8, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3126 (తల్లికిఁ గొమరుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్"
(లేదా...)
"తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్"

35 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కొల్లలు మిత్రులే తెలుప కోటుల వోటులు హిందువుల్ సదా
    చెల్లియొ చెల్లకో తనకు చెన్నుగ వేయుదురంచు చెప్పగా
    మెల్లగ బ్రాహ్మలన్ బిలిచి మీరిన హాయిని నవ్వుచున్ భళా
    తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్

    సూత్రము = జన్నిదము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తల్లికిఁ బ్రీతి = తల్లికి ప్రియమైన

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
      కాని ఇలా 'స్ంబాలిక్'గా చెప్తే నాలాంటి అల్పజ్ఞానికి ఎలా అర్థమౌతుంది?

      తొలగించండి
    3. 🙏

      పేరు చెబితే మునిగోటి వారు బోరు కొడుతోందని అభ్యంతరం తెలియజేసిరి 😊

      తొలగించండి

    4. * చెల్లియొ చెల్లకో తనకు చెన్నుగ వేయుదురంచు గ్రుడ్డిగా

      తొలగించండి
  2. నల్లని దైనను భూరిగ
    ముల్లెల తో వచ్చుననిరి మురిపెము తోడన్
    పిల్లను గని యెదు రాడక
    తల్లకిఁ గొమరుండు సూత్ర ధారణఁ జేసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      తల్లికి ఎదురాడక... అంటూ చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి


  3. ఉల్లము జల్లన నతడా
    లల్లిని ప్రేమించె, పెండ్లి లగనపు సమయం
    బల్లన నమస్కరించుచు
    తల్లికిఁ, గొమరుండు సూత్రధారణఁ జేసెన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ:

    ఎల్లరి బిల్చి తండ్రి వచియించుచునుండెను " భద్రశైలమం...
    దల్లదె రామమూర్తి వరుడై ధరణీసుత బెండ్లియాడగా
    నల్లన నర్చకుండన మదాత్మజుడే ! కొని , ముజ్జగాలకున్
    తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  5. మల్లెలవేళ! మేలగు కుమారుడు! వందన మాచరింపనా
    తల్లికిఁ, బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్,
    లల్లిని ప్రేమ యాత్రని భళా కలిసెన్ ముద మారగానతం
    డల్లన పెండ్లియాడుటకు డాయుచు మండప మందు చేరువై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. భద్రాచలం రాముని కళ్యాణం.....

    బెల్లము జీలకర నలదె
    తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్
    చల్లని పందిరి నీడన
    మెల్లని నగవుల మహీజ మెరియత జూడన్

    రిప్లయితొలగించండి
  7. పిల్లల కోసము త్రెళ్ళుచు
    మల్లెల పూలతొ దయగల మాతకు పార్వతి
    చల్లని దీవెనల మహా
    తల్లికి కొమరుండు సూత్ర ధారణ జేసెన్

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గొల్లున గోలబెట్టగను కోమలినిమ్మని ఖర్గపూరునన్
    తల్లియె ప్రీతినిన్ తెలుప: "దారను తెచ్చితి నీకురా భళా!"
    మెల్లగ కొక్కెమందునది మీరిన హాయిని క్రింద దింపుచున్
    తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్

    సూత్రము = జన్నిదము

    రిప్లయితొలగించండి
  9. బిల్లులు కట్టక చీకటి
    ఇల్లున చేతుల వెదకుచు ఇమ్రాన్సుతుడున్
    గొల్లున యేడ్చుచు తడబడి
    తల్లికి కొమరుండు సూత్ర ధారణ జేసెన్

    రిప్లయితొలగించండి
  10. మెల్లగ జేరట తుంటరి
    పిల్లలు నిప్పని యరువగ వేదిక పైనన్
    కల్లోలమునన్ కోడలి
    తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  11. భళ్ళున తెలవారిందని
    గొల్లడు పాలను పితుకుచు గోమాతెన్కన్
    మెల్లగ తచ్చాడు చికిలి
    తల్లికి కొమరుండు సూత్ర ధారణ జేసెన్

