3, ఏప్రిల్ 2021, శనివారం

సమస్య - 3682

4-4-2021 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే”
(లేదా...)
“మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే”

72 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    మన కెల్లప్పుడు నీతులం దెలిపి, నైర్మల్యంపు టుల్లంబులన్
    ఘనమౌ రీతినిఁ దీర్చుచున్; జనులకున్ గణ్యంపు లోకజ్ఞతన్,
    వినయంబుం దగఁ గూర్చునట్టి విలసద్విజ్ఞానియౌ యోగి వే

    మన పద్యంబుల నెల్లరుం జదివి, యాత్మజ్ఞానులై వెల్గరే!

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ఘనమౌ తీరున ఛందమున్ గఱపగా కందీశులే శాస్త్రికిన్
    పనికిన్ మాలిన పూరణల్ సలుపగన్ వందల్ గ వేలల్ గనున్
    మనముల్ రంజిల జేయునట్లు సరదా మాత్రంబుగన్ వ్రాయగా
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే!

    రిప్లయితొలగించండి
  3. ఘనమగు నీతుల సులువుగ
    జనులకు నెఱిఁగింపఁ నెంచి సామాన్యుల కున్
    తన శైలి ని వ్రాసిన వే
    మన పద్యమ్ముల బఠించి మాన్యత గనరే !

    రిప్లయితొలగించండి
  4. కనుమాశంకరుభాష్యము
    వినుమాక్రుష్ణునిసదమలవేదంబిలలో
    మనసునమాయలువిడువరె
    మనపద్యమ్ములఁబఠించిమాన్యతఁగనరే

    రిప్లయితొలగించండి
  5. జనులను జాగృత పరచగ
    వినసొంపగుపద్యములను విరివిగ నందిం
    చిన ఘనుడాతడు మన వే
    మన పద్యమ్ములఁ బఠించి మాన్యత గనరే.

    రిప్లయితొలగించండి


  6. ఒకానొకప్పుడు మాలికలో శంకరాభరణపు కవుల పై చురకలు జల్లిన ప్రబుద్ధుల కాలం!


    అనుదినము వ్రాసితిమిగా!
    మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే
    ల? నినాదమ్ముల తోడై
    పని లేని కవులని ద్రోసి ఫక్కున నగిరే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. వనిలోపూచినపూవులైవెలుగుభావంబుల్సుగంధంబులై
    మనికిన్భాష్యముచెప్పగావిరియుసామంబంతవర్ధిల్లగా
    పనికిన్వచ్చెడివర్ణలోకమునతాభాసిల్లురత్నమ్ములే
    మనపద్యమ్ములనెల్లరున్జదివియాత్మజ్ఞానులైవెల్గరే

    రిప్లయితొలగించండి

  8. జనులన్ జాగృత పర్చనెంచి మనదౌ శౌంఠ్యమ్ములన్ ద్రుంచుచున్
    ఘనుడౌ యోగియె తా సమాజ హితమున్ గాంక్షించి చెప్పెన్ గదా
    వినసొంపౌ పద్యరాజములనే వేవేలుగా నట్టి వే
    మన పద్యమ్ముల నెల్లరుంజదివి యాత్మజ్ఞానులై వెల్గరే.

    రిప్లయితొలగించండి
  9. జనజీవనవేదముగా
    మనమందరునడువదగిన మార్గము జూపన్
    ఘనముగ వ్రాసిన మన వే
    మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. మ :

      తనువున్ డస్సెనటంచు పద్యములనున్ తాదాత్మ్యమై విన్నచో
      మనమున్ శాంతము పెంపుసేయు నట నేమాత్రంబు చింతింపకే
      ధనమున్ వీడిన నింత హాయి గనమే! ధన్యాత్ములౌ కూర్పరుల్
      మన పద్యమ్ముల నెల్లరున్ జదివి యాత్మజ్ఞానులై వెల్గరే

