29, ఏప్రిల్ 2021, గురువారం

సమస్య - 3708

30-4-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియె”
(లేదా...)
“తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే”

50 కామెంట్‌లు:

 1. కొడుకు తండ్రిని‌ చెప్పుతో కొట్టె సరియె


  నాయ నా రమ్మ నెవరనె హాయి గాను,

  తేలు కనిపించ గానేమి తీసి చంప

  మంచి దనుచు నా పతితోడ మగువ బలికె

  కొడుకు తండ్రిని,చెప్పు తో కొట్టె సరియె

  రిప్లయితొలగించండి
 2. తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవము లన
  పూజనీయులు వారలు పుడమి యందు
  ఎట్టి దుర్మార్గు డైన దా నెచట నైన
  కొడుకు తండ్రిని చెప్పుతో కొట్టె సరియె?

  రిప్లయితొలగించండి
 3. చిలిపిచేష్టలబిడ్డనిచేరఁదీసి
  తప్పుఁజెప్పంగచెప్పునతడిమెతండ్రి
  ఆటయనుచునుతలచియుహాస్యసరణి
  కోడుకుతండ్రినిఁజెప్పుతోఁగోట్టెసరియె

  రిప్లయితొలగించండి
 4. అనయముకానిపద్ధతినియాదరమింయులేనిపెద్దగా
  కనగనుకాంతబిడ్డలనుకాదనిభోగముదేలియాడుచున్
  జనమునయాగిసేయుచునుజన్మనునిచ్చినతండ్రియున్నచో
  తనయుడుచెప్పుతీసికొనితండ్రినిగొట్టెనుతప్పులేదులే

  రిప్లయితొలగించండి
 5. కనివిని యెర్గనట్టి కలికాలపు చేష్టల నేమియందుమో
  వినుట కునేవగింపు పరివేదన గల్గెడి మాటలివ్వి యా
  తనయుల బెంచురీతియతి దారుణమైన విధంబునుండగా
  తనయుడు చెప్పుదీసుకొని తండ్రిని గొట్టెను తప్పుకాదులే


  రిప్లయితొలగించండి

 6. తప్పతాగి తా బొరుగింటి తరుణితోడ
  సభ్యతవిడి ప్రవర్తింప సకుటు డైన
  వానిని గని యాగ్రహమును పట్టలేక
  కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియె.


  వినయమదెంతయో కలిగి ప్రేమగ బిడ్దల బెంచి పుత్రులన్
  ఘనులుగ దిద్దితీర్చగను కష్టము లెన్నొ భరించు వాడె యా
  జనకుడు వృశ్చికమ్మొకటి జారుచు నాతని వీపు పై పడన్
  దనయుడు చెప్పుతీసికొని తండ్రిని గొట్టెను, తప్పుగాదులే.

  రిప్లయితొలగించండి
 7. నగరమున దండ్రి వెంబడి నడచు చుండ
  నెదుట వృశ్చికమును గాంచి హెచ్చ రించె
  గొడుకు దండ్రినిఁ ; జెప్పుతోఁ గొట్టె సరియె
  దానిజంప నంతియెగాని దప్పుగాదు

  రిప్లయితొలగించండి
 8. సంతాన ప్రాప్తికై ఎన్నో రకాల మొక్కులు మొక్కుతారు. ఒక కొత్త తరహా మొక్కు ను ప్రస్తుతించే ప్రయత్నం గా నా పూరణ:

  చం:

  జనకుడు గావనెంచి వయ సాచెడు వేళన విశ్వసింపనై
  కనివిని యెర్గమయ్యె ఘన కార్యమటంచని ముడ్పు గట్టగన్
  మనసగు కోర్కె దీర దన మాటగ దేవర మొక్కు దీర్చ నా
  తనయుడు చెప్పు తీసుకొని తండ్రిని గొట్టెను తప్పు గాదులే

  వయసాచెడు వేళ = late age

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 9. గుంతకల్లు పట్టణానికి సమీపంలో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం పురాతనమైనది మరియు ప్రసిద్ధమైనది. స్వామి రాజగోపుర ద్వారంలో భద్రపీఠంమీద సుమారు 2 అడుగుల పొడవు గల తోలు పాదరక్షలు ఉంచబడి ఉంటాయి. ఈ పాదరక్షలతో తాడనం చేసుకుంటే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి అని ప్రతీతి. ఈ సందర్భం పురస్కరించుకొని నేటి నా పూరణ...


  ఘనుడు కసాపురేశ్వరుని కాంచన గోపుర ద్వారమందున్
  కనెనట స్వామిపాదుకలు కాచి నికామము గూర్చు తాడనం
  బొనరగ జేయ సత్యమన పోహణమందున భక్తితోడ నా
  తనయుడు చెప్పు తీసికొని తండ్రిని గొట్టెను తప్పు గాదులే !

