5, ఏప్రిల్ 2021, సోమవారం

సమస్య - 3684

 6-4-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జమునన్ గనినంత విజయశాంతి లభించెన్”
(లేదా...)
“జముననుఁ జూడఁగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్”

34 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  తములము వక్కనున్ నమిలి దండిగ నుమ్ముచు వీథివీథులన్
  కుములగ శత్రువర్గమహ కూడుచు మేలు ప్రయాగనందునన్
  కమలపు గుర్తుపై నిడుచు కమ్మగ వోటును చేరి గంగనున్
  జముననుఁ జూడఁగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్

  జమున = యమునా నది

  రిప్లయితొలగించండి


 2. సుముహూర్తమ్ము! కిరీటి! ని
  జము! నన్ గనినంత విజయ! శాంతి లభించెన్
  ప్రముఖము గానెల్లరకున్
  విముఖత వలదు రణమునకు విజయము నీదే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. ప్రమదలె ప్రధాన యితివృ
  త్తముగల చిత్రమ్ము దీయ దలచి వెదకగన్
  రమణులు చిత్రనటసమా
  జమునన్ గనినంత విజయశాంతి లభించెన్.

  రిప్లయితొలగించండి
 4. తమతమనటనలమెఱుపుల
  తమకముతోజనులమదినిదాగిరివీరే
  సమతులసుందరతారలు
  జమునన్గనినంతవిజయశాంతిలభించెన్

  రిప్లయితొలగించండి


 5. విముఖత యేల యుద్ధమన? వీరుడ! అర్జున! నిత్యమైన తే
  జము! ననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్
  సుముఖము గా జనాళికి! వసుంధర వాసనకెక్కె మేల్మిగా
  కమలిన పుష్పమై నిలువ కయ్య కిరీటి ధనుస్సు నెక్కిడన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. అంపశయ్య పై భీష్ముడు విజయునితో

  సమరంబున మాటగడచి
  అమితావేశమున చక్రి యాయుధమందన్
  కమల దళాక్షుని ఘనతే
  జమునన్ గనినంత విజయ!శాంతి లభించెన్

  రిప్లయితొలగించండి
 7. ప్రమదయె పౌరుషాగ్నులను రాల్చెడు పాటవమొప్పు పాత్రలో
  గమకము గల్గినట్టి నటి కావలె నంచు వరించి చూడగా
  రమణియె తారసిల్లెనట రంగుల లోకము వంటి యా సమా
  జముననుఁ జూడఁగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 8. సుమధుర నటనా చాతురి
  కమనీయపు నాట్య గరిమ గలిగిన వారై
  ప్రముఖ చలన చిత్ర సమా
  జమునన్ గని నంత విజయశాంతి లభించెన్

  రిప్లయితొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  సమరమునందు నర్జునుఁడు శాత్రవులౌ తన బంధువర్గమున్
  జము పుర సన్నిధిం బనుప శాంతినిఁగోల్పడ, గీతఁ దెల్పి యా
  క్రమమునఁ జక్రి వల్కె నిటు "రమ్మిఁక! నీ హృది వైరి షట్సమా

  జము ననుఁ జూడఁగా, విజయ! శాంతి లభించె, జయప్రదమ్ముగన్!"

  రిప్లయితొలగించండి
 10. కందం
  రమణీలలామఁ బొందెడు
  సమరమ్మున పంక్తికంఠు సంహారికి, మో
  దము సీతమ్మ ముఖసరో
  జమునన్ గనినంత విజయశాంతి లభించెన్

  చంపకమాల
  సుమ సుకు మారి జానకి నశోకవనమ్మున నుంచి రావణా
  ధముడు పరాభవింపఁగ వ్యధార్థుడు రాముడు శౌర్యవంతుడై
  సమరము జేసి కూల్చి సతి సాంత్వన దీప్తుల వెల్లువన్ ముఖా
  బ్జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్!

  రిప్లయితొలగించండి
 11. సమరము ముగిసెను కదరా
  యమతులు జచ్చిరి రణమున యబ్బుర మౌ పో
  డిమఁజూపితివట నీ తే
  జమునన్ గనినంత విజయ, శాంతి లభించెన్.

  రిప్లయితొలగించండి
 12. ప్రముఖ ముని గణము లాహా

  రము నడుగగ ద్రౌపదికి జలదరము నిడ నా

  సమయమున వచ్చి నాడ,ని

  జము,నన్ గనినంత విజయ ,శాంతి లభించెన్


  దూర్వాస మహాముని శిష్యులతో భోజనమునకు వస్తున్నాడని తెలిసి పాంచాలి భీతి పొందినది‌. అప్పుడు వచ్చిన నన్ను చూసి శాంతి పొందింది విజయా అని కృష్ణుడు చెప్పు సందర్భం

  రిప్లయితొలగించండి
 13. చం:

  భ్రమగొని దిర్గుచున్ పడుచు భామల జూచుచు వెక్కిరింపుగన్
  సముచిత నామమంచు నస, శాంతిని గోల్పడ జేయువారలన్
  సముచిత రీతి దండనము, శాస్తిని జేయ గతింప చిత్తముల్
  జమునను జూడగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 14. చెమరించె నేటి భారత
  గమనం బున, తత్ పేరును గల చిత్రమునన్
  అమరెన్, ఆ సినిమా రా
  జమునన్ గనినంత "విజయశాంతి" లభించున్

  రిప్లయితొలగించండి
 15. సమర పథంబునం దరుల శాఠ్యపు జూద నియుక్త బద్ధ నీ
  మములను దాటి కౌరవుల మర్దన సేయగ సాటిలేని వి
  క్రమమున నొక్కడై జని ప్రఘాతము సల్పిన సవ్యసాచి తే
  జముననుఁ జూడఁగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  సుమడోలల, సైకతముల,
  నమలినకౌముదిని, నింగినమృతకరున్, బ్రే..
  మమయుని కన్నయ్యనునీ
  జమునను గనినంత విజయ! శాంతి లభించెన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 17. సమస్య ;
  జమునన్ గనినంత విజయశాంతి లభించెన్

