14-4-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి”(లేదా...)“జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అవినీతి పరుడైన పంచాయితీ ప్రెసిడెంట్...... ఆటవెలదికుక్క వలెను సేవ మిక్కుటముగ జేతునెన్నుకొనుమనంగ నెన్నఁ బ్రజలువాటమెరిగి మిగుల వారి పన్నుల విసర్జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి! చంపకమాలజనులట నమ్మగా బలికి జాతికి సేవల కుక్కనౌదనన్వినతిని నమ్మి యెన్నుకొన వేడుకఁ జేయ నుపక్రమించుచున్బనిగొని పన్ను సంపదల వాటమెరుంగుచు వారిదౌ విసర్జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్!
పండుగ దిన మంచు బంధువు లెందరొవచ్చిరని పలువిధ భక్ష్యములనువండి పెట్టె యమ్మ వంటయింట, గని భోజనము నెల్ల మ్రింగె శ్వానమొకటి.
ధనమునుమ్రింగినారటవదాన్యవినాయకులందలంబిడన్వనములుగాల్చినారటసభాస్థలిగట్టగబిల్డరుల్ప్రయోజనమునువిస్మరించిరటజాతిపితాశయమూడ్చినేత,భో*“జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్”*
నేటిపుర్వుజూడనేరుపుమీరంగవచ్చెమనిషియుసురువంచజగతికాలభైరవుడతడుకనిపించెనీరీతిజనమునెల్లమ్రింగెశ్వానమోకటి
అవ్వ వంట లన్న అత్యంత ఇష్టమౌ,తంతి చేసి మేము తరలి వెళ్ళవంట వండి మాకు వార్చబోయినది భోజనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి.
క్రొవ్విడి వెంకట రాజారావు: రుచికరమగు రీతి పచనము జేయించి పల్లె నుండి వచ్చు బావగారి తనయుని కొరకనుచు దాచినట్టిదగు భో జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి.
ఘనముగ పెండ్లివేడుకను గ్రామము నందున జేయనెంచగాజనకజ రామచంద్రులకు సంబరమందుచు చైత్రమందునన్వనితలు భక్ష్యభోజ్యముల వడ్డనసేయగ జేర్చియుంచ వ్యంజనమును మ్రింగివేసినది శ్వానము సూచినవారలేడ్వగన్
మూడు రోజులాయె కూడు దొరకకనేకనులముందు గాంచ గారెనొకటినక్కి నక్కి దూరి నట్టింట, కనుగప్పిజనమునెల్ల, మ్రింగె శ్వానమొకటి
పనిగోనిపబ్బులందుననుబారులుఁదీరుచువీడికట్టడిన్వనితలగూడిజారులునువాలుచుతూగుచుభోగులాయిరేకనగకరోనకాలమునకాముకులందరుకుక్కలేకదాజనమునుమ్రింగివేసినదిశ్వానముసూచినవారలేడ్వగన్
వనమున భోజనాలకని బంధువు లెల్లరు సంతసమ్ముతో జని పులిహోర పాయసము చక్కెర పొంగళి పూతరేకులున్ బుణుగులు చేసి పెద్దలట ముచ్చట లాడుచు నుండ నట్టి భో జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవారలేడ్వగన్.
సమస్య :జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వగన్ ( పండుగరోజు - పాయసపాత్ర - పరుగున వచ్చిన కుక్క )చంపకమాల ..................ఘనముగ బండుగన్ జరుప గాంతలు చిక్కని పాయసమ్ము భా జనమున శ్రద్ధమీరగను చక్కగ బోయుచు బ్రక్కనుంపగా దనరుచు వాసనన్ దెలిసి తక్కుచు తారుచు తోకనూపి భో జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వగన్ .( భాజనము - పాత్ర ; భోజనము - ఆహారము ; తనరుచు - మురియుచు )
వంట వండి యింటి వాకిలి వేయక పనుల కొఱకు నేగె బయటి కొకడు తగిన సమయ మనుచు ధైర్యాన వెడలి భో జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి
క్రొవ్విడి వెంకట రాజారావు: ఘనమగు రీతి నింపితము గల్గు విధమ్ముగ తీపి పాకముల్ ననువుగ రూపుజేసి తమ నాత్మసహాయుని తోడ గూడుచున్ తినుటకు వేచి జూడ నటు తెక్కలి వోలె నలిందమందు భో జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్.
