18, ఏప్రిల్ 2021, ఆదివారం

సమస్య - 3696

19-4-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు”
(లేదా...)
“కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్”

65 కామెంట్‌లు:

  1. కావడి భుజాన ధరియించి కాలిబాట
    కోసుదూరమ్ము నడిచెడు కూటిపేద
    తలచె నిట్టుల భూరిగా నలసి తాను
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు.

    రిప్లయితొలగించండి
  2. మేళ తాళము మ్రోగెడు మేటి వేళ

    కట్నమునొసగకను తాళి కట్టననెను

    వధువు హృదిన ముల్లును గుచ్చె వరుడు, చూడ

    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి , వెలుగోడు
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,

    గు రు భ్యో న మః ( నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన )


    { కీచకుడు ద్రౌపది తో }


    గుమ్మ ! ముదమున కవుగిలి నిమ్మ , యరుగు

    దెంచి | నీ యురోజయుగము గాంచి నంత ,

    నింతలు పులకలు కలిగె నింతి ! నాకు |

    నించువిలుతు గో డయొ భరించలేను !


    ( ఉరోజము = కుచము : ఇంతలు = ఇంతలేసి : పులకలు =

    పులకింతలు : ఇంచువిలుతుని = మన్మథుని : గో డయొ =

    గోడు + అయొ ! )

    ----------------------------------------------------

    రిప్లయితొలగించండి
  4. బాధభౌతికంబగుగదాపాదమందు
    మాటకటువుగమనసునుమాడ్చివేయు
    అలతిగాయంబుదారికినడ్డురాదు
    కాలికిన్ముల్లుగ్రుచ్చసుఖంబుకలుగు

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. చెప్పు లెట
      దాల్తురు జనులు,చెప్పు మోయి

      కంటక‌మ్మున కర్ధము, కదల కుండు

      నెపుడు విరులు దారమ్మున, నెలత తోడ

      కూడ శయన మందిరమున కూడు నేమి

      కాలికిన్,ముల్లు,గ్రుచ్చ,సుఖంబు కల్గు

      తొలగించండి

  6. కూలిని నుండి నిచ్చలము కోమలమున్ నిలయమ్ము జేర్చుచున్
    గాలము వెల్లబుచ్చు పరికర్ముడు వేసవి కాలమందునన్
    భాలువు నిప్పురాల్చుతరి బాలము నోర్వక జెప్పె భార్యతో
    కాలికి ముల్లుగ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్యమిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  7. నేల సుఖంబు నెర్గి కడు నీతులు జెప్పిన వాడుగాడె పో
    గాలము దాపురించగను కాలపు రీతులెరింగి నోడె గా
    ఏలిక యింటివాడవగ నేదరిలేక పొలమ్ములోదిగన్
    కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్


    *** మా మిత్రుడు అనుభవజ్ఞుడైన్నటికి
    పొలం లో దిగితే కస్సున గుచ్చిన ముళ్ళు ఆరు నెలలు బెడ్ పై ఉండేటట్లు చేసింది.

    రిప్లయితొలగించండి
  8. కాలు పూర్తిగ పుండ్లచే కందువారె‌
    కలత ఏమన? వైద్యుడు గజ్జి అనియె
    గీత అను పాప నవచేత గీరు మనగ
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి
  9. బేలగకణ్వుకూతురునుభిత్తికపైగలబోమ్మవోలెనా
    పాలకుసుందరాననముపాయనికోరికజూచునేర్పుతో
    ఆలముఁజేసినిల్చెనటనాగతిముల్లునుఁదీయుసాకుతో
    కాలికిముల్లుగ్రుచ్చినసుఖంబులభించుటతథ్యమిద్ధరన్

    రిప్లయితొలగించండి
  10. సమస్య :

    కాలికి ముల్లు గ్రుచ్చిన సు
    ఖంబు లభించుట తథ్య మిద్ధరన్

    ( తన శిఖను లాగి అవమానించిన దుష్టనవనంద
    సమూహాన్ని చంద్రగుప్తునిచే నశింపజేసి ప్రజాసౌఖ్య సంధాయకమైన మౌర్యసామ్రాజ్యసంస్థాపకు డైనాడు చాణక్యుడు )

    ఉత్పలమాల
    ..................

    మేలగు వేదపండితుని
    మించిన గర్వపు నందులెల్లరున్
    గోలగ జుట్టు బట్టికొని
    గుంపుగ బైటకు బంపివైవ ; దు
    శ్శీలుర రూపుమాపె దన
    శిష్యుడు చంద్రుని చేత ; గౌటిలున్
    గాలికి ముల్లు గ్రుచ్చిన సు
    ఖంబు లభించుట తథ్య మిద్ధరన్ .

