7, ఏప్రిల్ 2021, బుధవారం

సమస్య - 3686

8-4-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిట్టువారి కిడుము దీవెనలను”
(లేదా...)
“తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్”

39 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    రట్టును జేయగా మిగుల రాక్షసి వోలుచు తిట్లతోడనున్
    గట్టిగ జుత్తు పట్టుకొని గాభర నొందక లాగి తెచ్చుచున్
    పట్టుకు వచ్చి నాకడకు ఫక్కున నవ్వుచు నత్తగారినిన్
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  2. తప్పులెన్నువారుతల్లియుతండ్రియు
    మనసుదెలిసిచూడుమాటులేదు
    నిందనిన్నుజేయునియమవంతునిగాను
    తిట్టవారికిడుముదీవనలను

    రిప్లయితొలగించండి
  3. ఓపలేని వారు నుగ్రరూపముదాల్చి
    నీదు భక్తులేను వేదవేద్య!
    కష్ట మేల మాకు కరుణయే లేదని
    తిట్టువారి కిడుము దీవెనలను!!

    రిప్లయితొలగించండి
  4. అదురు బెదురు వీడి యందరి పీడించి
    క్రూర కృత్య ములను ఘోరములను
    సలుపు నట్టి వారి సజ్జనుల్ గమనించి
    తిట్టు వారి కిడుము దీవెనలను

    రిప్లయితొలగించండి
  5. 🤬గుట్టుగజీవితంపుసుమకోమలభావనసౌమనస్విచే
    పట్టినకార్యమెప్పుడునభాసుగమారదునర్ధవంతమై
    కట్టడిచేయగాజనులకమ్మనికావ్యముగాగభాసిలున్
    తిట్టెడివారికెల్లరకుదీవనలిమ్ముశుభమ్ముగోరుచున్

    రిప్లయితొలగించండి
  6. ప్రజల దోచుకొనెడి ప్రభువులల్లదెజూడు

    తిట్టువారి కిడుము ; దీవెనలను

    కూర్చి మాల జేసి కుదురుగ వేయరో

    జనుల మంచి కోరు ఘనుడి మెడన

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. 🤬గుట్టుగజీవితంపుసుమకోమలభావనసౌమనస్విచే
    పట్టినకార్యమెప్పుడునభాసుగమారదునర్ధవంతమై
    కట్టడిచేయగాజనులకమ్మనికావ్యముగాగభాసిలున
    తిట్టెడివారికెల్లరకుదీవనలిమ్ముశుభమ్ముగోరుచున్

    రిప్లయితొలగించండి
  8. పట్టరు దీక్షనెప్పుడును పామరులైనను పండితుండయున్
    దిట్టగ కోరుచుందురిట దీటుగ కోర్కెల దీర్చు మంచుచున్
    పట్టని దైవచింతనల భావమెరుంగని జ్ఞాన శూన్యులౌ
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్!!

    రిప్లయితొలగించండి
  9. కోట్లు ఖర్చుచేసి సీట్లుపొందినవారు
    ప్రజలసొమ్ము మ్రింగు స్వార్థ పరులు
    నీతిలేని దుష్ట నేతల కనుగొని
    తిట్టువారి కిడుము దీవెనలను

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    ఎట్టి ఫలమ్ములేక, శ్రమియించిన క్షేత్రము బీడు రూపమై
    గిట్టఁగఁ, దల్లడిల్లి, కడుఁ గ్లేశమునన్ దురపిల్లుచున్, శివా!
    మెట్టియు నీదు నాలయము, మెప్పులఁ దప్పులఁ బల్ వచస్సులం
    దిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
  11. పుట్టెను పొట్టి వారలగు పోకిరి ధూర్తుల చీని దేశమున్

    పెట్టెను కాలు మోదమున పీడన చేసెను వాడ వాడలన్

    పట్టుగ పంచి మందులను పాడు కరోనను పొమ్ము పొమ్మనిన్

    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  12. నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య

    తిట్టిన వారికెల్లరకు దీవెనలిమ్ము శుభంబు గోరుచున్

    నా పూరణ

    ఉత్పలమాల

    గట్టిగనమ్మి పల్కెదను కారణహేతుడ! చంద్రశేఖరా!
    మెట్టిన యింటిలో మగడు మీసము ద్రిప్పుచు మోసగించుచున్
    కట్టిన తాళికిన్ విలువ, గౌరవమీయక హింసపెట్టుచో
    తట్టుకొనంగలేక వనితామణి బాధ్యునిఁ జేయుచున్ నినున్
    దిట్టిన, వారికెల్లరకు దీవెనలిమ్ము శుభంబుఁ గోరుచున్.

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  13. తట్టలకొద్ది కూరలను తక్కలి కొన్నదినమ్ము కందుచున్
    కొట్టి హితమ్ము పేర్కొనెడు కుల్యులు గావలె గాదె లోకమున్
    బొట్టియ దారితప్పుతరి ముందుగ వారిని మేలుగోరుచున్
    తిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ము గోరుచున్.

