27-4-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జనన మరణమ్ము లల్పవిషయము లగును”(లేదా...)“జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్”
జన్మ మందిన ప్రతి జీవి చచ్చు ననుచు గీత బోధించు నని మన కెల్ల దెలియు నదురు బెదురును వదలిన నందరికిని జనన మరణమ్ము లల్ప విషయము లగును
క్రొవ్విడి వెంకట రాజారావు: కృష్ణభగవాను డన్నట్టి గీత జదివి సారమంతయు గ్రోలిన సద్గుణునకు ఆత్మ తత్త్వపు మహిమయే యంది యుండి జనన మరణమ్ము లల్ప విషయములగును.
తనదౌ జన్మ వరించి మానవుడు స్వాత్మానంద శుద్ధక్రియన్ననుమోదంబున బంధము ల్విడచి సు జ్ఞానామృత స్వాదుడైజనగా యోగ మహాద్భుతాశ్రమము సంసాధించి దర్శించు నీజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మాయదాటినమనిషికిమార్పులేదుబంధమెంచనిజీవికిభవితతెలియుకన్నుతెఱచినకమలమ్ముగాంచగలడుజననమరణమ్ములల్పవిషయములగును
వనమాలిన్ణదగమానసంబుననుతాపావిత్య్రభావంబునన్కనగన్యోగిగకాలమున్గడిపికాలుష్యంబులేకన్మదిన్వినగన్రోమశాదులుదివ్యులుగజీవింపన్తుదిన్ఁజూచిరేజననంబుల్మరణంబులన్నవిగడున్స్వల్పంబులౌనంశముల్
మిత్రులందఱకు నమస్సులు!వినయాదిప్రవిశిష్టసద్గుణగణోద్వేలప్రహృష్టాఢ్యులన్;వనసంస్త్యాయతపఃప్రభావయుతశాపానుగ్రహప్రాజ్ఞులన్;ఘనసంమాన్యసమగ్రమంత్రవిదవిఖ్యాతవ్రతామోదులన్;జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
సమస్య :జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్ ( శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో సంగ్రామవిముఖుడౌతున్న అర్జునునితో )మత్తేభవిక్రీడితము ............................వినుమో పార్థ ! సదా యథార్థములు ; స ద్విశ్వావబోధంబులున్ ;ఘనవేదాంతసముత్కటంబులగు వా గ్జాలంబులన్ శ్రద్ధతో ;వెనుకడ్గుల్ వలదయ్య ! చచ్చిరెపుడో వీరెల్ల నాచేతిలో ;జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్ .
క్రొవ్విడి వెంకట రాజారావు: దినమంతన్ననువైన రీతి భగవద్గీతన్ సమీక్షించుచున్ ఘనుడా పండితవర్యు డాత్మగుణ సంకల్పమ్ములన్ దెల్సియున్ తనువే సుస్థిరమన్న భావమును మిథ్యంబంచు బల్కెన్నిటుల్ "జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్"!
అందరికీ నమస్సులు🙏మత్తేభంతనివిన్బొందగ, భోగలాలస విడన్ తత్భావముల్ త్రొక్కగన్మనసా కర్మణ సాధు జీవనపు సామర్థ్యమ్ము సాధించగన్మనమే శాశ్వత శోధనన్నెరప తా మర్మంబు ఛేదించగా*“జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్”*మనము_ మనసు *వాణిశ్రీ నైనాల*
ఆది మధ్యాంత రహితులే హరిహరులనిరక్షకులు వారె భక్షకు లైన వారెయనుచు మనసార నమ్మిన జనులకిలనుజనన మరణమ్ము లల్ప విషయములగు.ఘనుడా శ్రీహరి నిర్గుణాత్ముడు నిరాకారుండతండే కదాయనఘుండాతడె చక్రధారియని భక్తాగ్రేసరుల్ కొల్చు పావనుడే భక్షకుడున్ గుధేరుడను విశ్వాసమ్మునే కల్గినన్ జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్.