    ( కౌటిలుడు - చాణక్యుడు )

    రిప్లయితొలగించండి
  11. కాయ కష్టము జేసెడు కటి క పేద
    ప్రతి దినమ్మును నడచుచు పనికి వెళ్ళు
    నలసి సొలసియు న త డ నె నాలి తోడ
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!

    మేలితరమ్మునౌ నగరమే చన నే నిటఁ బల్లెటూరినిన్
    మాలుకొనంగ, ముండ్ల గహనమ్మునఁ బోవుచు నుండి, వేగ ము
    క్కాళులపీటలం గొనియుఁ, గాళ్ళకుఁ బూనిచి, యేఁగ, నట్టి ము
    క్కాలికి ముల్లు గ్రుచ్చిన, సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్!

    రిప్లయితొలగించండి
  13. అందరికీ నమస్సులు🙏

    గాలము వేయుచున్ బ్రజల గాటపు ప్రేమల కొల్లగొట్టగన్
    పాలన రీతులన్ గనగ పాలక వర్గపు పాద యాత్రలన్
    మేలని తల్చగన్ వరస మీరుచు చెప్పులు దీసి పర్విడన్
    *“కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్”*

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    నేలకు మోపకుండ కడు నెమ్మది యింటను కుంటుచుండగన్
    పాలను సేకరించి సరి వంటలు చేసెడు సర్వ కార్యముల్
    నాలియె కూర్చుచుండ చిరు నవ్వులు రువ్వుచు వేళ లెంచి నా
    కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్యమిద్ధరిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారు సూచించిన మార్పులను సవరిస్తూ :..

      ఉ:
      నేలకు మోపకుండ కడు నెమ్మది నింటను కుంటుచుండగన్
      పాలను సేకరించి సరి వంటలు చేసెడు కార్య భారమున్
      నాలియె కూర్చుచుండ చిరు నవ్వులు రువ్వగ వేళ లెంచి నా
      కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్యమిద్ధరిన్

      తొలగించండి
  15. వేళకు నిద్ర రాక కడు వేదన చెందెడు వారి నేస్తమే
    చాల మహత్వ పూర్ణమును శక్తి యుతంబగు"ఆకుపంక్చ"రే!
    ఆలసమెందుకోయి?యిక హాయిని పొందుము;దాని నందుమా!
    "కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్యమిద్ధరన్."

    రిప్లయితొలగించండి
  16. చీని దేశమందున బుట్టి చెదరె జగతి
    నంతయు నిపుడు పూర్తిగ నలుము కొన్న
    సూది పొడుచు వైద్మమునందు సూక్ష్మత నరి
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి
  17. చాలిక చాలు జీవితముఁ జంపక చంపుచు యున్న భార్య నే
    నేలుకొనంగ కూడదిక, నిబ్బరికంబు నశించె, పోయె స
    చ్ఛీలత, బాధ నోర్చుటకు శీధువు బానిసనైతి, పిమ్మటన్
    కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్౹౹

    రిప్లయితొలగించండి

  18. చేలను దున్నెడిన్ బసుల చీలిన కాళ్ళకు రక్షణార్ధమై
    చాలిక బండ్లులాగెడిని జంతువులన్నిటి కాలిగిట్టలన్
    సీలలతోడ నాడెముల చెన్నగురీతిని సుత్తిపోటులన్
    కాలికి ముల్లుగ్రుచ్చిన సుఖంబు లభించుటతథ్య మిద్ధరన్

    రిప్లయితొలగించండి
  19. తే.గీ//
    దుర్మనస్కుఁడై యువరాజు తూలనాడి
    జెరచు నెపముతో దరిజేర, జేవురించి !
    కత్తియుద్ధమున్ జేసెడి కాంత, వైరి
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు !!

