9, ఏప్రిల్ 2021, శుక్రవారం

సమస్య - 3688

10-4-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్”
(లేదా...)
“పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్”

43 కామెంట్‌లు:

  1. అరి వీర భయంకరుడై
    శరములు సంధించు నరుడు చాపము వీడిన్
    విరటుని కొలువున జేరెన్
    పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పరువుల్ బెట్టుచు చేరగన్ ప్రజలహో బ్రహ్మాండమౌ రీతినిన్
    స్థిరమౌ తీరున కూచిపూడి కడనున్ సింగారి వేషమ్మునన్
    వరమౌ నాటక మందునన్ మురియుచున్ భామా కలాపంబునన్
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  3. పురమున నాటక మందున
    మురిపము గా ముదిత వేష మును ధరి యింపన్
    కురులను దాల్చియు జడలో
    పురుష వరుడు సీర గట్టి పూవులు ముడిచెన్

    రిప్లయితొలగించండి
  4. నరుడప్సరస యొసంగిన
    పరిగ్రహము పొందితాను వర్షవరుండై
    విరటుని కొలువున కేగుచు
    పురుషవరుడు సీరఁ గట్టి పూవులు ముడిచెన్.

    రిప్లయితొలగించండి
  5. పురహరుడానందమునను
    నరహరిచెల్లెలికరమునునయమునఁబట్టెన్
    పరమేశుడమరెసగమై
    పురుషవరుఁడుసీరఁగటిటపూవులుముడిచెన్

    రిప్లయితొలగించండి


  6. పరువపు మధురోహలలో
    న రమణి తేలుచు బిడియమున వలదనంగన్
    మరులుగొలుపుచు జిలేబికి
    పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్


    వామ్మో !

    నిన్నటి నుంచి "తేలు" విడవటంలే :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సిరులన్దెత్చెను వెంట సోయగపు రాశిన్నర్పణన్జేసెనే

    మరి వంశమ్మును వృధ్ధి చేయు విధినమ్మయ్యెన్సుతశ్రేణికిన్

    వొరిగెన్ శయ్యన కాలు వంగియును సేవొక్కింత సేయున్విధిన్

    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి


  8. మరులున్ గొల్పుచు రావె యంచు బిలువన్ మత్తేభమైరాగనే
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్
    మరియా డేవిడు సంతసించె! పతితో మాట్లాడె "యేమండి నా
    కు రువాణంపు వడమ్ము కావలెను ప్లీజ్! కొంటారుగా?" మోజుగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. సరిరాభామకుతోడుగానతఁడునాస్ధానంబువంశంబులో
    విరిసెన్సత్యయెతానుగానచటనావేషంబులోజాణయై
    సిరులేవేణిగనాడగామురిసెనాసింగారివయ్యారియై

    పురుషశ్రేష్ఠుడుసీరఁగట్టిముడిచెంబూమాలశీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  10. చెరబట్టన్ కుటిలుండు కీచకుడు సచ్చీలావతిద్రౌపది
    న్నరివేరంబున యుగ్రుడై కదలుచూ నాత్రమ్ముగా నూగుచున్
    తరుణిన్ గాచగ భీమసేనుడు జనెన్ తామారు వేషంబునన్
    *“పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్”*

    *వాణిశ్రీ నైనాల*
    9th April, '21

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ:

    సురలోకాంగనలేల? సుందరి! నినున్ జూడంగ నాకెంత సం..
    బరమౌనీదినమేను నీ సొగసులన్ భాసింపగా జేసెదన్!
    తరుణీ! రమ్మని పిల్చి తా స్వయముగా తాదాత్మ్యమున్ బొందుచున్
    బురుషశ్రేష్ఠుడు సీరఁగట్టి ముడిచెన్ బూమాల శీర్షమ్మునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. పరుగన సినిమా చూడగ
    బిరబిర సంసిద్ధమయ్యె పెనిమిటి ప్రేమన్
    ఇరు చేతులు లేని సతికి
    పురుష వరుడు సీరకట్టి పువ్వులు ముడిచెన్

    రిప్లయితొలగించండి

  13. సరసమ్మాడగ రమ్ము నాదరికి హే శంపాంగి జాగేలనే
    విరహమ్మందున వేగుచుంటినికదా వేగమ్ము రమ్మంచు వెం
    బరగాడౌ రతతాలి పల్కెనని తా వాచింపగా భీముడా
    పురుషశ్రేష్ఠుఁడు సీరగట్టి ముడిచెన్ బూమాల శీర్షంబునన్.

