27, ఏప్రిల్ 2021, మంగళవారం

సమస్య - 3706

28-4-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సైంధవుండు గౌరవరాజ సైన్య మడఁచె”
(లేదా...)
“జనవంద్యుండగు సైంధవుండు గురురాట్సైన్యాంతకుండై చనెన్”

34 కామెంట్‌లు:

 1. అర్జునిని తప్ప బావలనడ్డగించె

  శివుని వరమును పొందిన సింధు రాజు

  సైంధవుండు , గౌరవరాజ సైన్య మడఁచె”

  నర్జును సుతుని మోసరణంబునందు

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 2. నిల్చె తమ్మి మొగ్గర మందు నిలువరించ
  పార్థు సుతు ని కడ్డమై బ వర మునను
  సై o ధవుo డు :గౌరవ రాజ సైన్య మడచె
  నరుడు భుజ బల శక్తితో నైజముగ ను

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  సంధ్య సూర్యబింబమునడ్డి చక్రధరుడు
  వైరిఁ గూల్చఁగ సాయమ్ముఁ బంచినట్లె
  నరుని మోహాంధకారమ్ము దరుమ విజిత
  సైంధవుండు గౌరవరాజ సైన్య మడఁచె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మత్తేభవిక్రీడితము
   తననే నమ్మిన వారిగాచుననగా దైత్యారి, చక్రంబుతో
   వినువీధిన్ రవినడ్డఁగూలెనెవడున్? వీరుండు నప్పార్థుఁడే
   బొనుపున్ బెంచఁగఁ గృష్ణ గీత విడుచున్మోహాంధకారమ్ములన్
   జనవంద్యుండగు, సైంధవుండు, గురురాట్సైన్యాంతకుండై చనెన్

   తొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  విజయు నమ్ముకు చచ్చె భీకరముగ
  సైంధవుండు; గౌరవరాజ సైన్య మడచె
  వ్రజవరుండొసగిన నాత్మ బలము చేత
  పార్థు డసమాన ప్రతిభతో బవరమందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విజయు బాణమ్మునకు చచ్చె భీకరముగ
   సైంధవుండు; గౌరవరాజ సైన్య మడచె
   వ్రజవరుండొసగిన నాత్మ బలము చేత
   పార్థు డసమాన ప్రతిభతో బవరమందు.

   తొలగించండి
 5. ఆడపడుచునుచెఱబట్టియడ్డగించె
  వీరుడభిమన్యుఁజంపెనువెఱవకుండ
  రాజవంశంబునందునరచ్చఁజేసె
  సైంధవుండుకౌరవరాజసైన్యమడచె

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  అని సేయం గురుభూమిఁ జొచ్చి, రథముల్, హస్తుల్, తురంగా, లనీ
  కినులం గూల్పఁగఁ బూని, రేఁగె నపుడుం గిన్కం గురువ్యూహము
  ల్దునుమన్, బండ్లను గీఱుచుం గిటకిటల్వోన్ భీముఁడే, కాంచ దు
  ర్జనవంద్యుండగు సైంధవుండు, గురురాట్ సైన్యాంతకుండై చనెన్!

  రిప్లయితొలగించండి
 7. పాండవ సతి ద్రౌ పదిని జేబట్ట బూన
  బావయనుచు విడువ చంపబడక యుండె
  సైంధవుండు ; గౌరవరాజ సైన్య మడఁచె
  పార్థసుతుని పద్మవ్యూహ పథకమందు

  రిప్లయితొలగించండి
 8. జనకల్యాణముగోరుచున్భువినితాచక్రంబుతోతోక్రుష్ణుడున్
  ఇనునిన్గ్రమ్మదవేగమేనరుడువాడిన్రేగెకోపంబుతో
  అనిలోసైంధవమాయెడన్నురికెడాయంగన్వెసన్సైంధవున్
  జనవంద్యుండగుసైంధవుండుగురురాట్స్యైన్యాంతకుండైచనెన్

  రిప్లయితొలగించండి

 9. విందులో బంధు మిత్రులు వేడిరంచు
  సంధిజము హెచ్చుగా గ్రోలి శఠుడొకండు
  భారతమ్ము తెలుసునంచు వాగెనిట్లు
  సైంధవుండు గౌరవ రాజసైన్యమడచె.


  వినరా పంచమ వేదమంచు నిలలో పేర్గాంచెనా భారత
  మ్మనుచున్ జెప్పెద నట్టి గాథననుచున్ మద్యమ్మునే గ్రోలి కొ
  య్యనకాడొక్కడు మత్తుతో పలికె మద్యాసక్తులౌ వారితో
  జనవంద్యుండగు సైంధవుండు గురు రాట్సైన్యాంతకుండై చనెన్.

