21, ఏప్రిల్ 2021, బుధవారం

సమస్య - 3700

22-4-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంధు మరణ వార్త మనకుఁ బండుగె కద”
(లేదా...)
“పండుగఁ జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్”

59 కామెంట్‌లు:

 1. ( కురుక్షేత్ర యుధ్ధానంతరము, భీముని పలుకులు)

  ద్రౌపది కురులు పట్టిన త్రాష్టుడొరిగె

  మామ శకుని చచ్చెన్ భ్రాత మంద చచ్చె

  రాజ రాజు చచ్చెన్ కద రణమునందు

  బంధు మరణ వార్త మనకుఁ బండుగె కద”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 2. దండిగ భక్తితోడుతను దైవము పైనను భారమేయుచున్
  ఖండిత మా శివైక్యమని కాశికి జేరుచు వేచిచూచుచున్
  పండగ, నాత్మ యింక తన పార్థివ దేహము వీడిపోవగా
  పండుగఁ జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్.

  రిప్లయితొలగించండి
 3. మానవత్వము మరచిన మనుజ మృగము
  సంఘ విద్రోహ శక్తికి సాయ పడుచు
  ప్రోత్స హించె డు వాడైన మూర్ఖ దుష్ట
  బంధు మరణ వార్త మనకు బండుగె గద

  రిప్లయితొలగించండి
 4. నిత్యపోరాటపటిమనునిప్పువలెను
  పక్కబల్లెముగాగనుబంధువుండ
  వెంటనంటెడిచెడుగునువేగఁద్రుంప
  బంధుమరణవార్తమనకుపండుగకద

  రిప్లయితొలగించండి
 5. కష్టములనుపంచుకొనక, కలిమి కలిగి
  సాయమింతయు చేయక, జాలియనగ
  నెఱుగనట్టివాడు,దుష్టుని నెంతు రిట్లు
  బంధు మరణ వార్త మనకు బండుగె కద!

  రిప్లయితొలగించండి

 6. వలువ లూడ్చ నిండుసభలో పాపి దుస్స
  సేనుని వధింతు నని భీమ సేనుడపుడు
  ప్రతినబూనె, నారణమున బారిసమర
  బంధు మరణవార్త మనకు పండుగె కద.


  దండి పరాక్రమంబుగల తమ్ములఁ బత్నిని యోడెనంచు నా
  బండడు దుస్ససేనుడు సభాంతర మందు పరాభవించెనే
  భండన మందునా ఖలుని వాయుసుతుండు క్రమించి నంతనే
  పండుగ జేయగా దగును బంధువు సచ్చిన వార్తవచ్చినన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "...బత్నిని నోడెనంచు.." అనండి.

   తొలగించండి
 7. మెండుగచంచలంబుగనుమేలునుగోరకమాయఁజేయుచున్
  దండిగకామమున్గనగతల్లడమందగమానసాగ్నియై
  మండుచుమట్టుఁబెట్టుచునుమానిసిబూడిదఁజేయునత్తరిన్
  పండుగణజేయగావలయుబంధువుసచ్చినవార్తవచ్చినన్
  బంధువు-కామము

  రిప్లయితొలగించండి
 8. సమస్య :

  పండుగ జేయగా దగును
  బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  ( బంధువులావచ్చి ఏడాదిన్నర అయినా కదలని కరోనా రూపుమాసిన వార్త వస్తే మానవు లందరకు పండగే పండగ )

  ఉత్పలమాల
  ..................

  దండిగ మానవుల్ ప్రగతి
  దారుల ముందుకు సాగుచుండగా
  దండుగ జేయుచున్ బ్రతుకు
  దారుణమారణహోమవేదియై
  కొండొక బంధువట్టులను
  కూరిమి తిష్ఠ కరోన వేసెనే !
  పండుగ జేయగా దగును ;
  “ బంధువు “ సచ్చిన వార్త వచ్చినన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొగ బెట్టినా పోని బంధువు కరోనా! అద్భుతమైన పూరణ. అభినందనలు.

