24, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3142 (పాటలగంధి యింపుగను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాటలే రాని మగువయే పాటఁ బాడె"
(లేదా...)
"పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్"

(పోచిరాజు కామేశ్వర రావు గారు పంపిన సమస్య)

51 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    దాటుచు కొమ్మకొమ్మలను ధైర్యము మీరగ తెల్లవారగన్
    కాటుక రంగునన్ వెలసి కమ్మని కంఠము నెత్తి కూయుచున్
    తోటల లోన దాగుచును తొయ్యలి వోలుచు మాధనమ్మునన్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

    రిప్లయితొలగించండి
  2. ప్రాయమది రాగ పెద్దలు పడచు గాంచి
    ఈడుకు దగిన వరునిచ్చి పెండ్లి జేయ
    మూడు రాత్రుల ముచ్చటల్ ముదము గొల్ప
    మాటలే రాని మగువయే పాటఁ బాడె!

    రిప్లయితొలగించండి
  3. అత్త మామ లాడపడుచు లనిన ప్రేమ
    కలిగి నట్టి యా యింతియే కట్టుకున్న
    వానినెదురించ లేనట్టి వశ పరుషపు
    మాటలే రాని మగువయే పాటఁ బాడె.

    వశ.......పడతి.

    రిప్లయితొలగించండి
  4. భాష తెలియనివారలన్ బాగ వెతికి,
    నెత్తి కెక్కించు కొనుటయే నేరమాయె,
    నేటి చిత్రాల తెలుగేది? నిండు సున్న
    మాటలేరాని మగువయే పాటఁబాడె..

    రిప్లయితొలగించండి
  5. పల్లెటూరున బుట్టిన పడుచు మూగ
    రేడియోలలొ పాటలు రెచ్చి వినుచు
    గొంతుగలుపుటనేర్చెను గొప్పగాను
    మాటలేరాని మగువయే పాటబాడె.

    రిప్లయితొలగించండి
  6. పాటలుబాడుకోయిలలు,బాగుగమాటలుజెప్పునాయిలన్?
    మాటలుజెప్పుచిల్కలిక,మానసమొప్పగ పాటబాడునా?
    మీటలునొక్కు రోజులివి,మ్రింగక పాటలు బాడు యంత్రమై
    పాటలగంధి యింపుగను, బాడెనుమాటలు రాకపోయినన్

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    మహాశ్వేత....

    తోటలలోన నెచ్చెలులతో విహరించుచు, పుండరీకుడన్
    దీటగు విప్రునిన్ గని, మదిన్ వలపుల్ చివురింప, పూపొదల్
    దాటుచు, వాని యందమునతంద్రితపక్ష్మయనంగ గ్రోలుచున్ ,
    నోటను పల్కు లేకయె మనోహరి తీయుచు కూనిరాగమున్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితము)

    ఘాటు మరాటి భాషనహ గాఢపు రీతిని మాటలాడుచున్
    పాటలు పాడి చిత్రముల భారత రత్నము స్వీకరించుచున్
    దీటుగ నాంధ్రమందునను తియ్యని కంఠపు సంబరమ్మునన్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

    https://www.google.co.in/amp/s/www.cinejosh.com/news/amp/3/26672/lata-mangeshkar-3-rare-telugu-songs.html

    రిప్లయితొలగించండి
  9. నీటుగ పాటబాడినను, నిన్నెవరిక్కడమెచ్చరెప్పుడున్!
    తేటగ తెల్గురాదనిన తెంపరిదర్శకుడేదొ మోజులో
    మాటలురాని గాయనులు మత్తుగబాడుడు చాలులేయనన్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలురాకపోయినన్

    రిప్లయితొలగించండి
  10. సూర్య భగవాను డెన్నడుఁ జూడ లేని
    సమయ మందున సంగీత సాధన గర
    పంగ పదునైన గళమునపస్వరంపు
    మాటలేరాని మగువయే పాటబాడె

    సూర్యుడి కన్నా ముందే లేచి బాగా సంగీత సాధన చేసి, పదునెక్కి, అపస్వరాలు పలకని గొంతుతో ఆ అమ్మాయి పాట పాడింది.