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్యజననంబుల్ మరణంబులన్నవి కడున్ స్వల్పంబులౌనంశముల్నాపూరణమత్తేభమువనవాసంబును జేయుచున్ దనదు నద్వైతాత్మ చింతాత్ముడైవనమాలీ పదసన్నిధిన్ మనము దివ్యంబంచుఁ దానుంచుచున్ఘనమౌరీతిని దన్మయంబునను సాక్షాత్కార సంభావ్యతన్జననంబుల్ మరణంబులన్నవి కడున్ స్వల్పంబులౌ నంశముల్ ఆదిభట్ల సత్యనారాయణ
మరొక పూరణము:కనగా శ్రీరమణుల్ ధరాతలిని శోకంబున్విడన్జూపెనేతనదౌ మార్గము రామకృష్ణయతి సంధానించెనే సంఘమున్ఘన యోగక్రియలన్జరించెనట యోగానందు, లివ్వారికిన్జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
పార్ధసారధి జూపిన బాటనడచివీతరాగులై ద్వంద్వమ్ము విడచినపుడుజనన మరణమ్ము లల్పవిషయము లగునుమోక్షమందుటె నిజమగు లక్ష్యమగునుతనదౌ మాయను మానవాళిని సదాతాపంబులన్ద్రోయుచున్గనుచున్ వేడ్కను వారికర్మలను వైకల్యంబులేకే సదాగొనుచున్ లోనికి గ్రక్కుచున్ వెలికి దాకుక్షిన్ వినోదించగాజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌనంశముల్
జనులారా ! కనరేమి ? ఘోర యమపాశంబున్ విచారింపరా ?జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్యన నిర్లక్ష్యమునన్ ప్రజాళికిననూహ్యంబౌ కరోనా రుజన్యినుమాడంగను జేతురా ? తగదురా హేరామినిన్ వీడరా ?హేరామి = హింసించుట, ఉపద్రవం కలిగించుట
ఒక వైద్యశాల లో పరిస్థితిని అన్వయిస్తూ నా ప్రయత్నము:మ: దినచర్యల్ గమనించ నొక్క దినమై తీరెంచి నాస్పత్రినన్గనమే రుగ్ణులు యెన్ని రీతులుగనో కాపించ వైద్యక్రియన్ననువౌ మార్గము నెంచి వైద్యమిడగన్నాదైవమే దిక్కనన్జననంబుల్ మరణమ్ము లన్నవి గడున్ స్వల్పంబలౌ నంశముల్వై. చంద్రశేఖర్
దేవుడనగనేమి మరియా జీవుడెవరుజనన మెక్కడ నుండియో, చచ్చి చనెడితెరువదేదొతెలియజేయు ధీగురునకుజనన మరణమ్ము లల్ప విషయములను
వినుమో యర్జున చింతనొంద తగదీ పృధ్వీ తలంబందునన్జననంబందుట రూపుమాయుటలు సాజంబెల్ల జీవాళికిన్కనగానాత్మయె శాశ్వతంబునదియున్ కాబోదు నిర్యాణ మీజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
ఆత్మ వర్తించు దేహమ్ము నాశ్రయించిఆత్మ కెన్నడు క్లేశమ్ము లంటబోవుఅంతమన్నది లేనట్టి యాత్మకెపుడుజనన మరణమ్ము లల్పవిషయము లగును
వినినన్ గల్గుభయంబు సంతతము టీవీలో కరోనా విజృంభనమున్ ఆర్తిగ చూడగా మరణ సంభావ్యంబు శోకంబునౌమనకున్,కొందరు దుష్టనేతలకు,దుర్మార్గంపు (డాక్టర్లకున్) దోషజ్ఞుకున్జననంబుల్ మరణంబులన్నవి కడున్ స్వల్పంబులౌనంశంబుల్
పొరపాటు "స్వల్పంబులౌనంశముల్"
పుట్టె వారసుడని తాత గిట్టెననియు సంబరమ్ములు సేయును షావుకారుఅంబరమ్ము నీడ బ్రతుకు యాచకునకుజనన మరణమ్ము లల్పవిషయము లగును...భారతీనాథ్ చెన్నంశెట్టి...
