14, ఏప్రిల్ 2021, బుధవారం

సమస్య - 3693

15-4-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్”
(లేదా...)
“కరగిన నేయి నిప్పుపయిఁ గాచిన గడ్డలు గట్టెఁ జూడఁగన్”

62 కామెంట్‌లు:

 1. అరుదగు గారడి జేయుచు
  నిరుపమ రీతిగను దాను నేర్పరి యగుచున్
  మురియగ నందరు నొకచో
  కరగిన నెయి నిప్పు నుంచ గడ్డలు గట్టెన్

  రిప్లయితొలగించండి
 2. పొరుగున నున్న చీని దళమున్ సడిసేయక దాడిసేయగా
  మరుగున నున్న సైనికులు మాతృ ఋణంబును దీర్చ ధాటిగా
  పరుగున ఢీకొనంగ హిమ పాతము తాకిడి మాయమై జవాన్
  *“గరగిన నేయి నిప్పుపయిఁ గాచిన గడ్డలు గట్టెఁ జూడఁగన్”*

  రిప్లయితొలగించండి
 3. పరమ శివునర్చన కొరకు

  కరములు నిండుగ ఘృతమును గాదిలి జేర్చిన్

  గిరినన్ హిమపు వణుకునన్

  కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 4. విరివిగగుణములుగలిగిన
  నరునకుమేలుగకరోనమందునునీయన్
  సిరలనుప్రవాహమాగెను
  కరిగిననేయినిపునుంచగడ్డలుగట్టెన్

  రిప్లయితొలగించండి
 5. చిరుతిండి జేయ గోరుచు
  వరిపిండిని తెచ్చి క్రొత్త వంటను జేయన్
  మరులముతో తడిపి కలిపి
  కరిగిన నెయి, నిప్పునుంచ గడ్డలు గట్టెన్.

  రిప్లయితొలగించండి
 6. నిరతము వడ్డన జేయుము,
  కరకరమని యప్పడములు కమ్మగనుండున్,
  విరళము శీతల తలమున,
  కరగిన నెయి; నిప్పునుంచ; గడ్డలు గట్టెన్!

  విరళము=పెరుగు

  రిప్లయితొలగించండి
 7. ఎరుపగు బల్బుల కల్పిత
  మరయగ నిప్పులు సినిమా అవసరమున చే
  సిరి చలిలో తెలియక చెలి
  కరిగిన నెయి నిప్పు నుంచ గడ్డలు కట్టెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. గురువు గారు క్షమించి తప్పును సూచించ ప్రార్థన.

   ఎరుపగు| బల్బుల| కల్పిత|
   మరయగ|నిప్పులు| సినిమా| అవసర|మున చే
   సిరి, చలి|లో తెలి|యక చెలి
   కరిగిన|నెయిని|ప్పునుంచ| గడ్డలు| కట్టెన్

   తొలగించండి
  3. రెండవ పాదంలో మూడవ గణం జ,లేదా నల గణం ఉండాలి

   తొలగించండి
  4. కందము న జగణము మరచి
   తొందరలో వ్రాసి నేను తొట్రును బడితిన్
   వందనము మీకు చెప్పెద
   కుందగదు మరిసరి చేయ గురువులు దయతో ​

   తొలగించండి
 8. కందం
  జరిగిన విపరీతములకు
  మరిగిన మది కుదుట పడును మమతల సలువై
  యరయఁగ హిమ మందసమై,
  కరిగిన నెయి నిప్పునుంచఁ, గడ్డలు గట్టెన్

  చంపకమాల
  జరిగిన వైపరీత్యములు జ్వాలలు రేపగ మానసమ్మునన్
  మరుగిన నైన స్వాంతనము మైగను ప్రేమల చల్వతోడుగా
  నరయగ శీతళీకరణమందుచు శీతల మందసమ్మునన్,
  గరగిన నేయి నిప్పుపయిఁ గాచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్

  రిప్లయితొలగించండి
 9. మరిమరి కోరెనంచు నొక మానిని తప్పదటంచు వెంటనే
  విరివిగ తెచ్చె తా శనగ పిండిని మైసురు పాకు జేయగన్
  భరమని యెంచకుండ నొక పాత్రన కల్పుచు పంచదారతో
  కరిగిన నేయి, నిప్పుపయిఁ గాచిన గడ్డలు గట్టెఁ జూడఁగన్.

