10, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3128 (నల్లని యుత్పలమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నల్లని యుత్పలము దోచె నభమున శశియై"
(లేదా...)
"నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై"

49 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    చల్లగ చంద్రయానమట జారగ నాఖరిదౌ క్షణమ్మునన్
    కొల్లలు భారతీయులవి కోరిక లెన్నియొ భంగమాయెనే!
    కల్లయె కాదు శంకరయ! కండ్లను నీరము నింపిచూడగా
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై!

    రిప్లయితొలగించండి
  2. కల్ల యొకింతగా దతడు కర్మఠుడై యతనమ్ము చేసి తా
    నెల్లెడ నింద్రజాలమున నెంతయు గీర్తిగడించి యొక్కనా
    డల్లన వేదికన్ గరము నందున కల్వను బట్టి త్రోయ నా
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      ఐంద్రజాలికమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. ఉల్లము పొంగ సరస్సున
    నల్లని ఉత్పలము దోచె;నభమున శశియై
    తెల్లని మబ్బుల మాటున
    పిల్లలు సంతోష మొదవ వెల్గులు నిండెన్.

    రిప్లయితొలగించండి


  4. మెల్లగ విక్రముని తలము
    నల్లని యుత్పలము దోచె నభమున, శశియై
    తెల్లగ వికసింప శివుం
    డల్లన ప్రాజ్ఞుల ముఖమ్మ డరెను జిలేబీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. (బాలకృష్ణుని శకటాసుర సంహారం )
    నల్లని కన్నయన్ గొనుచు
    నంబర మెక్కిన రాక్షసాధమున్ ;
    మెల్లగ కంఠమున్ బిగియ
    మెత్తుచు ; మొత్తుచు ; గొంతునొక్కుచున్ ;
    కొల్లగ కేకిసల్ సలిపి
    కుర్రడు నవ్వగ ; గొల్లపల్లెలో
    నల్లని యుత్పలమ్ము గగ
    నమ్మున దోచె శశాంకబింబమై .

    రిప్లయితొలగించండి


  6. చల్లగ పీరుగాంచుచు విచారము తోడుత వున్న వారికిన్
    మెల్లగ చుట్టి యార్బిటరు మెక్కొని విక్రము జాడ చూపగా
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె; శశాంకబింబమై
    తెల్లగ వెల్గె కే. శివుని తేకువ ప్రాజ్ఞుల ధైర్యముల్ సఖీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. కల్లలు ఎరుగని మరియా
    పిల్లడి యాకలిని దీర్ప పిడికిలి చాపన్
    యుల్లము నందున వేడ్కొన
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  8. ఉల్లమునను యెల్లెడల త
    పిల్లుచు సతతము మనమున ప్రియుని ముఖమె భా
    సిల్లెడి నూతన వధువుకు
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి

  9. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చల్లగ మందు కొట్టి యిలు జంకుచు చేరగ దేవదాసుడై
    మెల్లగ తల్పు తీయుచును మెండుగ ప్రేమను జుత్తుపట్టుచున్
    పెళ్ళము కొట్ట చీపురున పేరిమి మీరిన ప్రక్కనింటిదౌ
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై!

    రిప్లయితొలగించండి
  10. (విక్రం ల్యాండర్ నుండి సంకేతాలు ఆగిపోయిన సందర్భం)

    చల్లని చంద్రుని జేరుచు
    నుల్లము మైమరచి పలుకు నోటయె రాకన్
    మెల్లన విక్రముడు నిలువ
    నల్లని యత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి


  11. నా పూరణ. చం.మా.
    ***** *** ***

    కొల్లగ నింద్రజాల మొనగూర్చెడు గారడివాడు ముగ్ధయౌ

    నల్లని రాత్రి పుష్పమును నాకముపై పడద్రోసి మాయచే

    తెల్లగ మార్చినంత ప్రజ దిగ్భ్రమచెందుచు గాంచ వారికిన్

    నల్లని యుత్పలమ్ము గగనమ్మున దోచె శశాంకబింబమై



    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  12. చల్లని పాలే యనుకొని
    తెల్లని సారాను తాగి తెగ మక్కువతో
    తుళ్లుచు మెల్లగ నడవగ
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  13. కల్లును ద్రావిన నొకఁడనె
    నల్లని యుత్పలము దోచె నభము న శశి యై
    పిల్లలు గొల్లున నవ్వుచు
    పెల్లు గ పరిహాస మాడె వికలము గాగన్

    రిప్లయితొలగించండి
  14. కందము:
    ఉల్లము ఝల్లన రీతిన
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై"
    చల్లని మలయ సమీరమె
    మెల్లన సరసపు జెలుడును మేనిని దాకన్

    రిప్లయితొలగించండి
  15. మెల్లగ మురళిని యూదుచు |
    నల్లని దేవుడు నగవుల చల్లగ రాగా |
    తెల్లని వెన్నెల భూమిని |
    "నల్లని యుత్పలము దోచె నభమున శశియై"
    (ఉత్పలము -కలువ )