    రిప్లయితొలగించండి

  11. మాటలే రాని మగువయే పాటఁ బాడె
    రాయనే తెలియని జవరాలు పద్య
    ములను వ్రాసె నౌరా ఛందముల నెరవుగ
    కలిల మేది చేరగ దాని గంధ మబ్బు
    విశ్వదాభిరమామణి వినవె భామ!

    ఈ సభలో చేరిన జిలేబి "మాదిరి" గా :)


    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. (మహారాష్ట్ర కర్ణాటకాంధ్ర తెలంగాణాలలో గౌతమీ
    తరంగిణి తరంగాల సంగీతం )
    కోటల రాజరాణులును
    కొల్లగ కప్పుర హారతీయగా ;
    పేటల కష్టజీవులును
    ప్రేమగ గంధము , పూలు చల్లగా ;
    తేటల నీట దప్పికను
    దీర్చుచు పంటల నిచ్చు గౌతమీ
    పాటలగంధి - యింపుగను
    బాడెను మాటలు రాకపోయినన్ .

    రిప్లయితొలగించండి
  13. కృష్ణ భక్తియు మహితమౌ విష్ణు పూజ
    రమ్యముగఁజేసె నౌర ' మీరా'ప్రశస్తి -
    చేకురంగను ముక్తి! యే లౌకికంపు
    మాటలే రాని మగువయే పాటపాడె

    రిప్లయితొలగించండి

  14. గూగుల్ అలెక్స పాడవే కోయిల :)


    జోటిక గూగులాపదియె జోడుగ నింటను చేరె యంత్రమై
    చాటున! పోఁచి సర్దు కొని సాయము కోరగ గోముగానటన్
    "తోటయె లేద లెక్స! విను తోడుగ పాడవె కోయిలై" యనన్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. చాటె ప్రతిభ తాను విడిచి జంకు; తెలుగు
    మాటలే రాని మగువయే పాటఁ బాడె
    కోటి శ్రోతలు మెచ్చగ కోయిలంచు
    మేటి గాయనీ మణి లత మెప్పునొందె

    రిప్లయితొలగించండి
  16. మాటలే రాని మగువయే పాట బాడె
    నోయని కడు యాశ్చర్యముతోటి వినగ
    తేటగీతులే మాలగా తీర్చి యామె
    కోటి యందాలు పాటలో కూరె సుమ్ము

    రిప్లయితొలగించండి
  17. ఆడ రోబో ను నిర్మించె నాధు నిక పు
    శాస్త్ర వేత్త యొ కండి ల చతురముగను
    మీట నొక్కి న వెంటనే మిడిసి పడుచు
    మాట లే రాని మగువ యే పాట పాడె

    రిప్లయితొలగించండి
  18. చెన్నగు విభుండు నవ్వుచు చెంత చేర
    పడకటింటిలో కనుగొని పరవశించి
    మౌన రాగాల తోమది మరులు కొనగ
    మాటలే రాని మగువయే పాటఁ బాడె

    రిప్లయితొలగించండి
  19. మేటి లతాంతముల్ దినుచు మెత్తనికొమ్మల నూయలూగుచున్
    చాట వసంతవైభవము చక్కగగూడగ తోడుజోడునన్
    కాటుకరంగుపిట్ట తనకంఠము నందున పంచమంబుతో
    పాటలగంధి, యింపుగబాడెను మాటలు రాకపోయినన్ ,
    పోటిగ కూకుహూయనెను ముచ్చటమీరగ ప్రొద్దుప్రొద్దునన్

    రిప్లయితొలగించండి
  20. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    *"మాటలే రాని మగువయే పాటఁ బాడె"*

    సందర్భము:
    " 'కృష్ణాష్టమి పర్వదినాన అంగన లందరూ భక్తితో జోలపాటలు పాడినారు. అందులో నొకతె.. మాటలే రానిది.. ఐనా పాడింది. అ దే పాట?'
    అని అడిగినారు కదా! అది ఈలపాట.."
    అని ఒకడు కృష్ణాష్టమి కార్యక్రమాల గురించి తన మిత్రునికి చెబుతున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "లీలఁ గృష్ణాష్టమిని భక్తి జోలపాట
    లతివ లందరుఁ బాడినా.. రందు నొకతె
    మాటలే రాని మగువ; యే పాటఁ బాడె?.."
    ననుచు నడిగితి.. రీల పా టగును గాదె!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    24.9.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. మీటిన వీణయో! యనగ మేళితసుస్వరవేణువట్లు, బూఁ
      దోటల తేనె లాని యల తొయ్యలి తేటి యొకర్తె మాధురీ
      పాటవకర్ణపేయకలభవ్యవసంతనవీనగీతి నా
      పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