చం: శునకము నిచ్ఛగింప మన సోప్పిన నొప్పక యెన్నికందునన్కనికర మింతలేక మెయి కావర మెక్కగ లంచగొండిగన్ధనము గడించ నెంచె నట దారుణ శైలిని సిగ్గువీడి, భోజనమును మ్రింగి వేసినది శ్వానము సూచిన వారలేడ్వగన్వై. చంద్రశేఖర్
తెచ్చుకొనిరివారుతీపిమిఠాయిలుచేయబూనవిందు చెట్ల క్రిందవనమునాడువేళవంచనచేసిబోజనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
సామిరంగ! చూడ శణఘంటలచ్చటదారి వెంట చనుచు దగ్గి దగ్గికొరికి కొరికి చూచి కోరి కోరితినుచుజనమునెల్ల మ్రింగె శ్వానమొకటిజిలేబి
వన భోజనమున బింబానన! జనమును మ్రింగివేసి నది శ్వానము సూచినవార లేడ్వఁగన్ మొరిగెనద్ది భౌభౌ మటంచు క్రింద పొరలుచున్ఏమి సమస్యయో!ఏమి పూరణయో!ఏమి లాజిక్కో!ఏమిటో ఒక ముక్కా అర్థం కాదే!జిలేబి నీ కేమైనా అర్థమయిందా?:)జిలేబి
కూలె ద్రుపదు పుత్రి కూలె సోదరులునుపంతమునను యముడు పాండు రాజజనమునెల్ల మ్రింగె :; శ్వానమొకటి” వెంటనుండె కడమ ధర్మ నందనునికి...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మునులకు బిక్షనిచ్చుటకు ముద్దుగ మంచివి తీయనౌ జిలేబిను మరి పాల కాయలను వేడిగ గారెలు బూరెలన్నియున్ఘనమున కూర్చి వేద్యులను గాదిలి పిల్చెడి వేళలందు భోజనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...( జిలేబి, పేరును , అనుమతి లేకుండా, వాడుకున్నందుకు, జిలేబీ గారికి క్షమాపణలు)
కుండనందువుంచికూలికివెళ్ళగాకూడువండిభార్య వేడిగానువచ్చిజూడ నిశ కవాటము తెరువ భోజనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
ప్రజనము కల్గెనన్చు తగ బాంధవు లెల్లరు గూడి వేడ్క మజ్జనమును సేయువేళ బహు సందడి సేయుచు నవ్యరీతి భోజనమును వండివార్చ నట చంగపు పప్పుకు పోపువేయ గృంజనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వగన్ప్రజనము = తొలిచూలు, చంగము = బహు చక్కని, గృంజనము = వెల్లుల్లి
మీ పూరణ బాగున్నది. కాని, మొదటి పాదంలో ప్రాసభంగం జరిగినది. సరిచేయగలరు.
ఘనముగ పెండ్లి వేడుకల కమ్మని వంటలొనర్చి ప్రీతితో వనమున చేరి యాటలను పాటల తోడచెరించి, క్షుత్తుతోకొనుటకు పోయి చూడగను క్షోణిజపున్ దరి నుంచి నట్టి భోజనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
పండుగ యని యింట పలు భక్ష్యములు చేసిసంబరమ్ము తోడ చక్క గాను బంధు జనుల కూడి భాషించు చుండ వ్యంజనము నెల్ల మింగె శ్వాన మొకటి
ఎటుల జూచెనేమొ యెటనుండి వచ్చెనోక్షణము లోన జరిగె సరిత!కంటె?తినుట కొఱకు నిన్న తేబడినట్టిభోజనమునెల్లమ్రింగె శ్వాన మొకటి
మిత్రులందఱకు నమస్సులు![పదివేవుఱు కన్యకామణులను చెఱఁబెట్టిన నరకుని యాగడములు]ఘనకిటికిన్ వసుంధరకుఁ గాదిలి పట్టిగఁ బుట్టి, దుష్టుఁడైన నరక నామ కుర్కురము, న్యాయముఁ గొంకును లేక, యందఱన్వినయము వీడి, కష్టములఁ బెట్టెఁ గదా! పదివేల కన్యకాజనమును మ్రింగివేసినది శ్వానము, సూచినవార లేడ్వఁగన్!![మ్రింగు = చెఱఁబెట్టు]
వినుముర రాజశేఖరుడ!వేజని దెచ్చిన మంచిదైన భోజనమునుమ్రింగి వేసినది శ్వానము సూచినవారలేడ్వగన్ కనగను బోధరాదెటుల గారణమయ్యెనొ? నెట్లయాయెనోపనిగొని జూచు చుండెనెమొ శ్వానము బ్రక్కననక్కి యయ్యెడన్
పర్వదినమునాడు బందుగులకొరకువంటగదిని చేరి వంటజేసికబురులాడుచుండ కన్నులుగప్పి భోజనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
ఘనముగ పిండివంటల నుగాది దినంబున జేసి యెల్లరున్పనులనుమాని తీరికగ వాకిట గూర్చుని మాటలందునన్మునిగినవేళ నెమ్మదిగ మూలల నక్కుచు మోహరించి భోజనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