🌹మానవ సేవే .. మాధవ సేవ🌹జననంబే మరణంబుగౌ మరణమే జన్మంబుగౌ చూడగన్ఘన రీతిన్బలు పేద జీవులకు సాగాయ్యమ్ము సేయంగదేవనమాలిన్నల వేడినట్టి ఫలమవ్వార్కిన్లభించంగదేజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
వినుమో పార్థ! మదీయమౌ తలపుతో విశ్వమ్ములో నన్నియున్కననౌ, నెంచగ నాదు చెయ్డులు జగత్కళ్యాణ మార్జింప గాననయమ్మున్ ఘటియిల్లు చుండు భువి నీవౌ బాధ్యతల్ శూన్యమేజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
ధనముందారయు బుత్రులున్ కడు యథార్థంబంచు మోహాత్ములైమనుజుల్ నిన్ను స్మరించలేక ఖలులై మాత్సర్యమొప్పారుచున్మనుచుండన్ జగదీశ్వరా కరుణతో మన్నించి నేర్పింపవేజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
జ్ఞాన విజ్ఞాన శోధన జగతి పోటినూతనాధ్యాయముల సృష్టి నొనర జేయుశాస్త్రవేత్త దీక్షాదక్ష సాహసములజననమరణములల్ప విషయములగును...!
తేటగీతినిత్య మారెండు సాజమై నేలపైనముదము శోకమ్ము జనతతిఁ బొదవు చున్నవైద్యనారాయణులవారి వాసరములజనన మరణమ్ము లల్పవిషయము లగునుమత్తేభవిక్రీడితముఅనిశమ్మీ భువి సాగి దప్పవన దైవాధీనమై సాజమైజనసామాన్యము మోదశోకములతో సావాసముల్ సేసినన్గొనసాగింపఁగ వైద్యశాలనవి నీకున్వైద్యనారాయణా!జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!!
వినగాభారతదివ్యగాథయనసంవేదంబుసంతానమైగనగాబుద్దుడు,జీవయాత్రననదీక్షార్థంబుసంతాపమై,జనగానిచ్చటమర్త్యలోకముననజ్ఞానాంథకారంబులౌజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
శ్రీ గురుభ్యోనమఃచావుపుట్టుకల నడుమ జరుగు మాయబుద్బుదమనెడి తత్వము బోధపడగమోక్ష సాధనే లక్ష్యమై ముందు కేగజనన మరణమ్ములల్ప విషయములగును
కె.వి.యస్. లక్ష్మి: పుట్టు గిట్టుక లన్నవి పుడమి మీద కాల ధర్మపు రీతిని కదలు చుండు తనువశాశ్వతమను తీరు తలచి సాగ జనన మరణమ్ములల్ప విషయము లగును.
మఱొక పూరణము:మనమందెంతయు సేవ సేయు గుణమున్; మంచిన్ ద్వరన్ బంచు నెమ్మనమున్; రోగుల పాలి దైవతములై మాన్యాత్ములై యెప్పుడున్జనమున్ సౌఖ్యముగాను నుండఁ బచరించం జూచు వైద్యాళికిన్,జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
ఆత్మ పరమాత్మ లొకటిగ నగుట వలననేను నేనను భావమ్ము దానువీడిమోక్షధామము నేగిన మౌనికియిలజనన మరణమ్ము లల్ప వి షయము లగును
వినుమోపాండవమధ్యమా! తగదిటుల్ వీడన్ గురుక్షేత్రమున్మనవారెవ్వరు లేరు పృథ్విన, నసామాన్యంబులౌ ద్రోహులన్దునుమం బూనుము వీతమోహమున సందోహంబునన్, భారతా!జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్.
