తెలుగు వృధాయటంచు నది తేలిక భాషయటంచు నెప్పుడున్ పలువురితో సదా పలుకు వాడు కుమారుని చేర్చెనంట యీ యిలగల యాంగ్లమాధ్యమము నింపుగ వాడు వచించె నిట్టులన్ యెలుకలనంగ నీవెరుగవే గగనమ్మున నీఁదు నట్టివౌ.
కలుగుల లోనె కాదు తిరుగాడును మూషిక ముల్ గృహమ్ములన్ బొలములలోను పంట దిన బూనుచు కర్షకు పాలి వైరులౌ కలవర పెట్టి యొక్క యిలికమ్ము విమానము నాపు జేసెనే యెలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ"
(విమానంలో ఎలుక ఉన్నదన్న అనుమానం వచ్చి బయలు దేరడానికి ముందుగా విమానాన్ని పూర్తిగా పరీక్షించిన పిదపనే నడిపించిన సంఘటనను కూడా పద్యంలో గుర్తు చేసుకోవడమైనది)
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"తలఁపులలోన ధ్యానములఁ దాల్చుచు నెప్పుడుఁ బూజ సేయఁగన్,
గలుముల నిచ్చు వేలుపగు గణ్య గణాధిపుఁ డెక్కి, ముజ్జగ
మ్ములఁ దిరుఁగాడు యానమయి, మోదముతో నుపచర్య సేయు నా
యెలుక లనంగ నీ వెఱుఁగవే? గగనమ్మున నీఁదునట్టివౌ?"
చివర ప్రశ్న గుర్తు తప్పుగా పడినది. సవరించినాను...
తొలగించండి"తలఁపులలోన ధ్యానములఁ దాల్చుచు నెప్పుడుఁ బూజ సేయఁగన్
గలుముల నిచ్చు వేలుపగు గణ్య గణాధిపుఁ డెక్కి ముజ్జగ
మ్ములఁ దిరుఁగాడు యానమయి మోదముతో నుపచర్య సేయు నా
యెలుక లనంగ నీ వెఱుఁగవే? గగనమ్మున నీఁదునట్టివౌ!"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆంగ్లమాధ్యమ విద్యార్థి యతను వ్రాసె
రిప్లయితొలగించండినొక పరీక్షలో పలుకునకుత్తరముగ
పుష్టికాంతుని వాహము మూషకమదె
యెలుకలన నాకసమ్మున నీఁదు నవియె.
మీ పూరణ బాగున్నది అభినందనలు.
తొలగించండికలుగు నందున నుండక మలగు చుండె
రిప్లయితొలగించండిమూషికమ్ములు కొన్ని సమూహముగను
గ్రద్ద యొక్కటి వాటిని గాంచి పట్టె
ప్రాణములుగోరి గ్రద్దతో రచ్చ సేయు
యెలుక లన నాకసమ్మున నీఁదు నవియె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశాస్త్ర వేత్తగ సృష్టించె చకిత మైన
రిప్లయితొలగించండిరూపముల విమానమ్ములు రోదసి కెగుర
నెలుకన నాకసమ్మున నీదు నవియె
యనుచు వింతగ వీక్షించె నవని యపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
మూడవ పాదంలో నెలుకలన నాకసమ్మున అని సవరించడమైనది
తొలగించండిచాటుమాటువద్దుతినుటచాలుమాకు
రిప్లయితొలగించండినేటినేతమాటయిదియనేర్వరండి
బాహ్యమంతరమనుభేదమంతవీడు
ఎలుకలననాకసమ్ముననీదునవియె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితెలుగు వృధాయటంచు నది తేలిక భాషయటంచు నెప్పుడున్
పలువురితో సదా పలుకు వాడు కుమారుని చేర్చెనంట యీ
యిలగల యాంగ్లమాధ్యమము నింపుగ వాడు వచించె నిట్టులన్
యెలుకలనంగ నీవెరుగవే గగనమ్మున నీఁదు నట్టివౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలదుకొలనటమబ్బులకొలువులోన
రిప్లయితొలగించండికొలనుగట్టుననేన్గులుజలకమాడ
జలముబాఱుచునున్నట్లుదలపురాగ
ఎలుక లన నాకసమ్మున నీఁదు నవియె