    రిప్లయితొలగించండి
  12. Friendship band కట్టిన పిల్లాడు

    ఎల్లలు లేని యాదరుణ ఇంపుగ సొంపుగ కంపు గొట్టు యా
    పిల్లికి ప్రీతి మీరగను పీకల మొయ్యగ పాల ముంచుచూ
    గోళ్లను గీరుచూ ముదిని గోముగ చొంగలు కార్చు యా మహా
    తల్లికి ప్రీతి సూత్రమును ధారణ జేసెను పుత్రుడం తటన్

    రిప్లయితొలగించండి
  13. ఉల్లము రంజిల నాటక
    మల్లదె ప్రారంభమయ్యెనన నటుడెలమిన్
    తెల్లని మల్లెల కళామ
    తల్లికి కొమరుండు సూత్ర ధారణఁజేసెన్

    రిప్లయితొలగించండి
  14. నల్లని రాతిపై తొలిచె నాతడు విద్దెలతల్లి రూపమున్
    అల్లది విగ్రహంబునకు నాలయమొక్కటి గట్టె గొప్పగా
    తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్
    పిల్లల పెద్దలందరిని బిల్చెను విద్యను నేర్పె ముచ్చటన్

    సూత్రము....కొన్నిధర్మముల నుగ్గడించు ప్రవచనము;

    సూత్రము.. యంత్రము

    రిప్లయితొలగించండి
  15. చెల్లెల విను, మటు లాయువు
    జెల్లిన పతికై వగచెడి జీవితమందున్
    చల్లని తోడై బిడ్డల
    తల్లికిఁ, గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  16. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    తల్లికిఁ గొమరుండు సూత్ర ధారణఁ జేసెన్

    సందర్భము: ఆ పిల్లవా డొక దేవీ భక్తుడు. తన ఉల్లము నా దేవికి అర్పించుకొన్నవాడు. వా డిలా పలుముతున్నాడు.
    "యల్లబ్ధ్వా.." యని "యత్ ప్రాప్య.." అని సూత్రాలను ధారణ చేస్తున్నాడు. గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
    అవి ప్రసిద్ధములైన ప్రామాణికములైన నారద భక్తి సూత్రాలు.
    య ల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి.. మొదటి అధ్యాయము 4 వ సూత్రం
    (దేనిని పొంది మనుష్యుడు సిద్ధు డగునో.. అమృతు డగునో..)
    యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి , న రమతే, నోత్సాహీ భవతి.. 5 వ సూ.
    (ఏది ప్రాప్తించి ఏ కొంచెమైనన్ వాంఛింపడో.. శోచింపడో.. ద్వేషించువాడు కాడో.. రమింపడో.. ఉత్సాహి కాడో..)
    అటువంటి లక్షణాలు వుంటేనే అతని వద్ద భక్తి వున్నట్టు లెక్క. కేవల వేష ధారణాదులు చూచి భక్తు డని మోసపోతూ వుండడం కద్దు.
    మువ్వురు తల్లుల తల్లి = ముగురమ్మల మూలపుటమ్మ.. దేవి
    పలుముట = శబ్దం పైకి రాకుండా పెదవు లాడించుట (గద్వాల మాండలికం)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *"య ల్లబ్ధ్వా.." యని పలుముచు*

    *నల్లన "యత్ ప్రాప్య.." యనుచు*

    *నర్పించుచుఁ దా*

    *నుల్లము మువ్వురు తల్లుల*

    *తల్లికిఁ.. గొమరుండు సూత్ర ధారణఁ జేసెన్*

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    8.9.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  17. తల్లియె పుత్రునిన్ బిలిచి త్రాడును తెమ్మన చెప్పెనివ్విధిన్
    నల్లని కుక్క యీనినది నాలుగు పిల్లలు పుట్టె జూడరా
    పిల్లల తోడ తిర్గునది వీధులు కట్టిన మేలటంచనన్
    తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్

    రిప్లయితొలగించండి


  18. మన కందివరులు :)



