18, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3136 (మత్స్యాహారమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్"
(లేదా...)
"మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే"

62 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    మత్స్యమ్ముల్ ఘన పుష్ప రాజములహో మాధుర్యమౌ గంగనున్
    మత్స్యమ్ముల్ కొని రామకృష్ణ నరుడే మారెన్ భళా హంసగా
    మత్స్యమ్ముల్ తిని దీది మోడి వరునిన్ మైత్రమ్మునన్ గోకునే...
    మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే

    రిప్లయితొలగించండి
  2. ఎవడి గోల వాడిది :)



    మత్స్యంబమ్ముడు పోకన్
    మాత్స్యము వినిపించినట్టి మహనీయునితో
    మాత్స్యికుడొకడనెనుగదా
    మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  3. హమ్మయ్య ! కంది వారు సెలవా ఇవ్వాళ ?


    "మత్స్యండిన్ గొన రాదు!" వైద్యుడనగా మౌనమ్ము పాటింపగా
    మత్స్యందిన్ తనరార ప్రత్యహమసామాన్యంబుగా కోరెడా
    మత్స్యాధీశులు, కొంత తేరుకొననా మన్నీడు వెజ్జుండనెన్
    "మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే"!



    జిలేబి

    రిప్లయితొలగించండి

  4. Indra speaks while deputing one of his zilebis to sabotage a Rishi's tapasya :)


    గమనిక! మత్స్యాహార
    మ్మె మేలు మౌని వరులకు నిమేషములో వా
    రి మనసు చలించు! ధ్యానమ
    దె మరలు! ప్రణయంపు వీధి దెసతిరుగు వెసన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఈరోజు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ఇంటికి వెళ్తున్నాను. వారి ప్రబంధము డిటిపి పని తుది మెరుగుల కోసం... (దగ్గరే కనుక వీలైతే మన సరదా కవి ప్రభాకర శాస్త్రి గారిని కలుస్తాను).

      తొలగించండి
  5. మత్స్యము గుండెకు మిత్రుడు
    మత్స్యపుపరిశోధన పలు మహిమలు దెలిపెన్
    మత్స్యము జలములపుష్పము
    మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురుషోత్తమ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మత్స్యమ్మన జలపుష్పమె" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. మత్స్యము గుండెకు మిత్రుడు
      మత్స్యపుపరిశోధన పలు మహిమలు దెలిపెన్
      మత్స్యమ్మన జలపుష్పము
      మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్.

      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
  6. మత్స్యము రోగనివారిణి
    మత్స్యము దినువారి మనసు మహిమలు జేయున్
    మత్స్యము శాకాహారమె
    మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్.

    రిప్లయితొలగించండి
  7. శంకరా భరణము నిన్నటి సమస్య
    కుజనులు క్రూరాత్ములు గద గుంటూరు జనుల్
    ఇచ్చిన సమస్య కందము నా పూరణము సీసములో

    గురువు గారి అంతరంగము (క్షమా పణములతో)


    సలిపిరి సాహిత్య సభలను సులువుగ తిరుపతి పురమున , తిరుమల గిరి

    వెడలితి ,చూచితి వేంకట పతిని, శ్రీకాకుళ వాసులు ఘనత తోడ

    పిలువగా వెడలుచు తలచితి నేనిట్లు, యేమిది? విబుధుల లేమి గాదె

    యీ గర్తు పురము హాయిగ కావ్య సభలను పెట్టిన గుంటూరు పట్టణమును

    చూచు వాడను గదా! శోభిల్లు కోటప్ప కొండను చూచు నా కోర్కె తీరు

    ను! ఘన బొగ్గరపు క్షుణ్ణుడు గోలి హనుమంతుడును కృష్ణ సూర్యుడు ననువుగ నిట

    కూడరు , కుజనులు క్రూరాత్ములు గద గుంటూరు జనుల్"యేమి టో ననుకొని

    తలచు చుండగన్ చెదరెను కల, కనులను
    తెరచి చూడగ గుంటూరు పురము చేరె
    రైలు బండి, పొరబడితి ,మేలు కవులు
    కలరు యిచటనని మదికి తెలిపి నాను

    రిప్లయితొలగించండి
  8. మత్స్యముమోదీనిచ్చెను
    మత్స్యము బంగాళమందు మంచినినిలిపెన్
    మత్స్యము దీదీ బసునిడె
    మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్.

