17, ఏప్రిల్ 2021, శనివారం

దత్తపది - 176

18-4-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
"గుమ్మము - గోడ - తలుపు - అరుగు"
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పండి.

69 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    [మరణశయ్యపైనున్న కర్ణునితో శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము]

    పేద గుమ్మముఁ ద్రొక్కినపెద్ద బావ!
    తల్లి గో డదినిను నట్లుఁ దరలఁజేసె!
    మనసు తలుపును తెఱువుము మాన్య! కర్ణ!
    యమిత కీర్తుల తోడుత నరుగుమయ్య!

    రిప్లయితొలగించండి
  2. అదిగో డప్పు వాద్య శబ్దముల తో నార్భాట సంగ్రామమే
    మొదలయ్యెన్ గద గుమ్మమున్ విడిచియున్ పొంగారు ధైర్యమ్ముతో
    పదునౌ వీరులు గెల్తు మన్ తలుపు నన్ భాసించి పోరాడగా
    కుదురౌ రీతి విజేతులై యరుగ రే కొండాడ నా పాండవుల్

    రిప్లయితొలగించండి
  3. (గుమ్మము) యను భ్రాంతియుతుడౌ కురు కుల పతి

    నిష్క్రమించు తరిన్ (గోడ ) నిలిచెనడ్డు

    (తలుపు) వెన్క పరిహసించె ద్రౌపదమ్మ

    (అరుగు) టయె తప్పు కదర మయ భవనముకు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుమ్మము+అను' అన్నపుడు యడాగమం రాదు. "గుమ్మ మనెడి" అనండి.

      తొలగించండి
  4. గోడనుగట్టిరినీతికి
    పీడగమూసిరితలుపులుపెన్నిధిపోయెన్
    తోడుగధర్మమునరుగగ
    చేడియగుమ్మంబుదాటచేటునుకలిగెన్

    రిప్లయితొలగించండి
  5. కీచకాలాపన

    ముద్దు ముద్దుగుమ్మ! మున్గితి నీప్రేమ
    మనసు తలుపు తెరిచి యనుమతించు
    అడ్డుగోడ లేల నంగజు క్రీడను
    అరుగు దెంచరాదె యంచయాన

    రిప్లయితొలగించండి
  6. దత్తపది :-
    *"గుమ్మము - గోడ - తలుపు - అరుగు"*
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం

    *తే.గీ**

    ముద్దు గుమ్మ మునీంద్రుని ముఖము జూచి
    సేవ జేయగ గోడంబి చేతినిండ
    నాలుగింతలు పుట్నాలు నములు కొరకు
    వేగ నరుగుము కొనిరాగ వెర్రి బాల
    ..................✍️చక్రి

    (కపటయతి వేషంలోని అర్జునుడు సుభద్ర తో మొదటిసారి కలిసినప్పుడు)

    రిప్లయితొలగించండి

  7. (ద్రౌపతి వస్త్రాప హరణం తర్వాత భీష్ముడు దుర్యోధనుని మందలించినట్లుగా నూహించిన పద్యం)


    మాతలు పుణ్యమూర్తులుసుమా! యవమానము సేయనేలరా
    చేతులతోడ గుమ్మ ముడి చేదుచు నీసభ కీడ్చినారె యా
    యేతుల నెవ్వతో యరుగు హీనుడ నీకుల మంచెరుంగవే
    యా తెలిగంటి గోడదియె యంతము సేయక వీడదందునే.

    రిప్లయితొలగించండి


  8. అరుగు దెంచి కీచకుడు కలాపములకు
    గోడ దాటి బిలిచెనదె గోల ! రావె
    ముద్దుగుమ్మ! ముద్దాడగ ముందు పడు! త
    లుపుల మాటుదాగకిక చెలువుమిగులదె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పిందేమో?

      తొలగించండి
  9. ఉత్తర తో సుభద్ర
    ముద్దుగుమ్మ!మురిపెముల పుట్టినిల్ల!
    మాకుఁగోడల!సుగుణాల మధుర చరిత!
    ధర్మ పత్నిగ వలపుల తలుపు తీసి
    అరుగు!మాపుత్రు నభిమన్యు నలరఁజేయ.

