22, ఏప్రిల్ 2021, గురువారం

సమస్య - 3701

23-4-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”
(లేదా...)
“కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”

67 కామెంట్‌లు:

 1. మారుని బారికి గురియై
  వారిజ నేత్రను వలచియు పరిణయ మాడన్
  తోరపు రసికత కున్ మమ
  కారమె ప్రేమికులకు గన గడు ముద్దు సుమా !

  రిప్లయితొలగించండి
 2. తీరవు నీవవి తెంచక

  భారపు పగ్గములు నరుల పాపపు తనువుల్

  చేరెద నిను నీపై మమ

  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. గు రు మూ ర్తి ఆ చా రి ( SYND. BANK ) , వె లు గో డు
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,

  గు రు భ్యో న మః ( దయచేసి మొన్నటి పూరణ స్వీకరించ మనవి )


  సమస్య = వసుదేవుని గాంచి వాలి పక్కున నవ్వెన్
  ......................................................................................  '' వసుధ '' యను పడతి తన బా

  వ , " సుదేవుని '' గాంచి వాలి పక్కున నవ్వెన్ ‌ ,

  గుసగుస నావిడ చెవిలో

  హసనము కలిగించు పలుకు లాతడు గొణుగన్ ! !


  [ వాలి పక్కున నవ్వెన్ = ముందుకు వాలి పడిపడి నవ్వెను :

  హసనము కలిగించు = నవ్వు పుట్టించు ]  ***************************************

  రిప్లయితొలగించండి
 4. చేరగమనసులుదగ్గర
  వీరికనోకటేయనగనుపెంపునుగనగన్
  భారములేకనుకలసా
  కారమెప్రేమికులకుఁగనఁగడుముద్దుసుమా

  రిప్లయితొలగించండి
 5. మీరక చెప్పిన మాటలు
  ఊరక పొగడుచును సాగు ఊసుల తోనం
  వేరవని తియ్యనగు మమ
  కారమె ప్రేమికులకు గన కడు ముద్దు సుమా

  రిప్లయితొలగించండి


 6. ధోరణి మార్చవె గయ్యా
  ళీ! రయ్యన దుముకకె సతి లీలావతి! సం
  ప్రేరణను జేర్చెడా మమ
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ధారుణి భోగ భాగ్యములు , దండిగ చేరెడు రత్న రాశులున్,

  కోరరు వేద వేద్యులును , కోర్కెలు వీడిన వార్కి ముద్దు ఓం

  కారమె ; యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”
  జారెడు వాన దేహముల జ్వాలలు రేపుచు ముద్ద సేయగన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 8. హారము కంఠమందిడగ
  నందము లీను ముఖంబు, కూరలో
  కారము కొంచెమై విరియ
  కమ్మని స్వాదువు నందజేయు, సం
  స్కారము మానవాళి కిడు
  కాంతియు, నా తెరయీఁగ కంఠ ఝుం
  కారమె యెంతొ ముద్దు, నయ
  గారము లుండిన ప్రేమ జంటకున్
  భారముగాదు జీవనము,
  భాతములీను నలంకృతిన్ సదా!

  రిప్లయితొలగించండి

 9. తారుణ్యమందు కామవి
  కారపు చేష్టలను ప్రేమగా దలచుదురే
  గారముతో మెదిలెడు సం
  స్కారమె ప్రేమిలకుఁ గనఁ గడు ముద్దు సుమా.


  పేరిమి కాదు మోహమది విజ్ఞత వీడుచు ప్రాయమందు శృం
  గారము గాంచి బేటపు వికారపు చేష్టలె సుమ్మ యంధులై
  స్వైరము తో చరింపక విచారము గల్గి పరిభ్రమించు సం
  స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్.

  రిప్లయితొలగించండి
 10. మారముసేయకన్మనసుపండగసిగ్గులపెళ్లికూతురై
  సారెకుచూపుసోయగముసందడిసేయగసాధుపుంగవున్
  గారముమీరుమాటలనుగాండివిగాగనుపల్కరించునా
  కారమెయెంతోముద్దునయగారములుండినప్రేమజంటకున్

  రిప్లయితొలగించండి
 11. మిత్రులందఱకు నమస్సులు!

  పూరిత సద్గుణమ్ములును, భూరియశోద్భుతశక్తియుక్తులున్,
  గౌరవయుక్తపద్ధతులు, గణ్యవిరాజితమూర్తిమత్త్వమున్,
  ధీరమహత్త్వపూర్ణసువిధేయత వెల్గుచునున్న, వారి సం
  స్కారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమ జంటకున్!

  రిప్లయితొలగించండి
 12. సమస్య :

  కారమె యెంతొ ముద్దు నయ
  గారములుండిన ప్రేమజంటకున్

  ( అధికజనసంఖ్యతో అవస్థ లెందుకు ?)

  ఉత్పలమాల
  ....................