ఎన్నికలపయి మక్కువ యెక్కువయ్యరాష్ట్ర నేతలకు గెలుపె లక్ష్యమయ్యవారికేల శ్రద్ధ మనుజ వనరులనినజనన మరణమ్ము లల్పవిషయము లగును
హే సదాశివ, నీకృప వీసమున్నచాలు, దావాగ్ని నీహార సదృశమగునుకష్టసాగరమొక శుష్క గర్త మగునుజనన మరణమ్ము లల్ప విషయములగును.
కనుమా రాఘవ!నీదురూపమును దాకళ్ళారజూడంగనౌజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్ మననన్ జేయగ నీదునామమును బల్మాఱుల్ దమిన్ శ్రద్ధతోమనగన్ జక్కటి యాయువున్ నిడుట రామానీ కుసింగారమే
పుట్టి నట్టి వా రెల్లరి పోక నిజము చచ్చి నట్టి వారికి నుండు జన్మమెంచ సంతతం బివి భువి నుండ వింత యేల జనన మరణమ్ము లల్ప విషయము లగును మను జానీక మృ గాభ్రగ వ్రజ మహాంభః ప్రాణి వృక్షమ్ములే జనియింపంగ లయింప సంతతము గాంచం బ్రీతియౌవారికిన్ వన జాత్మోద్భవ కాల కృత్యముల సంభావింప డెందమ్మునన్ జననంబుల్ మరణంబు లన్నవి గడున్ స్వల్పంబులౌ యంశముల్
అనునిత్యంబునవిద్యలో మునిగి మాయామోహ సంబద్ధులై జననంబుల్ మరణంబులంచు భువిలో సాగింతురుద్ధర్షముల్ మనమున్ నిశ్చల భక్తి దోడ పరమాత్మన్ గాంచు వేదాంతికిన్జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
కష్టకాలమందుకరోన కలియుగమునఅవతరించెనేమొ, నదియు జ్ఞానమివ్వతెలుసుకొనినవారికిదియు తేటమయ్యెజనన మరణమ్ము లల్ప విషయము లగును
మదికిబుట్టెడి భావాలు మరుపులట్లువచ్చిపోయెడిరీతిగా బతికి చచ్చుజీవి బుట్టుక వింతగ చిగురు దొడిగుజననమరణమ్ము లల్పవిషయములగును
ఆత్మవీడి వేరొకనిదేహానజేరుగీత సారాంశమిదియని కృష్ణ నుడివెసారము గ్రహించిసత్పురుషాదులకునుజనన మరణమ్ము లల్ప విషయము లగును
క్షణకాలంబున పోసి యూపిరుల నాస్వాదించి దైవమ్ము తక్షణమందూపిరులాపు జీవులకు, సూక్ష్మంబిందు స్పష్టంబిదేమనకర్మంబులె వాని లీలలన బ్రహ్మానందమున్ బొందుచో*జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మంచి పనులను మహి లోన మాను గానునాచరించుచు వీడక ననవరతముతిరుగు వారికి చూడం గ దేహమునకుజనన మరణములల్పవిషయములగును.
జన్మ మందిన ప్రతి జీవి చచ్చు ననుచు
రిప్లయితొలగించండిగీత బోధించు నని మన కెల్ల దెలియు
నదురు బెదురును వదలిన నందరికిని
జనన మరణమ్ము లల్ప విషయము లగును
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికృష్ణభగవాను డన్నట్టి గీత జదివి
సారమంతయు గ్రోలిన సద్గుణునకు
ఆత్మ తత్త్వపు మహిమయే యంది యుండి
జనన మరణమ్ము లల్ప విషయములగును.