    రిప్లయితొలగించండి
  10. చం:

    అరుగుచు నుండెయర్జునుడె యా రణరంగము వీడి భీతినిన్
    తలుపులు దీసి యుంచి మది తల్చెను నెల్లరు బంధు వర్గమై
    పెర పెర లాడె ధీరుగని పెక్కురు గుమ్మము దాట నోపకన్
    పరిగణ నెంచ యుద్దమున బంధపు గోడలు గూల్చు టెట్లనన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. దౌత్యమునకు నీ గుమ్మము దాటియుంటి
    పందెవు నిబంధనపు గోడ పాయెనిపుడు
    నీ మది తలుపును తెరచి నేయమయిన
    యవని వారి కి యగ జెప్పి యరుగు చుంటి

    రిప్లయితొలగించండి
  12. విప్రులుయరుగుదెంచిరి, వెనుకవైపు
    కోటగోడతలుపుపైనిగంటగొట్ట
    విప్రవేషమువీరిదివీలుగాను
    గుమ్మముననిలిచిరిగదగోప్యముగను
    అరులుగనుదోచువీరుగ అయిననేమి
    ధర్మమనిజరాసంధుడుతావిడెనుగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విప్రులు + అరుగుదెంచి' రన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  13. దత్తపది :
    గుమ్మము - గోడ - తలుపు - అరుగు - పదాలను భారతార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందస్సులో

    ( వనవాసం , అజ్ఞాతవాసం ముగించుకొని వచ్చిన పాండవులను హస్తినకు తీసుకువస్తానని వాత్సల్యంతో
    వారి రాజ్యం వారి కిమ్మని ధృతరాష్ట్రునికి చెబుతున్న విదురుడు )

    అమ్మలు మెచ్చగా నరుగు
    దచ్చటికిన్ ; ముదమార దెచ్చెదన్ ;
    గుమ్మము దాటనీకు మన
    క్రొన్నెల వంశపు పోరుపొచ్చెముల్ ;
    నమ్ముము ; దీయుమా తలుపు
    నమ్రులు తమ్ముని పుత్రకాళికి ;
    న్నెమ్మెయి కోటగోడలిక
    యెప్పుడు కూలగనీకు మగ్రజా !!

    ( అమ్మలు - మన తల్లులు ; క్రొన్నెలవంశము - చంద్రవంశము )

    రిప్లయితొలగించండి
  14. ఆ౹౹
    కుంతి యరుగు వేళ గోపతిజుడు తాను
    గుమ్మముననె నిల్చె గోడనాని
    తలుపు వద్దనుండె తలి ప్రతిపాదనన్
    గోడగించె నిజపు కూర్మి కొఱకు౹౹

    రిప్లయితొలగించండి
  15. గుమ్మము - గోడ - తలుపు - అరుగు
    ముద్దుగుమ్మమునుపుముచ్చటలాడంగ
    కోరికోరితానుగోడలయ్యె,
    చేరిలక్కనింటఁజేతలుపులుమంగ
    యన్నదమ్ములంతనరుగుదెంచె,

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  16. కీచకుని ఉన్మత్త ప్రేలాపన:
    ముద్దులొలుకు *గుమ్మ ము*నుపెన్నడునుగాంచి
    యుండనైతి*నరుగు*చుంటివెటకు
    పూలసౌరభముల పులకరిం*తలు పు*ట్టె
    నడ్డు *గోడ*లేల నబల మనకు

    రిప్లయితొలగించండి
  17. (గుమ్మము)న కాలు పెట్టిన కొడుకు సతిని

    (గోడ ) కావల చేరిన కోమలి నను

    (తలుపు) కీవల తెచ్చిరి తట్టి జుట్టు

    (అరుగు)నున్న మామ కనుము అంధ రాజ

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  18. కోరి పిలువ *గుమ్మ ము* దమ్ము గూర్తు నంచు
    నాసిరికిఁ *గోడ* లి పెనిమి టావహించె
    నెంచి యామె చే *తలు పు* లకించెఁ దనువు
    నే *నరుగు* దు నామెఁ గలయ నేటి రేయి


    రిప్లయితొలగించండి
  19. మక్కువ తీర గుమ్మ ముదమార వృకోదరుఁ గోర పుష్పమున్
    చక్కని దివ్యపుష్పముల సౌరభమొప్పు కుబేరుఁ వాటికన్
    గ్రక్కున గోడలం దలుపులన్నియు దాటి సుగంధ పుష్పముల్
    పెక్కగు వేగమందరుగు భీముడు కృష్ణకు దెచ్చియిచ్చెగా

    రిప్లయితొలగించండి
  20. కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో....