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెలవునజేరి బట్టలను నేతిని పప్పును కాగితమ్ములన్
రిప్లయితొలగించండికలుగులలోన దాగుచును గాదెల నుంచిన వానిదోచువౌ
ఎలుకలనంగ నీ వెరుగవే ?గగనమ్మున నీదునట్టివౌ
పులుగుల కోగిరంబులవి ,పూజ్యగణాధిపు వాహనమ్ములౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములాచార్యా! నమోనమః!🙏🙏🙏
తొలగించండికలవరపాటు నొందిమది కన్నులకేమియు కానరాక యా
రిప్లయితొలగించండికులమున మాటలాడునది కూడ నెరుంగని మత్తు గ్రమ్మగన్
పలికెను త్రాగుబోతు తన బావమరిందిని గాంచి బిట్టుగన్
ఎలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమద్యమునుగొని మత్తున మరచి యొడలు
రిప్లయితొలగించండివదరెనొక్కడు నోటికి వచ్చినటుల
ఎలుకలన నాకసమ్మున నీఁదు నవియె
చిరుతలన నీట నెగిరెడు జీవులనుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం:
రిప్లయితొలగించండిచిలుకల గుంపు నాకసము చేరువ మిట్టి ప్రయాణ మొందగన్
తలకొక మాట చెప్పగను తానొక వింతను జూచితంచనన్
తెలుపుమటన్న, బల్కె నట ద్రిమ్మరి చిల్కల బోలు నాకృతౌ
ఎలుకలనంగ, నీవెరుగవే గగనమ్మున నీదు నట్టివౌ
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఎలుక లనంగ నీ వెరుగ
వే గగనమ్మున నీదునట్టివౌ
( గాఢనిద్ర పోతున్న గారాల పిల్లవాడు కల గని కలవరిస్తున్నాడు )
మెలకువ రాని డింభకుడు
మెత్తని పానుపు పైన దొర్లుచున్
కలలను గంచు చిత్రముగ
కల్లలు బల్కుచునుండె నిట్టులన్ -
" జిలుక లనంగ రివ్వునను
జెర్వుల బైపయి నేగుచుండులే ;
యెలుక లనంగ నీ వెరుగ
వే ! గగనమ్మున నీదునట్టివౌ . "
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశాస్త్రపరిశోధనమ్ముకుసాయమివిగ
రిప్లయితొలగించండిఅంతరిక్షమువాటికి యందునుమరి
యూరిగగరినుబోలును, వ్యోమ గామ
ఎలుక లన నాకసమ్మున నీఁదు నవియె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"శాస్త్ర పరిశోధనమునకు.. వాటికి నందును మరి..." అనండి.
అలాగె అండి. ధన్యవాదాలు
తొలగించండికలుగులను తవ్వుచుండుచు గనబడునవె
రిప్లయితొలగించండియెలుక లన ; నాకసమ్మున నీఁదునవియె
చిలుకలు ; బిలువనేర్పగ చిత్ర మదియ
పిలుచును మనను , వీనుల విందగుగద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలుగుల తవ్వుచుండు మరి కారణమేమియులేకనే , నవే
రిప్లయితొలగించండియెలుక లనంగ నీ వెఱుఁగవే ; గగనమ్మున నీఁదునట్టివౌ
చిలుకలు మీరు నేర్పినవె చిత్రగ పల్కుచునుండి మిమ్ములన్
పిలిచినవేళ మీకపుడు వీనులవిందగునే యెరుంగవే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఎలుక లన నాకసమ్మున నీఁదు నవియె
పిల్లులన వాటి వెనుక ద్రవించి పరుగు
లిడెడు ప్రేమ పక్షులగు! భళీ శునకము
లింక వాటి స్నేహితులు భళీ జిలేబి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"విను" పల్కె శకారుడు చి
ర్రున! "ఎలుకలనంగ నీ వెఱుఁగవే గగన
మ్మున నీఁదునట్టివౌ! వా
టి నెయ్యులగు పిల్లులు" సురటి విసురు కొనుచున్!
