28, ఏప్రిల్ 2021, బుధవారం

సమస్య - 3707

29-4-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడవ పతి యున్న సాధ్వికే గౌరవమౌ”
(లేదా...)
“ఏడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్”

35 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    [సావిత్రి తన భర్త ప్రాణము లిమ్మని యమధర్మరాజును కోరిన సందర్భము]

    "కూడని కోర్కె నే నిపుడు కోరను నో యమధర్మరాజ! యే
    యాడుదియైనఁ దాళిఁ గని, యందును సంతస మిద్ధరాతలిన్!
    మేడలు కోటలున్ నగలు మెచ్చను; పెత్తన మెద్ది కల్గ నే
    నేడవ! భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్!"

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జోడుగ నుండెడి ధవుడే
    కీడొనరించుచు దుడుకుగ కెరలుచు నున్నన్
    వీడను వానిని మరి నే
    నేడవ! పతియున్న సాధ్వికే గౌరవమౌ!

    రిప్లయితొలగించండి
  3. కీడుల లెక్కజేయరుగ, కించితు నైనను బాధనొందరీ
    బోడులు, జీవితమ్మునిక బోఁడిమి యెల్లను బ్రాణనాథుడే!
    వీడులు, పాడి పంట లిఁకవేల సనాతన ధర్మపత్ని కిం
    కేడవ! భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్.

    పోడిమి- సంపద
    వీడు - గృహము (ఆం.భా)

    రిప్లయితొలగించండి
  4. కందం
    కూడును సద్గతులంచున్
    వేడుచు మదిఁ గార్తికేయు వేదన దొలఁగన్
    గోడెఱుఁగ సంతు నిమ్మను
    చేడవ, పతి యున్న సాధ్వికే గౌరవమౌ

    ఉత్పలమాల
    కూడును సద్గతుల్ సుతులఁ గూర్మినిఁ గన్న నటంచు భక్తితో
    వేడుచు కుక్కుటధ్వజుని వేగమె సంతునొసంగ ప్రార్థనన్
    గోడెరుగంగ స్తోత్రములఁ గోరుచు వేదనఁ బాప నార్తితో
    నేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

    రిప్లయితొలగించండి
  5. పోడిమిషట్కర్మలతో
    వీడకభర్తనుతలచుచువేల్పునుగాగన్
    తోడుగనీడగతనకోర
    కేడవపతియున్నసాధ్వికేగౌరవమౌ

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జోడుగ నుండు వల్లభుడు జోరుగ చెడ్డను జేయు కార్యముల్
    వేడుకగా గ్రహించి తన ప్రేయసినైన ననున్ బడల్చినా
    వీడక వాని సంగడము వెంటను దిర్గుచు నుందు కాని నే
    నేడవ! భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్!

    రిప్లయితొలగించండి
  7. తోడుగ నీడగ మెలగుచు
    వీడక వెన్నంటి యుండు ప్రీతి మగండై
    వేడుక గూర్చెడు దరి యే
    యేడవ పతి యున్న సాధ్వి కే గౌరవ మౌ?

    రిప్లయితొలగించండి

  8. వాడొక వ్యసనపరుడు గా
    లోడితుడాతడు కుకభపు లోలుడు వాగెన్
    మోడు సఖులతో నిట్టుల
    నేడవ పతియున్న సాధ్వికే గౌరవమౌ.


    వాడొక లొట్టముచ్చు మధుపానము జేయుచు వీధిమధ్య గా
    లోడితుడంత తూలుచు ఖలుండ్రగు మిత్రులగూడి మత్తుతో
    నాడది యాడదంచు పరిహాసము లాడుచు నిట్లు వాగెనే
    యేడవభర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్


    నీడను కూడ నమ్మనని నీచుడు పల్కుచు శంశయించు గా
    లోడితుడౌ మగండు గల రుక్మిణి తాళగ లేనటంచు తా
    వీడగ పిచ్చివాడగుచు పెన్మిటి మద్యము గ్రోలి వాగెనే
    యేడవ భర్తకల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్.

    రిప్లయితొలగించండి
  9. కె.వి.యస్. లక్ష్మి:

    తోడయ్యె పతి నాకున్
    వేడుక గూర్చుచు బ్రతుకున వెలుగులు నింపన్
    కూడని సంతతి కొరకై
    నేడవ! పతియున్న సాధ్వికే గౌరవమౌ!

