20, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3315 (రాముఁ డేలఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు"
(లేదా...)
"వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్"

90 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    "గొగొ గొగొ గోంగురా..."

    గోముగ చిత్రసీమలను గొప్పగ దోచుచు హృత్తులన్ సదా
    రాముడు నందమూరుడహ రాజుగ నేలుచు హాస్యమాడగా
    భామలు పూరుషుల్ తనరి పట్టుచు పొట్టలు నవ్వజాలకే
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "సీతారాం సీతారాం..."

    గోముగ కమ్యునిస్టులహ గొప్పగ కొట్టుచు గుండులన్ భళా
    రాముడు యేచురుండచట రాజుగ నేలగ వంగభూమినిన్
    భామలు పూరుషుల్ హడలి పట్టుచు పొట్టలు వెక్కివెక్కుచున్
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్

    రిప్లయితొలగించండి
  3. (రావణపాలన - రామపాలన)
    సోమరులట్లు పౌరులను
    చోద్యముగా పనిచేయకుండగా
    కామలు లేని ఛత్రముల
    గప్పుచు సల్పు దశాస్యుపాలనన్
    వేమరు చచ్చినారు ప్రజ
    వేనకువేలుగ;రాముడేలగా
    సౌమనసమ్ముతో సకల
    సద్గుణశోభితులై చెలంగిరే!!
    (కామలు లేని-కాడలు లేని;సౌమనసము-బలిమి;దశాస్యుడు-రావణుడు)

    రిప్లయితొలగించండి


  4. జై శ్రీరామ్!


    సుఖము గా వర్ధిలిరయ వసుధని జనులు
    రాముఁ డేలఁగఁ, జచ్చిరి ప్రజలు వేలు
    రావణుండేల గా లంక , రామ రావ
    ణుల నడుమ చిరమరయిది నుతిని జేతు
    రామ రామ యనుచు నవిరామ‌ మయ్య!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. చామను కోరి విజ్ఞతయె చచ్చిన రావణు కారణమ్ముగా
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ, రాముఁ డేలఁగన్
    నీమము తోడు జీవితము నెక్కొన క్షేమము గా సుఖమ్ముగా
    రాముని ప్రస్తుతించి భళిరా జనులెల్లరు నిల్చిరే భువిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. రామకథ పాడ లవకుశుల్ రహిని బూని
    ధన్యులైతిమను కొనిరి తాపసులును
    రాము డేలగ, జచ్చిరి ప్రజలు వేలు
    నని పలుకు టసంబద్దమౌ నవని యందు

    రిప్లయితొలగించండి
  7. గోముగ రాజశేఖరుని,గొప్పగనెంచిన వారలందరున్
    ప్రేముడి మీరనిల్పనిక,పేల్చెను పాలన రాజధానిపై
    కామునివోల్చె గాల్చెనిక,కాష్టముబోల్చిన ప్రాంతమంతటిన్
    వేమురుచచ్చినారుగద,వేనకువేలుగ రాముడేలగన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కాముని వోలె... కాష్ఠము బోలిన..." టైపాటు.

      తొలగించండి
  8. సేమముగోరిసంఘమున,సేవితభక్తుడు నందమూరియే
    రామునిబాటలోనడువ,రాజ్యమునంతసుభిక్షమాయెగా
    నీమములన్నిబోవనిక,నిందలుబొందెను పార్వతీపతై
    రాముని పేరుబెట్టుకుని రాష్ట్రమునంతయు దోచెనాపెయే
    వేమురుచచ్చినారుగద,వేనకువేలుగ రాముడేలగన్.