   తొలగించండి
 9. వ్రణము కాయమునందున వచ్చినపుడు
  దానిదొలగించ కున్నచో హానికలుగు
  దురిత కర్మములొనరించు దుష్టుడైన
  బంధు మరణ వార్త మనకుఁ బండుగె కద

  రిప్లయితొలగించండి
 10. మెండుగ నాదరించవలె మిక్కిలిభక్తిని బంధువర్గమున్
  అండగనుండగా వలయు నాపదలందును దెల్పుమెట్లనన్
  దండుగ మారినట్టి పెడదారిని బట్టిన పుత్రుడిట్లనెన్
  పండుగ జేయగాదగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దండిగ బ్రేమబంచుచును దక్షతగల్గిన దర్శకుండునై
   యండగ నిల్చికష్ట సమయమ్ముల గాచిన నాప్తబంధుకున్
   నిండిన దుఃఖభారమున నిచ్చినివాళిని తర్పణమ్మ
   నే
   పండుగ జేయగాదగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. మిత్రులందఱకు నమస్సులు!

  మెండగు దీర్ఘరోగమను మిన్ను పయింబడఁగాను; విత్తముల్
  దండుగమాఱి భేషజ వితానముకయ్యు వ్యయింప; రుగ్మతన్
  ఖండన సేయకుండియు, సుఖమ్మగు మృత్యువు నీయ, నింటిలోఁ
  బండుగఁ జేయఁగాఁ దగును; బంధువు సచ్చిన వార్త వచ్చినన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్న సవరణతో:

   మెండగు దీర్ఘరోగమను మిన్ను పయింబడఁగాను; విత్తముల్
   దండుగమాఱి భేషజ వితాన నిమిత్త మొసంగ; రుగ్మతన్
   ఖండన సేయకుండియు, సుఖమ్మగు మృత్యువు నీయ; నింటిలోఁ
   బండుగఁ జేయఁగాఁ దగును; బంధువు సచ్చిన వార్త వచ్చినన్!

   తొలగించండి
  2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 12. నిండు మనమ్ముతోడ నిట
  నెయ్యము జేయగ నేర్వ మంచు సా
  గండిక జీవనమ్ము సరి
  గానుము శత్రులనైన చెల్మితో
  నండగ నుండి యొండొరుల
  కాశ్రయ మీయుమటంచు జెప్ప నే
  పండుగఁ జేయఁగాఁ దగును
  బంధువు సచ్చిన వార్త వచ్చినన్?!

  రిప్లయితొలగించండి
 13. నిండు మనమ్ముతోడ నిట
  నెయ్యము జేయగ నేర్వ మంచు సా
  గండిక జీవనమ్ము సరి
  గానుము శత్రులనైన చెల్మితో
  నండగ నుండి యొండొరుల
  కాశ్రయ మీయుమటంచు జెప్ప నే
  పండుగఁ జేయఁగాఁ దగును
  బంధువు సచ్చిన వార్త వచ్చినన్?!

  రిప్లయితొలగించండి
 14. బండెడు మోతయౌ పనులు బంధన మెండగు రిక్త పూజ్యమౌ
  ఖండన సేయలేక సరి గాసిలి యోర్చుటె రాచకార్యమౌ
  గండములుండు కార్యమిది గండడె రాజగు జెండకున్ మహా
  పండుగ జేయగా దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  రాచకార్యం = ప్రభుత్వ ఉద్యోగం
  జెండాపండుగ = భారత స్వాతంత్ర్య దినం

  రిప్లయితొలగించండి
 15. మఱొక పూరణము:

  భండనమందు నర్జునుఁడు వైరి వరూధినియందుఁ జెచ్చెఱన్
  ఖండన సేయ సైంధవునిఁ గాండివ ముక్త శిలీముఖమ్ములన్
  మెండుగఁ బంపఁ, బాండవుల మేడను నుండిన రాణివాసమే
  పండుగఁ జేయఁగాఁ దగును; బంధువు సచ్చిన వార్త వచ్చినన్!

