మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో "కులమతమ్ముల ... బోదింప నలసట విడి" అనండి (అలసట+అనక.. అన్నపుడు సంధి లేదు) రెండవ పూరణలో 'ఇత్తరుల'? "తోడయి నిల్వు మన్యులను దూరకు.." అనండి.
వీధి నాటకము బహుళ ప్రాచుర్యము పొందిన రంగస్థల ప్రదర్శన. అట్టి కళాకారులలో ఒకరు, రాముని పాత్రధారి గొప్ప పేరు సంపాదించి మిగతా వారికి సహాయకారిగా ఉన్నారని చెప్పుటగా నా ప్రయత్నము:
కూడును గూడు లేక మరి గుడ్డ యు లేక తపించు వారికిన్ నీడను నివ్వ బూనుకొని నిక్కము తిర్గెను గాంచ వారలన్ వాడొక ధర్మ దాత గుణవంతుడు దీనుల బాధ దీర్చగా వాడలవాడలందిరుగు, వాడలరున్ సుగుణాభి రాముడై.
లోకసంచారినారదులౌక్యమెంచి
రిప్లయితొలగించుతానుజనములబాధలతాకగాను
మనిషిమనసునుదెలిసినమానవునిగ
వాడవాడలతిరిగెడివాడెసుగుణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'నారదు' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "సురమౌని" అందామా?
సర్వజ్ఞ, లోసంచారిసురమౌని, అనిసరిదిద్దుకుంటాను
తొలగించుపౌష్య మాసాన తంబూర పట్టి సతము
రిప్లయితొలగించుహరిని కొలుచుచు హరిదాసు డాగ కుండ
వాడ వాడల తిరిగెడి వాడె, సుగుణి
తెలుసు కొమ్మని యొజ్జ శిష్యులకు తెలిపె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఎట్టి ప్రతి ఫలము లను దా నిష్ట పడక
రిప్లయితొలగించుచేత నైనట్టి రీతిగా సేవ జేయ
సిద్ద పడినట్టి సంకల్ప సిద్దు డగుచు
వాడ వాడల దిరిగెడు వాడె సుగుణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుసమస్య :
రిప్లయితొలగించువాడల వాడలం దిరుగు
వా డలరున్ సుగుణాభిరాముడై
( భోగాలన్నిటినీ రోసి ప్రజల నడుమతిరిగి
ఆటవెలదులతో చైతన్యం కలిగించిన
ప్రజాకవి మన వేమన )
ఉత్పలమాల
.....................
మేడల మిద్దెలం గడుపు
మేలిమి మానిసి వేమనార్యుడే
వేడుక గొల్పు భోగముల
వీడెనె ; పల్లెల సంచరించెనే !
గూఢపు గోచి దాలిచెనె !
గొప్పవి పద్యము లెన్నొ చెప్పెనే !
వాడల వాడలం దిరుగు
వా డలరున్ సుగుణాభిరాముడై .
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఏడగు కొండలన్ వెలసి యెల్లరికోర్కెలు
రిప్లయితొలగించుదీర్చువాడు తా
వేడుక బెక్కుయానముల వెల్గుల నీనుచు రాత్రివేళలన్
గూడిన భక్తులందరకు గుండెలనిండగ మోదమెంతయున్
వాడల వాడలన్ దిరుగువాడలరున్ సుగుణాభిరాముడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములాచార్యా! నమోనమః!🙏🙏🙏
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుజగము నేలెడి పరమాత్మ శైలధరుని
మహిమ లన్నియు జెప్పెడి మనసు తోడ
ప్రవచనముల నిచ్చుచునుండి వాలకముగ
వాడ వాడల దిరిగెడు వాడె సుగుణి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుగురువు గారికి నమస్సులు.
తొలగించుమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించువేడుక వేంకటేశ్వరుని వేడుచుఁ, గీర్తనఁ బాడుచుండియున్,
మాడల వీథులందుఁ దిరుమాళిగలం దగ నాట్యమాడుచున్,
వేడుచు, సంస్మరించుచునుఁ, బ్రేమనుఁ బిల్చుచు, సౌహృదుండునై,
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై!