    -----------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పతి+ఐ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  9. కామముకండ్లుగప్పుకొన,కామితయర్ధములన్ని బోవగా!
    నీమమువీడినేతలిక,నిందలువేసిరికర్షకాళిపై
    గోముగరైతులందరిక ఘోషలుబెట్టుచుదీక్షసేయగా
    వేమురుచచ్చినారుగద,వేనకువేలుగ రాముడేలగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కామిత+అర్థము=కామితార్థము' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  10. రాముడనగనె మనకు శ్రీరాముడు, భృగు
    రాముడు, బలరాములయొక్క లక్షణమగు
    నీతిపాలన తలపగు, నేటి దొంగ
    రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు

    రిప్లయితొలగించండి
  11. రామ రాజ్యమె కోరిరి భూమి ప్రజలు 
    రాము డేలగ, చఛ్చిరి ప్రజలు వేలు 
    రాక్షసుండగు రావణు రాజ్యమందు
    దుష్ట పాలన మెవ్వరు నిష్ట పడరు 

    రిప్లయితొలగించండి
  12. పురజనంబులుదలచిరి పరవశమున
    రామరాజ్యము బ్రతుకుల రహినిగూర్చు
    రాముఁ డేలఁగఁ, జచ్చిరి ప్రజలు వేలు
    వనములకురాముడేగెడు వార్తతెలిసి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వనవాస వార్తి విని దుఃఖించారే కాని చావలేదు.

      తొలగించండి
  13. ఆయువది తీరి పోయిన నవని యందు
    బ్రతుక జాలదే జీవియు వాస్తవమ్ము
    మరణ మాసన్న మైనట్టి జరులు నాడు
    రాముఁ డేలగఁ జచ్చిరి ప్రజలు వేలు.

    రిప్లయితొలగించండి
  14. నిన్నటిపూరణ.

    శుండాలమ్ములుఁ ద్రొక్కనేమి,భయదోచ్ఛూనాహిఫేనమ్ము లా
    గుండెం జేర్చిన నేమి, కొండలపయిన్ గుప్పించి త్రోయన్, హరీ!
    దండించం బలు భంగులం, బెదిరెనే? త్వద్భక్తియేఁ బ్రోవ, నా
    గాండీవోద్గతదివ్యబాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. నీమము లేని రాజ్యమున నీతి వహించని చట్టమేలగా
    కామము, క్రోధ మోహములు క్రమ్మిన రాక్షస పాలనమ్ముతో
    వేమరు జచ్చినారు ప్రజ వేనకు వేలుగ! రాముడేలగన్
    బ్రేమమునంద వచ్చునని పేర్కొని రంతట రామరాజ్యమున్!

    రిప్లయితొలగించండి
  16. షోడశ గుణసం పన్నుని శోకమార్పి/
    సీత జాడదెలిపొసంగ సిగ్గు బిళ్ళ/
    హనుమ కీయంగ తానింక నంకపాళి/
    రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు/
    కౌగిలింతల నారాము కరుణ జూప.//

    అంకపాళి-కౌగిలింత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అస్పష్టత ఉన్నది. 'తెలిపి+ఒసగ' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  17. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు"
    సందర్భము:
    సత్వగుణం ఆధారంగా రాజ్య మేలితే ఇలాంటి పేరు వస్తుంది.
    రజోగుణం ఆధారంగా రాజ్య పాలన చేస్తే ఇలాంటి పేరు వస్తుంది. అని వశిష్ఠుడు గుణముల ప్రాధాన్యాన్ని గురించి రామునికి
    వివరించినాడు.
    రాజు సత్వగుణం పెంచుకుంటే ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తారు. దీవిస్తారు. మంచిపేరు వస్తుంది. రజోగుణం పెంచుకుంటే ప్రజలు దుఃఖంతో అశాంతితో చస్తారు. శపిస్తారు. చెడ్డపేరు వస్తుంది.
    రామ రావణ రాజ్య పాలనలలో సంభవించిం దిదే కదా! సత్వగుణాధిక్యంతో పాలన జరిగిన రామరాజ్యంలో సుఖశాంతులు నెలకొన్నాయి. రజోగుణాధిక్యంతో కొనసాగిన రావణరాజ్యంలో వంశనాశనంతోసహా మహావీరు లెందరో మట్టిగరచినారు. రాజ్యం అల్లకల్లోల మయింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *సుగుణాభిరాముడు*

    రామ! సత్త్వ రజస్సులన్ గ్రమముగాను

    రాజ్య మేలిన ని న్నిట్లు ప్రజ లనెదరు..

    "రాముఁ డేలఁగ బ్రతికిరి ప్రజలు వేలు"

    "రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    20.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  18. మరో పూరణ.