తనదౌ జన్మ వరించి మానవుడు స్వా
రిప్లయితొలగించండిత్మానంద శుద్ధక్రియ
న్ననుమోదంబున బంధము ల్విడచి సు జ్ఞానామృత స్వాదుడై
జనగా యోగ మహాద్భుతాశ్రమము సం
సాధించి దర్శించు నీ
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాయదాటినమనిషికిమార్పులేదు
రిప్లయితొలగించండిబంధమెంచనిజీవికిభవితతెలియు
కన్నుతెఱచినకమలమ్ముగాంచగలడు
జననమరణమ్ములల్పవిషయములగును
వనమాలిన్ణదగమానసంబుననుతాపావిత్య్రభావంబునన్
రిప్లయితొలగించండికనగన్యోగిగకాలమున్గడిపికాలుష్యంబులేకన్మదిన్
వినగన్రోమశాదులుదివ్యులుగజీవింపన్తుదిన్ఁజూచిరే
జననంబుల్మరణంబులన్నవిగడున్స్వల్పంబులౌనంశముల్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివినయాదిప్రవిశిష్టసద్గుణగణోద్వేలప్రహృష్టాఢ్యులన్;
వనసంస్త్యాయతపఃప్రభావయుతశాపానుగ్రహప్రాజ్ఞులన్;
ఘనసంమాన్యసమగ్రమంత్రవిదవిఖ్యాతవ్రతామోదులన్;
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
సమస్య :
రిప్లయితొలగించండిజననంబుల్ మరణంబులన్నవి గడున్
స్వల్పంబులౌ నంశముల్
( శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో సంగ్రామవిముఖుడౌతున్న అర్జునునితో )
మత్తేభవిక్రీడితము
............................
వినుమో పార్థ ! సదా యథార్థములు ; స
ద్విశ్వావబోధంబులున్ ;
ఘనవేదాంతసముత్కటంబులగు వా
గ్జాలంబులన్ శ్రద్ధతో ;
వెనుకడ్గుల్ వలదయ్య ! చచ్చిరెపుడో
వీరెల్ల నాచేతిలో ;
జననంబుల్ మరణంబులన్నవి గడున్
స్వల్పంబులౌ నంశముల్ .
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదినమంతన్ననువైన రీతి భగవద్గీతన్ సమీక్షించుచున్
ఘనుడా పండితవర్యు డాత్మగుణ సంకల్పమ్ములన్ దెల్సియున్
తనువే సుస్థిరమన్న భావమును మిథ్యంబంచు బల్కెన్నిటుల్
"జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్"!
అందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండిమత్తేభం
తనివిన్బొందగ, భోగలాలస విడన్ తత్భావముల్ త్రొక్కగన్
మనసా కర్మణ సాధు జీవనపు సామర్థ్యమ్ము సాధించగన్
మనమే శాశ్వత శోధనన్నెరప తా మర్మంబు ఛేదించగా
*“జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్”*
మనము_ మనసు
*వాణిశ్రీ నైనాల*
రిప్లయితొలగించండిఆది మధ్యాంత రహితులే హరిహరులని
రక్షకులు వారె భక్షకు లైన వారె
యనుచు మనసార నమ్మిన జనులకిలను
జనన మరణమ్ము లల్ప విషయములగు.
ఘనుడా శ్రీహరి నిర్గుణాత్ముడు నిరాకారుండతండే కదా
యనఘుండాతడె చక్రధారియని భక్తాగ్రేసరుల్ కొల్చు పా
వనుడే భక్షకుడున్ గుధేరుడను విశ్వాసమ్మునే కల్గినన్
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్.