మొదటి పాదంలో ’వేడుచు’ బదులు ’వేమరు’ అని పఠించగలరు
తొలగించుమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించువీడుచురాజసంబునటవేగమమారినవేషధారణన్
రిప్లయితొలగించుకూడుచుపల్లెవీధులనుకుందినదీనులబాంధవుండునై
పోడిమిమీరగౌతముడుపోంగినజాలినిసంచరించెనే
వాడలవాడలన్దిరుగువాడలరున్సుగుణాభిరాముడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుకులమతముల విడనాడి కువలయమున
మానవత్వపు విలువలన్ మహిని నిలుపు
మనుచు జనులకు బోధింప యలసటనక
వాడ వాడలఁ దిరిగెడు వాఁడె సుగుణి.
వీడకు మానవత్వమును, పెద్దల నెప్పుడు గౌరవించుచున్
తోడయి నిల్చు మిత్తరుల దూరకు ధర్మము తప్పబోకుడీ
నీడనొసంగు వృక్షముల నిల్పిన మేలని చెప్పుచున్ సదా
వాడల వాడలం దిరుగు వాఁడలరున్ సుగుణాభి రాముడై.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుమొదటి పూరణలో "కులమతమ్ముల ... బోదింప నలసట విడి" అనండి (అలసట+అనక.. అన్నపుడు సంధి లేదు)
రెండవ పూరణలో 'ఇత్తరుల'? "తోడయి నిల్వు మన్యులను దూరకు.." అనండి.
తోడుగనుండి చిత్తమున
రిప్లయితొలగించుదీపమువోలె వెలుంగు లీనుచున్
వేడకనే వినిర్మల ర
వి ప్రభవోలెను నంధకారమున్
వీడగజేయు వాడగుచు
వేడుక నింపగ గోరి నిత్యమున్
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుశైత్య కంజారమునువీడి జగమునందు
రిప్లయితొలగించుపీడితులగూడి వారల గోడు నెరిగి
యుద్ధరింపగ కంకణ బద్ధుడౌచు
వాడ వాడలఁ దిరిగెడు వాఁడె సుగుణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించుప్రాతః కాలంలో నగర సంకీర్తనలు చేసెడి వారిని ఉద్దేశించి...
పోడిమి గూర్చగన్ జనుల మోదము కోరెడి సంఘరీతులన్
గూడును భక్తి భావనల కూర్మిని బెంచగ భక్తకోటినిన్
గీడును ద్రుంచగన్ నగర కీర్తన లెన్నియొ యాలపించుచున్
*"వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై”*
*వాణిశ్రీ నైనాల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించువేడుక గూర్చునట్టివగు వెన్నుని లీలల గొప్పలన్నియున్
కూడిన పూనికన్ నెఱిని కోపుగ బోధనజేయు లక్ష్యమున్
పాడుచు శ్రావ్యమైన విధి భక్తిని పౌరులలోన పెంచుచున్
వాడల వాడలన్ దిరుగువాడలరున్ సుగుణాభిరాముడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఎప్పుడును నేను నీతోడ ఇంట నుందు!
రిప్లయితొలగించుఅనగ విని భార్య అనెనిట్లు అతని తోడ
మగువ హృదయంబెరుగని మగని కంటె
వాడ వాడల దిరిగెడు వాడె సుగుణి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'ఇట్లు+అతని' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "నీతోడ నింట నుందు । ననగ విని భార్య యనెనిట్టు లతనితోడ । మగువ హృదయము నెఱుగని/హృదయం బెఱుంగని.." అనండి. (మూడవ పాదంలో గణభంగం)
మరోపూరణము:
రిప్లయితొలగించువాడు కళాధరుండు తన
వెల్గుల బంచుచు లోకమంతటన్
వేడుక జేయు మామగ, త
పించెడి ప్రేమపిపాసు లందరన్,
షోడశకాంతు లీనుచును
చుక్కల చెంతను చంద్రశాలలో
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై!