    ఇండోనేషియ సింగపూరిటలిరానిత్యాదిదేశమ్ములన్
    చెండాడెన్ ఘనవైరసట్లు జననిస్తేజమ్ముఁ, జేకూర్చి లే
    లెండో పౌరులు మందు లేడఁ గలవో లేవో?, కరోనాలస
    ద్గాండీవోద్గతదివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే?

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  19. పామరుడైనవాడొకడు పావని సీతకునిందలేయగా
    ప్రేముడిగల్గుదానిగను,పేరును నిల్పగ దూకెనగ్నిలో
    రాముడు రాముడన్న రఘురాముడె రాక్షసుడైనతీరుతో
    వేమురు చచ్చినారుగద వేనకువేలుగరాముడేలగన్
    —————————//-
    రావెలపురుషోత్తమరావు











    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పామరుని నిందకు ఫలం సీతా పరిత్యాగమే. అగ్నిప్రవేశం కాదు కదా?

      తొలగించండి
  20. శంకరాభరణం......20/03/2020
    శుక్రవారం

    సమస్య. : 
    **** ***
    రాము డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు

    నా పూరణ :: తేటగీతి
    **** ***** ***** ***** ***** ****

    నీమము చెడక...మరువక నీతినెపుడు

    ప్రేమ బంచుచు... న్యాయము వీడక ప్రజ

    క్షేమమె తన ధ్యేయమని నెంచి మది...నేలె

    రాము ; డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు???


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  21. సత్య ధర్మాలు వర్దిల్లె చక్క గాను
    రాము డేల గ : జఛ్చి రి ప్రజలు వేలు
    గద కరోనా యను పిశాచి గజ్జె కట్టి
    నాట్య మాడుచు కబళింప నరుల నెల్ల

    రిప్లయితొలగించండి
  22. నామమిడంగ దానికిక న్యాయము సాగుట తథ్యమం చునే
    గోముగ దల్లిదండ్రి తమ కొండిక నామము రాముడం దురే!
    తామసవంతుడై యతడు దానము జేయగ గానవచ్చెగా!
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్

    దానము = పాలనము

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు వారి పూరణ

    ఏమి మనోహరాకృతి! యొకింత గనన్ పులకించు మేను! మా...
    రాముడు మాకు దేవుడు., పరాక్రమవంతుడు, ధర్మమూర్తియౌ!
    ప్రేమకు మారు పేరనుచు బేర్మి బడీ పడి వానికోసమై
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ 🙏

      నేమము దప్పకుండ ., ధరణీస్థలి ధర్మమె నిల్పుచుండ , ని...
      ష్కామజనానురంజకవిశాలమతిన్ గనుచుండ లోకులన్,
      కాముకులర్థలుబ్ధులపకారమతుల్ గుణహీనులెందరో
      వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. రాముఁడేలగఁ జచ్చిరి ప్రజలు వేల
    నుట నిజంబౌనెడ ప్రజలెందులకు కోరు
    కొంటిరయ రామరాజ్యము గొఱకుఁ దరత
    రముల నాటినుంచియు శంకరార్య విబుధ!

    రిప్లయితొలగించండి
  25. నూరు యజ్ఞములన్ జేసి కోరుకొన్న
    ఇంద్ర పదవిని పొందె మహీపతియును
    దుర్మతిని; కీడు వాటిల్లె తుదకు నట సు
    త్రాము డేలగఁజచ్చిరి ప్రజలు వేలు

    సు గురువైనదే!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'సు'గురువయింది కదా!

      తొలగించండి
    2. రేఫకుముందున్నది గురువుగ కాని లఘువుగా కాన స్వీకరించే వెసులుబాటు ఉన్నది కదా!