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండిజననంబుల్ మరణంబులన్నవి కడున్ స్వల్పంబులౌనంశముల్
నాపూరణ
మత్తేభము
వనవాసంబును జేయుచున్ దనదు నద్వైతాత్మ చింతాత్ముడై
వనమాలీ పదసన్నిధిన్ మనము దివ్యంబంచుఁ దానుంచుచున్
ఘనమౌరీతిని దన్మయంబునను సాక్షాత్కార సంభావ్యతన్
జననంబుల్ మరణంబులన్నవి కడున్ స్వల్పంబులౌ నంశముల్
ఆదిభట్ల సత్యనారాయణ
మరొక పూరణము:
రిప్లయితొలగించండికనగా శ్రీరమణుల్ ధరాతలిని శో
కంబున్విడన్జూపెనే
తనదౌ మార్గము రామకృష్ణయతి సం
ధానించెనే సంఘమున్
ఘన యోగక్రియలన్జరించెనట యో
గానందు, లివ్వారికిన్
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
పార్ధసారధి జూపిన బాటనడచి
రిప్లయితొలగించండివీతరాగులై ద్వంద్వమ్ము విడచినపుడు
జనన మరణమ్ము లల్పవిషయము లగును
మోక్షమందుటె నిజమగు లక్ష్యమగును
తనదౌ మాయను మానవాళిని సదాతాపంబులన్
ద్రోయుచున్
గనుచున్ వేడ్కను వారికర్మలను వైకల్యంబులేకే సదా
గొనుచున్ లోనికి గ్రక్కుచున్ వెలికి దాకుక్షిన్ వినోదించగా
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ
నంశముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనులారా ! కనరేమి ? ఘోర యమపాశంబున్ విచారింపరా ?
రిప్లయితొలగించండిజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
యన నిర్లక్ష్యమునన్ ప్రజాళికిననూహ్యంబౌ కరోనా రుజన్
యినుమాడంగను జేతురా ? తగదురా హేరామినిన్ వీడరా ?
హేరామి = హింసించుట, ఉపద్రవం కలిగించుట
ఒక వైద్యశాల లో పరిస్థితిని అన్వయిస్తూ నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిమ:
దినచర్యల్ గమనించ నొక్క దినమై తీరెంచి నాస్పత్రినన్
గనమే రుగ్ణులు యెన్ని రీతులుగనో కాపించ వైద్యక్రియన్
ననువౌ మార్గము నెంచి వైద్యమిడగన్నాదైవమే దిక్కనన్
జననంబుల్ మరణమ్ము లన్నవి గడున్ స్వల్పంబలౌ నంశముల్
వై. చంద్రశేఖర్
దేవుడనగనేమి మరియా జీవుడెవరు
రిప్లయితొలగించండిజనన మెక్కడ నుండియో, చచ్చి చనెడి
తెరువదేదొతెలియజేయు ధీగురునకు
జనన మరణమ్ము లల్ప విషయములను
వినుమో యర్జున చింతనొంద తగదీ పృధ్వీ తలంబందునన్
రిప్లయితొలగించండిజననంబందుట రూపుమాయుటలు సాజంబెల్ల జీవాళికిన్
కనగానాత్మయె శాశ్వతంబునదియున్ కాబోదు నిర్యాణ మీ
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
ఆత్మ వర్తించు దేహమ్ము నాశ్రయించి
రిప్లయితొలగించండిఆత్మ కెన్నడు క్లేశమ్ము లంటబోవు
అంతమన్నది లేనట్టి యాత్మకెపుడు
జనన మరణమ్ము లల్పవిషయము లగును
వినినన్ గల్గుభయంబు సంతతము టీవీలో కరోనా విజృం
రిప్లయితొలగించండిభనమున్ ఆర్తిగ చూడగా మరణ సంభావ్యంబు శోకంబునౌ
మనకున్,కొందరు దుష్టనేతలకు,దుర్మార్గంపు (డాక్టర్లకున్) దోషజ్ఞుకున్
జననంబుల్ మరణంబులన్నవి కడున్ స్వల్పంబులౌనంశంబుల్
పొరపాటు "స్వల్పంబులౌనంశముల్"