    రిప్లయితొలగించండి
  14. ప్రాచుర్యములో నున్న కథ ఆధారము : పరశురాముడు క్షత్రియ సంహారం లో భాగంగా అయోధ్యకు వెళ్లగా దశరథుడు ఆడ వేషంలో కనబడు సందర్భముగా ఈ ప్రయత్నము

    మ:

    పరశున్ బూని నశింప జేయు మిషతో పారాడుచున్ న్యక్షుడే
    పరుగున్ జేరి నయోధ్యకున్ భ్రమ గొనెన్ పంతంబు చేజారనై
    యరరే పంక్తిరథుండు మార్పుగొని వయ్యారమ్ము చెష్టింప నా
    పురుష శ్రేష్ఠుడు సీర గట్టి ముడిచెంబూమాల శీర్షంబునన్

    న్యక్షుడు=పరశురాముడు
    పంక్తి రథుడు =దశరథుడు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. సురలున్ దైత్యులు జేరి సాగరమునుం శోధించి సాధింపగా
    హరియా స్త్యేన ఘటంబు వట్టి హొయలాహార్యంబునన్ సొంపుగన్
    మురిపెంబున్ కురిపించి దైత్యవిభులన్ మోహంబునన్ముంచుచున్
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  16. వరమై "స్థానమువారు" నిల్చిరట సం
    భావ్యంబుగా సత్యకున్
    సరి "రేబాల"యు "బుర్ర"వారలు విలా
    సంబొప్ప చింతామణిన్
    హరువున్బంచి నటించిరే మిగుల నా హార్యంపు శోభాకృతిన్-
    "పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్"!

    రిప్లయితొలగించండి
  17. వరమై "స్థానమువారు" నిల్చిరట సం
    భావ్యంబుగా సత్యకున్
    సరి "రేబాల"యు "బుర్ర"వారలు విలా
    సంబొప్ప చింతామణిన్
    హరువున్బంచి నటించిరే మిగుల నా హార్యంపు శోభాకృతిన్-
    "పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్"!

    రిప్లయితొలగించండి
  18. సమస్య :

    పురుషవరుడు సీర గట్టి
    పూవుల ముడిచెన్

    ( " తులాభార"నాటకమైన పిమ్మట గ్రీన్ రూం లో స్థానం వారిని నాకు చూపించి పలుకుతున్న స్నేహితుడు )

    అరుగో మిత్రమ ! కంటివ ?
    వరలిరి తెనుగుల ఘననట
    వారిథి స్థానం
    నరసింహులు ! నాటకమున
    బురుషవరుడు సీర గట్టి
    పూవుల ముడిచెన్ .

    ( శ్రీకృష్ణతులాభార నాటకంలో స్థానం వారిని చూచి సత్యంగా సత్యభామగానే
    ప్రేక్షకులు భావించేవారు )

    రిప్లయితొలగించండి
  19. పురమున ప్రదర్శనముకై
    గిరిజా కళ్యాణమనెడి కేళిని యెంచన్
    గిరిజగ వేషము వేయగ
    పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్

    రిప్లయితొలగించండి
  20. అరరె జబర్దస్తందున
    పురుషవరుఁడు సీరఁగట్టి పూవుల ముడిచెన్
    దరుణిగ దయితగ నత్తగ
    మొఱగుగ చమ్మక్కు చంద్ర మోదించంగన్

    రిప్లయితొలగించండి
  21. కందం
    'తరుణిగ' నర్తన శాలను,
    పరిమార్చఁగ సింహబలుని 'వలలుం'డొకడై
    దరికొనెడు నిప్పుకొండగ
    పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్

    మత్తేభవిక్రీడితము
    సరసమ్మెంచుచుఁ గీచకుండు సెలఁగన్ సైరంధ్రి వెంటాడుచున్
    మరులన్ నర్తనశాలపంచుననెడున్ మర్మాన రమ్మంచుఁ దాఁ
    బరిమార్చన్ వలలుండు సేరి మిగులన్ వయ్యారి పూబోడిగన్
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  22. వరవైవాహికవార్షికోత్సవపుసంభారంబు
    లేపారగన్
    సిరిసీతమ్మకుదెచ్చినారుసుమసౌశీల్యంపు
    వస్త్రంబులన్
    స్వరసంధానపుమేళవింపుననుభాస్వత్శీల
    విప్రుండునౌ
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. కరమున కురువకమును గని
    తరుణికి సింగారమందు తగసాయపడన్
    వెరవక తనసతి మేనుకు
    పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. గురువారమ్మున దూరదర్శిని మహా ఘోరమ్మునౌ కామెడిన్
    పరివారమ్ములుమోజునన్ విడిగ జబ్బర్దస్తునేవెర్రిగా
    సరియౌ నర్థముగానరాదటను వేసారంగ నెబ్బెట్టుగా
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్.