      తొలగించండి
  26. మాయదారి యుప్పెనొకటి మరణమువలె
    విరుచుకుపడె నయోధ్య పై విధివశమున |
    నెదురుచూడని ముప్పుకు బెదరి పోగ
    "రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు"

    రిప్లయితొలగించండి
  27. రావణుడు మారీచునితో చెప్పు సందర్భము :
    రాముడు ధర్మహీనుడు పరాకుగ నుండగ చంపె తమ్ములన్
    తామసుడీతడెంతయును తండ్రియు కానలకంపివేసెనే
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్
    నేమము జేసి తెచ్చదము నేర్పుగ బొందుము జింక రూపమున్
    కాముని బాణఘాతముల క్రమ్మగ చచ్చును సీత కోసమై

    రిప్లయితొలగించండి
  28. రాముఁడటంచు నమ్మిరి కరాముని ప్రీతి జనాలు గాని తా
    నీమము లేవెఱుంగడు ప్రణీత విధానములన్నఁ బట్టవే
    కాముక రాక్షసాన్వయుల కాఁడిని మోయుచుఁ గష్టబెట్టగా
    "వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు గరాముఁ డేలఁగన్"

    కరాముఁడు = చేతియందు రోగము కలవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవపూరణ:
      కామము మీరిపోయె కలి కాలమునందు సుఖాలగోరుచున్
      నీమములంద్యజించి ప్రజ నీతిని మాలి చరించు చుండు నౌ
      రా! మరులేలు కాలము, కరాముడనంగ కరోన వైరసే
      "వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు గరాముఁ డేలఁగన్"

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. పాములు సూకరమ్ములను భక్షణ జేయుచు కొందరున్ భువిన్
    దోమలు పెచ్చు మీర పలు ధూకలతో మరి కొందరున్ వడిన్
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ, రాముఁ డేలఁగన్
    నేమము వీడకుండఁగడు నీతిగ నుండిరి లోకులెల్లరుల్.

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల
    కాముకునిన్ వధించి కలకంఠిని సీత నయోధ్య జేర్చ విం
    జామరలూచుచున్ జనులు సంబరమందిరి, నిందఁ భాయఁగన్
    కోమలి నిండు గర్భవతిఁ గుందిలమంప మనస్సునందునన్
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్!

    రిప్లయితొలగించండి
  31. శాంతియుతముగమనుగడసాగెభువిని
    రాముడేలగ,జచ్చిరిప్రజలువేలు
    రక్కసులెకాక పుడమినిరహినిచెడుచు
    రామరావణయుద్ధానరాముగురిచి

    రిప్లయితొలగించండి
  32. ఏమని యందుమీ విలయమెంత భయంకరమైనదో గదా
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ; రాముఁ డేలఁగన్
    నీమము నిష్ట గల్గి ప్రజ నిర్భయ జీవనమందిరట్టులే
    సేమము గూర్చు స్వచ్ఛతను చిందెడి దేహము మానసమ్ములే

    రిప్లయితొలగించండి
  33. వేమరుచచ్చినారుప్రజవేనకువేలుగరాముడేలగన్
    యేమదియట్టులంటిరయ,యట్లుగబల్కుటన్యాయమే,ప్రజల్
    రామునిరాజ్యమేతమకురంజిలమైనదియంచుబల్కిరే
    రామునిజన్మమున్నరయరావణుహత్యకుకారణంబుసూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏలగన్+ఏమది' అన్నపుడు యడాగమం రాదు. రెండవ పాదంలో యతి తప్పింది. 'రంజిలము'? "... మైనదటంచు..." అనండి.

      తొలగించండి
  34. రాముని వీరవిక్రమము రాక్షసరాజ్యముఁగూల్చి వేయ నా
    రామములందుమౌనులకురక్షణగల్గెను రాక్షసాధముల్
    వేమరు చచ్చినారు, ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్
    క్షామముచేరరాదనుచు సంతసమంది సుఖించిరెల్లెడన్

    రిప్లయితొలగించండి
  35. చోర భయము లేదు రుజల నేర రేరు
    మూడు వానలు నెల లోన మూరి కురిసె
    నచ్చెరుపడ నేల నల హర్షాబ్ధి మునిఁగి
    రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు!


