8, ఏప్రిల్ 2021, గురువారం

సమస్య - 3687

9-4-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్”

(లేదా...)

“తేలును ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్”

54 కామెంట్‌లు:

 1. ఆలిగనన్నిసపర్యలు
  జాలిగదీనులకునొసగుజక్కనియన్నం
  బేలగగీమున నా కుం
  దేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁదగున్

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  జాలిగ కోపమున్ విడిచి చక్కగ నవ్వుచు నాథునిన్ గనన్
  పూలను దాల్చుచున్ జడను పొంకము మీరగ కౌగిలించుచున్
  మేలుగ పచ్చ రూపమున మెల్లగ గాంచుచు ఛాతి మీదదౌ
  తేలును ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్

  పచ్చ = tattoo

  రిప్లయితొలగించండి
 3. బేలగ నుండక సతిగా
  మేలొన రించుచు ను దాను మిన్నగ సతమున్
  తాలిమి పతి సేవలలో
  తేలును ముద్దాడిన పడతిన్ మెచ్చ దగున్

  రిప్లయితొలగించండి
 4. కాలుని బంటై వచ్చెను

  కాలము తీరినదియన్చు కామము తోడన్

  జాలిని చూపదు దీక్షన్

  తేలును , ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 5. క్రాలినదౌర్బల్యంబున
  చాలగదుర్భాషలాడజంకనిపతినిన్
  మేలనిసుమతియునోర్చెను
  తేలునుముద్దాడెడిపతిన్మెచ్చదగున్

  రిప్లయితొలగించండి
 6. తాళిని కట్టిన వాడొక
  బాలిశుడని యెఱగి కూడ పతి యన్నను తా
  మాలిమి చూపగ నొకడనె
  తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్.


  తాళిని కట్టినట్టి పతి ద్రాబ దురాత్ముడు పోల్చి చూడగన్
  వాలము నందు హాహలము వాసిగ గల్గిన చీటకమ్మె యౌ
  తేలును బోలనేమి తియతీపిని జూపగ గాంచి వాడనెన్
  తేలును ముద్దులాడు బడతింగని మెచ్చఁ దగున్ ముదమ్మునన్.

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. నీలపు బొగ్గుల మాటున
   దేలికగా దాగికొనగ, తేకువమీరన్
   బాలుని రక్షింప నడచి
   తేలును, ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్

   తొలగించండి
  2. బాలల పెద్దలన్ గరచి బాధలబెట్టగ వృశ్చికమ్ములే
   చాలిక నౌషధంబులను చక్కగగల్ప నివారణార్ధమై
   ఆళుల ఘాటుకాటులకు, నల్లన బెంచుచు దీయ క్ష్వేడమున్
   తేలును ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ ముదంబునన్

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
 8. సమస్య :

  తేలును ముద్దులాడు బడ
  తిం గని మెచ్చదగున్ ముదమ్మునన్

  ( చెలి చిత్రరేఖ నిద్రిస్తున్న అనిరుద్ధుని కొనిరాగా ఉషాకన్యక ఆనందం )

  ఉత్పలమాల
  .....................

  " పూలను బాణపంక్తులుగ
  బొంగుచు వైచు ననంగు పుత్రుడా !
  సోలుచు నిద్రవోవు కడు
  సొంపుల సుందరదేహు డీతనిన్
  జేలము వీచి సేవలను
  జేసెద " నంచును సంతసంబునన్
  దేలును ; ముద్దులాడు ; బడ
  తిం గని మెచ్చదగున్ ముదమ్మునన్ .

  రిప్లయితొలగించండి
 9. హేలను జూపిన బయటకు
  తేలును ; ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్ ,
  కీలకము తేలకుండగ
  మాలిమి జూపెను సుళువుగ మందికి బొంకన్

  రిప్లయితొలగించండి
 10. కీలాలము పై తైలము,

  గోలను చేయు బుడతలను, కూరిమి తోడన్

  లాలన మొనర్చచు నపుడు

  తేలును,ముద్దాడెడి పడతిని‌ మెచ్చ దగున్


  కీలాలము జలము

  రిప్లయితొలగించండి


 11. చాలని పతియో యెలమిని
  తేలును! ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్
  మేలని మరింత గా క
  ల్లోలము లో తనను కౌగిలుకొన జిలేబీ !


  రామరామ!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 12. అదటున మెలపున పతి సం
  బడు తేలును! ముద్దులాడు బడతిం గని మె
  చ్చఁ దగున్ ముదమ్మునన్ పై
  యెద విడిచి విడువక తనను యెలమిని తేల్చన్


  కృష్ణ కృష్ణ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   హర హరా! ద-డ ప్రాస ?

   తొలగించండి


  2. అదటున మెలపున పతి ని
   బ్బది తేలును! ముద్దులాడు బడతిం గని మె
   చ్చఁ దగున్ ముదమ్మునన్ పై
   యెద విడిచి విడువక తనను యెలమిని తేల్చన్


   :)

   కృష్ణ కృష్ణ!