  రిప్లయితొలగించండి
 16. ఉ:

  నిండగు ప్రాణముల్ గొనుచు నిత్యము దేశపు నింద జేయుచున్
  మొండగు నుగ్రవాది యను ముద్రను మోయుచు దేశ ద్రోహి యా
  దండుగ మారి రక్కసుని తాళగలేక విచార గ్రస్తులై
  పండుగ జేయగాదగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 17. పౌరులరుసుము మ్రెక్కెడి పందికొక్కు
  నెపము లేకహానినిసేయు నీచుడతడు
  కీడు గొప్పగసలిపెడికీటకము, క
  బంధు మరణ వార్త, మనకుఁ బండుగె కద

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కామ తత్త్వమ్మె నిండుగా కలిగి యుండి
  వావి వరుసలు వీడెడి బాట నంటి
  తోయజాక్షుల చెఱబట్టు దుష్టుడౌ క
  బంధు మరణ వార్త మనకు బండుగె కద!

  రిప్లయితొలగించండి
 19. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  బంధు మరణ వార్త మనకు బండుగె గద


  నా పూరణ‌ సీసము లో


  జరుపుచు నుండగ సర్పయా గము నేను
  తమరి యనుమతితో ,తక్ష కుండు

  జ్వాల కీలలలోన జారు సమయమందు
  వర యాస్తి కుడిటకు వచ్చి యాగ

  మందున్న‌ నాజేత మాటను కొనియాత
  డాపించె యాగమ్ము, వ్యాల జాతి

  నంతయు కాపాడి నెంతయీ ఘనతను
  పొందెన తండు ప్రముఖుల చేత,  చచ్చె నెన్నియో సర్పముల్, చచ్చె తక్ష

  కుని‌ హితుడు బంధువు నచట, ఘనత నొప్పు

  బంధు మరణ వార్త మనకు బండుగె గద

  యనుచు జనమేజయుడు బల్కె ముని‌ని‌ గాంచి
  సర్ప యాగములో తక్షకుడు మరణించ లేదని వగచు‌చున్న ఉదంకుని కాంచి జనమేజయుడు పలుకు సందర్బంలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రశస్తమైన సన్నివేశంతో చక్కని పూరణ. అభినందనలు.
   'కాపాడి యెంత...' అనండి.

   తొలగించండి
 20. తేటగీతి
  రామ సీతను వంచించి లంకనుంచి
  తగదు తగదన్న నిందించి తరిమివైచి
  వెతల యుద్ధాన వ్రాల విభీషణాఖ్యు
  బంధు మరణ వార్త మనకుఁ బండుగె కద!


  ఉత్పలమాల
  అండగ నుండి కష్టముల నాదుకొనంగను బంధువందురే
  మెండుగఁ కీడొనర్చుచును మీరుచు బాల్యము నుండి మీదటన్
  గండములెన్నొగూర్చిరను గైవడి నుండిన ధార్తరాష్ట్రులై
  బండుగఁ జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్


  రిప్లయితొలగించండి


 21. అముదై ప్రభువునకు జనన
  ము మరణముల్ సూక్ష్మమైన మూలమ్ము సుమీ
  శమనము బంధు మరణ వా
  ర్త మనకుఁ, బండుగె కద సఖి ప్రభవమ్మెపుడున్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మెండుగ కామతత్త్వమది మేనున నిండుగ విస్తరిల్లగా
  దండన తోడ నింతులను తల్లడ బెట్టుచు కట్టివేయునౌ
  రండుడు చుట్టమైనను విరక్తిని గల్గి నుదల్చి నంతటన్
  పండుగ జేయగా దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  రిప్లయితొలగించండి