  రిప్లయితొలగించండి
 10. సమస్య :

  జనవంద్యుండగు సైంధవుండు గురురా
  ట్సైన్యాంతకుండై చనెన్

  ( పద్మవ్యూహాన్ని ఛేదించటానికి పురోగమిస్తున్న అభిమన్యునికి పినతండ్రుల సాహాయ్య మందనీయక
  వరగర్వంతో అడ్డగించిన సైంధవునికి భవిష్యత్తులో తానే కురుసైన్య వినాశకుడననే విషయం తెలియదు )

  మత్తేభవిక్రీడితము
  ..........................

  మనమందున్ రణధర్మభావుకత యే
  మాత్రంబు లేనట్టి సం
  తమసాప్లావితశూన్యబుద్ధి ; కరుణా
  దారిద్ర్యదర్పోద్ధతుం
  డమలుండైన కిరీటి పుత్రు మృతికై
  యాసాంత మల్లాడి దు
  ర్జనవంద్యుండగు సైంధవుండు గురురా
  ట్సైన్యాంతకుండై చనెన్ .

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తునియించన్ బడె క్రీడి బాణమున సింధూరాజ్యమందున్ సదా
  జనవంద్యుండగు సైంధవుండు; గురురాట్సైన్యాంతకుండై చనెన్
  ఘనుడా పార్థుడు భీకరమ్మగు ననిన్ కాఠిన్యంబునౌ తూపులన్
  కనికారమ్మును జూపకుండని విధిన్ ఘాతమ్ములే గూర్చుచున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తునియించన్ బడె క్రీడి బాణమున సింధూరాజ్యమందున్ సదా
   జనవంద్యుండగు సైంధవుండు; గురురాట్సైన్యాంతకుండై చనెన్
   ఘనుడా పార్థుడు భీకరమ్మగు ననిన్ కాఠిన్యమౌ తూపులన్
   కనికారమ్మును జూపకుండని విధిన్ ఘాతమ్ములే గూర్చుచున్.

   తొలగించండి
 12. మ:

  మనదేశంబున రాజకీయ విభువుల్ మార్పెంచి సందోహమున్
  తనదౌ పక్షము వారినెల్లరల యాత్రల్ జేయ సంచారమై
  ఘనమౌ సాధన మేర్పరించివిడిగా గావింప సారూప్యమున్
  జనవంద్యుండగు సైంధవుండు గురురాట్సైన్యాంతకుండై చనెన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 13. ఆశుతోషుని ప్రార్థించి అర్జనుండు
  కొట్ట శరమున, శిరమును కోలుపోయె
  సైంధవుండు, గౌరవ రాజ సైన్యమడచె
  భీషణంబుగ, రణమున భీముడపుడు.

  రిప్లయితొలగించండి
 14. తనయు జంపిన కోపాగ్ని తప్తుడగుచు
  ప్రతినబూనిన పార్థుండు బావతోడ
  కఱకుటమ్ముల శిక్షించి, కడకుచావ
  సైంధవుండు , గౌరవరాజ్య సైన్యమడచె

  రిప్లయితొలగించండి
 15. సమస్య :

  జనవంద్యుండగు సైంధవుండు గురురా
  ట్సైన్యాంతకుండై చనెన్

  ( పద్మవ్యూహాన్ని ఛేదించటానికి పురోగమిస్తున్న అభిమన్యునికి పినతండ్రుల సాహాయ్య మందనీయక
  వరగర్వంతో అడ్డగించిన సైంధవునికి భవిష్యత్తులో తానే కురుసైన్య వినాశకుడననే విషయం తెలియదు )

  మత్తేభవిక్రీడితము
  ----------------

  మనమందున్ రణధర్మభావుకత యే
  మాత్రంబు లేనట్టి సం
  జనితామర్షకళంకబుద్ధియుతుడున్ ;
  జాంచల్యదుష్పాలకుం ;
  డనఘుండైన కిరీటి పుత్రు మృతికై
  యాసాంత మల్లాడి దు
  ర్జనవంద్యుండగు సైంధవుండు గురురా
  ట్సైన్యాంతకుండై చనెన్ .

  రిప్లయితొలగించండి
 16. ధనువుందాల్చి మహోగ్రతేజమున పద్మవ్యూహముం జొచ్చి కా
  లుని వోలెన్ క్రమియించి సింధు నృపతిన్ లోకోత్తరానర్తమున్
  దునుమాడెన్ కురురాజ సైన్య చయమున్ దుర్వార సౌభద్రి దు
  ర్జనవంద్యుండగు సైంధవుండు గురురాట్సైన్యాంతకుండై చనెన్

  రిప్లయితొలగించండి
 17. జనులారా ! కనరేమి ? ఘోర యమపాశంబున్ విచారింపరా ?
  జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్
  యన నిర్లక్ష్యమునన్ ప్రజాళికిననూహ్యంబౌ కరోనా రుజన్
  యినుమాడంగను జేతురా ? తగదురా హేరామినిన్ వీడరా ?

