23, ఏప్రిల్ 2021, శుక్రవారం

సమస్య - 3702

24-4-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోడలా నా పతిని నేఁడు గూడవలెను”
(లేదా...)
“కోడల నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్”

65 కామెంట్‌లు:

  1. ఒక ఇల్లాలి వేడుకోలు...

    తేటగీతి
    మొదటి నవధానమున్ జేయ మదిని నమ్మి
    వాగ్విభవమున నలరించు బ్రహ్మసతిగ
    మాత దిక్కీవె నని మ్రొక్క మాధవునకుఁ
    గోడలా నా పతిని నేఁడు గూడవలెను

    ఉత్పలమాల
    కూడితి వమ్మగా సుతునిఁ గొల్వున నిల్పితి గూర్చివిద్యలన్
    బాడుచు మాత నీవనుచు వాగ్విభవమ్మవధానమందునన్
    వేడుక గూర్చ తొందొలుత వేదిక నెక్కఁగ నెంచ శౌరికిన్
    గోడల నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "దిక్కీవె యని"
      రెండవ పూరణలో "తొల్దొలుత"

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాణి దరినుండి మాటాడు పైడినెలత
    శివుని దర్శించి వచ్చెను చెల్వుడనుచు
    కోడలా! నాపతిని నేడు గూడవలెను
    ననుచు సత్యపురమునకు నరిగె వడిగ.

    రిప్లయితొలగించండి
  3. సమస్య :

    కోడల నా సుతున్ విడిచి
    కూడగ నొప్పును నేడు నా పతిన్

    ( సైన్యంలో పనిచేస్తున్న భర్త చిరకాలానికి ఇంటికి వస్తే అప్పటివరకు తన ఏకైకకుమారుణ్ణీ , కోడలినీ చూసుకొంటున్న అత్త పలుకులు )

    ఉత్పలమాల
    ..................

    నేడిదె నాదు భాగ్యమది
    నిండుగ పండెను ; వచ్చినారులే
    వేడుక మీర మామయయె ;
    వెన్నెల యైనది జీవితమ్మికన్ ;
    గూడల మీద మోసితిని
    కూరుకు లేని విధమ్ముగా ; నొహో
    కోడల ! నా సుతున్ విడిచి
    కూడగ నొప్పును నేడు నా పతిన్ .

    రిప్లయితొలగించండి

  4. ధనము నార్జింప దలచుచు తా విదేశ
    మేగె నైదేండ్ల క్రిందటే యిప్పు డతడు
    స్వగృహ మున్ జేరె గద గారవమున నేను
    కోడలా! నాపతిని నేఁడు గూడవలెను.



    వాడొక కోపగొండియును బాలిశు డైన సహించు పోకుమా
    కోడల నా సుతున్ విడిచి, కూడగ నొప్పును నేఁడు నా పతిన్
    మూడు యుగాంశకమ్ములకు పూర్వమె గేహము వీడె, వాడిదౌ
    జాడయె తెల్సెనేడు కద చయ్యన బోయి గృహంబు తెచ్చెదన్.

    రిప్లయితొలగించండి
  5. పట్నంలో కొడుకు ఇంటికి వచ్చిన అత్తగారు కోడలితో

    తోడుగ నీడగా నిలచి తోషము దుఃఖము నన్నివేళల
    న్నేడుగడై ననున్ సతము నింటికి రాణిగ గారవించగా
    నేడుపదుల్ వయస్సునను నేర్పడ నాదగు తోడుపాటు నో
    కోడల! నాసుతున్ విడచి గూడగ నొప్పును నేడు నాపతిన్

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    మేడ పయిన్ సుతుండు, రుజ మేనికిఁ గల్గఁగఁ, దల్లి చూచియున్,
    దోడుగ నుండి, కొంత వడిఁ, దుంటరి భర్తయె పిల్వ, నిట్లనెన్;
    "వీడఁగలేఁడు నన్ మగఁడు! ప్రేమగ సూనునిఁ జూడు మిప్పు డో
    కోడల! నా సుతున్ విడిచి, కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్!"