    తేటగీతి
    బంధముల గోడ దాటఁగ భయపడ ననిఁ
    గోటగుమ్మమ్ము దక్కునే కొలువుఁ దీర
    మదిని తలుపులు తెఱువ సమంజసమన
    నరుగు మోహమ్ము విజయా! జయమ్ములందు

    రిప్లయితొలగించండి
  21. ముద్దు(గుమ్మ! ము)రిపమును బడయుచు నిన్ను

    మనువాడ గా భావ్యమా తలచుము,

    గురు పుత్రికవు యీవు,
    సరికాదు,మాతాపి
    (తలు పు)ణ్య మూర్తులు‌ ,దయను గూడి

    విద్యలు నేర్పిరి,వినయము తో నేను
    నీకును సేవలనెపుడు చేతు,

    (నరుగు) పడగలవు నావిద్య లన్నియు
    నియముము తప్పినన్, నీదు
    నిర్ణ


    యమును మార్చు కొనవలయు నమ్మ, విభవ

    ములు నశించి ,యేడా (గోడ)ములు కలుగ

    దిగులు చెందడీ కచుడని
    దేవ యాని

    నిని గని పలికె పలికెను కినుక‌ తోడ


    ఏడాగోడము = విరోధం
    అరుగు పడు= నశించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో నా వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
  22. ముద్దుగుమ్మ! ముదము,గోడ దద్దరిల్లు
    నట్ల యరుగు దమికరమ్ము తలుపు
    తీయి సైరంధ్రి యనుచును దీయపలికె
    కీచ కుండప్డు కలుగగ నీచబుద్ధి

    రిప్లయితొలగించండి
  23. కడు వంతలు పుట్టఁగ నరు
    గుడు మే లిట మనకు ముద్దుగుమ్మ మురియఁగన్
    మడు గోడక దిగి కొని పూ
    లడరి వనము నందు నుంట నర్హము భీమా

    రిప్లయితొలగించండి
  24. మరొక ప్రయత్నం..

    తేటగీతి
    ముద్దుగుమ్మ ముదము గోరి హద్దుదాట
    వావి వరుసల గోడలు లేవు మనకు
    వలపు తలుపులు తెఱువగా నలుసె వనిత?
    దూరమరుగుచు నర్జునా! తొలఁగనేల

    రిప్లయితొలగించండి
  25. కం||
    గుమ్మయు దెల్పిన గోడును
    దమ్మున విని యరిగె భీమ ధవుడే తలపున్
    నెమ్మది గుప్తపు దొమ్మికి
    రమ్మనె నర్తనపు శాల రయమొనరింపన్.

    రిప్లయితొలగించండి
  26. కె.వి.యస్. లక్ష్మి:

    మాయల మయమౌ మయసభా మందిరమున
    తలుపు గోడ యరుగు గుమ్మములను భిన్న
    రూపములుగ విలోకించి చూపులందు
    భ్రాంతి నొందిన రారాజు భంగ పడియె.

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి , వెలుగోడు
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు రు భ్యో న మః


    { కీచకుడు ద్రౌపది తో }


    గుమ్మ ! ముదమున కవుగిలి నిమ్మ , యరుగు

    దెంచి | నీ యురోజయుగము గాంచి నంత ,

    నింతలు పులకలు జనించె స్వాంత మందు |

    నించువిలుతు గో డయొ భరించలేను |


    ( ఉరోజము = కుచము : ఇంతలు = ఇంతలేసి : పులక =

    పులకింత : ఇంచువిలుతుడు = మన్మథుడు : గో డయొ =

    గోడు + అయొ )

    ----------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. (గుమ్మ ము)ని మంత్రమున మున్ను గొమరు బడసె
    అరయ నంబాలికకు (గోడ)లాయె పిదప
    అనుసరించె పతి నడవి (కరుగు) వేళ
    సంతసిలె దేవ(తలు పు)త్ర సంతతినిడ

    రిప్లయితొలగించండి
  29. చక్కెర ముద్దుగుమ్మ ముఖచంద్రుని గాంచియు కీచకుండు గో
    డక్క సుదేష్ణకున్ దెలుపు డక్కయు నీయమ వద్దు వల్లభుల్
    జక్కగ గాతు రేవురట చాలిక చేతలు పుణ్యమూడ్చు నీ
    కెక్కడి మోహ మీ వరుగు టెంతయు సేమ మటంచు జెప్పదే

    రిప్లయితొలగించండి
  30. ముద్దు గుమ్మ ముఖము ముదమును కలిగించ
    మది తలుపు తెరిచితి మానుగాను
    కుంతిదేవికినినుగోడలిన్ చేసెద
    నరుగుదమని పలికె నర్జునుండు

    రిప్లయితొలగించండి