      తొలగించండి
  22. చాటుగ పాపికొండలకు సాగగ కాంతుని తోడ భామయే
    నీటను నావ బ్రుంగగనె నేర్పుగ నీదెను భర్త మున్గగన్
    దాటిన కాలముందలచి దాఁ పతి పాడిన పాటలన్నిటిన్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

    రిప్లయితొలగించండి
  23. మౌన రాగాలె మదినిండ మరులు గొనగ
    కోటి రాగాల కూరిమి నోట దాచి

    వింత గాదిది జనులార వినగ మీరు
    మాటలే రాని మగువయే పాట బాడె

    రిప్లయితొలగించండి
  24. ఉత్పలమాల
    చాటుచు పీవిఆరు కె ప్రసాదను యీవొ దయార్ద్ర దృష్టినిన్
    బాటున సుబ్బలక్ష్మిఁ గని పాడఁగ వేంకట నాథుకీర్తనల్
    బాటలు వేయ భాష ప్రతిబంధకమైనను సాధనమ్ముతోఁ
    బాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

    (శ్రీ పి. వి. ఆర్కె. ప్రసాదుగారి 'నా హం కర్త హరి: కర్త' పుస్తకంలో ఒక అధ్యాయము)

    రిప్లయితొలగించండి
  25. అందచందాల తోడను నడరిమిగుల
    నాటపాటలయందుననారితేరి
    కన్నుమిరు మిట్లుగొలిపెడు కాంతిగలుగు
    మాటలేరానిమగువయే పాటపాడె

    రిప్లయితొలగించండి
  26. చాటుచు సాంప్రదాయ శృతి శాస్త్ర విశిష్టత కీర్తనాదులన్
    పాటలగంధి యింపుగను బాడెను; మాటలు రాకపోయినన్
    దీటుగ నాట్యమాడె విరిదీవియ బోలు లతాంగి చెల్వుగన్
    సాటియె లేని జంటగ ప్రశంసలు బొందుచు సోదరీమణుల్

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సాటి వారల కెల్లను సాయ పడుచు
    ప్రేమ నిండిన హృదితోడ వెలుగు చుండి
    నుపక రించక నుండెడి యూక దంపు
    మాటలే రాని మగువయే పాటపాడె

    చలన చిత్రములందున వలను జూపి
    వేషములదోడ మెప్పించు ప్రేప్స గలిగి
    పట్టు మారినా తెలియని భాషలోన
    మాటలే రాని మగువయే పాటపాడె

    రిప్లయితొలగించండి
  28. తేటగీతి:
    శాంతమును లేని జనులకు సౌఖ్య మేది
    భామయును తేనె తీయని మాట బల్కి
    పాటవమున సుస్వరముల ప,ద,ని, పరుష
    మాటలే రాని మగువయే పాటఁ బాడె .

    ఉత్పలమాల:
    కోటను జేరినా చెలుడు గోరిక దెల్పగ పొంగిపోవుచున్
    ఆటల స్నేహితుండు మరి ఆయమ జేతిని గోరబట్టగన్
    మీటగ వీణియే మదిని మీరిన యాత్రపు ప్రేమయే, మరా
    "పాటలగంధి, యింపుగను బాడెను, మాటలు రాకపోయినన్"

    రిప్లయితొలగించండి
  29. వాణి నెరుగని మూగ పూబోణి ,వెజ్జు
    చెంత శస్త్రచికిత్సతో కొంత బాగు
    పడుననితెలిసి చేయించ ఫలిత మొచ్చి
    మాటలే రాని మగువయే పాటఁ బాడె

    రిప్లయితొలగించండి
  30. తే.గీ.

