2, ఏప్రిల్ 2021, శుక్రవారం

సమస్య - 3681

3-4-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఈసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు”
(లేదా...)
“ఈర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా”


 

39 కామెంట్‌లు:

 1. మిత్రులందఱకు నమస్సులు!

  కార్ష్యచ్ఛాయను జేరి తాపసులు దీక్షాదక్షులై పూజ్య స
  ప్తర్ష్యామోదము నంది ధన్యజనులై ప్రాగ్జన్యసత్పుణ్యులై
  యార్ష్యోద్దీపిత సత్కృతమ్ములనహో యార్జింత్రు! నిశ్శేషమౌ

  నీర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా!

  రిప్లయితొలగించండి
 2. మోసము నెరుగ డతిథుల కాసరాయ
  గు విధి వంచితకోటికి గూడుగూడు
  గుడ్డలిడు వదాన్యుడు పాపగుణమటన్న
  నీసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  విద్యపరమోన్నతంబైన విత్తమనగ
  స్పర్ధ వలయును విద్యార్థి సంఘమందు
  నొకరొకరి మించి పొంద నుపకరణంబె
  యీసు, గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శార్దూలవిక్రీడితము
   హర్ష్యాదుల్ మునులన్న లేని హరి ద్రోహంబెంచి కల్పించినన్
   స్పర్ష్యాదుల్ గొని మేనకాప్సరసతో సంయోగ నాశాన రా
   జర్ష్యాళిన్ దగ మించెఁ గౌశికుఁడహో స్పర్ధించి బ్రహ్మర్షియై
   యీర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా!

   తొలగించండి
 4. పరుల కపకార మొనరించి బాధ పెట్టి
  క్రూర కృత్యాల నొనరించు నేర పరుల
  మార్చ యత్నించి సతతమ్ము మాన్యు లగుచు
  నీసు గల్గు నరుల మెచ్ఛు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
 5. బ్రహ్మరచనలోనిబహుచిత్రమంతయు
  తెలిసిమానవుండుతేటపడుచు
  స్పర్ధపెంచితానుసాగెగాశోధింప
  ఈసుగలుగునరులమెచ్చునీశ్వరుండు

  రిప్లయితొలగించండి

 6. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  ఈర్ష్యల్ మీరుచు యూదులన్ కనగనున్ హృద్దేశమే మండగన్
  పోర్ష్యావంటిది జడ్జి మిమ్ములగనన్ ప్రోత్సాహమున్ జేయదే!👇
  పర్ష్యన్ దేశపు పుత్రులార! విడగన్ పాపమ్ములౌ నిట్టివౌ
  నీర్ష్యాద్వేషములున్న; మానవులనే యీశుండు మెచ్చుం గదా!

  రిప్లయితొలగించండి
 7. మూడు కనుల వాని కనుల మ్రోగె రుధిర

  నాదము కనుల మందు కన్ననచు బోయ

  కన్నడు కనులనిచ్చెను కాంచి వాని

  ఈసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 8. ఈర్ష్యాద్వేషముల విడువు
  మీర్ష్యాద్వేషముల వలన నేర్పడు స్పర్ధల్
  హర్ష్యాదుల్ దొలగు నెటుల
  నీర్ష్యాళువులైన నరుల నీశుడు మెచ్చున్ ?

  రిప్లయితొలగించండి
 9. దీక్షలను జేసి మోక్షంపు దెసను బోవు
  జనులు కొందరు కఠినమౌ జపము చేసి
  శిష్ట శిరియాళు కథ విని సిగ్గు పడిన
  ఈసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు.

  రిప్లయితొలగించండి
 10. శశభూషణ సిద్ధాంతి, శ్రీ కొలను భారతి పంచాంగకర్త, నంద్యాల‌.

  శార్దూలము.

  పౌర్ష్యేయాన్విత జ్ఞాన సారసభవంబౌ శా‌స్త్ర వాక్యార్థ మౌ
  త్కర్ష్యంబున్ నిరతంబు తాలిమిని సంధానించి సత్యార్థమౌ
  హర్ష్యాదుల్ విడనాడకుండ ఘన మోహావేశముల్ వీడ నీ
  యీర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా

  పౌర్ష్యేయము = వేదము
  ఔత్కర్ష్యము = గొప్పదనము

  రిప్లయితొలగించండి


 11. వ్యర్థ జీవితమని సదా బాధపడెడు
  ఈసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు?
  యెప్పటికి కుదరనిమాట యిది జిలేబి!
  ప్రాణశక్తి వాడిచ్చిన పట్టుగొమ్మ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. ఎదుటివాని యున్నతి గాంచి యీర్ష్యపడుట
  మనుజ సహజ మదిమనను మార్పుజేసి
  వాని మించగ యత్నము పన్నినపుడె
  ఈసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
 13. శ్రీ గురుభ్యోనమః

  జన్మమయ్యది యేటికి సాధనంబు!
  రావణా బ్రహ్మ నిను గొల్చి రాణనొప్పె;
  వాని నెదిరిన యనుజుడు వరమునొందె
  నీసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు!