    భళ్ళని తెలవారగ కో
    కొల్లలు కైపదపు మాల గూర్చు కవీశుం
    డల్లన క్రొత్తగ, తెల్లని
    తల్లికి కొమరుండు, సూత్రధారణ జేసెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. మల్లియ వంటి మదిగలిగి
    కల్లలెరుఁ గని తన యక్క గతియించగ తా
    పిల్లను వీడి, ముదమిడన్
    దల్లికిఁ, గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  20. పిల్లడి పెండిలి దినమని
    తల్లి తనసుతునికి పెండ్లి తలపెట్టగనే
    తల్లడిలి యామె మనుమని
    తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  21. కల్లలు సెప్పుట నేరము
    తల్లికికొమరుండు,సూత్రధారణ జేసె
    న్నుల్లమునలరగ రాముడు
    నల్లదెసీతమ్మమెడకు నందరు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  22. ఎల్లర చిత్తమ్ముల వడిఁ
    దల్లడ పెట్టు మొనగాఁడు దానెప్పుడు వూ
    విల్లూను వాఁడును సిరుల
    తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్



    పెల్లుగ మ్రోఁగ వాద్యములు వెల్గఁగ రమ్యపు దీపకాంతులే
    యుల్లమె యుల్లసిల్లఁగ సమున్నత పీఠము నందు నుండఁగా
    మల్లికి నా వధూమణికి, మానస మందునె మ్రొక్కి తండ్రికిం
    దల్లికిఁ, బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను బుత్రుఁ డంతటన్

    రిప్లయితొలగించండి
  23. తల్లడిలెనాత్మ సుదతికి
    పిల్లలభవితనుతలచుచుభీతిలదయతో
    తల్లినుడువగనెపిల్లల
    తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  24. అల్లదె యాదిశంకరులు హర్షముగల్గను,నొప్పుకోలుకున్
    దల్లికిబ్రీతి సూత్రమునుధారణజేసెనుబుత్రుడంతటన్
    దల్లియుసంతసంబునను దానొడబాటునుజెప్పనాతడున్
    వెల్లువగాగ మానసమువెళ్ళెబ్రచారముజేయుగోరికన్

    రిప్లయితొలగించండి
  25. తల్లడ మ o ద క ప్రేమ ను
    మెల్లగ దెలు పందొ డ గిన మిన్నక నుండఁ న్
    వల్లె యను వరకు మ్రొక్కె ను
    దల్లి కి : గొ మ రుండు సూత్ర ధా ర ణ జేసె న్

    రిప్లయితొలగించండి
  26. చల్లని తల్లి నం గనిన సాధ్వి మహామహితాత్మ, తెచ్చె నీ
    మల్లియ వంటి మానినిని మంచిగ బండగ నాదు భావి, నా
    యుల్లము పొంగ నీమె గొని యుందు నటంచును బెట్టి దండముం
    దల్లికి,బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్.

    రిప్లయితొలగించండి
  27. పిల్లలు ఋణపడుటేరికి?
    తల్లిని దైవముగ గొలుచు తానెవరొక్కో?
    అల్లదిగొ!వరుడు వధువుకు;
    "తల్లికిఁ; గొమరుండు; సూత్రధారణఁ జేసెన్"

    రిప్లయితొలగించండి
  28. తల్లియె వలదని చెప్పిన
    పిల్లను తాను మదిలోన ప్రేమించుటచే
    కొల్లగ బాసలు చేసియు
    తల్లికిఁ, గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  29. కందం
    మెల్లగ నే చెవిఁ జెప్పఁగ
    నుల్లము గాయత్రిఁ దలఁచు నుపనయ మందున్
    పెళ్లికి ముందర మ్రొక్కుచుఁ
    దల్లికిఁ, గొమరుండు సూత్రధారణఁ జేసెన్

    ఉత్పలమాల
    పెళ్లికి ముందరన్ వడుగు వేద విధమ్ముగ జేయు వేడుకన్
    మెల్లఁగ నే చెవిన్ బలుక మేటి దటంచను మంత్రరాజమే
    యుల్లము వేదమాత కొలువుండుగ మ్రొక్కుచు భక్తిభావనన్
    దల్లికిఁ బ్రీతి, సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్

    రిప్లయితొలగించండి