    రిప్లయితొలగించండి
  16. పొల్లుగ తొరపడి తాగిన
    కల్లు యొకపరిగ కడుపున కలవర పెడుచున్
    భళ్ళున వాంతులు కాగనె
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  17. "యద్భావం తద్భవతి",
    "యథాస్మై రోచతే విశ్వం తథాస్మై పరివర్తతే"

    ఎల్లెడ సాధుదృక్పథము లేర్పడినన్ వ్యతిరిక్తమైననున్
    జెల్లును భావరోదసిని స్వీకృతయోగ్యమునై, మనోగతం
    బల్లదె యెట్లు నుండునొ! యదట్లుగఁ దల్చు, విభిన్నదృష్టులన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మున దోచె శశాంకబింబమై.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    నల్లని మేనివాడు., నయనమ్ముల సత్కరుణాసుధారసం..
    బెల్లెడ జల్లువాడు., విహగేశునిపై విహరించుచుండగా
    నల్లన సప్తశైలశిఖరాగ్రముపై మది దోచెనివ్విధిన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. విల్లునరిని సింధుజనిక
    నెల్లబలఁగమును విడిచె చనె హరియె భువికిన్
    మల్లడిగొనగ కరియె, నిక
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  20. కల్ల యనుకొంటిరేమో
    బల్ల చరచి తెలుపుచుంటి , వాస్తవముగనే
    గొల్ల పడుచు నుడివెనిటుల
    "నల్లని యుత్పలము దోచె నభమున శశియై"

    రిప్లయితొలగించండి
  21. అల్లదె చూడుమ నింగిని
    నల్లనియుత్పలముదోచెనభమున శశియై
    మెల్గగ జంద్రుని జేరెను
    దెల్లటియాచంద్రయాన తేరువు వోలెన్

    రిప్లయితొలగించండి
  22. అల్లదె చూడుమాభరణి! యాయతరీతిని జంద్రయానమే
    నల్లనియుత్పలమ్ము,గగనమ్మునదోచె శశాంకబింబమై
    తెల్లటిమబ్బులాదరిని దేరువులోపలనుండునట్లుగా
    నుల్లమునుల్లసిల్లుగద యుత్పలబాంధవుజేరగల్గుతన్


    రిప్లయితొలగించండి
  23. అల్ల నగాగ్రమందు గనుమా యదు వీరుడు నిల్చి యుండె ను
    త్ఫుల్ల జలేజ హార సువిభూషణుడై దరహాస భాసమున్
    ఝల్లన జేయునా విమల చారు ప్రకాశ స్వరూపమున్ గనన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై

    రిప్లయితొలగించండి
  24. 🙏శ్రీ గురుభ్యోన్నమః🌺
    తృణావర్తుడు కృష్ణుని చంపుటకు నాకసమునకు గొనిపోయి,తాను కృష్ణుని జేతిలో జచ్చుట:
    నా ప్రయత్నం
    ఉ.
    మెల్లన ధూళినన్జక్రసమీరుడు, దైత్యుడు వచ్చి రయ్యనన్
    పిల్లడటంచుఁ గృష్ణుఁనిక పేరడగించఁ దలంచి, జావగా
    గొల్లలుఁ దల్లియున్ భయముకోర్వక నింగిని జూడ,బాలుడే?
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై!

    కం.
    అల్లరి కృష్ణుడు చెండా
    డఁల్లన రా చక్రసమీర దైత్యున్జీరన్
    గొల్లలు, దల్లి యశోదకు
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై!

    శ్రీయుతులు GPSastry, Jilebi, Jandhyala, Ramacharya,RK Sastry ల స్ఫూర్తితో ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  25. ఉత్పలమాల
    అల్లన విశ్వరూపమున నర్జునుఁ దీర్చుచు యుద్ధభూమినన్
    ఝల్లన తామసమ్ము విడ చక్రి ముఖమ్ము నభమ్ము నిండగన్
    జెల్లెను యేక కాలమున శృంగము తెల్లని సూర్యబింబమై
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై

    రిప్లయితొలగించండి
  26. ఉల్ల మలరు దృశ్యం బిది
    కల్లయె సంపూర్ణ సూర్య కర సంగ్రహణ
    మ్మల్లదె రవి బింబ మహో
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై


    పల్లవ వాగ్దళ జ్వలిత పంకజ శత్రు నిభాస్య మానినీ
    సల్లలి తాంబకమ్మునఁ బ్రసన్నత గోచర మౌ ముఖమ్మునం
    దెల్లని వర్తులమ్ము పయి తేలెడు నల్లని గ్రుడ్డు వింతగా
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై

    [ఇక్కడ కంటి తెల్లని వర్తులము గగనము, నల్లని గ్రుడ్డు ఉత్పలము]

    రిప్లయితొలగించండి
  27. ఉత్పల మాల:
    కల్లలు బల్కియే బ్రియుఁడు గానక మోసము జేయఁ జూడగన్
    చల్లని జూపులే యరయ చక్కని చిన్నది సైగజేయఁగన్
    తల్లడి జేరెనే సఖిని దప్పును సైచుమటంచు గోరఁగన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె; శశాంకబింబమై

    రిప్లయితొలగించండి
  28. అల్లన నల్లఁగల్వ విరహాగ్నికిఁ దాళగ లేక చేరి జా
    బిల్లిని సంగమించఁ గడుఁ బేర్మి, తదంగరుచిర్నిమగ్నమై
    యెల్లెడ మేను తెల్లనయి యేర్పడె, నయ్యెడఁ జూచు వారికిన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై.