  రిప్లయితొలగించండి
 10. సిరియనుసీతనచ్చటనుచిత్రముగాగనుకుందునట్లుగా
  అరికినిదాసియయ్యెననియాయమరాముడునిందఁజేసెనే
  కురిసెనుకంటధారగనుగుంభితమేఘమునాజ్యమట్లుగన్
  కరిగిననేయినిప్పుపయిగాచినగడ్డలుగట్టెచూడగన్

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పొరిగ యజతి కేమి వలయు?
  గరవడి యౌనగు ఘృతమది కరుగును నెపుడున్?
  కరగిన నెయి చలి నేమగు?
  కరగిన నెయి; నిప్పు నుంచ; గడ్డలు గట్టెన్.

  రిప్లయితొలగించండి
 12. సమస్య :

  కరగిన నేయి నిప్పుపయి
  గాచిన గడ్డలు గట్టె జూడగన్

  ( మురహరి తన మిత్రుడు నరహరితో )

  నరహరి ! విందువా ? మనము
  నమ్మని వింతను జెప్పె తాతయే ;
  యిరువది యేండ్ల క్రిందటట !
  యెక్కడి యాతడొ యింటిముందు న
  చ్చెరువును గొల్పు సాహసపు
  చిత్రము జేసెను సర్వసన్నిధిన్ ;
  గరగిన నేయి నిప్పుపయి
  గాచిన , గడ్డలు గట్టె జూడగన్ .

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్సులు!

  [1]
  అరిగితి శీతఖండమున; కక్కడి శీతల కోష్ణ సంస్థితు
  ల్తిరముగ నుండ, నే నచట గ్రీష్మపు ఛాయలఁ గ్రోల నెంచియుం,
  ద్వరితముగా సుకాష్ఠముల, వహ్నిని వ్రేల్చియు, నప్డు, నింటనుం

  గరఁగిన నేయి, నిప్పుపయిఁ గాఁచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్!

  [2]
  సరసముఁగాఁగఁ జంద్రికలు శారద రాత్రులఁ దెల్లఁ జేయుచున్
  బఱచిన చల్లగాలు లిలఁ బంచెను హాయినిఁ బూల పాన్పుపై;
  విరియఁగ నా మనమ్ము, తలఁపించె హిమాద్రి నివాస; మచ్చటం

  గరఁగిన నేయి, నిప్పుపయిఁ గాఁచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్!

  రిప్లయితొలగించండి
 14. మరులను తన కరమునుగొన
  బరువని భావించి సతిని బాధలు పెట్టన్
  దురముగ నురివేసుకొనగ
  కరిగిన నెయి నిప్పునుంచ గడ్డలుకట్టెన్

  రిప్లయితొలగించండి
 15. కార్యాలయం లో పనిభారము ఒక్కడిపైనే వేసినపుడు ఆ ఉద్యోగి తిరగ బడిన పరిస్థితి ఆధారంగా నా ప్రయత్నము

  చం:

  నిరతము చావ గొట్టుచును నిప్పులు చిమ్ముచు కార్య భారమున్
  పరులకు పంచకుండగను వైరము నెంచు ప్రవృత్తి మీరగన్
  తలపడి యాజ్ఞ మీరె నట తట్టగ నొక్క నుపాయ మివ్విధిన్
  కరిగిన నేయి నిప్పు పయి గాచిన గడ్డలు గట్టె జూడగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సరవిని యాగ మెంచుటకు జాస్తిగ యుక్తమునైన దేమగున్?
  గరవడియైన నేతిని చొకారముగా కరగించు టెట్లగున్?
  కరగిన నేయి తాను చలికారున నెట్టి విధంబు మారునౌ?
  గరగిన నేయి; నిప్పుపయిఁ గాచిన; గడ్డలు గట్టెఁ జూడఁగన్.

  రిప్లయితొలగించండి
 17. కె.వి.యస్. లక్ష్మి:

  విరివిగ పెండ్లికి వలసిన
  అరిసెలు వందగను వచ్చి ననుభవ శూన్యుల్
  త్వరగా పిండియు బెల్లము
  కరిగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్.