    రాముఁడు క్షాత్రధర్మ జన రక్షక కార్య నిమగ్న చిత్తుఁడే
    యేమఱ కుండ నుండి వని నేచి సదార సలక్ష్మణుండునై
    యా ముని కాయ బాధకులు నాసుర వీరులు, దండకావనిన్
    వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ, రాముఁ డేలఁగన్

    రిప్లయితొలగించండి
  36. నీమముదప్పి వర్తిలగ నేతలు సోకుచు నంటురోగముల్
    వేమరు చచ్చినారు ప్రజ వేనకువేలుగ;రాముడేలగన్
    క్షామము లేదకాలమృతి గానము లేవుగ దీర్ఘరోగముల్
    క్షేమము శాంతిసౌఖ్యములె చేకురుచుండెను మానవాళికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లేవు జబ్బులు చావులు లేదుకరువు
      లేవమంగళములు పోరు లేశమైన
      రాముడేలగ;జచ్చిరి ప్రజలువేలు
      కలియుగంబున హెచ్చగ కల్మషంబు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  37. తేటగీతి
    పంక్తి కంఠుని వధియించి పత్నిఁదెచ్చి
    సంతసంబును గూర్చిన సద్గుణుండు
    సీత నంపఁగఁ కానకు చిత్తమందు
    రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు

    రిప్లయితొలగించండి
  38. నీమము దోడ ధర్మయుత
    నిర్మిత రాజ్య సుపాలనమ్మునన్
    కామము క్రోధమున్ మదము
    కంటక భావము మోహ లోభముల్
    బాము కొనంగ సిగ్గు వడి,
    పామరతన్ విడి, పాలనమ్ములో
    వేమరు జచ్చినారు గద
    వేనకు వేలుగ రాముడేలగన్!

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "వేమరు చచ్చినారు ప్రజ వేనకు
    వేలుగ రాముఁ డేలఁగన్"

    సందర్భము: చైనీయులు తినని తిండి లేదు. జిహ్వా చాపల్యానికి కొదవలేదు. ఆ నియంత్రణ లోపించిన చోట రోగం చోటు చేసుకుంటుంది.
    పాములు, కప్పలు, బల్లులు, పిల్లులు, గండుచీమలు, పందులు, నక్కలు, కుక్కలు, గొఱ్ఱెలు, కోళ్ళు, తేళ్ళు ఒక టేమిటి? పద్యంలో చోటు చేసుకోనివి యింకా చాలానే వున్నాయి ఎలుకలు, రొయ్యలు, పిట్టలు, దున్నలు, చేపలు, మేకలు, బొద్దింకలు, రకరకాల పురుగులు ఇంకా ఏవేవో..
    కాదేదీ తినుట కనర్హం.. అంటూ అన్నీ ఆవురావురు మని మెక్కేస్తూ వుంటే ప్రకృతిమాత ఎన్నాళ్ళని చూస్తూ వూరుకుంటుంది? తన తడాఖా చూపించకుండా వుంటుంది?
    మితిమీరిన భోగం (సుఖం) రోగానికి కారణమై తీరుతుంది. అసలు సుఖమే రోగం. సుఖరోగ మని వింటాం. కాని దుఃఖ రోగమనే మాటే వినం కదా!
    చైనీయుల భోగం ప్రపంచానికే రోగమయిం దిప్పుడు. అదే.. కరోనా..కాదు కరాన.. అంటే.. కరమున.. చేతిలో రోగం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *భోగమే రోగము*

    పాములఁ గప్పలన్ మరియు
    బల్లులఁ బిల్లుల గండుఁ జీమలన్
    బామరు లౌచుఁ బందులను
    నక్కలఁ గుక్కల గొఱ్ఱెలన్ భలే
    గోముగ నడ్డమైన యవి
    కోళ్ళను దేళ్ళను మెక్కి, చైన వా
    రామయ లాభ మందుచుఁ గ
    రాము లనన్ యశ మంది కుల్కగా
    వేమరు చచ్చినారు ప్రజ
    వేనకు వేలుఁ.. గరాముఁ డేలఁగన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    20.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  40. రావణాసుర సంహార సమయమందు
    యుద్దభూమిన రామునినుద్దరించ
    రాముడేలగజచ్చిరి ప్రజలువేలు
    భక్తి నొనగూర్చు శక్తిచేముక్తిబడయ!

    రిప్లయితొలగించండి