  ( యమునానదిలో చొరబడి జల
  వాయుకాలుష్యాలకు కారకుడైన
  కాళియుణ్ణి మర్దించిన చిన్నికన్నయ్యకు విజయశాంతి కలిగింది )

  సమదుడు కాళియు బలద
  ర్పములే క్రుంగగ యశోదపట్టియె నటనన్
  " ధిమిధిమి " యంచును జేయుచు
  జమునన్ గనినంత విజయశాంతి
  లభించెన్ .
  (జమున - యమున ; సమదుడు - మదించినవాడు )

  రిప్లయితొలగించండి
 18. సమతను శాంతి గోరె నిజశౌర్యము గల్గిన పాండుసంతు ‌సా
  మముగ సమాన భాగములు మాకిల జెందుట కష్టమేను రా
  జ్యము నెటులైన గెల్తుము విచారము యేలకొ పోరుటే విభా
  జమునను జూడగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్

  రిప్లయితొలగించండి
 19. త్రిమతస్థులుండు తిరుపతి
  సమరము నందున జయావజయముల శంకన్
  అమరిన విజయమును సరసి
  జమునన్ గనినంత విజయశాంతి లభించెన్

  రిప్లయితొలగించండి
 20. విమతులు గారు స్వజనులని
  యమరాధిపు సూతి వగచి యాజిన్వీడన్
  రమణీయాద్భుతహరి తే
  జమునన్ గనినంత విజయశాంతి లభించెన్

  రిప్లయితొలగించండి
 21. మమతను వీడు నీవిపుడు, మార్గము వేసితి పాపులన్ వినా
  శము నొనరించి బ్రోవగను సజ్జనులన్ భువి నిశ్చయమ్ముగా
  బ్రమలను వీడి, ప్రీతి భగవంతుని రూపము నీదుహృత్సరో
  జముననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. విమలమతి నింపుగ వివా
   హ మాడఁగాఁ జూచి నంత నాత్మజ కలిగెం
   గమలదళాక్షి యచిరమే
   జమునన్ గనినంత విజయశాంతి లభించెన్


   విమల జలమ్ము భాసిలఁగ వీవఁగ నొడ్డునఁ జల్ల గాలి ప
   శ్చిమమున సూర్య బింబము విశేషపు టెఱ్ఱని రంగుఁ జిందఁగాఁ
   గమలిన చిత్త మక్కజముగా నట నూఱట సెందఁ జక్కఁగన్
   జముననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్

   [జమున =యమునా నది]

   తొలగించండి
 23. అమితోత్సాహము గలిగెను
  జమునన్ గనినంత ,విజయ! శాంతిలభించెన్
  మముజూడుమయొకపరి,మా
  యుమనాధునిగరుణయుంట యొనరెను సుఖమున్

  రిప్లయితొలగించండి
 24. అమరెననేకగోళములనాగతిలోకములన్నినేకమై
  తమకముతోడపార్ధుడునుతన్మయుడయ్యెవణంకమేనునున్
  మమతనువీడెనప్పుడునుమాయనుదాటెమహోదయంబురా
  జముననుఁజూడగావిజయశాంతిలభించెజయప్రదమ్ముగన్

  రిప్లయితొలగించండి

 25. ~~~~~~~~~~~~~~~~~~
  ప్రముఖుడు దర్శకత్వమున
  రాజసమొప్పెడు రాజమౌళి తా
  నమిత సహాస తారకయి య
  క్కడ నిక్కడ వెద్కసాగె నా
  సమయమునందునన్ మిగుల
  చక్కని చుక్కయె యా సినీ సమా
  జమునను జూడగా విజయశాం
  తి లభించె జయప్రదంబుగా
  ~~~~~~~~~~~~~~~~~~
  యల్ జి

  రిప్లయితొలగించండి
 26. విమలపు మానసంబునను వేయిరకంబగు చిత్స్వరూపమౌ
  జమునను జూడగావిజయ! శాంతిలభించె జయప్రదమ్ముగన్
  నమలిన రక్తిగల్గుచును నాదరమొందగ జిత్రప్రక్రియన్
  బ్రమదము తోడచేయుచును రాణకునెక్కినభామయామెయే

  రిప్లయితొలగించండి
 27. ప్రమదంబగు నాటి నటుల
  జమునన్ గనినంత; విజయశాంతి లభించెన్
  జమునకు వారసురాలై
  అమితానందంబు గూర్చు నద్భుత నటిగా

  రిప్లయితొలగించండి
 28. జమునకు సోదరీమణులు చాల చలా కి టపాసులైనధీ
  సుమతులు శాంతియున్ విజయ, సుంతము ఆగరు వారు మువ్వురున్
  తమకము దీర ఆడుకొని తల్లికి కన్పడ కుండ దాగినన్,
  జమునను చూడగా విజయ,శాంతి లభించె జయప్రదమ్ముగా.

  రిప్లయితొలగించండి
 29. రమణులతో నాటకమును
  కమనీయముగా నెరపెడు కాంక్షను మదిలో
  తమిగొనఁగ మహిళల సమా
  జమునన్ గనినంత విజయశాంతి లభించెన్

  రిప్లయితొలగించండి
 30. అమలిన మనమున భార్యయు
  కొమరుల తోడనుతిరుగుచు కువలయమందున్
  హిమగిరులనుగని మరలుచు
  *జమునను గనినంత విజయశాంతి లభించెన్

  రిప్లయితొలగించండి