  మారిన కాలమందు మతి
  మంతులు మంచిని పంచగావలెన్ ;
  ఘోరము ; నూటముప్ప దగు
  కోటులు దాటెను సంఖ్య జూడగా ;
  మారని నిర్ణయాత్ములయి
  " మా కొక రంతె " యనంగ గల్గు సం
  స్కారమె యెంతొ ముద్దు ; నయ
  గారములుండిన ప్రేమజంటకున్ .

  రిప్లయితొలగించండి
 13. కారణమేమై యున్నను
  పోరాడకు మెల్లవేళ పొలతుక తోడన్
  శ్రీరాముడు సీతా సహ
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”

  రిప్లయితొలగించండి
 14. అందరికీ నమస్సులు🙏

  దూరము నోర్వలే కుభయ దోసము లెంచక కయ్యమందునన్
  భారము దీరగన్ గలువ భ్రాంతిని వీడుచు నొక్కటాయెనా
  గారము బోవ నిర్వురును కౌగిట జిత్తగు మోహమం దలం
  *“కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”*

  *వాణిశ్రీ నైనాల*

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కూరిమి నెంతయు గూడుచు
  తీరున నొక్కరి కొకరుగ మెలగెడి పసతో
  దోరుచు ప్రకటించెడి సహ
  కారమె ప్రేమికులకు గన కడు ముద్దుసుమా!

  రిప్లయితొలగించండి
 16. ఉ:

  పోరుచు నుండ మాటకును ప్రొద్దున రాత్రులు బెట్టు చేయుచున్
  సారము శూన్యమై తెలివి చాలక యున్న యనుంగు వారటన్
  క్షీరము నీరమున్ గలియు జీవన సౌఖ్యమునొంద నో పరి
  ష్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 17. కారులుమేడలుచూడరు
  వారుగనుదురుతమయెదలవాత్సల్యమునే
  ఆరనిమమతలతమమమ
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కూరిమి గూడి త్రిమ్మరుచు కొంచెము నైనను ప్రేమవీడకున్
  వేరిమికాని భావమున వీకను సాగుచు ధీమసమ్మునన్
  తీరగు రీతినిన్ సతము తీయని నైఖ్యత నెంచునౌ సుసం
  స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్.

  రిప్లయితొలగించండి


 19. అయ్యయ్యో :(  నీరజనేత్ర రాగమయి నెవ్వపు రూపు కరోన కైవడిన్
  ప్రేరణ కొంత తగ్గవలె క్రీడల వేళల ముద్దులాటలోన్
  మారిన కాలమిద్ది! భళి మాస్కులు మోమును కప్పుచుండు ప్రా
  కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. కారులు మేడలన్ గొనగ కాంతల యార్జన ముద్దుగూర్చుచో
  దూరుటమాని యింతులను దోషములెంచుచు వంటలందునన్
  కూరిమి నిత్యకృత్యముల గొమ్మకు సాయముజేయు చిత్తసం
  స్కారమె యెంతొముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్

  రిప్లయితొలగించండి
 21. తీరులు వేరగుగద బం
  గారమె కాముకులకు గన గడు
  ముద్దు సుమా
  వారి నడుమనుండిన మమ
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా

  రిప్లయితొలగించండి
 22. శ్రీ గురుభ్యోనమః
  అందరికీ నమస్కారాలు 🙏

  కం.
  బేరము లాడక జీవిత
  సారము తెలియగ నిరువురు సమమని సతమున్
  ప్రేరణ నిండినదౌ సహ
  కారమె ప్రేమికులకు గన కడు ముద్దు సుమా

  అపర్ణ గాడేపల్లి

  రిప్లయితొలగించండి
 23. భూరి ధనంబు మేటి గృహ భూ కనకంబులు నంబరాదులున్
  కారణమౌనె ప్రీతికిల ? గారవ మద్దిన మంచి మాటలున్
  వారణ సేయలేని ప్రియ వాక్కులె బంధము గూర్చు నిత్య సా
  కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  రిప్లయితొలగించండి
 24. మారుని శరముల ధాటికి
  తీరని తమకమున సొక్కి దెందములందున్
  వారణనొందని యా మమ
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా

  రిప్లయితొలగించండి
 25. ప్రేరణరాధకృష్ణులనవెల్లువలెత్తెమనోహరంబువి
  స్పారితదివ్యలోకమున,సత్యపుబ్రేమమునైక్యమొందగా
  గారణజన్ములైనిలచిగల్మషమొందనిదత్వమౌనిరా
  కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 26. సారముగల బ్రతుకు సం
  స్కారముగల నడవడియు, సంసారమునన్
  క్షీరము నీరమువలె మమ
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!