   జిలేబి

   తొలగించండి
 13. రిప్లయిలు
  1. మాలను గట్టి ముచ్చటగ మల్లెల తోడను విష్ణుచిత్తుఁ గో
   దా లలితాంగి కొప్పునను దాల్చి రమాహృదయాంతరంగ ప్రేం
   ఖోలిత మూర్తినిం దలచి గోముగ చుంబన మిచ్చి యూహలం
   దేలును ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్

   తొలగించండి
 14. కూలిరి రాక్షసాధములు కోరిక విష్ణుడు జన్మలెత్తగన్

  వాలిరి నేతలై భువిని వందలు వేయిలునెందరెందరో

  జాలిగ కన్న బిడ్డలని సైచెను ధాత్రియె వృశ్చికమ్ములన్

  తేలును ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి


 15. చాలని చాలదంచు భళి చాలమి తో పతి రాధనమ్ములో
  తేలును! ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్
  చాలదు చాలదంచు పరి చారికయై పతి సంగమమ్ములో
  తేలగ మేలటంచు సరి దీనికి సాటి విమోహమెచ్చటే!


  నారద సంసారం :)
  నారద! Some సారః :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. కందం
  మేలుగన మందరన్ దా
  బేలుగ నిలుపఁగ సుధాబ్ధి విష్ణువు కృపతో
  శ్రీలక్ష్మిగబుట్టుచు స
  త్తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్

  ఉత్పలమాల
  తేలక మున్గు మందరను తేల్చఁగ విష్ణువు సంద్రమందు తా
  బేలుగ, దేవదానవులు పేరిమి జిల్కగ నుద్భవించుచున్
  శ్రీలకు మూలమౌ జనని శ్రీహరి గోరఁగ భార్యయౌచు స
  త్తేలును ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్

  (సత్యనారాయణుడె సత్యాలు, సత్తేలు)

  రిప్లయితొలగించండి
 17. కాలునిరూపము తనపతి
  బాలుర సంతోషమరసి బాధలు పడుచున్
  కాలముగడుపుచు నిడుముల
  దేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్

  రిప్లయితొలగించండి
 18. మేలిమి బంగారముతో
  మేలుగ నొక శశము రూపు మెలతకు నిడగా
  దేలుచు ముదముననా కుం
  దేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మేలిమి బంగారముతో
   మేలుగ దన జన్మ రాశి మెండెమునిడగా
   దేలుచు సంతోషంబున
   తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్

   తొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  శ్రీకృష్ణుని ఆత్మగతమ్..

  వాలును నా భుజమ్ముపయి., వాల్గనులన్ గురిపించు బ్రేమ., చే..
  వ్రాలును వ్రాయు బుగ్గపయి.,బాసలు తేనెల సోనలౌనటున్
  గ్రాలును రాధికారమణి.,రమ్యసుఖాల జలాశయమ్ములో
  తేలును, ముద్దులాడు., బడతింగని మెచ్చఁ దగున్ ముదమ్మునన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 20. కాలుని గెలిచిన దగుటన
  తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్
  మేలములాడుచు నుంటివె?
  బాలిక! యికజెప్పకిటుల బరిహాసముగా

  రిప్లయితొలగించండి
 21. ఉ:

  గాలిని తెలియాడుచును గమ్యము గొట్టగ నెంతమాత్రమున్
  జాలిని చూపకుండగను శత్రువు గుండెలు దద్దరిల్లగన్
  కూలగ జేసి; భారతము గొప్పను నిల్పగ యుద్ధ కేళిలో
  తేలును, ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ ముదమ్మునన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 22. ఆలినిబిడ్డలన్విడచియాదరమోప్పగవేశ్యముంగిటన్
  వాలుచుముద్దుగన్మధురవాణినిపంతులుగేలిసేయగా
  కాలినమానసంబుననుకాంతయుకోపముకాననీకయా
  తేలునుముద్దులాడుబడతింగనిమెచ్చదగున్ముదంబునన్

  రిప్లయితొలగించండి
 23. తేలును ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ముదమ్మునన్
  బాలక! యేమినీపలుకుభావ్యమె నీకిది?ముద్దులాడుటల్
  మేలము లాడగన్ సమయమేయిది కుట్టునుగాపుటుక్కునన్
  కాలము వమ్ముగాగనక గాలుని పూజను జేయుమెప్పుడున్

  రిప్లయితొలగించండి
 24. కాలానుగుణమ్ముగ నో
  లోలాక్షీ ముద్దు లిడ నరుగుమ సరసకున్
  లీలగఁ బతినిఁ జిలుక రౌ
  తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్

  [చిలుక రౌతు + ఏలును; చిలుక రౌతు = మన్మథుఁడు]


  లాలన హేలఁ జేరి దరి రాగ విలోకన సాయ కాలినిన్
  లీల రసాల సాల సుపరీవృత నందన మందు నింపుగాఁ
  గాలము కాదు నా ననక కాంతుని ముద్దిడ హర్ష వారిధిం
  దేలును, ముద్దులాడు పడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్

  రిప్లయితొలగించండి
 25. ఆలును బిడ్డలన్ మరచి యన్య నెలంతుకలందు గ్రాలుచున్
  కాలము వెళ్ళబుచ్చుతన కాంతుని వీడక పన్నిదంబుగన్
  బాలల భావిజీవనము బాధ్యతగాగొని కార్యదీక్షతో
  తేలును ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్

  రిప్లయితొలగించండి