తొలగించండిపుట్టె వారసుడని తాత గిట్టెననియు
రిప్లయితొలగించండిసంబరమ్ములు సేయును షావుకారు
అంబరమ్ము నీడ బ్రతుకు యాచకునకు
జనన మరణమ్ము లల్పవిషయము లగును
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
🌹మానవ సేవే .. మాధవ సేవ🌹
రిప్లయితొలగించండిజననంబే మరణంబుగౌ మరణమే జన్మంబుగౌ చూడగన్
ఘన రీతిన్బలు పేద జీవులకు సాగాయ్యమ్ము సేయంగదే
వనమాలిన్నల వేడినట్టి ఫలమవ్వార్కిన్లభించంగదే
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
వినుమో పార్థ! మదీయమౌ తలపుతో విశ్వమ్ములో నన్నియున్
రిప్లయితొలగించండికననౌ, నెంచగ నాదు చెయ్డులు జగత్కళ్యాణ మార్జింప గా
ననయమ్మున్ ఘటియిల్లు చుండు భువి నీవౌ బాధ్యతల్ శూన్యమే
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
ధనముందారయు బుత్రులున్ కడు యథార్థంబంచు మోహాత్ములై
రిప్లయితొలగించండిమనుజుల్ నిన్ను స్మరించలేక ఖలులై మాత్సర్యమొప్పారుచున్
మనుచుండన్ జగదీశ్వరా కరుణతో మన్నించి నేర్పింపవే
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
జ్ఞాన విజ్ఞాన శోధన జగతి పోటి
రిప్లయితొలగించండినూతనాధ్యాయముల సృష్టి నొనర జేయు
శాస్త్రవేత్త దీక్షాదక్ష సాహసముల
జననమరణములల్ప విషయములగును...!
జ్ఞాన విజ్ఞాన శోధన జగతి పోటి
రిప్లయితొలగించండినూతనాధ్యాయముల సృష్టి నొనర జేయు
శాస్త్రవేత్త దీక్షాదక్ష సాహసముల
జననమరణములల్ప విషయములగును...!
తేటగీతి
రిప్లయితొలగించండినిత్య మారెండు సాజమై నేలపైన
ముదము శోకమ్ము జనతతిఁ బొదవు చున్న
వైద్యనారాయణులవారి వాసరముల
జనన మరణమ్ము లల్పవిషయము లగును
మత్తేభవిక్రీడితము
అనిశమ్మీ భువి సాగి దప్పవన దైవాధీనమై సాజమై
జనసామాన్యము మోదశోకములతో సావాసముల్ సేసినన్
గొనసాగింపఁగ వైద్యశాలనవి నీకున్వైద్యనారాయణా!
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!!
వినగాభారతదివ్యగాథయనసంవేదంబుసంతానమై
రిప్లయితొలగించండిగనగాబుద్దుడు,జీవయాత్రననదీక్షార్థంబుసంతాపమై,
జనగానిచ్చటమర్త్యలోకముననజ్ఞానాంథకారంబులౌ
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
శ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండిచావుపుట్టుకల నడుమ జరుగు మాయ
బుద్బుదమనెడి తత్వము బోధపడగ
మోక్ష సాధనే లక్ష్యమై ముందు కేగ
జనన మరణమ్ములల్ప విషయములగును
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిపుట్టు గిట్టుక లన్నవి పుడమి మీద
కాల ధర్మపు రీతిని కదలు చుండు
తనువశాశ్వతమను తీరు తలచి సాగ
జనన మరణమ్ములల్ప విషయము లగును.
మఱొక పూరణము:
రిప్లయితొలగించండిమనమందెంతయు సేవ సేయు గుణమున్; మంచిన్ ద్వరన్ బంచు నె
మ్మనమున్; రోగుల పాలి దైవతములై మాన్యాత్ములై యెప్పుడున్
జనమున్ సౌఖ్యముగాను నుండఁ బచరించం జూచు వైద్యాళికిన్,
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్!