  రిప్లయితొలగించండి
 14. శీర్ష్యమ్మున్కదలాడు గంగగల కాశీ విశ్వనాధున్ గనిన్

  ఈర్ష్యన్జెందదు అన్న పూర్ణ మధురంబీ దర్శనంబన్చు , తా

  ఈర్ష్యన్జెందును భక్త పుంగవులు నాకేదయ్య భాగ్యంబనున్

  ఈర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 15. ఈర్ష్యాదుల్ సదసద్వివేక గుణమున్నేమార్చి ముంచేయవే!
  ఈర్ష్యాసూయలు సందడించ నరుడే యిద్ధారుణింగూలు, నౌ
  త్కర్ష్యమ్మున్మదినెంచగోర సతమున్ దానింక నిశ్శేషమౌ
  నీర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా.

  రిప్లయితొలగించండి
 16. ఆర్ష్యోక్తుల్ విని శత్రువర్గములనే యత్నించి గెల్వంగ నౌ
  త్కర్ష్యంబౌ గద మర్త్యకోటికిలలో క్రౌర్యంబు వీడంగ బ్ర
  హ్మర్ష్యౌచిత్య పదంబు నిల్చి గెలువన్ మర్దింపబడ్డట్టివౌ
  యీర్ష్యాద్వేషములున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా

  రిప్లయితొలగించండి
 17. ఎరుగుమోయి సత్యమనుగ్రహింపజాల
  డీసు గల్గునరుల, మెచ్చు నీశ్వరుండు
  దీనజనుల సేవించెడు దీక్ష గలుగు
  సత్ప్రవర్తన గలిగిన జనుల సుమ్మి.


  ఆర్ష్యోద్దీపిత ప్రాంతమియ్యదియె మోక్షార్థుండ్రకున్ నాడు స
  ప్తర్ష్యాదుల్ వచియించిరే, హరుడనుద్యానమ్ము నే చూపడా
  యీర్ష్యాద్వేశము లున్న, మానవులనే యీశుండు మెచ్చుం గదా
  యీర్ష్యాసూయల వీడు వారలనె ప్రత్యేకమ్ముగా బ్రోవగన్

  రిప్లయితొలగించండి
 18. పరుల కీడును దలపెట్టు వానిగాంచి
  దైవదూషణ జేయుమానవుని జూడ
  నెయ్యమును మోసగించెడునయ్య యెడల
  నీశు గల్గునరుల మెచ్చు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
 19. శీర్ష్యానేకములౌవిధంబులనుతాసేవింపశంభున్మదిన్
  ఈర్ష్యాసూయలయోగులన్నిలిపితానీడేరిమోక్షంబునన్
  కార్ష్యంబైచలనంబులేకహ్రుదిసాకల్యంబుసద్భావుడై
  ఈర్ష్యాద్వేషములున్నమానవులనేయీశుండుమెచ్చున్గదా

  రిప్లయితొలగించండి
 20. ఈర్ష్యాద్వేషపు ద్వంద్వముల్ నరులలో హెచ్చెన్ మహోత్కృష్టమౌ
  హర్ష్యాదుల్ తొలగందొడంగె నొకలోహంబంటి దేహంబుతో
  నీర్ష్యా మంత్రము తాజపించుచు దయాహీనంబుగా వర్తిలన్
  యీర్ష్యాద్వేషములున్న మానవుల నేయీశుండు మెచ్చుం గదా?

  రిప్లయితొలగించండి
 21. ఈశునర్చింప దీర్చు తానీప్సితములు
  మోక్ష గామియై లోభము మోహములను
  వదలి మదియందు నైహిక వాంఛలయెడ
  నీసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
 22. ఆస్తిక జనుల వర్ధిల్లు నవని యెల్ల
  సంతతమ్ము పరిఢవిల్ల సంతసమ్ము
  నాస్తికులు దురిత జనులు నడవఁ గాంచ
  నీసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు


  ఆర్ష్యప్రోక్త గుణమ్ము సూప కనునిత్యం బుండ భాసిల్ల ని
  ష్కర్ష్యా భాషణ సంయుతమ్ము నిలఁ బ్రాశస్త్యమ్ము తోడన్ నిజో
  త్కర్ష్యాలాపము లెన్నఁడుం బలుకకే ధాత్రిన్ విరాజిల్ల వీ
  తేర్ష్యాద్వేషము లున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా

  [ఆర్ష్యప్రోక్తము = దూలగొండి; నిష్కర్ష్యము = నిజమునకు సంబంధించిన; నిజోత్కర్ష్యము = ఆత్మశ్లాఘమునకు సంబంధించిన]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వీత అన్న చిన్న పదంతో బాగా వ్రాశారండీ. నాకు జిత, నిర్జిత తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. అవి గణాలకు లొంగవు కాబట్టి ఇంక సమాస ప్రక్రియ మాని పూరించవలసి వచ్చింది.