  నికామము = కోరిన కోర్కెలు
  పోహణ = వ్యవహారము, సందర్భము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "ద్వారమందునన్" టైపాటు.

   తొలగించండి
 10. సమస్య :
  తనయుడు చెప్పు తీసికొని
  తండ్రిని గొట్టెను తప్పు గాదులే

  ( సామంతుడైన పాండ్యరాజును దాయాదుల నుండి కాపాడి తిరిగి సింహాసనాధిష్ఠితుని కావించి రమ్మని
  సేనాని నాగమనాయకుని పంపిన కృష్ణదేవరాయలవారి ఆజ్ఞను ధిక్కరించి తానే మధురరాజ్య సింహాసనమెక్కిన తండ్రి నాగమనాయకునికి విశ్వనాథ
  నాయకుడు చేసిన సత్కారం )

  " పనిగొని పోయినాడవుగ !
  పాండ్యుని రాజ్యపు నప్పగింతకై
  ఘనుడగు కృష్ణరాడ్విభుడు
  గట్టిగ నమ్ముచు నిన్ను నంపగన్ ;
  మనదగు రాజభక్తి కిది
  మచ్చయె నాగమనీడ ! " యంచు నా
  తనయుడు చెప్పు తీసికొని
  తండ్రిని గొట్టెను తప్పు గాదులే .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారిత్రకమైన అంశంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైనసమయస్ఫూర్తిగలిగి, ఆనందదాయకముగానున్నది. గురువులకుప్రణామములు

   తొలగించండి
 11. శ్రీ గురుభ్యోనమః

  అతిధి మరియాదలను జేయ ననుసరించె
  కొడుకు తండ్రినిఁ ; జెప్పుతోఁ గొట్టె సరియె
  భిత్తి మీదకు నెగబాకు వృశ్చికమును
  నదను జూచి సమయమున బెదరకుండ

  రిప్లయితొలగించండి
 12. మనుషులు చెడ్డ వారలయ మార్గమునడ్డము పోకుమన్ననూ

  వినియును చీకటింటనల వేసెను కాటును వెర్రి జెఱ్ఱికిన్

  తనయుడు , చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

  అనువుగ పెంచుటన్దెలియనట్టి కుకీటక రాజ రాజమా

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అన్ననూ' అన్న ప్రయోగం సాధువు కాదు. "పోకుమన్న తా వినియును..." అనండి. 'రాజ రాజమా'?

   తొలగించండి
 13. మునుమునుబుట్టెవారికొకముద్దులబిడ్డడులేకలేకయున్
  వనరులగూడగట్టుకొనివానినిబెంచిరిగారవమ్మునన్
  వినయమునేర్వజాలకనువీడకగారముమంకుబట్టులన్
  తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 14. అనయము రామునిం దలచు నగ్ని పునీతను గూర్చి ధూర్తతన్
  జనకుని బుత్రి రావణుని సన్నిధి వత్సర మున్నదంచు నో
  జనపదముండు దుష్టమతి చాకలి ప్రేలుచు నున్నవేళలో
  తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

  రిప్లయితొలగించండి
 15. అనుదినమున్ సతీ సుతుల నారడి వెట్టుచు దిట్టి కొట్టుచున్
  అనయము మద్యపాన మదమందున దేలుచు మందబుద్ధియై
  తనయనె కాముకత్వమున దగ్గర జేరుమటంచు బల్కగా
  తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

  రిప్లయితొలగించండి
 16. వనమునపోవు చుండగను పట్టకుపీకగ నప్డు తండ్రినిన్
  శునకము, పండ్లతోడుతను చూచి, తలంచుచు పాతసామెతన్
  కనదగు స్వస్థతంచు వడిగా చని చెంతకు, భక్తి మ్రొక్కుచున్
  తనయుడుచెప్పుతీసికొనితండ్రినిగొట్టెనుతప్పులేదులే

  రిప్లయితొలగించండి
 17. దారివెంబడిజనుచుండు తరుణమందు
  వెఱ్ఱి శునకము తండ్రికి వేసె గాటు
  చెప్పుదెబ్బ యౌషధమని చెప్పగ విని
  కొడుకు దండ్రినిఁ జెప్పుతోఁ గొట్టె సరియె

  రిప్లయితొలగించండి
 18. ఉఱుకులఁ బరుగులఁ గదిసి యఱచుచు వడిఁ
  దనదు తండ్రినిఁ గాపాడఁ దలఁచి మించి
  మీదకు నుఱుకు పగవాని, నాదు కొనుచుఁ
  గొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె


  అనయము మీఱ నల్లరి నిజాత్మజుఁ డింతయు జాలి లేక తాఁ
  గనిన మహాల్ప జీవులను గ్రక్కునఁ బట్టి చెలంగి వాని వేఁ
  చినఁ గని రోష వేగమునఁ జిన్నఁదనమ్మునఁ దాత తండ్రికిం
  దనయుఁడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను దప్పు గాదులే

  రిప్లయితొలగించండి
 19. అనయము సొమ్మరోగమున
  నార్తము జెందెడు కన్నతండ్రితో
  వనమున బోవుచుండగ దబాలు
  న తండ్రి పడెం ధరిత్రిపై
  కనుగొని వెంటెనే యడలి గ
  మ్మున బాధను బాప ముక్కపై
  తనయుడు చెప్పు తీసుకొని
  తండ్రిని గొట్టెను దప్పు లేదుగా.

  రిప్లయితొలగించండి
 20. ఆశిసుల నిమ్మనిదనకు నడిగెనార్య!
  కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె
  తనదు భార్యజో లికివచ్చు దమ్మునపుడు
  స్వార్ధమనునది వదలదు బంధువులను

  రిప్లయితొలగించండి
 21. విననిది వింతగొల్పెడిని వెఱ్ఱితనంబనిపించు గాని యా
  వినినది నిక్కమే యొకడు వీధిన బోవుచునుండ పుత్రుతో
  శునకము గాటు వేయగనె సుంతయు గొంకును చూపకుండ నా
  తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే

  రిప్లయితొలగించండి
 22. వెనుకకు జేరి జాగిలము వెర్రిగ తండ్రిని కాటువేయగన్
  మననము జేసి సామెతను మందుగ నెంచియు *కుక్కకాటుకున్*
  ఘనమగు *చెప్పుదెబ్బయని* గౌరవ భావము తోడ బేలయై
  *తనయుడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను తప్పు గాదులే*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 23. కుక్కను పెంచుకున్న తండ్రి తనయల నడుమ
  గేయ మని గొడవలు మష్రుమించిన వేళ
  నల్ల మేయిలు జేసి నగదు కాజేసి నిటుల
  నిరుడు తన్నుకు బోయే తదా చెప్పులను తినగ దెబ్బలు

  ~సిరిహర్ష జనక

  రిప్లయితొలగించండి
 24. అనయము ద్రాగుచుండియును నందఱి బంధుజనంబు సాక్షిగా
  చనువునునుండు వానివలె శారదచేతిని ముద్దువెట్టగా
  దనదగు భార్య హస్తమును సోకుట కోర్చుకొనంగ లేకనే
  దనయుడు చెప్పుతీసికొని తండ్రిని కొట్టెను దప్పుగాదులే

  రిప్లయితొలగించండి
 25. మిత్రులందఱకు నమస్సులు!

  అనయము మద్యమాంసముల నానుచుఁ, గాముకుఁడై చరించుచున్,
  ధనమును దుష్టమార్గమున దండిగఁ గూర్చుచు, బేలలం గసిం
  దునుముచు, గర్వియై తిరుగ, దూఱి, సహించఁగలేక, కూళకుం
  దనయుఁడు చెప్పుఁ దీసికొని తండ్రినిఁ గొట్టెను! తప్పు గాదులే!

  రిప్లయితొలగించండి
 26. తేటగీతి
  అప్పుఁ దీర్చమంచడుగగా చెప్పుఁ దీసి
  వెంటఁ బడుచు తరుమఁ గని మంటరేగి
  యాప దుష్టుని దుశ్చర్య నాదుకొనుచు
  కొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె

  చంపకమాల
  అనయము సానికొంపలను హాయిగఁ బొర్లుచు సర్వసంపదల్
  మణిమయ భూషలన్ దొడగ మైకముఁ గ్రమ్మి సమర్పణమ్మునన్
  జననిని తీవ్రకష్టమున జాలిని గాంచుచు మారబోననన్

  రిప్లయితొలగించండి
 27. వెసన పరుడైన కొడుకును వెసనుగావ
  తండ్రి మందలించెను దినం, తగదటంచు
  కొడుకుదండ్రిని చెప్పుతోకొట్టె సరియె
  మత్తుదిగి కాళ్ళపైబడి మొత్తుకొనియె!

  రిప్లయితొలగించండి

 28. తనకు జన్మ నొసంగిన తల్లి నచట
  తండ్రి తిట్టుచు కొట్టుచు దయను మాలి
  వెతలనిడగ తాళగలేక విసిగి పోయి
  కొడుకు దండ్రిని చెప్పుతో కొట్టె సరియె

  రిప్లయితొలగించండి