  హేరామి = హింసించుట, ఉపద్రవం కలిగించుట

  చనె పుత్రుండన నర్జునుండురిమి రోషావేశమునున్ బూని సిం
  ధు నరేశున్ యినుడస్తమించ మును తా ద్రుంచన్ దృఢాత్ముండవన్
  తన మాయన్ బడి సూర్యుడున్ ముసరగన్ తంత్రంబు సేయన్ హరే
  జనవంద్యుండగు; సైంధవుండు గురురాట్సైన్యాంతకుండై చనెన్

  రిప్లయితొలగించండి
 18. నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య

  జనవంద్యుండగు సైంధవుండు గురురాట్ సైన్యాంతకుండై చనెన్

  నాపూరణ

  మత్తేభము

  ఘనమౌ రీతిన ఫల్గుణుండు కదనోత్కంఠంబునన్ రేగుచున్
  గనెనా సింధుపతిన్ యనిన్ జివరకున్ గాలించిశోధించగా
  నినుడస్తంబగుముందుగన్, దునిమె దానేకైకయస్త్రంబునన్
  జనవంద్యుండగు సైంధవుండు గురురాట్ సైన్యాంతకుండై చనెన్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 19. మనమున్ శిష్యులు పాండు పుత్రులు సదా మాధుర్యమివ్వంగ భో

  జన దాతా కురు రాజు సేవలను రాజాజ్ఞా నిభధ్ధుండె ప

  న్నెను వ్యూహమ్మును పాండు సేనలనటన్నిల్పన్ స్వసేనాళికిన్

  జనవంద్యుండగు సైంధవుండు ; గురురాట్సైన్యాంతకుండై చనెన్

  కినిసిన్పార్ధుడు యుధ్ధమున్విడిచి నక్కిన్నట్టి వాన్జంపగన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 20. ఘనులౌ పాండుకుమారులన్ నిలుపగా, కామారి యియ్యన్ వర
  మ్మును, నా సైంధవు డప్డు, కౌరవులు పెన్ మోసమ్ముతో బాలకున్
  దునుమాడన్ కసి నర్జునుండు దురమున్ ద్రుంపెన్ ప్రతిద్వంద్వి దు
  ర్జనవంద్యుండగు సైంధవుండు గురురాట్సైన్యాంతకుండై చనెన్

  రిప్లయితొలగించండి
 21. సింధు దేశపు రాజుగా శ్రేణికెక్కె
  సైంధవుడు,గౌరవరాజ సైన్యమడచె
  యుద్ధరంగాన ఫల్గుణు డొక్కగుణిని
  పాఱి పోవగ జేసెను భయముతోడ

  రిప్లయితొలగించండి
 22. వర గరిమ దర్ప మడరంగఁ బద్మ సన్ని
  భమ్ము వ్యూహ మడర భండనమ్మునఁ జెల
  రేఁగి పాండవ మధ్యము లేమిఁ గాంచి
  సైంధవుండు గౌరవ రాజ సైన్య మడఁచె

  [గౌరవ రాజ సైన్యము = గౌరవనీయుఁ డైన రాజ సైన్యము, ఇక్కడ ధర్మరాజ సైన్యము]


  తన పాపమ్మున కింత యేని మదిఁ జింతం జేయకే కక్షతో
  ననిఁ గూల్పంగఁ దలంచి పాండవులఁ దా నా శంభుఁ బూజింపఁగా
  నెనయం గల్మష కంఠ దత్త వరమే యేకైక ఘస్రమ్మునన్
  జనవంద్యుం డగు, సైంధవుండు, గురు రాట్సైన్యాంతకుండై చనెన్

  [గురురాట్ =గొప్పరాజు, ఇక్కడ జనవంద్యుఁ డగు ధర్మరాజు]

  రిప్లయితొలగించండి
 23. జననింద్యుండగు వానినెట్లిటనగనీచౌమాట సాకారమే
  జనవంద్యుండగు సైంధవుండు, గురురాట్సైన్యాతకుండైచనెన్
  గనుడో ఫల్గుణుడాయనిన్ నొకడ దాగాలించి యాచోటులన్
  మనమున్ బొంగగ దీర్గుచున్ గనీయె సన్మానంబు జేయంగగా

  రిప్లయితొలగించండి
 24. మనమున్ బొంగగ దిర్గుచున్ గనియె సన్మానంబు జేయంగగా

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. వినుమా బాలుడు మోహరంబునను నిర్భీతిన్ ప్రవేశించగా
  అనుకంపంబణువైన లేక గడతేర్చన్ సాయమందించె దు
  ర్జనవంద్యుండగు సైంధవుండు; గురురాట్సైన్యాంతకుండై చనెన్
  ఘనుడా పార్థుడహో మహోగ్రగతి సంగ్రామంబునందంతటన్

  రిప్లయితొలగించండి
 27. కన్నసుతుని చావున కట కారణమ్ము
  ననుచు నెరిగి క్రోధమ్ముతో నర్జునుండు
  ప్రతినచేసి చంపియతని పట్టుబట్టి
  సైంధవుండు, గౌరవరాజ్యసైన్యమణచె

  రిప్లయితొలగించండి