్రదేశ రాష్ట్రమపుడున్ వ్రక్కల్ గ చీలంగ నేన్
    దరువుల్ బాదుచు కాళ్ళు బట్టుచునహా దర్బారుకై వేడగా
    వరుడౌ చంద్రుడు త్రోసిపుచ్చగను నా వాంఛల్ ను వేతీర్చెడిన్
    కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కండయో
    😢

    దర్బారు = రాజసభ (ఆంధ్ర భారతి)

    రిప్లయితొలగించండి
  21. స్థిరవాసమ్మది లేదునాకనుచు నే చింతించు నవ్వేళలో
    దరికిన్ జేరుచు చెప్పె దార యొక యుక్తాయుక్తమౌ యోచనన్
    నరువున్ బొందుటె మేలటంచు, మరి సాయమ్మంద జేయన్నటన్
    కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో

    రిప్లయితొలగించండి
  22. మత్తేభవిక్రీడితము
    సిరిమాలక్ష్మియుఁ గొల్వుఁ జేసి యటనే శ్రీలిచ్చి కాపాడగన్
    వర నర్సింహుఁడు చందనార్చితుడుఁ తా పైనుండి దీవించగన్
    గొరతల్ గానక భాగ్యమంది సుఖముల్ గూరంగఁ గష్టమ్ము లే
    క రుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదాన్ని ఇలా చదువుకొన మనవి:

      ' సిరిమాలచ్చియె కొల్వుఁ జేసి యటనే శ్రీలిచ్చి కాపాడగన్ '

      తొలగించండి
  23. ఉదయపు వేళల నైనను
    విధిగా సాయంత్ర సంధ్య వేళలనైనన్
    ఉదధిని సేదను దీరని
    సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్

    రిప్లయితొలగించండి
  24. అదనున సాయము జేయును
    సదయుడు.... గంటంబడడు విశాఖ నగరిలోన్
    పదుగురి బాధించు నతడు
    వెదకిన నచ్చోట మనకు వేయి విధాలన్

    రిప్లయితొలగించండి
  25. హృదిలో లేనిది పలుకుచు
    మదినిండుగ గల్గినట్టి మాయల తోడన్
    సదయుడ నని చెప్పుకొనెడి
    "సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్

    రిప్లయితొలగించండి