  రిప్లయితొలగించండి


 18. అరిగన రికార్డు వేయుచు
  కరగిన నెయి నిప్పునుంచ, గడ్డలు గట్టెన్
  మరి నా మది నాటి తలపు
  లు రయ్యనుచు తట్టగా ములుకుగ తగులుచున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 19. సలసల సువాస నల కా
  వల కరగిన నేయి నిప్పుపయిఁ గాచిన! గ
  డ్డలు గట్టెఁ జూడఁగన్ ఫ్రి
  జ్జులోన పెట్టగ జిలేబి చోద్యంబిదియే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. దొరకుట దుర్లభమ్ములట ధూర్తులు దొంగలు పెచ్చు మీరగన్

  నర వర కల్తి లేని బహు నాణ్యపు వస్తులు వంటకమ్ములున్

  వరునకు భోజనమ్మునను వాజమునత్తయె వేయు కోరికన్

  కరగిన నేయి నిప్పుపయిఁ గాచిన గడ్డలు గట్టెఁ జూడఁగన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. కరమునదాల్చికొందరునుకమ్మదనంబునుగ్రోలుచందమున్
  స్థిరముగవెన్నదీయుచునుఁదీరుగనూగుగమార్చురెవ్విధిన్
  సురుచిరఁగాశియందునిదిసోమునిబూజకుశీతలమ్మునన్
  కరగిన నేయి ,నిప్పుపయిఁ గాచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సురుచిర' తర్వాత అరసున్న అవసరం లేదు.

   తొలగించండి
 23. మరులుగొనవలె తిని నతిమ
  ధురమైన మిఠాయి మీరు, దొరికెను మనకై
  చెరుకురసముచాల, కలిపి
  కరగిననెయినిప్పునుంచగడ్డలు గట్టెన్

  రిప్లయితొలగించండి
 24. వరదుని పూజలన్ సలుప పండుగ రోజున మించు భక్తితో
  అరిసెలు చేయనెంచుచు రయమ్మున బాణలి లోన వేయగా
  సరగున తెచ్చి బెల్లమును స్వచ్ఛపు బియ్యపు పిండియున్
  కరగిన నేయి, నిప్పుపయిఁ గాచిన గడ్డలు గట్టెఁ జూడఁగన్

  రిప్లయితొలగించండి
 25. దొరలెను ఘుమ ఘుమ వాసన
  కరగిన నెయి నిప్పునుంచ; గడ్డలు గట్టెన్
  తిరుగ నదియె నావల నిడ
  పెరిగెను గద చలి శిశిరము వెదచింద భువిన్

  రిప్లయితొలగించండి
 26. చురచుర యనుచును బేలును
  కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్
  నిరతము శీతలమగుటన
  నరయుమ యాక్షీరమంత యట్లుగమారెన్

  రిప్లయితొలగించండి
 27. చురచురలాడుచున్ మిగులజొప్పుచు శబ్దమువచ్చుడప్పుడున్
  గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్
  నిరతము చల్లజేయుటన నేయియుమారెనుపూర్వరూపమై
  యరయుము పండితోత్తముడ! యందలిమార్పుల చిత్రమంతయున్

  రిప్లయితొలగించండి
 28. దురితములందు పాలుగొన తోడువునీవని పార్లమెంటుకున్
  ద్వరితము పంపగానచట తంపులబెట్టుచు కోర్టుకీడ్చుచున్
  పరువును నీటముంచగను భగ్గునమండెడు జిత్తమున్ కటా!
  కరిగిన నేయి, నిప్పుపయి గాగిన గడ్డలుగట్టె జూడగన్

  నేయిని స్నేహమనే అర్ధంలో గ్రహించడమైనది!

  రిప్లయితొలగించండి
 29. అరయగ హవ్యము జాలక
  సరియగు యాహారమేది సాచియె నలుగన్
  కరగడె భక్తిని గొల్చిన
  కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

  రిప్లయితొలగించండి
 30. అరయగ హవ్యము జాలక
  సరియగు యాహారమేది సాచియె నలుగన్
  కరగడె భక్తిని గొల్చిన
  కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

  రిప్లయితొలగించండి
 31. విరిగిన దుగ్ధమునందున
  చిరుమజ్జిగతోడుబెట్టి చిలికిన దధిలో
  నురగయె వెన్నగదలచితి
  కరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

  రిప్లయితొలగించండి
 32. రిప్లయిలు
  1. తిరముగ నొక్క క్షణ మయినఁ
   దిరుగక నొక చోట నిల్చి తీయఁడు వహి న
   త్తరి నుత్తీర్ణుం డయ్యెను
   గరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్

   [వహి = పుస్తకము]


   పరమ మునీంద్రు లచ్చటఁ దపస్సుల నెవ్విధి నాచరింతురో
   సురుచిర శీతకాలమునఁ జోద్యము దుస్సహ శీతలంపు టా
   గిరి పయి నుంచ నొక్క త్రుటి గిన్నెను జల్లగనై తటాలునం
   గరగిన నేయి, నిప్పుపయిఁ గాచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్

   [అన్వయము: నిప్పుపయిఁ గాచిన కరగిన నేయి]

   తొలగించండి