    వయసు పెంపార ముద్దుల పట్టి కలుగ
    గొడ్డు రాలిగ చిత్రించి గోల సేయ
    గర్భమే దాల్చి గొంతుల గట్టి వేయ
    మాటలే రాని మగువయే పాట బాడె

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. సుందర వదన గోమున మందిరమున
    నమ్ము నారీమణి దనరి నాథు చెంత
    సొగసు లొలుకుచు వింత నలుగురి యెదుట
    మాటలే రాని మగువయే పాటఁ బాడె


    తేఁటులు పాడెనో యచట తియ్యని తామర తేనెఁ గ్రోలుచున్
    మాటున మావి విద్రుమము మక్కువఁ గోయిల మెక్కి పాడెనో
    వాటిక జామపండ్లు దిని వన్నెలు చిల్కుచు రమ్య కీరమో
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

    రిప్లయితొలగించండి
  32. పాటయననది సినిమాల పాటగాదు
    సంత పాకల వేలంపు వింతపాట
    కుతుకమొప్పగ నేగియు కొమరుతోడ
    మాటలే రాని మగువయే పాటఁ బాడె

    రిప్లయితొలగించండి
  33. మాటలురావు మౌనముగ మానసమందలి భావ వీచికల్
    కాటుక కంటి బాసలతొ కళ్ళకుగట్టినయట్లు దెల్పగా
    పాటగమార్పునొందితన పాటవ మచ్చెరువందజేయుచున్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్

    రిప్లయితొలగించండి
  34. చాటునమాటునన్దఱచుచావడియందునబాటబాడునా
    పాటలగంధియింపుగనుబాడెనుమాటలురాకపోయినన్
    దేటమనంబుతోడనికదిట్టతనంబునమెల్గుచుండుచున్
    బాటలగంధియాసరళమానసమందునబాడుచుండెడున్

    రిప్లయితొలగించండి
  35. తాను కొంజూచిన వలపు తలపు కొచ్చి
    మైక మొక తెరగావరింప హ హ హా హ
    కూని రాగముతో కులుకుతు ఉ ఊ ఉ
    మాటలే రాని మగువ యేపాట బాడె

    రిప్లయితొలగించండి
  36. పాటల పోటియంచు పలు ప్రాంతపు గాయకు లెందరెందరో
    పాటలు పాడగా దలచి వచ్చిరి, యాంగ్లము నందు వ్రాసి యో
    పాటల గంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్
    మేటిగ తెల్గు గీతమును, మిక్కిలి యచ్చరు వొందిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  37. ఉ. పాటులు గడ్డువవ్వతనపాతకమేమనియడ్గలేక ,యో
    మాటున యేడ్చుసాధ్వితనమానసమందునమెర్పుమెర్వ, తా
    నాటకమందుపాత్రగనినాయిక గొంతుకుగాత్రమిచ్చి,యా
    పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్.

    రిప్లయితొలగించండి
  38. బూట కమైన శబ్దమని భూరిగ పేలిరి శ్రోతలొక్కటై
    మాటల ధాటిలేదనుచు మాన్యతవీడుచు గేలిసేయగా
    తోటన కోయిలమ్మవలె తొందరలేకను మంత్రముగ్ధగా
    పాటలగంధి యింపుగను బాడెను మాటలురాకపోయినన్.

    రిప్లయితొలగించండి
  39. చాటుగ పాటబాడుచును చక్కనిచుక్కగ పేరువచ్చెలే
    మాటల తోడయేమిపని?,మంజుల గాత్రము విన్న చాలుగా!
    తేటగకోయిలమ్మవలె,తేనియలూరెను గాత్రమందునన్
    పాటలగంధి యింపుగను బాడెను మాటలురాకపోయినన్.

    రిప్లయితొలగించండి
  40. మాటలు బూతులాయెనిట, మంచిగ నుండెడు మాట శూన్యమై !
    నూటికినొక్కపాటయును,నూపురమై నిలుచుండలేదిలన్
    సూటిగమాటలాడకను, శుద్ధముగా నటుబాడెకీర్తనల్
    పాటలగంధి యింపుగను, బాడెను మాటలురాకపోయినన్.

    రిప్లయితొలగించండి