ఆత్మ పరమాత్మ లొకటిగ నగుట వలన
రిప్లయితొలగించండినేను నేనను భావమ్ము దానువీడి
మోక్షధామము నేగిన మౌనికియిల
జనన మరణమ్ము లల్ప వి షయము లగును
వినుమోపాండవమధ్యమా! తగదిటుల్ వీడన్ గురుక్షేత్రమున్
రిప్లయితొలగించండిమనవారెవ్వరు లేరు పృథ్విన, నసామాన్యంబులౌ ద్రోహులన్
దునుమం బూనుము వీతమోహమున సందోహంబునన్, భారతా!
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్.
ఎన్నికలపయి మక్కువ యెక్కువయ్య
రిప్లయితొలగించండిరాష్ట్ర నేతలకు గెలుపె లక్ష్యమయ్య
వారికేల శ్రద్ధ మనుజ వనరులనిన
జనన మరణమ్ము లల్పవిషయము లగును
హే సదాశివ, నీకృప వీసమున్న
రిప్లయితొలగించండిచాలు, దావాగ్ని నీహార సదృశమగును
కష్టసాగరమొక శుష్క గర్త మగును
జనన మరణమ్ము లల్ప విషయములగును.
కనుమా రాఘవ!నీదురూపమును దాకళ్ళారజూడంగనౌ
రిప్లయితొలగించండిజననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
మననన్ జేయగ నీదునామమును బల్మాఱుల్ దమిన్ శ్రద్ధతో
మనగన్ జక్కటి యాయువున్ నిడుట రామానీ కుసింగారమే
పుట్టి నట్టి వా రెల్లరి పోక నిజము
రిప్లయితొలగించండిచచ్చి నట్టి వారికి నుండు జన్మమెంచ
సంతతం బివి భువి నుండ వింత యేల
జనన మరణమ్ము లల్ప విషయము లగును
మను జానీక మృ గాభ్రగ వ్రజ మహాంభః ప్రాణి వృక్షమ్ములే
జనియింపంగ లయింప సంతతము గాంచం బ్రీతియౌవారికిన్
వన జాత్మోద్భవ కాల కృత్యముల సంభావింప డెందమ్మునన్
జననంబుల్ మరణంబు లన్నవి గడున్ స్వల్పంబులౌ యంశముల్
అనునిత్యంబునవిద్యలో మునిగి మాయామోహ సంబద్ధులై
రిప్లయితొలగించండిజననంబుల్ మరణంబులంచు భువిలో సాగింతురుద్ధర్షముల్
మనమున్ నిశ్చల భక్తి దోడ పరమాత్మన్ గాంచు వేదాంతికిన్
జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
కష్టకాలమందుకరోన కలియుగమున
రిప్లయితొలగించండిఅవతరించెనేమొ, నదియు జ్ఞానమివ్వ
తెలుసుకొనినవారికిదియు తేటమయ్యె
జనన మరణమ్ము లల్ప విషయము లగును
మదికిబుట్టెడి భావాలు మరుపులట్లు
రిప్లయితొలగించండివచ్చిపోయెడిరీతిగా బతికి చచ్చు
జీవి బుట్టుక వింతగ చిగురు దొడిగు
జననమరణమ్ము లల్పవిషయములగును
ఆత్మవీడి వేరొకనిదేహానజేరు
రిప్లయితొలగించండిగీత సారాంశమిదియని కృష్ణ నుడివె
సారము గ్రహించిసత్పురుషాదులకును
జనన మరణమ్ము లల్ప విషయము లగును
క్షణకాలంబున పోసి యూపిరుల నాస్వాదించి దైవమ్ము త
రిప్లయితొలగించండిక్షణమందూపిరులాపు జీవులకు, సూక్ష్మంబిందు స్పష్టంబిదే
మనకర్మంబులె వాని లీలలన బ్రహ్మానందమున్ బొందుచో
*జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మంచి పనులను మహి లోన మాను గాను
రిప్లయితొలగించండినాచరించుచు వీడక ననవరతము
తిరుగు వారికి చూడం గ దేహమునకు
జనన మరణములల్పవిషయములగును.