    రిప్లయితొలగించండి
  20. కాలము చెల్లు వేళలను కన్నుల ముందున కాడు కాంచుచున్

    కాలుని రాకకై మదులు కాంక్షలు రేపెను హాయి హాయిగన్

    చాలికనూత కాలుయని చావడి గోడకు చేర్చు రీతికై

    కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. ముల్లులె చికిత్స చేయును మోదమిడుచు,
    ఆక్యుపంచరు వైద్యమె అండనీయ
    నొప్పి మాయమవును, రోగినూరడిల్లు
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి
  22. శిరమునందున నెలకొన్ననెరివు వోవ
    నాకుపంక్చరు వైద్యము నూకుమనిరి
    యట్టి వైద్య విధానమునందు మనకు
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి

  23. తేటగీతి

    "తిరుగ బోకుమ కష్టాలు తెచ్చుకోకు"
    మనుచు పాదాన దిగిన కంప దొలగించ
    మాతృదేవత ప్రేమ కొమరుడలరగ
    గాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      గాలికి ధూళికిన్ దిరుగు కష్టములేల యటంచు మాతృమూర్తి తా
      లాలన జేయుచున్ వగచి రాలగ ధారగ బాష్పబిందువుల్
      బాలుని బ్రేమగా నిమిరి పాదమునందలి కంప దీయగన్
      గాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్


      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. చేలను దున్నుయెద్దులకు చెచ్చెర గిట్టలు నాశమౌనుగా
    వేలకు వేల రూప్యముల పిమ్మట పోసిన స్వస్థతబ్బునే?
    మేలగు రేకులన్ నిలిపి మిక్కిలి శ్రద్ధగ సుత్తి వేటుతో
    కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్

    రిప్లయితొలగించండి
  25. కె.వి.యస్. లక్ష్మి:

    తీరులేని పలుకులెంచు వారు వాడు
    వాడి సూదుల వంటివౌ వాక్కులన్ని
    పంచు ఖేదము కంటెను యెంచి జూడ
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    రిప్లయితొలగించండి
  26. బాధ గలిగించు నిరతము వచ్చువరకు
    కాలికిన్ ముల్లుగ్రుచ్చ,సుఖంబు గలుగు
    ముల్లు దీసిన దదుపరి యుల్లమలరి
    దాని బాధను వర్ణించ దరమె మనకు?

    రిప్లయితొలగించండి
  27. కూలి జనంబులెప్పుడును గోలను జేయక తీసికొందురే
    కాలికి ముల్లు గ్రుచ్చిన,సుఖంబు లభించుట తధ్యమిద్ధరన్
    కాలము వమ్ముసేయకను గాలుని సేవయె నిత్యకృత్యమై
    మేలగు రీతినిన్ భువిని మిక్కిలి శ్రద్ధగ జేయువారికిన్

    రిప్లయితొలగించండి
  28. పాలు రసాలు శాకములు పండ్లు ఫలాలు విలాస వస్తువుల్
    తైలము నీరమన్నములు ధాన్యము చియ్యలు పప్పులుప్పులున్
    గాల మహత్తు సంకరము కశ్మలమై రుజ కాలవాలమై
    నాలుక గోరి నట్టు దిన నంగము భంగము గాగ వైద్యుడే
    *“కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్”*

    రిప్లయితొలగించండి
  29. చాలిక చెప్పబోకుమెటు సైతురు వేదన నెవ్వరేనియున్
    కాలికి ముల్లు గ్రుచ్చిన; సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్
    కాలును మోపనీక నిల కంటికి రెప్పగ గాచుచున్ సదా
    మేలుగ నీడయై నిలిచి మెప్పును బొందెడి దోడు గల్గినన్

    రిప్లయితొలగించండి
  30. కాలము నెల్ల సంపదలకై కడు

    కష్టములన్నెదురించు వానికిన్

    మేలగు జీవితంబుకయి మిక్కిలి

    క్లేశములన్ భరియించు జీవికిన్

    లాలితమైన కోర్కులకు రాత్రి

    బవల్ శ్రమియించు ప్రాణికిన్

    కాలికి మల్లు గ్రుచ్చిన సుఖంబు

    లభించుట తథ్య మిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  31. ఏవగిం పొసఁగు జనుల కేల యిట్టి
    లీల హింసాప్రియుండవు లేదు జాలి
    నీ కొకింతయు నక్కట నీ మనసున
    కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు

    [మనసునకు +ఆలికిన్ = మనసున కాలికిన్]


    మేలుగ మాను గాయములు మేనునఁ గల్గిన సత్వరమ్ముగం
    గాలిన గాని మేను మది గాయము మానునె మాన్య కోటికిన్
    జాలిని వీడి నా హృదిని శబ్ద కృపాణపుఁ బోటు కన్న నా
    కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్

    రిప్లయితొలగించండి
  32. పాదరక్షలు లేకుండ బాట నడువ
    నంతులేనట్టివేదన నార్తి గూర్చ
    తీయసూదితోడను దాని తీరు గాను
    కాలికిన్ ముల్లు గ్రుచ్చి ,సుఖంబు కల్గు

    రిప్లయితొలగించండి