    రిప్లయితొలగించండి
  7. కనగకాళిదాసునిభార్యకాంతుకోఱకు
    వినయశీలిగశ్యామలన్వేడికోనియె
    కరముపరబ్రహ్మరూపుగాకాంచివిష్ణు
    కోడలానాపతినినేడుగూడవలెను

    రిప్లయితొలగించండి
  8. దారుణ దరిద్ర శోకము తల్లడిల్లి

    సోలి చేరెను హరిని యశోదమాత

    కోడలా నా పతిని నేఁడు గూడవలెను

    నీ దయామృత దృక్కులు నీరజాక్షి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. స్వంత దేశమ్ము వచ్చె డి పతిని గూర్చి
    వార్త తెలిసిన భార్య తా పలికె నిట్లు
    కోడలా నాపతిని నేడు గూడ వలెన
    టంచు సిగ్గు దొంతరల తో ననుచు వెడలె

    రిప్లయితొలగించండి
  10. నాన్న, కొమరుండు ఆకరోనాను బడగ
    మాస్కు వేసుకు మొదటను మగని సేవ
    చేసినట్టి కోడలికిట్లు చెప్పె అత్త
    కోడలా నా పతిని నేడు కూడవలెను.

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేడుకతోడ జూచితిని వేధను నిన్నును సంతసమ్మునన్
    మూడవకంటివేల్పు గని మోదన మొందుచు వచ్చె శౌరియున్
    కోడల! నా సుతున్ విడిచి కూడగ నొప్పును నేడు నాపతిన్
    వీడను నింక నేననుచు వెళ్ళెను లక్ష్మియె భర్తచెంతకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెళ్ళెను' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  12. మఱొక పూరణము:

    వేడుక నుండి పాల్కడలిఁ బ్రేమను విష్ణుని సేవ సేయుచున్,
    జూడఁగఁ బోయి యిందిరయె, సూనుని బ్రహ్మనుఁ, గాంచి, సత్కృతుల్
    గాఢత నొంది, తుష్టిఁ గొని, కాంతుఁడు జ్ఞప్తికి రాఁగ, వెంటనే
    వీడుచుఁ, జెంతనుండి తనివిం గొనఁ గొల్చెడు వాణి కిట్లనెన్
    "గోడల! నా సుతున్ విడిచి, కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్!"

    రిప్లయితొలగించండి
  13. కె.వి.యస్. లక్ష్మి:

    దేశ రక్షణ భారపు దీక్ష బూని
    ధీరుడై వెడలె రణభూమి దీటు గాను
    విజయుడై వచ్చె నిపుడిటు వీర సుతుడు
    కోడలా! నా పతిని నేడు కూడవలెను.

    రిప్లయితొలగించండి
  14. కోవిడువలన రోగుల గుణములను గు
    రించి నా సతుని కెరుక లేదు , గాన
    కోడలా ! నాపతిని నేఁడుగూడవలెను
    దీనిగూర్చి నాతడొకడె తెలుపగలడు

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. వీడక వెంట నుండగను వేగమె నీకగు నూత్న వేడుకల్
      వేడిన యన్ని కోర్కెలును వేసట లేకయె తీర్చు మామ యీ
      నాడిక పుట్టితీవు సరి నాలవ పండుగ నీకు యియ్యెడన్
      కోడల ! నా సుతున్ విడిచి కూడగ నొప్పును నేడు నా పతిన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నీకు నియ్యెడన్" అనండి.

      తొలగించండి
  16. అత్త....కోడలితో....

    నేడు కూడను వంటను చూడుమమ్మ!
    కోడలా! నా పతిని నేఁడు గూడ, వలెను
    వలెననంచును వైద్యుడు కలువ గోరె,
    పోవు చుంటిమి, జాగగు, నీవు తినుము!