  రిప్లయితొలగించండి
 27. దూరపు కొల్వులో ప్రియుడు తోరపుఁ బ్రేమము చూపి మించగా
  నారని కోరికల్ మనసు నారడి పెట్టి దహించు చుండగా
  ప్రేరణ చేయ మన్మథుడు, పెండ్లికి పెద్దలొసంగు నట్టి శ్రీ
  కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  రిప్లయితొలగించండి
 28. కందం
  వారించ పెద్దలెల్లరు
  నోరిమితో శంక దీర్చి యొప్పించుచు న
  వ్వారి, వరించెడు కల సా
  కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!

  ఉత్పలమాల
  నేరము గాదు ప్రేమయని నిర్మల మానస చిత్తులై మనన్
  మీరకుమంచు పెద్దలట మేరలు సెప్పుచు నడ్డగింప న
  వ్వారలు నొప్పగా మసలి వాంఛిత ప్రేమ వివాహ స్వప్న సా
  కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  రిప్లయితొలగించండి
 29. కోరి వరించు వారలతి కోర్కుల
  జోలికి బోక వేదనా
  భారములుండిన్ సుమన భా
  వముతో దొలిగించుచున్ సదా
  కూరిమితోడ కాపురము గువ్వ
  ల తీరుగ సాగ నిత్య సా
  కారమె యెంతొ ముద్దు నయ
  గారములుండిన ప్రేమ జంటకున్

  రిప్లయితొలగించండి
 30. మారుని ప్రేరణ చేతను
  జేరగ దాభర్తదరికిచిత్తమునలరన్
  తోరమువశమైమన,మమ
  కారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా

  రిప్లయితొలగించండి
 31. కోరుదురెల్లవేళలను కూరిమి యొండొరులందు మెండుగన్
  వేరుతలంపులుండవిక వేమరు నేమరుపాటు నొందుచున్
  వారిది వేరు లోకమని భావనజేసెదరట్టిదౌ సుసం
  స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  రిప్లయితొలగించండి
 32. భారము కా దెన్నం డవి
  చారపు సుద్దులు వలికిన సమ్మతములు సూ
  వారక దెందమ్ముల మమ
  కారమె ప్రేమించినఁ గనఁ గడు ముద్దు సుమా
  (కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా)


  కోరినవాఁడు భర్తగను గోమలి కింపుగ దక్క మిక్కిలిన్
  మూరదె డెంద మందుఁ దగఁ బొంగుచు నిత్యము హర్ష మెంచఁగన్
  వారక యుండ దీవనలు పన్నుగఁ బెండ్లికిఁ బెద్దవారి స్వీ
  కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ పక్షికిన్

  రిప్లయితొలగించండి
 33. మఱొక పూరణము:
  వజ్ఝలవారికి నమస్సులతో...

  కారమె కూరకున్ సొగసు; కమ్రసువాఙ్మృదురూపవాక్య సం
  స్కారమె పూరుషాళి రుచి; సన్నియమాఢ్యవినమ్రతోన్నమ
  స్కారమె మాన్యు కిచ్చు నగ; సద్వరవస్త్రయుతమ్మునౌ నలం
  కారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమజంటకున్!

  రిప్లయితొలగించండి
 34. భారకుచమ్ములొప్పుసతి
  బాహుపటుత్వము పాతికొప్ప సొం
  పారెడి కౌను శోభనకు, వర్ధిల శ్రీపతి పద్మనాభుడై
  ప్రేరిత రాసలీల మురిపించగ మల్లెల పాన్పు *మన్మథా*
  *కారమె, యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 35. కోరి పరస్పరంబు దగ గూరిమి మీరగ నూసులాడుచున్
  చేరువయైన డెందముల చిందెడి మోజుల లొంగిపోవకన్
  తీరుగ పాణిబంధమున దీవెనలన్ గొను దాఁక నొప్పుగా
  దూరమె మేలటంచు ధృతితో పచరించెడి చక్కనైన సం
  స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్

  రిప్లయితొలగించండి
 36. మీరక హద్దులెన్నడు మమేకపుభావన గల్గునట్టిసం
  స్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్
  గోరినవాడు భర్తగనుగూర్మి లభీంచుట యోగమేకదా
  పారమునొందవీలగును భవ్యతరాలకు వీరిసర్గముల్

  రిప్లయితొలగించండి
 37. కేరున నేడ్చుచున్ దనదు కేళులజాపుచు నేత్తుకొమ్మనున్
  చారెడు కన్నులన్ మెఱయు చక్కని దృక్కుల
  ముద్దులొల్కెడిన్
  ఔరస పుత్రునిన్ గనగ నర్రుల జాచెడు మంచి
  స్వప్న సా
  కారమె యెంతొముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్

  రిప్లయితొలగించండి
 38. కోరిన వనితయె సతియై
  తీరుగ కాపురము చేయ తేలుచు ముదమున్
  కూరిమితోచూపినమమ
  కారమె ప్రేమికులకు గన గడు ముద్దు సుమా.

  రిప్లయితొలగించండి