ముప్పు లెప్పగిదినిఁ జొప్పడుఁ జెప్పంగ నెప్పు డైన నెట్టు లొప్పుఁ జెప్పు కొమ్మ పైన జాఱి కూల నేలపయి నంజనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి [అంజనము = ఒక రకపు బల్లి]చని చని యెవ్వరుం గనని చందము దూఱి సజాతి పంక్తితో ఘనముగ వండి యుంచగను గమ్మని వాసన లింపు గొల్పఁగాఁ దనర వివాహ మంటపము దగ్గరఁ బందిరి లోన విందు భోజనమును మ్రింగివేసినది శ్వానము సూచిన వార లేడ్వఁగన్
ధనమును బంచి ఓట్లు కొని దంభపు రీతుల నెట్టకేలకా కనకపు గద్దెనెక్కి అధికారము చేతికి చిక్కినంతనే జనులకు మేలు మాని దన సంపద పెంపును గోరి సత్ప్రయోజనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
ఖననము చేయ,చూచె ఋషి కాలెడు కాష్టములన్, కరోనచేమననము చేసి మంత్రమును మార్చెను కుక్కను చాల పెద్దగాతనరుగ మాస్కు లేకజను తామసులన్ తిని చంప నింపుగాజనమును మ్రింగి వేసినది శ్వానము సూచినవార లేడ్వగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవినీతి పరుడైన పంచాయితీ ప్రెసిడెంట్......
రిప్లయితొలగించండిఆటవెలది
కుక్క వలెను సేవ మిక్కుటముగ జేతు
నెన్నుకొనుమనంగ నెన్నఁ బ్రజలు
వాటమెరిగి మిగుల వారి పన్నుల విస
ర్జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి!
చంపకమాల
జనులట నమ్మగా బలికి జాతికి సేవల కుక్కనౌదనన్
వినతిని నమ్మి యెన్నుకొన వేడుకఁ జేయ నుపక్రమించుచున్
బనిగొని పన్ను సంపదల వాటమెరుంగుచు వారిదౌ విస
ర్జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్!
పండుగ దిన మంచు బంధువు లెందరొ
రిప్లయితొలగించండివచ్చిరని పలువిధ భక్ష్యములను
వండి పెట్టె యమ్మ వంటయింట, గని భో
జనము నెల్ల మ్రింగె శ్వానమొకటి.
ధనమునుమ్రింగినారటవదాన్యవినాయకులందలంబిడన్
రిప్లయితొలగించండివనములుగాల్చినారటసభాస్థలిగట్టగబిల్డరుల్ప్రయో
జనమునువిస్మరించిరటజాతిపితాశయమూడ్చినేత,భో
*“జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్”*
నేటిపుర్వుజూడనేరుపుమీరంగ
రిప్లయితొలగించండివచ్చెమనిషియుసురువంచజగతి
కాలభైరవుడతడుకనిపించెనీరీతి
జనమునెల్లమ్రింగెశ్వానమోకటి
అవ్వ వంట లన్న అత్యంత ఇష్టమౌ,
రిప్లయితొలగించండితంతి చేసి మేము తరలి వెళ్ళ
వంట వండి మాకు వార్చబోయినది భో
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరుచికరమగు రీతి పచనము జేయించి
పల్లె నుండి వచ్చు బావగారి
తనయుని కొరకనుచు దాచినట్టిదగు భో
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి.
ఘనముగ పెండ్లివేడుకను గ్రామము నందున జేయనెంచగా
రిప్లయితొలగించండిజనకజ రామచంద్రులకు సంబరమందుచు చైత్రమందునన్
వనితలు భక్ష్యభోజ్యముల వడ్డనసేయగ జేర్చియుంచ వ్యం
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార
లేడ్వగన్
మూడు రోజులాయె కూడు దొరకకనే
తొలగించండికనులముందు గాంచ గారెనొకటి
నక్కి నక్కి దూరి నట్టింట, కనుగప్పి
జనమునెల్ల, మ్రింగె శ్వానమొకటి
పనిగోనిపబ్బులందుననుబారులుఁదీరుచువీడికట్టడిన్
రిప్లయితొలగించండివనితలగూడిజారులునువాలుచుతూగుచుభోగులాయిరే
కనగకరోనకాలమునకాముకులందరుకుక్కలేకదా
జనమునుమ్రింగివేసినదిశ్వానముసూచినవారలేడ్వగన్
రిప్లయితొలగించండివనమున భోజనాలకని బంధువు లెల్లరు సంతసమ్ముతో
జని పులిహోర పాయసము చక్కెర పొంగళి పూతరేకులున్
బుణుగులు చేసి పెద్దలట ముచ్చట లాడుచు నుండ నట్టి భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవారలేడ్వగన్.