    రిప్లయితొలగించండి
  26. వరమున దొరికిన పనియని
    పురోహితునిగఁ బనిజేసె పురుషుండొకడున్
    సరియనుచు "నమ్మ వారికి
    పురుషవరుఁడు" సీరఁ గట్టి పూవుల ముడిచెన్

    రిప్లయితొలగించండి
  27. పరిధానీయము గట్టెను
    పురుషవరుఁడు; సీరఁ గట్టి పూవుల ముడిచెన్
    తరుణీరత్నంబిరువురు
    నరిగిరి కోవెలకు దగిన ఆహార్యమునన్

    రిప్లయితొలగించండి
  28. దురితాత్ముండగు కీచకుండు మదిలో తోరంపు కామాంధుడై
    పరదారంచు తలంచకుండ సభలో పాంచాలి వెంటాడగా
    పరిహారమ్ముగ వాని సూక్షముగ చంపంగా నపేక్షించుచున్
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  29. భామనే సత్యభామనే

    విరటున్ గొల్వున మారువేషమున నాభీభత్సు వోలెన్ భళా
    మురియం జేయగ ప్రేక్షకాళి దన సమ్మోహంపు నాహార్యమున్
    బిరుదుల్ బొందగ భామరుక్మిణిగ సంప్రీతిన్ తనూజాప్తుడై
    పురుషశ్రేష్ఠుండు చీరగట్టి ముడిచెన్ పూమాల శీర్షంబునన్


    రిప్లయితొలగించండి
  30. అరరే దుర్విధి పాండుమధ్యముడహా అజ్ఞాత వాసంబునన్
    వరమై శాపము పేడి రూపమటు సంప్రాప్తింప వయ్యారమున్
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్
    అరయన్ జేరె విరాట రాజ్యమున నాట్యాచార్యుడై యొప్పుచున్

    రిప్లయితొలగించండి
  31. తరతమభేదము జూడక
    సరసికుడై మనుటవలన సరసతలొలకన్
    మరియును బిచ్చియె ముదరగ
    పురుషవరుడు సీరగట్టిపూవులముడిచెన్

    రిప్లయితొలగించండి
  32. పరు లెల్లరు తన్ను గొలువఁ
    బురవర మందు నిరతమ్ము పూఁబోడికిఁ దాఁ
    గర మనురక్తిని భార్యకుఁ
    బురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్


    పురుహూత ప్రతిభా విశేషమున నా పుంస్త్వంపు సంప్రాప్తమే
    వరమై భాసిల నొక్క యేఁ డచట సంవాసార్థ సంరంభియై
    వర ధానుష్కుఁడె యుర్వశీ వనిత శాపం బీయఁ దాఁ బేడియై
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  33. పరభార్యన్గని మోహమొందు కడు పాపాత్ముండునౌ కీచకున్
    పరిమార్చన్ వలలుండు తంత్రమున కోపావేశ మొప్పారగన్
    మరలెన్ దా నటనాలయంబునకు నామంత్రింపగా సోదరుల్
    పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెంబూమాల శీర్షంబునన్

    రిప్లయితొలగించండి
  34. విరటున్ గొల్వగ నేగియచ్చటను నాభీముండు కీచాధమున్
    ధరలేకుండగ జేయనెంచియికసూ తానేయీరకంబుగా
    పురుషశ్రేష్ఠుడు సీరగట్టి ముడిచెం పూమాలశీర్షంబునన్
    నరయన్ సత్యమె యట్లుమారుటనునాయావేష వస్త్రాలతో

    రిప్లయితొలగించండి
  35. త్వరితముగాచేరెవృకో
    దరుండునర్తనమొనర్చు తావుకు వడిగా
    తరుణీమణివేషముతో
    పురుషవరుడు చీరగట్టి పూవులు ముడిచెన్


    అరుదగు రోగము తోడుగ
    కరచరణమ్ములు విరుగగకలవర పడుచున్
    నిరతము మరుగుచు భార్యకు
    పురుషవరుడు చీర కట్టి పూవులుముడిచెన్

    రిప్లయితొలగించండి
  36. తెరవాటుల్ చెలరేగగా నగరిలో ధీశక్తితో మృఛ్చులన్
    పరి మార్చన్ జనపాలకుండు మరి సంపూర్ణంపు పూబోడిగా
    పరివర్తించుటవల్ల బంధులుగ జేపట్టెన్ నిశీధిన్ భళా!
    పురుష శ్రేష్ఠుడు సీరగట్టి ముడిచెన్ పూమాల శీర్షం బున్

    రిప్లయితొలగించండి