    రిప్లయితొలగించండి
  10. ఉ:

    మూడగు ముళ్ళు వేయగనె ముచ్చట గొల్పెడి జోడి యంచనన్
    తోడుగ నుండగోరిరట దూరము గాకిట నేడు జన్మలున్
    వీడని ధర్మ సందియము వేగమె దూయగ బల్కె నో ప్రభో
    నేడవ భర్త కల్గి నపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. సీతమ్మ ఉవాచ

    వీడుచు రాజ్యభోగముల వేసటనొందక రామచంద్రుడే
    వేడుక కాననమ్ములకు వెళ్ళుటకై మనమిచ్చగింపగా
    తోడుగ ధర్మచారిణిగ తోషమునందుచు వెంబడించ నే
    నేడవ! భర్తకల్గినపు డేగద సాధ్వికి గౌరవంబిలన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతమ్మవారే

      మూఢత మాయలేడికయి ముప్పును బొందితి లంకలోపలన్
      ఱేడగు రామచంద్రుడయొ రేయిని ప్రొద్దును కానలోననున్
      జాడను గానకే ఘనవిచారము గ్రుంగుచు పెద్దపెట్టున
      న్నేడవ! భర్తకల్గినపు డేగద సాధ్వికి గౌరవంబిలన్ !

      తొలగించండి
  12. సమస్య :

    ఏడవ భర్త కల్గినపు
    డే కద సాధ్వికి గౌరవంబిలన్

    ( మండోదరి రావణాసురునితో )

    ఉత్పలమాల
    ....................

    కూడదు కూడదం చనిన
    కొంచెము కూడ మదీయవాక్కులన్
    బోడిమి నాలకింపవుగ ;
    పోరిపు డేర్పడె ; నాశనం బికన్
    వీడదు మిమ్ము ప్రాణపతి !
    వెన్నెలమేడల లంకకోసమై
    యేడవ ; భర్త కల్గినపు
    డే కద సాధ్వికి గౌరవంబిలన్ !!

    రిప్లయితొలగించండి
  13. వాడుక బంటై మంత్రై

    జోడై నలుడై క్షమకును చోటై చక్క

    న్వాడైనార్వురు పతులౌ

    ఏడవ పతి యున్న సాధ్వికే గౌరవమౌ”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  14. పాడిన మూగభావములపాటలచిత్రము నాలకించగన్,
    గూడిరినేడుజన్మలకుగోరుచుబంధమునంతరాత్ములై
    వీడగభౌతికంబుగనువేరగుభర్తను,జీవితంబున
    న్నేడవ,భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  15. తోడయి మంచి భర్త కడు తోషము నింపెను జీవితమ్మునన్
    కూడెను పుత్రుడున్ పుడమిఁ గూర్చ ముదమ్మును, పెంచి ప్రీతితో
    పోడిగ పెండ్లిఁ జేయగను పోయెను వేరుగ, వాడికోసమై
    యేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

    రిప్లయితొలగించండి
  16. ఏడవనాభరణములకు
    నేడవ చీనాంబరములనిమ్మని పతియే
    యేడుగడసతికి నెప్పుడు
    నేడవ పతి యున్న సాధ్వికే గౌరవమౌ

    రిప్లయితొలగించండి
  17. కూడుకు గుడ్డకున్ మరియు గూ
    డుకు లోటది యెంతయుండినన్
    తోడుగ నుండి యెల్లపుడు దో
    షము లెన్నక ప్రీతితోడ నా
    నీడగ నుండునట్టి పతి నిక్క
    ము పొందితి నేను యందుకే
    యేడవ, భర్త కల్గినపుడే కద
    సాధ్వికి గౌరవంబిలన్"

    రిప్లయితొలగించండి
  18. పొందితి నేను నందుకే
    సవరణ గమనించండి గురువుగారు

    రిప్లయితొలగించండి

  19. గాడిద తోడ సేసిరట కర్మఫలంబని పెండ్లి, పిమ్మటన్
    బేడికి కట్టబెట్ట తను వీడెను షండుడటంచు పెద్దలో
    మోడున కిచ్చిచేయ గని బోడిక యిట్లు వచించె ధాత్రిలో
    యేడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్.

    రిప్లయితొలగించండి
  20. వీడి ప్రపంచబంధముల వేగమె సాగెడి భర్తకోసమై
    రాడని వీడకుండ కనరానటి దుష్కర మార్గమందున
    న్నీడగ వెంబడించి తను నేర్పుగ కాలుని మెప్పుబొందగా
    నేడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

    రిప్లయితొలగించండి
  21. పాడినిఁదప్పుచున్సుమతిభర్తయుభోగినిపోందుగోరగా
    చేడియవానినంతటనుచేర్చెనుకాంతలభోగమందగా
    వీడదుపూజ్యభావమునువేదనఁజెందదునాధునాజ్ఞతా
    నేడవ. భర్తగల్గినపుడేగదసాధ్వికిన్గౌరవంబిలన్

    రిప్లయితొలగించండి

  22. కాడెద్దులు పొలమమ్మితి
    పాడెక్కెడు పతియె దక్కె భాగ్యంబదియే
    పాడు ధనమ్మది పోయిన
    నేడవ, పతియున్న సాధ్వికే గౌరవమౌ.