    రిప్లయితొలగించండి
  9. మత్స్యమె జలపుష్పంబని
    మత్స్యమె పౌష్టికత నిడును మహిలోనంచున్
    మత్స్యము తినువారందురు
    మత్స్యాహారమ్మె మేలు మౌని వరులకున్

    రిప్లయితొలగించండి
  10. మత్స్యమె కాడ్లివరాయిలు
    మత్స్యము 'హంస'గ వరమున మహిమను జూపెన్
    మత్స్యమె నరేంద్రుడాయెను
    మత్స్యా హారమ్ముమేలు మౌనివరులకున్

    రిప్లయితొలగించండి
  11. ( కంకభట్టు రూపంలోని ధర్మరాజు విరాటరాజుతో )
    మత్స్యక్ష్మాప ! విరాటరాజ ! వినుమా
    మా మాట ; వేదమ్ములన్
    మత్స్యేంద్రుం డటు బ్రహ్మకిచ్చెను మహా
    మాయావి జెండాడి ; యా
    మత్స్యంబుల్ జయమిచ్చులే వలలుడే
    మాకింక వడ్డింపగా ;
    మత్స్యాహారమె మేలు మౌనులకు ధ
    ర్మజ్ఞోక్తియౌ నిద్దియే !

    రిప్లయితొలగించండి


  12. మత్స్యాహారమ్ములతో
    మత్స్యాహారమ్మె మేలు! మౌనివరులకున్
    మత్స్యాహారమ్ములకున్
    మత్స్యాహారమునకున్ సమన్వయమగునా?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమన్వయం కుదరదు. "మత్స్యాహారులకు సతము మత్స్యాహారమ్మె మేలు..." అంటే సరి!

      తొలగించండి
  13. మత్స్యాన్వేషి యొకండు నిత్యము భువిన్ మాన్యత్వ మిందంచు నా
    మత్స్యంబుల్ గొని విక్రయించ నిలుచున్ మాయూర నేతెంచి యా
    మత్స్యస్వామి వచించు నీగతి గనన్ మాతా కొనన్ రండిటన్
    "మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే"

    రిప్లయితొలగించండి

  14. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)


    మత్స్యమ్మున్ గని క్రీడి యంత్రముననున్ మార్మోగగా త్రుంచెనే
    మత్స్యమ్ముల్ కొని జ్యోతి బాసు బడసెన్ మార్క్సిస్టు నేతృత్వమున్
    మత్స్యమ్మొంది ప్రభాకరుండు వెలిగెన్
    మార్తాండుడై వంగనున్...
    మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే

    http://gpsastry.blogspot.com/2010/03/fish-n-chips.html?m=0

    రిప్లయితొలగించండి
  15. మాత్సర్యము పెరిగె నహో!
    కుత్సితుల కుతికలు తుంప! కుమతులు కారా?
    వత్సా! ఏ తీరున గన
    "మత్స్యా హారమ్మె మేలు మౌని వరులకున్"?

    రిప్లయితొలగించండి
  16. మత్స్యా హారుల కగు నా
    మత్స్యా హారమ్మె మేలు : మౌని వ రులు కున్
    మత్స్య ము ల లోన కన బడు
    మత్స్యా వ తా ర మ్మె స త ము మాని త రీతి న్

    రిప్లయితొలగించండి
  17. మత్స్యధ్వజు తాపమునకు
    మత్స్యాహారమ్మె మేలు; మౌనివరులకున్
    మత్స్యాహారమదేలా
    మత్స్య స్వరూపుని స్మరణమె మధురంబౌగా

    రిప్లయితొలగించండి
  18. మత్స్యాక్షీ! వలదంటిని
    మత్స్యాహారమ్మె, మేలు మౌని వరులకున్
    మత్స్యాక్షి తోడ వండుము,
    మత్స్యమ్ముల వాడవలదు మానిని వినవే.