   తొలగించండి
  2. వీత అన్న చిన్న పదంతో బాగా వ్రాశారండీ. నాకు జిత, నిర్జిత తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. అవి గణాలకు లొంగవు కాబట్టి ఇంక సమాస ప్రక్రియ మాని పూరించవలసి వచ్చింది.

   తొలగించండి
  3. వీత అన్న చిన్న పదంతో బాగా వ్రాశారండీ. నాకు జిత, నిర్జిత తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. అవి గణాలకు లొంగవు కాబట్టి ఇంక సమాస ప్రక్రియ మాని పూరించవలసి వచ్చింది.

   తొలగించండి
  4. వీత అన్న చిన్న పదంతో బాగా వ్రాశారండీ. నాకు జిత, నిర్జిత తప్ప ఇంకొక ఆలోచన రాలేదు. అవి గణాలకు లొంగవు కాబట్టి ఇంక సమాస ప్రక్రియ మాని పూరించవలసి వచ్చింది.

   తొలగించండి
  5. సవరణములతో:

   ఆర్ష్యప్రోక్త గుణమ్ము సూప కనునిత్యం బుండ భాసిల్ల నై
   ష్కర్ష్యా భాషణ సంయుతమ్ము నిలఁ బ్రాశస్త్యమ్ము తోడన్ నిజౌ
   త్కర్ష్యాలాపము లెన్నఁడుం బలుకకే ధాత్రిన్ విరాజిల్ల వీ
   తేర్ష్యాద్వేషము లున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా

   [ఆర్ష్యప్రోక్తము = దూలగొండి; నైష్కర్ష్యము = నిష్కర్షమునకు(నిజమునకు) సంబంధించిన; నిజౌత్కర్ష్యము = ఆత్మ శ్లాఘమునకు సంబంధించిన]

   తొలగించండి
 23. దోసమౌను మెచ్చ దెలిసి తుచ్ఛులనుచు
  నీసు గల్గు నరుల; మెచ్చు నీశ్వరుండు
  లేశమైన నీసు నసూయ లేక దనకు
  దాసులై మను మనుజుల తథ్యమెపుడు

  రిప్లయితొలగించండి
 24. ఈర్ష్యాద్వేషములున్న మానవుల నీవెన్నంగ రాదెన్నడున్
  ఈర్ష్యాద్వేషములున్న వారలు సదా హీనాత్ములై మెత్తురే
  ఈర్ష్యాద్వేషములున్న మానవులనే; యీశుండు మెచ్చుం గదా
  ఈర్ష్యాద్వేషము లేని మానవుల దానెన్నండు దోడౌనుగా

  రిప్లయితొలగించండి
 25. ఆర్ష్యుష్టిక్కులయందు నగ్రజుడుగా నైనన్సు శిక్షించుగా
  నీర్ష్యాద్వేషములున్న మానవులనేయీశుండు,మెచ్చుంగదా
  నీర్ష్యాద్వేషములొందకుండగను దానేభ్రాతగాగాచునే
  కార్ష్యంబండినదైన నాఫలమునే గర్హీంచు మార్గంబునన్

  రిప్లయితొలగించండి
 26. అక్ర మార్కులు సంపద లనుదినంబు
  బెంచుకొనుచుండ్రి వంచించి పేదజనుల
  భాగ్య హీనులు ధనికుల బ్రతుకు జూసి
  యీసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు

  రిప్లయితొలగించండి
 27. ఈర్ష్యా ద్వేషము లేని మానవ ఘనుల్ ఏరీ జగంబందునన్
  ఈర్ష్యాద్వేషమె ప్రోత్సహించు కవి‌తన్ ఈ రీతిగా ఈర్ష్యతో
  ఈర్ష్యన్ వాడుట చేత వ్రాయ, గురువే ఈర్ష్యనుపేక్షించ స
  ద్యీర్ష్యాద్వేషము లున్న మానవులనే నీశుండు మెచ్చుం గదా!

  రిప్లయితొలగించండి
 28. కన సొంపగు పద ప్రతిమలు
  కనిపించును తెనుగున,విన కమనీయం బై
  అనిపించు హాయి చెవులకు
  మన పద్యమ్ముల భఠించి మాన్యత గనరే

  ఆదివారం, ఏప్రిల్ 04, 2021 9:37:31 AM

  రిప్లయితొలగించండి