    రిప్లయితొలగించండి
  17. ఉ:

    చూడగ రమ్మనంచు తొలి చూలు జనించిన పట్టి పట్టినిన్
    వేడుచు తోడు గూడు మని వేగమె గూర్చ విదేశయానమున్
    వీడగ లేననెన్ మగని, వేతమిగుల్చగ నొంటి వాడిగన్
    కోడల, నాసుతున్ విడచి కూడగ నొప్పును నేడు నాపతిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. వచ్చితిని ఓంటిగనునేను వదిలిపతిని
    చూడవలెమనుమడినని, చురుకుగాను
    పండుగదినములుగడిచె, పయనమవుదు
    కోడలా!, నా పతిని నేఁడు గూడవలెను

    రిప్లయితొలగించండి
  19. నాడు విలాతిరక్షణయె నాయమటంచు తలంచి నందునన్
    వీడెనునన్ను నామగడు వెల్లువ నందున జేర వెళ్ళెనే
    నేడు సమిత్తు పూర్తవగ నేరుగ నింటికి వచ్చి యుండగా
    కోడల ! నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్

    రిప్లయితొలగించండి
  20. అడగ వచ్చె బావకడ, అత్తను చూసిన వెంటనే అనెన్
    చూడగ ఏమి? ఈ దినము సొంపుగ వుంటివటంచు కొంటెగా
    వేడుక మామ జన్మ తిధి వెళ్ళకు! ఆడుము ఈ దినంబునన్
    కోడల నా సుతుని విడిచి, కూడగ నొప్పు ను నేడు నా పతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సొంపున నుంటివటంచు... వీడక..." అనండి (వెళ్ళక అనడం వ్యావహారికం)

      తొలగించండి
  21. నాడటదైవవర్గముననామములన్నియుబీచుబీచుగన్
    మూడునునాల్గుమార్గములముచ్చటలాడగలక్ష్మిదేవిఁదా
    వేడెనుగంగమాతననవియ్యమునొందుచుదల్లిదల్లియై
    "కోడల నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్”

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  22. పాడెను కూడి యింతి తన భర్త శవంబున జేరియిట్లనెన్
    నేడిక సాగుమానమున నే తరియించెద భాగ్యశాలినై
    తోడుగ నిల్చి పుత్రునికి దుఃఖము బాపుచు శాంతిగూర్చవే
    కోడల! నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్

    రిప్లయితొలగించండి

  23. ( సూర్యుని భార్య ఛాయా దేవి, కొడుకు శని భార్య జేష్టా దేవితో)


    వీడవు దారుణమ్మయెడి వీర విహారము ఘోర బాధలన్

    వీడక పట్టి పీడనను వీధుల త్రిప్పును మందుడక్కటా

    కోడల నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్

    చూడగ మంచి సేయునట చూచితి జాతక రీతి ఛాయగన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  24. శ్రీ గురుభ్యోనమః
    అందరికీ నమస్సులు 🙏

    తే.గీ.
    దినము విడువని తన పతిదేవుని విడి,
    కొత్త కాపురంబును గూర్చ కొడుకు కడకు
    నరిగి, పూర్ణత నొందిన నామె పలికె
    కోడలా, నా పతిని నేఁడు గూడవలెను!

    రిప్లయితొలగించండి
  25. వేడుకగా వసించితిట పెద్దకుమారుని పైన ప్రేమతో
    తోడుగ నీదుబిడ్డలకు, తొందర పెట్టుచు నుండె మామ, నన్
    వీడి వసింప లేదెపుడు, వేశము శుభ్రము చేయగా వలెన్
    కోడల! నా సుతున్ విడిచి, కూడగ నొప్పును నేడు నాపతిన్

    రిప్లయితొలగించండి

  26. కోవిడువలన రోగుల గుణములను గు
    రించి నా సతుని కెరుక లేదు , గాన
    కోడలా ! నాపతిని నేఁడుగూడవలెను
    దీనిగూర్చి నాతడొకడె తెలుపగలడు