    పాడుకరోన సోకగను భర్తయె మృత్యువుతోడ తాను పో
    రాడిన వేళ మందిరము రాజిక లమ్మితి భేషజమ్ము కై
    పాడుధనమ్ము పోయినను బాధయె లేదుర దాని కోసమై
    యేడవ, భర్తకల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్.

    రిప్లయితొలగించండి
  23. చేడెల కెల్లర కరయఁగ
    నేఁడు పతియె నిత్య దాత నీ వాగుమ యి
    ట్లాడిన సంఖ్య గణింపఁగ
    నే డవ! పతి యున్న సాధ్వికే గౌరవమౌ

    [ఏడు +అవ =ఏడవ; అవ = అవ్వా]


    ఱేఁడు గుణాఢ్యుఁ డుత్తముఁడు ఱేయుచుఁ బాలన సేయ ధాత్రినిన్
    వీడుల నున్న మానవుల ప్రీతిని మన్ననఁ బొందు నట్టులే
    యీ డగు సద్గుణావృతుఁడు నిద్ధ చరిత్రుఁడు, స్వీయ శత్రులే
    యేడవ, భర్త కల్గి నపుడే కద సాధ్వికి గౌరవం బిలన్

    రిప్లయితొలగించండి
  24. వేడుక మీర నాతనిని ప్రేమగ కోరుచు బెండ్లి పీటలన్
    దోడుగ చేరి వేగిరమె దుష్టుడటంచును వీడి పోవగా
    కూడదు! ఓ వధూటి! పతి కూరిమి జేకొన బోక యేల నీ
    వేడువ? భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవం బిలన్!

    రిప్లయితొలగించండి
  25. నేడు విదేశ సంస్కృతియె నీమమనిన్ సహజీవనంబనిన్
    వేడుక మాటలాడి దన పెంకెతనంబును జూపు ముద్దరా
    లేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్,
    వీడుము దుష్ప్రచారమని వేదికపై నెచరించె ప్రాజ్ఞియే

    రిప్లయితొలగించండి
  26. వీడక కరోన జనులను
    నేడును నాడును బ్రబలుచు నెఱి బాధించన్
    వేడుచు రాముని నాసతి
    యేడవ పతియున్నసాధ్వికేగౌరవమౌ

    రిప్లయితొలగించండి
  27. ఓ పడుచు....

    మూడగు ముళ్ళువేసి పరిపూర్ణతనిచ్చి సుఖాల దేల్చగా
    తోడు, హసింపజేయగ విదూషకుడై, గృహమందు భృత్యడై,
    వేడుకలెన్నొ గూర్చి ,పలు వేదనలందున నూరడింప నే
    *నేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  28. ఏడవ భోగభాగ్యములకెన్నడు, నెందుకు స్వర్గ సౌఖ్యముల్?
    వేడుదు భర్త ప్రాణముల వీడుమటంచును దండపాణి యా
    కీడునొనర్ప న్యాయమొకొ? క్షేమముగూర్చగ నాదు నాథు కే
    నేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్

    రిప్లయితొలగించండి
  29. వీడక యాకరోన నిల వేలకొలందిజ నంబులే జనన్
    బాడుకరోన వచ్చి మాబ్రదుకు బాధలొనర్చెను నంచు భామినుల్
    యేడవ,భర్తకలిగినపుడేకద సాధ్వికిగౌరవంబిలన్
    వేడుకొనంగమేలు బ్రజ వీడగ బాధలురామునిన్ నికన్

    రిప్లయితొలగించండి

  30. మేడల్మిద్దెల వేటికి
    నీడగ దోడౌచు గాచి నెనరులు నింప
    న్వీడగ జాలన్నేనా
    డేడవ, పతి యున్న సాధ్వికే గౌరవమౌ!


    రిప్లయితొలగించండి
  31. చూడనిది మనకు చోద్యము
    పడతికి పలుమార్లు పెళ్లి పలువురి తోడన్
    అడవిని గిరిజన తెగలో
    ఏడవ పతి యున్న సాధ్వికే గౌరవమౌ

    రిప్లయితొలగించండి