    రిప్లయితొలగించండి
  29. కం.
    తెల్లని సున్నపు గోడన
    పిల్లది కుదురుచు నగుపడ పిడకల వరుసల్
    యల్లది నూహకు తట్టెను
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    వై. చంద్రశేఖర్

    నానార్థములుగా ఉత్పలము అంటే పిడక ( గోమయ పిష్ట ము) అనికూడా కలదు

    రిప్లయితొలగించండి
  30. గొల్లల పురవీధులలో
    పిల్లలు చేసిరి పిడుకలు వేడుక తోడన్
    తెల్లని కుడ్యము పైగల
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై.

    రిప్లయితొలగించండి
  31. పెల్లుగ విరిసిన విరులట
    మెల్లగ దోచుచు మనములు మేటిగ కదలన్
    చల్లని సరోవరంబున
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  32. చల్లని సంధ్య వేళ, సిత సైకత పంక్తుల, యామునీ తటిన్,
    గొల్లెత లాడ మైమఱచి గోపశిఖామణి చెంత, నిండి యా
    నల్లని వాని మోముకళ నవ్యముగా శశి దర్పణమ్మునన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై.

    రిప్లయితొలగించండి
  33. తెల్లని నింగి మబ్బులవి, తేలికగా నటు దారిజూపగా!
    మెల్లగ యాత్రసాగినది,మేలిమియైనటువంటి మేధతోన్
    చల్లని చందమామకడ,చాటుగ శైత్యము దెబ్బదీయగా
    నల్లనియుత్పలమ్ము, గగనమ్మున దోచె శశాంకబింబమై.

    రిప్లయితొలగించండి
  34. ఉల్లముఝల్లుమన్నదిగ,ఉత్సుకమంతయు నీరుగారగా!
    చల్లని చందమామకడ, చక్కగజేసెను యాత్రనంతయున్
    మెల్లగ కొంతదూరమున, మెత్తగ దాకనిచంద్రయానమే
    నల్లనియుత్పలమ్ముగగనమ్మున దోచె శశాంకబింబమై

    రిప్లయితొలగించండి
  35. నల్లనిదారిలోనడచి, నాణ్యముగానది యాత్రజేయుచున్!
    మెల్లగ చందమామకడ,మేధనుజూపుచు జేరుచుండగా!
    కళ్ళెదురైన కష్టమది,కాలపునాగయి కాటువేయగా
    నల్లనియుత్పలమ్ము, గగనమ్మున దోచె శశాంకబింబమై.


    రిప్లయితొలగించండి
  36. పిల్లల తోడ పండుగకు వేడ్కలు జర్పగఁ దూరమెంచకన్
    బల్లెలఁ జేరిరెల్లరును పట్నము నుండియె, మోదమందుచున్
    బిల్లలు నింగిలో కెగుర వేసిన గాలి పతంగమున్ గనన్
    నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై

    రిప్లయితొలగించండి
  37. చల్లనివెన్నెలరేయిని
    నల్లనిగోపాలుని చిరునవ్వులువిరియన్
    జల్లన హృది రాధమ్మకు
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  38. కందం
    నల్లకలువఁ బోలినదై
    ఝల్లన మిరుమిట్ల బాణసంచా నింగిన్
    జల్లఁగ వెన్నెల వెలుగుల్
    నల్లని నుత్పలము దోచె నభమున శశియై

    రిప్లయితొలగించండి
  39. కం. చల్లని కలువల రేడే
    గొల్లునశరణుశరణుయనికొల్వగ కలువల్
    తెల్లని సాంబుని ఛాయకు
    నల్లని యుత్పలము దోచె నభమున శశియై.

    నోట్ : చంద్రుడు శాపము బాపుకొనగ సోమనాథుని పూజించిన వైనం .

    రిప్లయితొలగించండి
  40. నల్లనియుత్పలమ్ము గగ
    నమ్మున దోచె శశాంకబింబమై
    చల్లనితల్లి కాళికకు
    చక్కగ మేన సగంబునిచ్చి మే
    నెల్లెడలన్ విభూతి కమ
    నీయ సుగంధమునిండియుండ రం
    జిల్లెడు లాస్యతాళములు
    శ్రీనగమంత ప్రతిధ్వనించగన్.

    రిప్లయితొలగించండి