    మత్స్యాక్షీ = మీనముల వంటి కనులు గలదానా,,( మొదటి పాదంలో)
    మత్స్యాక్షి = పొనుగంటి కూర ( మూడవపాదంలో )

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    హృత్స్యూతమ్మున రామభక్తివిభవంబేపారగా నిత్యమున్
    చిత్స్యందామలసర్వజీవకరుణాశ్రీశోభితస్వాంతులై
    మత్స్యాకారుని నమ్మువారలిలలో మన్నింతురే యిట్లనన్
    మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  20. మత్స్యము నొకప్రాణియెకద
    మత్స్యముహారమ్ముజేయ మాన్యతయౌనే?
    మత్స్యము నిటులన సబబే?
    మత్స్యాహారమ్ముమేలు మౌనివరులకున్

    రిప్లయితొలగించండి
  21. మత్స్యమ్మున్నను చాలు నిష్టమనుచున్ మద్యమ్ముతో గ్రోలగన్
    మత్స్యమ్ముల్ గొని తెచ్చినానిటకు కామాక్షీ వడిన్ వండుమా
    మత్స్యాహారమె, మేలు మౌనులకు ధర్మ జ్ఞోక్తియౌ నిద్దియే
    మత్స్యాక్షీ యనె డాకుకూరొకటి సమ్మానింపగన్ వారినిన్

    రిప్లయితొలగించండి
  22. మత్స్యాకారము నెత్తె శ్రీధరుడు దుర్మార్గాసురుం గూల్చగన్
    మత్స్యంబున్ విజయుండు కూల్చె శరసంధానమ్ము నేపారగన్
    మత్స్యంబుల్ మధుమాంసముల్ గొనుట సమ్మాన్యంబె?,.. కాదట్టులన్
    మత్స్యాహారమె మేలు;.. మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే?

    రిప్లయితొలగించండి
  23. మత్స్యములు దొరకు చోటన
    మత్స్యాహారమ్మె మేలు ; మౌనివరులకున్
    మత్స్యముల నెటుల దినదగు !
    మత్స్యందినె దినగ నొప్పు మనుగడ జేయన్

    మత్స్యంది = కండచెక్కెర

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. ఔత్స్యమ్మే పల లమ్మగు
      గౌత్స్యమ్మే మే ల్గదయ్య కాదని యకటా
      వాత్స్యమ్మేల నిఁక వినా
      మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్

      [ఔత్స్యము = ఔత్సమునకు సంబంధించినది, ఔత్సము = సెలయేట పుట్టినది;
      గౌత్స్యము = గౌత్సమునకు సంబంధించినది, గౌత్సము= గుత్సమునకు సంబంధించినది, గుత్సము = వరి;
      వాత్స్యము = వత్సము (దూడ) నకు సంబంధించినది]


      హృత్స్యం దానుప మాగ్రహమ్ము హృదసంతృప్తిన్ విడం దల్చినం
      దత్స్యంత్తృవ్రజ దారణమ్ము విడుఁడీ ధర్మంబె మీకెంచఁగన్
      మృత్స్యన్నాంచిత శాకముల్ దగును సుమ్మీ యెల్లరున్ వీడఁగా
      మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే

      [హృత్ + స్యంద + అనుపమ + ఆగ్రహమ్ము; స్యందము = కాఱుచున్నది; తత్ + స్యంత్తృ; స్యంత్తృ = కదలుచున్న; మృత్ + స్యన్న + అంచిత; స్యన్నము =కాఱినది;]

      తొలగించండి

    2. అవధాని వర్యులు శ్రీ మైలవరపు మురళీకృష్ణ ఉవాచ: 👇

      "మాన్యులు పోచిరాజు వారి పద్యాలు వారి ప్రతిభకు నిలువుటద్దాలు👏👏🙏🙏నమోనమః"

      తొలగించండి
    3. విద్వాంసుల ప్రశంస లభించిన కదా కవికి నానందము. వారికి, మీకును నమస్సులు.

      తొలగించండి
  25. మత్స్యాహారమెమేలుమౌనులకుధర్మఙ్ఞోక్తియౌనిద్దియే
    మత్స్యంబన్నియు ప్రాణులేగదరమా! మాన్యంబె భక్షించగా
    మత్స్యాహారమె మేలు మౌనులకనన్ భావ్యంబె చింతించగన్
    మత్స్యంబుల్గన దూరమేగునుగదా మౌనుల్ విరాగంబుతో

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    అనారోగ్యము వలన చాలాకాలమునకు మిమ్ము దర్శించు భాగ్యము కలిగినది. చాల సంతోషము.