    రిప్లయితొలగించండి
  27. ఈ నాటి శంకరాభరణం వారి సమస్య

    కోడలా నాపతిని నేడు కూడ వలెను

    నా పూరణ క్రమాలంకారములో





    జానకి నెటుల పిలుచు
    కౌసల్య, పారి

    జాతమును తెమ్మనెవరిని సత్య భామ

    నడిగిదె ననుచు చెలియతో నుడివె,యీ ది

    నము నెటుల పిల్చునో దెల్పు,పడక

    టింట పతినేమి కోరు బోటి మురి పెముగ


    కోడలా,నా పతిని,నేడు,
    కూడ వలెను

    రిప్లయితొలగించండి
  28. కోడలా నాపతిని నేడు గూడవలెను
    నెంతదౌర్భాగ్య మీయది యిటుల నడుగ
    స్వంత భర్తను గూడుట సబబు,కాని
    కోడలిని యడుగ భువిని క్రూరమగును

    రిప్లయితొలగించండి
  29. ఆడగబిడ్డలైముగురునాయమసందిటముద్దులోల్కగా
    వేడగభార్యలాయెడనువేదనఁజెందుచువచ్చినిల్చిరే
    వేడుకనత్రిపత్నియునువేమరుకోరెనువేదమాతలన్
    కోడలనాసుతున్విడిచికూడగనోప్పునునేడునాపతిన్

    రిప్లయితొలగించండి
  30. మోడుగ మారె జీవితము ముందుగ నా పతి దాటిపోవగా
    తోడుగ నిల్చి పుత్రునొక దోవను వెట్టితి తృప్తిగానికన్
    నేడవసానకాలమిది నీకిక వానిని యప్పగించి నేఁ
    కోడల! నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్

    రిప్లయితొలగించండి
  31. ఏడుదినంబు లాయెగద యిప్పుడులెక్కనుజూడగాసుమా
    కోడల!నాసుతున్ విడిచి,కూడగనొప్పును నేడునా పతిన్
    బాడుకరోనకుందగిలి భద్రతదృష్టిని దూరముండుచున్
    నేడిక గీము జేరుటన నిర్మొహమాటుగనెవ్వరేనియున్

    రిప్లయితొలగించండి
  32. పురుడు వోసితి పండంటి పుత్రునిడితి
    నీకు సల్పిన సహకార మింకచాలు
    పతిని యెడబాసి నేనింక బ్రతుకలేను
    కోడలా నా పతిని నేఁడు గూడవలెను

    రిప్లయితొలగించండి
  33. తోడును నీడగా నొకరితో నొకరుంటిమి యిన్నినాళ్ళుగా
    పాడుకరోన నన్నిచట బందినిజేసినదేమి చేతు నే
    నాడెడబాసిలేముగద న్యాయమ నేడిటులొంటి చేయగా
    కోడల నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్

    రిప్లయితొలగించండి
  34. ఉండు డింక భద్రమ్ముగ నండ నుండ
    నా సుతుం డిట నీకు నానందముగను
    మురిసితిని యాదరమునకుఁ బోయి వత్తుఁ
    గోడలా! నా పతిని నేఁడు గూడ వలెను


    పాడిగ లేక భోజనము పాపము వేఁగును నీదు మామయే
    మాడుచు నుండు సంతతము మానిని! యేఁగెద నింక నేను యే
    నాఁ డిట కేను వచ్చితినొ నా కిట చాల దినమ్ము లయ్యె నో
    కోడల! నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్

    రిప్లయితొలగించండి
  35. నీపతికొలువుకొరకనినిన్ను వీడి
    యరుగనీతోడుగానుంటినమ్మనేను
    నిచటనుండగ లేనికనేగెదనిక
    కోడలా నాపతిని నేడు గూడవలెను

    రిప్లయితొలగించండి