సమస్య :
రిప్లయితొలగించండిజనమును మ్రింగివేసినది
శ్వానము సూచినవార లేడ్వగన్
( పండుగరోజు - పాయసపాత్ర - పరుగున వచ్చిన కుక్క )
చంపకమాల
..................
ఘనముగ బండుగన్ జరుప
గాంతలు చిక్కని పాయసమ్ము భా
జనమున శ్రద్ధమీరగను
చక్కగ బోయుచు బ్రక్కనుంపగా
దనరుచు వాసనన్ దెలిసి
తక్కుచు తారుచు తోకనూపి భో
జనమును మ్రింగివేసినది
శ్వానము సూచినవార లేడ్వగన్ .
( భాజనము - పాత్ర ; భోజనము - ఆహారము ; తనరుచు - మురియుచు )
వంట వండి యింటి వాకిలి వేయక
రిప్లయితొలగించండిపనుల కొఱకు నేగె బయటి కొకడు
తగిన సమయ మనుచు ధైర్యాన వెడలి భో
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఘనమగు రీతి నింపితము గల్గు విధమ్ముగ తీపి పాకముల్
ననువుగ రూపుజేసి తమ నాత్మసహాయుని తోడ గూడుచున్
తినుటకు వేచి జూడ నటు తెక్కలి వోలె నలిందమందు భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్.
చం:
రిప్లయితొలగించండిశునకము నిచ్ఛగింప మన సోప్పిన నొప్పక యెన్నికందునన్
కనికర మింతలేక మెయి కావర మెక్కగ లంచగొండిగన్
ధనము గడించ నెంచె నట దారుణ శైలిని సిగ్గువీడి, భో
జనమును మ్రింగి వేసినది శ్వానము సూచిన వారలేడ్వగన్
వై. చంద్రశేఖర్
తెచ్చుకొనిరివారుతీపిమిఠాయిలు
రిప్లయితొలగించండిచేయబూనవిందు చెట్ల క్రింద
వనమునాడువేళవంచనచేసిబో
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
రిప్లయితొలగించండిసామిరంగ! చూడ శణఘంటలచ్చట
దారి వెంట చనుచు దగ్గి దగ్గి
కొరికి కొరికి చూచి కోరి కోరితినుచు
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
జిలేబి
రిప్లయితొలగించండివన భోజనమున బింబా
నన! జనమును మ్రింగివేసి నది శ్వానము సూ
చినవార లేడ్వఁగన్ మొరి
గెనద్ది భౌభౌ మటంచు క్రింద పొరలుచున్
ఏమి సమస్యయో!
ఏమి పూరణయో!
ఏమి లాజిక్కో!
ఏమిటో ఒక ముక్కా అర్థం కాదే!
జిలేబి నీ కేమైనా అర్థమయిందా?
:)
జిలేబి
కూలె ద్రుపదు పుత్రి కూలె సోదరులును
రిప్లయితొలగించండిపంతమునను యముడు పాండు రాజ
జనమునెల్ల మ్రింగె :; శ్వానమొకటి” వెంట
నుండె కడమ ధర్మ నందనునికి
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మునులకు బిక్షనిచ్చుటకు ముద్దుగ మంచివి తీయనౌ జిలే
రిప్లయితొలగించండిబిను మరి పాల కాయలను వేడిగ గారెలు బూరెలన్నియున్
ఘనమున కూర్చి వేద్యులను గాదిలి పిల్చెడి వేళలందు భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( జిలేబి, పేరును , అనుమతి లేకుండా, వాడుకున్నందుకు, జిలేబీ గారికి క్షమాపణలు)
కుండనందువుంచికూలికివెళ్ళగా
రిప్లయితొలగించండికూడువండిభార్య వేడిగాను
వచ్చిజూడ నిశ కవాటము తెరువ భో
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
ప్రజనము కల్గెనన్చు తగ బాంధవు లెల్లరు గూడి వేడ్క మ
రిప్లయితొలగించండిజ్జనమును సేయువేళ బహు సందడి సేయుచు నవ్యరీతి భో
జనమును వండివార్చ నట చంగపు పప్పుకు పోపువేయ గృం
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వగన్
ప్రజనము = తొలిచూలు, చంగము = బహు చక్కని,
గృంజనము = వెల్లుల్లి
మీ పూరణ బాగున్నది. కాని, మొదటి పాదంలో ప్రాసభంగం జరిగినది. సరిచేయగలరు.