    నా పూరణము:
    మృత్స్యందోద్భవ వాపి జీవభృతమై మాన్యంబునై యొప్పఁ ద
    న్మత్స్యంబుల్ దిరుగాడ ఖాదకుల కా మత్స్యంబులం బట్టియు
    న్మత్స్యందీ నిభ రౌచ్య పచ్య కబళం బందింప నోర్మూసి రీ

    మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే!

    [మృత్-స్యంద+ఉద్భవ వాపి=భూమినుండి పుట్టిన నీటిబుగ్గచే నేర్పడిన బావి; మృత్స్యందీ నిభ=కలకండతో సమానమైన; మౌనులు=చేపల రుచికి నోరు మూసిన ఖాదకులు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదంలో యతిభంగమైనది. దోషమును సవరించిన పూరణము:

      మృత్స్యందోద్భవ వాపి జీవభృతమై మేల్ముల్ సదా యొప్పఁ ద
      న్మత్స్యంబుల్ దిరుగాడ ఖాదకుల కా మత్స్యంబులం బట్టియు
      న్మత్స్యందీ నిభ రౌచ్య పచ్య కబళం బందింప నోర్మూసి రీ
      మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే!

      తొలగించండి
    2. కవి పుంగవులు మధుసూదన్ గారికి నమస్సులు. ఎందుకు మీ పూరణములు వచ్చుట లేదా యని యనుకొనుచున్నాఁడను.
      ఇప్పుడు పూర్తి స్వస్థత చేకూరి నట్లు తలఁచెదను.

      తొలగించండి
  27. కందం
    ప్రమదమె మత్స్యాహార
    మ్మె? మేలు మౌనివరులకు నమృత శాకాహా
    రము వారి చిత్తవృత్తికి
    సమతుల్యతనిచ్చుకాదె? సాత్వికమనగన్

    రిప్లయితొలగించండి
  28. మత్స్యము రైతుల నేస్తము
    మత్స్యము బండించువారు మహనీయులులే
    మత్స్యము గుండెకు బలమట
    మత్స్యాహారమ్మె మేలు మౌని వరులకున్

    రిప్లయితొలగించండి
  29. కం.
    మత్స్యము శాకము వంగన
    మత్స్యము మాంసమె భుజించ మనుగడ సాగన్
    మత్స్యము కాదనుటేలగు
    మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. మునివర్యుల నివాసాల మధ్య చేపల వ్యాపారం పెట్టిన ఒక వ్యాపారి ప్రచార లీలలు:

    మత్స్యంబన జల పుష్పమె
    మత్స్యంబులుఁ దినిన దోస మంటదు యనుచున్
    మత్స్యపు బేహారి పలికె
    మత్స్యాహారమ్ముమేలు మౌనివరులకున్

    రిప్లయితొలగించండి
  31. శార్దూలవిక్రీడితము
    మత్స్యాలన్ వలపన్ని పట్టి మనుటే మా వృత్తి, మా కూతురిన్
    మత్స్యంపేటకు పెళ్లి జేసి బనుపన్ మాయింట కార్యంబయా!
    మత్స్యాహారమె కాక పాయసములన్ మార్చేమనన్, వీడితే
    మత్స్యాహారమె, మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే

    రిప్లయితొలగించండి
  32. మత్స్య మనగ మీనము మరి
    మత్స్యండి య శర్కర, యనుమానము వలదున్
    మత్స్యండి యె, పొరపా టన
    "మత్స్యా హారమ్మె మేలు మౌని వరులకున్"

    రిప్లయితొలగించండి
  33. డా.బల్లూరి ఉమాదేవి.
    మత్స్యాహారి యనె మనకు
    మత్స్యాహారమ్మె మేలు; మౌనివరులకున్
    మత్స్యా క్షీ చేయవలయు
    మత్స్య రహితమైన వంట మానుగ నెపుడున్.

    రిప్లయితొలగించండి