 23. అనఘా ప్రభవమ్మున గున
  గున పండుగఁ జేయఁగాఁ దగును! బంధువు స
  చ్చిన వార్త వచ్చినన్ సఖి
  మనోవ్యధయు తధ్యము! నిజమైనది హముయే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. పాండుని పుత్రులందరిని పావన కాశికి పంపి యుక్తినన్

  పండిన రాత్రి వేళలను మంటల బారులు హోరులెత్తగన్

  మండెను లక్క నిష్కుటము మండిరి పాండవ భ్రాతలందరున్

  పండుగఁ జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 25. భండనమందు నేడు ఘన భాను
  జు డేసెడు వాడి శస్త్రముల్
  దండి బలాడ్యుడైన మన ధర్మజు
  భాత్రుని యర్జునిన్ వడిన్
  ఖండన జేయు దప్పకను గర్మము
  మూడెను జూడు వానికిన్
  పండుగ జేయగా దగును బంధు
  వు సచ్చిన వార్త వచ్చినన్.

  రిప్లయితొలగించండి
 26. అండ నొసంగకుండ సత మారడి పెట్టుచు కన్న బిడ్డలన్
  దండుగ చేయుచున్ ధనము దౌష్ట్యములన్ చెడు పేరుతెచ్చుచున్
  మొండిగ సంచరించుచును పోవ కరోన కతమ్ము ప్రీతితో
  బండుగఁ జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  రిప్లయితొలగించండి
 27. దుఃఖకరము మిగుల దుర్భరంబగునార్య!
  బంధుమరణ వార్త,మనకు పండుగెకద
  యింటినిండ జనము వంటిల్లుసందడి
  రకరకంపు తిండ్లు లభ్యమగుట

  రిప్లయితొలగించండి
 28. చావు పుట్టుక లెంచఁగ లేవు నరుల
  చేతి లోవాసుదేవుఁ డహో తలంచి
  పేర్మిఁ దగు మేలు సేయంగ వినక యున్న
  బంధు మరణ వార్త మనకుఁ బండుగె కద


  అండగ నిల్చి తోడ్పడఁగ నాపద వేళల బంధు లుండరే
  దండము వెట్టి యోర్పుఁ దగఁ దాల్చి తదుత్తర కర్మ కాండముల్,
  గుండెలు మండు చుండగను ఘోర విచారము నిండ మానుచుం
  బండుగఁ, జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్

  రిప్లయితొలగించండి
 29. దండుగ వీని విద్య యతి దారుణమీ అపశబ్దముల్ గనన్
  రండిటు జూడుడీ ఘనుని వ్రాతలఁ మారెను "వచ్చి" "సచ్చి" గా
  నిండగు భావమే సమసెనీ గతి నొక్క పదంబుతో నయో
  "పండుగఁ జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్"

  రిప్లయితొలగించండి
 30. నిండుమనంబునందలరి నెమ్మినిఋరాముని బెండ్లివేడుకన్
  బండుగజేయగ దగును,-బంధువు సచ్చిన వార్తవచ్చినన్
  గుండెను నిబ్బరంబునిచి ఘోరముజర్గుట నెంచుచున్ మదిన్
  నండగనుండగాదగును నన్నివిధంబుల సేవజేయుచున్

  రిప్లయితొలగించండి
 31. మెండుగ భోగభాగ్యములు మేదినియందున కల్గి యుండగా
  నిండుగ సంతసంబు మది నెమ్మదిగూర్చిన వేళలందునన్
  పండుగఁ జేయఁగాఁ దగును, బంధువు సచ్చిన వార్త వచ్చినన్
  పండుగజేయజాలుదుమె బాధను చెందక నెన్నడేనియున్

  రిప్లయితొలగించండి
 32. దండుగమారికార్యములు దండిగ చేయుచునెల్లవారికిన్
  అండగ నుందునం చునుచు యాతన బెట్టుచు నాస్తి దోచుచున్
  మెండుగమంచిమాటలనుమేటిగనాడెడు వాడుజచ్చినన్
  బండుగ సేయగా దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్.

  రిప్లయితొలగించండి