తొలగించండిఘనముగ పెండ్లి వేడుకల కమ్మని వంటలొనర్చి ప్రీతితో
రిప్లయితొలగించండివనమున చేరి యాటలను పాటల తోడచెరించి, క్షుత్తుతో
కొనుటకు పోయి చూడగను క్షోణిజపున్ దరి నుంచి నట్టి భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
పండుగ యని యింట పలు భక్ష్యములు చేసి
రిప్లయితొలగించండిసంబరమ్ము తోడ చక్క గాను
బంధు జనుల కూడి భాషించు చుండ వ్యం
జనము నెల్ల మింగె శ్వాన మొకటి
ఎటుల జూచెనేమొ యెటనుండి వచ్చెనో
రిప్లయితొలగించండిక్షణము లోన జరిగె సరిత!కంటె?
తినుట కొఱకు నిన్న తేబడినట్టిభో
జనమునెల్లమ్రింగె శ్వాన మొకటి
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[పదివేవుఱు కన్యకామణులను చెఱఁబెట్టిన నరకుని యాగడములు]
ఘనకిటికిన్ వసుంధరకుఁ గాదిలి పట్టిగఁ బుట్టి, దుష్టుఁడై
న నరక నామ కుర్కురము, న్యాయముఁ గొంకును లేక, యందఱన్
వినయము వీడి, కష్టములఁ బెట్టెఁ గదా! పదివేల కన్యకా
జనమును మ్రింగివేసినది శ్వానము, సూచినవార లేడ్వఁగన్!!
[మ్రింగు = చెఱఁబెట్టు]
వినుముర రాజశేఖరుడ!వేజని దెచ్చిన మంచిదైన భో
రిప్లయితొలగించండిజనమునుమ్రింగి వేసినది శ్వానము సూచినవారలేడ్వగన్
కనగను బోధరాదెటుల గారణమయ్యెనొ? నెట్లయాయెనో
పనిగొని జూచు చుండెనెమొ శ్వానము బ్రక్కననక్కి యయ్యెడన్
పర్వదినమునాడు బందుగులకొరకు
రిప్లయితొలగించండివంటగదిని చేరి వంటజేసి
కబురులాడుచుండ కన్నులుగప్పి భో
జనమునెల్ల మ్రింగె శ్వానమొకటి
ఘనముగ పిండివంటల నుగాది దినంబున జేసి యెల్లరున్
రిప్లయితొలగించండిపనులనుమాని తీరికగ వాకిట గూర్చుని మాటలందునన్
మునిగినవేళ నెమ్మదిగ మూలల నక్కుచు మోహరించి భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
ముప్పు లెప్పగిదినిఁ జొప్పడుఁ జెప్పంగ
రిప్లయితొలగించండినెప్పు డైన నెట్టు లొప్పుఁ జెప్పు
కొమ్మ పైన జాఱి కూల నేలపయి నం
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి
[అంజనము = ఒక రకపు బల్లి]
చని చని యెవ్వరుం గనని చందము దూఱి సజాతి పంక్తితో
ఘనముగ వండి యుంచగను గమ్మని వాసన లింపు గొల్పఁగాఁ
దనర వివాహ మంటపము దగ్గరఁ బందిరి లోన విందు భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచిన వార లేడ్వఁగన్
ధనమును బంచి ఓట్లు కొని దంభపు రీతుల నెట్టకేలకా
రిప్లయితొలగించండికనకపు గద్దెనెక్కి అధికారము చేతికి చిక్కినంతనే
జనులకు మేలు మాని దన సంపద పెంపును గోరి సత్ప్రయో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచినవార లేడ్వఁగన్
ఖననము చేయ,చూచె ఋషి కాలెడు కాష్టములన్, కరోనచే
రిప్లయితొలగించండిమననము చేసి మంత్రమును మార్చెను కుక్కను చాల పెద్దగా
తనరుగ మాస్కు లేకజను తామసులన్ తిని చంప నింపుగా
జనమును మ్రింగి వేసినది శ్వానము సూచినవార లేడ్వగన్