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించువీధి నాటకము బహుళ ప్రాచుర్యము పొందిన రంగస్థల ప్రదర్శన. అట్టి కళాకారులలో ఒకరు, రాముని పాత్రధారి గొప్ప పేరు సంపాదించి మిగతా వారికి సహాయకారిగా ఉన్నారని చెప్పుటగా నా ప్రయత్నము:
రిప్లయితొలగించుఉ:
కూడళు లందు నాటకము గోరుచు రమ్మన నాటకీడులన్
పాడుచు నాడుచున్నొకడు ప్రాకట మొప్పగ కౌసలేయుడై
తోడగుటెంచ, నన్యులకు దుఃఖము బాపెడి దొడ్డవాడనన్
వాడల వాడలందిరుగు వాడలరున్ సుగుణాభిరాముడై
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములు
తొలగించుకూడును గూడు లేక మరి గుడ్డ
రిప్లయితొలగించుయు లేక తపించు వారికిన్
నీడను నివ్వ బూనుకొని నిక్కము
తిర్గెను గాంచ వారలన్
వాడొక ధర్మ దాత గుణవంతుడు
దీనుల బాధ దీర్చగా
వాడలవాడలందిరుగు, వాడలరున్
సుగుణాభి రాముడై.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించువీడి గృహంబు సౌఖ్యములు వేసటలన్భరియించి యోర్మితో
రిప్లయితొలగించుపీడితవర్గమెల్లరకు పెన్నిధివోలె సమాదరింపగన్
తోడయి వారియున్నతికి తొందరనొందుచు వారి సేవలో
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుకె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించుజగతి నేలెడు పరమాత్మ చక్రధరుని
తీరు పొగడుచు నిరతమ్ము తీయనైన
గళమునన్ పాడు చుండుచు కరణి గూడి
వాడ వాడల తిరిగెడు వాడె సుగుణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుత్యాగరాజస్వామి నగర సంకీర్తన....
రిప్లయితొలగించుపాడియె పుష్యమున్ బహుళ పంచమి నా డల త్యాగరాజునిన్
కూడుచు సంస్మరించుకొనఁ కోరుచు వచ్చిన వారలందరున్
పాడుచు నామకీర్తనమె భక్తిగఁ సేయుచు బృందగానమున్
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై౹౹
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఆడడబద్ధమెప్పుడును యాచకవృత్తిని మున్గిదేలుచున్
రిప్లయితొలగించుమోడగు జీవితంబున ముముక్షువు బోలుచు ముందుకేగుచున్
బీడుగమార జీవితము విష్ణుని యందున జిత్తముంచుచున్
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై.
యజ్ఞభగవాన్ గంగాపురం
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుచేడెల జుట్లుగట్టి సరి చీరల దొంగిలి వెన్నదోచి పూ
రిప్లయితొలగించుబోడుల వేణుగాన వశ భూతుల జేయుచు లీలగన్ మహా
క్రీడల నాడి గోగిరిని వ్రేలున నిల్పెను గోపబాలుడీ
వాడల వాడలం దిరుగువా డలరున్ సుగుణాభిరాముఁడై
ప్రతి గృహమునకు పోవుచు వారికెల్ల
రిప్లయితొలగించువలసినట్టి కార్యములను బాటిగొనుచు
వాడవాడలఁ దిరిగెడువాఁడె సుగుణి,
కోవిడుండి బయటకు రాకూడనపుడు
శ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించుతే.గీ.