      వీడిన=ఖర్చుతో

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  11. మఱొక పూరణము:

    "నను నీ దాసుని నెమ్మనానఁ జెలిమిన్ గాంతాళముం బూని, తా
    చిన తాపద్దియ నాకు మన్ననయ నా సీమంతినీ!" యంచుఁ బ
    ల్కిన కృష్ణుం గమలాక్షు ప్రేమమునుఁ దెల్పెంగాదె! యా నంది తి

    మ్మన పద్యంబుల నెల్లరుం జదివి, యాత్మజ్ఞానులై వెల్గరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మఱొక పూరణము:

      "నను నీ దాసుని నెమ్మనానఁ జెలిమిన్ గాంతాళముం బూని, తాఁ
      చిన తాఁ పద్దియ నాకు మన్ననయ నా సీమంతినీ!" యంచుఁ బ
      ల్కిన కృష్ణుం గమలాక్షు ప్రేమమునుఁ దెల్పెంగాదె! యా నంది తి
      మ్మన పద్యంబుల నెల్లరుం జదివి, యాత్మజ్ఞానులై వెల్గరే!

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  12. మనుజుల సత్పథమున దా
    మనయము నడిపించునట్లు హవణిక తోడన్
    మనన సులభముగ గూర్చిన
    మన పద్యమ్ముల బఠించి మాన్యతగనరే

    మనుజాళిన్ నడిపింపగా నెపుడు సన్మార్గంబునన్
    బ్రేమతో
    తనివిన్ బొందక శ్రీహరిన్ దలచి సత్కావ్యంబులన్
    వ్రాయగా
    ఘన రామాయణ భారతాది పలు సద్గ్రంధమ్ములన్
    నిండినన్
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మఙ్ఞానముం
    బొందరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన సంస్కృతి మనభాషను
      ఘన పదమున నిల్పినట్టి గ్రంథములెన్నో
      మన మలరగ వానిని గల
      మన పద్యమ్ముల బఠించి మాన్యతగనరే

      తొలగించండి
    2. మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
  13. మనవలె సద్వర్తనులై
    మనమున పరహితము విడక మానవులనుచున్
    మనకునెపుడు దెలిపెడి వే
    మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే

    రిప్లయితొలగించండి


  14. మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే
    ల? నినాదమ్ముల తోడు తిట్టెదరుగా లావణ్యమొప్పారలే
    దని! బ్లాగ్లోకము కూసె గా పనియు లేదంచున్ బుధానుల్ శ్రమ
    మ్మున నిట్టూర్చిరిగా యొకప్పుడు! జనుల్ మూర్ఖుల్వెడంగుల్ కదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నదనకుంటే నాకు బాగుండదని బాగుగా తెలిసి "బాగు బ్లాగు" అంటాను.

      తొలగించండి
  15. మన శంకరాభరణమున
    మను గురుదేవుల సమీక్ష మార్కొనినిలువన్
    ననువుగ లభించినవనుచు
    మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిలువన్+అనువుగ = నిలువ ననువుగ' అవుతుంది కదా...

      తొలగించండి
  16. ఘనశబ్ధాలంకృతమై
    వినసొంపింపుత్సవంబువీనులవిందై
    మనెదెనుగుసహజకవిచే
    మనపద్యమ్ములఁబఠించిమాన్యతఁగనరే

    రిప్లయితొలగించండి
  17. అనునిత్యంపు జనాళి జీవితములం దానందమున్ నింపగా
    ఘనుడౌ వేమన యోగివర్యు కృతమై కాలాను కూలంబుగా
    మనమే రీతిచరింప నెమ్మియగునో మాన్యంబుగా దెల్పువే
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే

    రిప్లయితొలగించండి
  18. ఘన తాపంబును బాపి మోక్షపద సాకల్యంబునున్ జేరగన్
    మునులందించిన వేదకావ్యములలో మూలంబునున్ తెల్పి పో
    తన నన్నయ్యయు తిక్కనల్ జనగ నూత్నాధారమై నిల్వ వే
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే

    రిప్లయితొలగించండి
  19. కనులను పొంగిన నీరును

    కనరానీయకుము వాణి , ఖలుల కురచన

    ల్గని ,తొల్లి రగడ కవి సో

    మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( సోమన ... పాల్కురికి సోమ నాధ కవి, రగడ గతులకు ఆద్యుడు)

    రిప్లయితొలగించండి
  20. మత్తేభవిక్రీడితము
    గణికా రత్నము విశ్వదాలలన సద్జ్ఞానాంబుధిన్ దేల్చఁగా
    మునిగాఁ దీర్చెను మేటి నీతి శతకమ్మున్ నిత్య సత్యాళితో
    జన సామాన్యముదాహరింపదగు సచ్ఛైళిన్ ప్రబోధింప, వే
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే

    రిప్లయితొలగించండి
  21. కన సొంపగు పద ప్రతిమలు
    కనిపించును తెలనుగున,విన కమనీయం బై
    అనిపించు హాయి చెవులకు
    మన పద్యమ్ముల భఠించి మాన్యత గనరే

    ఆదివారం, ఏప్రిల్ 04, 2021 9:37:31 AM

    రిప్లయితొలగించండి
  22. మనములు రంజిలగావే
    మనపద్యములు బఠించి మాన్యతగనరే
    కనివిని యెఱుగని రీతిని
    మనకిచ్చెను సూక్తులెన్నొ మాన్యులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  23. వినుమివి ‌హితమును తెలుపుచు
    మనసుకు నాటెడి విధముగ మహిలో నెపుడున్
    ఘనమై వెలిగెడు చక్కని
    మనపద్యమ్ములబఠించి మాన్యత గనరే.



    రిప్లయితొలగించండి
  24. జన హితము గోరి వ్రాసెను
    మనుజుల నడవడిక గూర్చి మహితాత్మకుడున్
    ఘన చరితార్థుండగు వే
    మన పద్యమ్ముల పఠించి మాన్యతగనరే

    రిప్లయితొలగించండి
  25. కె.వి.యస్. లక్ష్మి:

    ఘనమగు కైతలు వెలయగ
    ననయము ప్రేరణ నొసగెడి యార్యుల నీడన్
    వినయం బొప్పగ వ్రాసెడి
    మన పద్యమ్ముల పఠించి మాన్యత గనరే!

    రిప్లయితొలగించండి
  26. ధన ధాన్యమ్ముల నడుగము
    తనియుం డనుదుము పఠించి తాత్పర్యములే
    యనుమాన మేల నీ కిట
    మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే


    ఘను లా శంకర మధ్వ ముఖ్యు లిల లోకజ్ఞుల్ సరామానుజుల్
    కన వారల్ గద యాత్మ సంవిదు లహో కాలజ్ఞు లెన్నండునున్
    మన గొప్పల్ వచియింప నేల మన కాత్మజ్ఞానమే యున్నచో
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే

    రిప్లయితొలగించండి
  27. జనముల్ మెచ్చగ పాండితీగరిమ,సచ్ఛైలిన్ బ్రదర్శించువే
    మనపద్యమ్ములనెల్ల రుంజదివియాత్మఙ్ఞానులై వెల్గరే
    జనసామాన్యుల కర్ధమౌనటుల స్వచ్ఛంబైన బద్యాలతో
    వినగానింపుగనుండు నట్లుగను దావేలాదిగావ్రాసెగా

    రిప్లయితొలగించండి
  28. వినసొంపైన పదంబులన్ గలిపి దీపింపంగ సత్కావ్యమున్
    ఘన చాతుర్య బలంబుచే బనిచి సాక్షాత్కారమున్ జేసె రు
    క్మిణిపాతివ్రత శక్తినెల్లరకు నెమ్మిన్ జూడగా నంది తి
    మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే

    రిప్లయితొలగించండి