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    ముట్టిన చోట ముట్టకయె ముట్టడి చేయ కరోన రోగమున్
    పట్టిన చోట పట్టకయె ప్రక్కకు దప్పుచు దూరమెంచగన్
    గిట్టని వారు, చూపరులు కేకలు వేయుచు కోపగించ నా
    తిట్టెడి వారికెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. శంకరాభరణం సమస్య
    ~~~~~~~~~~~~~~~~~
    "తిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముజయమ్ము గోరియున్"

    పుట్టిన ప్రాణులీధరను బూజ
    లు నోముల నెన్ని నోచినన్
    గిట్టుట నిక్కమంచెరిగి కిన్కను
    వైరులపైన వీడి నిన్
    దిట్టెడు వారికెల్లరకు దీవెనలి
    మ్ము జయమ్ము గోరియున్
    పుట్టెడు పణ్యమబ్బు కడు మో
    దము కల్గును నీకుసైతమున్.
    ~~~~~~~~~~~~~~~~~~
    యల్ జి

    రిప్లయితొలగించండి
  16. పుట్టుక లేనివాడు వెలిబూడిద పూతల మేనివాడు దా
    పట్టు కపాలమున్ దినుపాత్రగ సర్పము భూషణమ్ముగా
    కట్టును తోలువస్త్రముల కాడున వాసము జేయువాడనిన్
    దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

    నిందాస్తుతి!🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో
      పుట్టుక లేనివాడు వెలిబూడిద పూతల మేనివాడు చే
      పట్టు కపాలమున్ దినెడు పాత్రగ సర్పము భూషణమ్ముగా
      కట్టును తోలువస్త్రముల కాడున వాసము జేయువాడనిన్
      దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

      తొలగించండి
  17. పట్టెడుయన్నమైన తుదిcబెట‌్ట‌డు నీచుడు తల్లిదండ్రికిన్
    పెట్టెను వాcడు వృద్ధులను పట‌్ట‌ణమందలి ఆశ్రమంబునన్
    అట్టి దురాత్ములందరికి జ్ఞానముcబంచుచు వారి మార్పు కై
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్”

    రిప్లయితొలగించండి
  18. ఎన్నికలకు ముందు యేదికోరిన యది
    యుచితమంచు నుడివి యోట్లు
    పొంది
    గద్దె నెక్కి నతడు దప్పులు సేయగ
    తిట్టువారి కిడుము దీవెనలను

    రిప్లయితొలగించండి
  19. తిట్టిన హేమకశ్యపుడు తిన్నడు రావణ కుంభకర్ణులున్
    తిట్టిన గోపరాజు సరి తిట్టిన వారికి నెల్ల మోక్షమబ్బ నా
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్
    తిట్టిన చేరదీయ కడ తేర్చిన శ్రీహరి చిత్తమీ భువిన్ !

    రిప్లయితొలగించండి
  20. సమస్య :
    తిట్టెడి వారి కెల్లరకు
    దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్

    ( అరసికులకు సమాధానమీయక ఆశీస్సులివ్వమని కవికి సలహా నిస్తున్న మిత్రుడు )

    ఉత్పలమాల
    ....................

    ఎట్టుల నైన సైపు సుక
    వీశ్వర ! దివ్యపు భావసంపదన్
    బట్టుగ నింపుకొంచు మృదు
    పద్యములెన్నియొ నాట్యమాడగా
    దిట్టలవోలె ధిక్కరణ
    దెంపుగ జేయుచు దీరుబాటుగా
    దిట్టెడివారి కెల్లరకు
    దీవెనలిమ్ము శుభమ్ము గోరుచున్ .

    ( సైపు- ఓర్చుకొను ; పట్టుగ - బాగుగ )

    రిప్లయితొలగించండి


  21. కొమరాల! తిట్టు వారికి
    డుము దీవెనలను పరేశుడు నిను కరుణతో
    డు మునుకడగాచు! నిజమై
    న మాన వత్వమును చూపు నలుగురు మెచ్చన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. మన్నుదిన్నపాము మానవత్వమునిజా
    యితిని నీతి వీడి వెతలబెట్ట
    ప్రజల కొరకు,చేత,వలన,పాలకుడాతనిన్
    దిట్టువారికిడుము దీవెనలను

    రిప్లయితొలగించండి
  23. మంజునాథహితుడు మంజునాథాఖ్యుడు
    దేముడన్ననలుగు దీనహితుడు
    వాడునీదువాడు పెడదారిలోనిను
    దిట్టువారికిడుము దీవెనలను