సకల గుణదాభిరాముండు సన్ను తుండు
మనసెరిగినాదు కొనియెడి మాధవుండు
ప్రజల నోట కీర్తనలతో వాసి యగుచు
వాడవాడలఁ దిరిగెడు వాఁడె సుగుణి
కూడిన మిత్రసంతతికిఁ గూర్మినిఁ బంచుచు నాటలాడుచున్
రిప్లయితొలగించుపోఁడిగ వ్రేతలన్ గదిసి పూఁ బొదరిండ్లను చెంగలించుచున్
తోఁడుగ గోపబాలకులు తోషముతోఁ జనఁ బాలు వెన్నకై
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై
తేటగీతి
రిప్లయితొలగించువిశ్వనాథుని వలె వీధి వీధిఁ దిరిగి
ప్రజల పాపాల భిక్షగా బడసి సాయి
మిగుల ధౌతి క్రియఁ బునీతుడగుచు, షిర్డి
వాడ వాడలఁ దిరిగెడు వాఁడె సుగుణి
ఉత్పలమాల
మేడలు మిద్దెలన్ గొనక మేదిని నొక్క మసీదు నిల్లుగా
బోడిమిఁ గోరఁ బోక శివుఁ బోలుచు భిక్షగఁ బొంది పాపమున్
వీడుచు ధౌతి యోగమున వేలుపు షిర్డి పురాధివాసుడై
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై
మాయదారి కరోనను మట్టి గఱుప
రిప్లయితొలగించురామ భజనను జేయుచు రహిజెలంగ
వాడవాడల దిరిగెడు వాడె సుగుణి
పాలు బంచుకొనుడు మీరు భజనయందు
చీడ కరోన బట్టె భువి చిందెను వేదన నాల్గు దిక్కులన్
రిప్లయితొలగించుజాడయె లేదు మందుకిక జాగ్రతగా ముసుగున్ ధరించుడీ
మూడును ముప్పు గుంపులను మూర్ఖముగా తిరుగాడ రాదనిన్
వేడుచు నెల్లరిన్ దరిమివేయగ జాడ్యము మేలుకొల్పుచున్
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై
పొట్ట కూటికై గట్టులు పుట్ట లిట్టె
రిప్లయితొలగించుచుట్టి నట్టాడుచు నడర దిట్టఁదనము
పిట్టలం గొట్ట గట్టిగ విల్లు నూని
వాడ వాడలఁ దిరిగెడు వాఁడె సుగుణి
[సుగుణి = మంచి విల్లు గలవాఁడు]
గోడుల నాలకించుచును గూర్మిని జానపదాలి కింపుగాఁ
దోడుగ నుండి కష్టముల దూరము సేయుచు యుక్త రీతినిన్
వీడక ధర్మమార్గమును బెన్నిధియై యిల దీన కోటికిన్
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై
పాడుచు రామకీర్తనలు వక్త్రము నిండుగ నార్తినొందుచున్
రిప్లయితొలగించువాడల వాడలం దిరుగు వాడలరున్ సుగుణాభిరాముడై
వాడును వీడునున్ ననక వాలినభక్తిని నెందఱేనియున్
వాడలవాడలం దిరిగి భక్తజ నాళిని బ్రోత్సహించనౌ
వాడల వాడలం దిరిగి భామల కన్నులఁ గప్పి బాలుడౌ
రిప్లయితొలగించుప్రోడఁడు పాల వెన్నలను బూర్తిగ దోచుటె కాదు వెన్నలౌ
వాడల కన్నె డెందముల వాటముగా హరియించె వింటిరే
వాడల వాడలం దిరుగు వాఁ డలరున్ సుగుణాభిరాముఁడై.
పాడియటంచు నెంచి పరిపాలన జేయగ తండ్రిమాట దు
రిప్లయితొలగించున్మాడగ రావణాసురుని మాతను సీతను గావ ,కానలన్
వేడుకతో చరించిన ప్రవీణుని రాముని గాథపాడుచున్
*వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
ఎన్నికలయందు గెలిచి యింపుమీర
రిప్లయితొలగించుగ్రామ మెల్ల కలయ దిరుగంగ నెంచి
ప్రజల బాగోగుల నరయవరసగాను
వాడవాడలా దిరిగెను సుగుణి