    రిప్లయితొలగించండి


  24. అశుభము పలుకకు! నడత ప
    రశ! తిట్టెడివారి కెల్లరకు దీవెనలి
    మ్ము శుభమ్ముఁ గోరుచున్ వ
    చ్చు శోభలు నిను వెతుకుకొనుచు జిలేబి వినన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. కీర్తినిందజేసి గేలిచేసినగాని
    వరములిచ్చి బ్రోచు దొరవు నీవు
    భక్తిమదిని నిల్పి పరమేశ్వరా నిన్ను
    తిట్టువారి కిడుము దీవెనలను

    రిప్లయితొలగించండి
  26. మైలవరపు వారి పూరణ

    పుట్టినదిక్కడే, మరల పోషణ యిక్కడె., పీల్చుగాలి యీ
    మట్టిదె., కాని హైందవము మాత్రము నమ్మక, దేశసంస్కృతిన్
    బట్టక తిట్టుచుండిరిట., వాఙ్మయి! తాత్త్వికబోధ గల్గగా
    దిట్టెడి వారికెల్లరకు దీవెనలిమ్ము శుభంబు గోరుచున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  27. పట్టుగ విద్యలన్ బడసి పాపపు కార్యము లందు మున్గగా
    రట్టు ఘటిల్లునంచును పరాభవమున్ తలపోసి చెచ్చెరన్
    కట్టడి చేసి పుత్రులను కాంచ యశస్సు, మురారి! వారలన్
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  28. జుట్టును బట్టి దెచ్చి తను జుట్టిన సన్నని నేకమాత్రమౌ
    బట్టను లాగి మానితను వట్టి సభాంతరమందునెట్టుచున్
    వెట్టి యటంచు బొబ్బలను బెట్టిన దుష్ట చతుష్టయంబునున్
    దిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  29. ఆటవెలది
    శ్రమల నెంచ కుండ సంపద గోరుచు
    నందలేదటంచు నిందజేయ
    బుద్ధిఁ గలుఁగు నట్లుఁ బొడఁజూపి దైవమా!
    తిట్టువారి కిడుము దీవెనలను

    ఉత్పలమాల
    పట్టిన కార్యమున్ విడక పట్టుదలన్ శ్రమియించ దీవెనల్
    తట్టెడు వారికెల్లరకు దైవమొసంగగ వేడమంటి నీ
    విట్టుల వేడనొప్పిదమె? యింగితమేమయె నీదు వాక్కులన్
    "దిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్"

    రిప్లయితొలగించండి
  30. తిట్టి నంతఁ దిరిగి తిట్టిన వైరమ్ము
    దిట్ట మగును బట్టు పట్ట కుండ,
    నొట్టు నిన్ను నింకఁ దిట్టరు నమ్ముము,
    తిట్టువారి కిడుము దీవెనలను


    చట్టపుఁ గన్ను లేమఱచి సంపదఁ బెంచెడి మోసగాండ్రనుం
    గట్టితిఁ దాళి నంచు నిజ కాంతను గొట్టెడి మోసగాండ్రనుం
    జుట్టము లంచుఁ గొల్లగొనఁ జుట్టును దిర్గెడి మోసగాండ్రనుం
    దిట్టెడి వారి కెల్లరకు దీవెన లిమ్ము శుభమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  31. తిట్టువారికిడుము దీవెనలనుతాత!
    బుద్ధివచ్చి యుండ్రు బుద్ధిగాను
    నీతిమంతు డగుచు నిరతము మంచినే
    చేయుచుండు బ్రజకు చిరము సుమ్ము

    రిప్లయితొలగించండి
  32. పట్టినపట్టువీడకను ఫాలవిలోచన నీదు పాదముల్
    నెట్టనపట్టి గట్టిగను నిందలు వేయుచు నిష్టురంబుగా
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్
    తట్టములందు భక్తులకు తప్పవు తొందరపాటు లీశ్వరా!

    రిప్లయితొలగించండి
  33. గట్టువ రాజశేఖరుడ!గారవమొప్పగ నెల్లవేళలన్
    దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ముగోరుచున్
    బిట్టున వారిమానసముబేర్మిని మారుచు మంచివారునై
    నిట్టటుచేయుచుందురిక యీప్సిత కార్యమునర్హులైనచో

    రిప్లయితొలగించండి
  34. పట్టును వీడకన్ జదువ పాఠములన్నియునొంటబట్టు నీ
    విట్టుల కాలయాపనమునేల భవిష్యము గాలరాతువో
    గట్టిగ శ్రద్ధ జూపుమని గాదిలి బిడ్డలనుద్ధరింపగా
    తిట్టెడివారి కెల్లరకు దీవెనలిమ్ము శుభమ్ముఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  35. బుద్ధి చెప్పువారు పుడమిలోనవిడక
    నేర్పు చుందు రెపుడు నెమ్మితోడ
    తిట్టెననుచు మదిని తీరుగా నేడ్వక
    తిట్టువారి కిడుము దీవెనలను.

    రిప్లయితొలగించండి