ఇట్లు
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఈ నడుమ జీపీయెస్ వారి ఫ్లాషులు రావడంలేదు! కుశలమే కదా?
జిలేబి
ప్రస్తుతం అస్వస్థులై హాస్పిటల్ లో ఉన్నారు.
తొలగించండివారి ఆరోగ్యం తొందరగా బాగగు గాక
తొలగించండి
తొలగించండివారు సత్వరము శ్రీరాముని దయచేతను కోలు కోవాలని ఆశిస్తూ
జిలేబి
సత్వరమే వారు కోలుకోవాలని భగవంతునికి వేడుకోలు
తొలగించండిఅందరికీ ధన్యవాదములు. వారు త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్ధిద్దాం!🙏🙏🙏🙏
తొలగించండికలుముల తల్లి లక్ష్మి కనకాంచిత నీరజమయ్యె తోటలో
రిప్లయితొలగించండిపల పలు వర్ణ శోభిత శుభాన్విత రాగ మనోజ్ఞ పుష్పమై!
చిలిపి గణేశు వాహనము చిత్రము!లేదట మేదినీ స్థలిన్!!
ఎలుక లనంగ నీ వెఱుగవే? గగనమ్మున నీదునట్టివౌ!!!
మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
తొలగించండికలుగులలోన నుండు భువి కమ్మని ధాన్యము లారగించుచున్
రిప్లయితొలగించండిపొలముల గట్లపైన కడు మోదము తో తిరుగాడు నట్టివౌ
ఎలుక లనంగ నీ వెఱుఁగవే? గగనమ్మున నీఁదునట్టివౌ
పులుగులు పన్నగమ్ములకు భోజ్యములౌ గద మూషికమ్ములే
గిరిజ అను గడుసరిపిల్ల గీసె బొమ్మ
రిప్లయితొలగించండిచెట్టు పుట్ట లు కొండలు చెరువు తోడ
ఆకసము నీరు ఎలుకలు అందు చేర్చె
ఎలుకలన నాకసమ్మున నీదు నవియె
చుంచు రూపమునుగలిగి సంచరించు
రిప్లయితొలగించండినెలుకలన,నాకసమ్మున నీదునవియె
ఫ్లైటులనబడి తిరుగుచు బాటసారి
నిలను జేరవేయును వారి నిలయములకు
తేటగీతి
రిప్లయితొలగించండిరాదు వర్షము నిండవు గాదెలంచు
తిండి గానక వగపున గుండె వగిలి
ప్రాణముల వీడి మేఘాల పూనినంత
ఎలుక లన నాకసమ్మున నీఁదు నవియె
చంపకమాల
పిలువఁగ రైతు తా గగన వీధుల వృష్టికి మేఘపంక్తినిన్
వలవల యేడ్చుచున్ సతియె వల్కెను దీనత నిట్టులంచు, "గా
దెల వడి వీడి ప్రాణముల తిండికి లేక మొయిల్ల వూనె న
య్యెలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ"
కలతలమానసంబుననుకామములోభముమూషికంబులౌ
రిప్లయితొలగించండిచెలగుచుకానరాకయవిచెంగునదూకుచుచుట్టుముట్టెనే
తోలచినకన్నముల్వలనదోంగలజూడకబాధనందితిన్
ఎలుకలనంగనీవెఱుగవేగగనమ్ముననీదునట్టివే
ఎలుకలనంగ నీవెఱుగవే గగనమ్మున నీదునట్టివౌ
రిప్లయితొలగించండియెలుకలవోలె గన్పడును నెచ్చటనుండ విమానమంతటన్
గలిబొలి మాటలాడగను గాలమె యీయది?కాంత చెప్పుమా
యెలుకలు నీటనీదునని నెంచుచు జెప్పుదుబాల! యిప్పుడున్
కడుపు వీక్షింప నింపగు గగన మౌను
రిప్లయితొలగించండితిన్న కూటినిఁ గబలింప వెన్ను పెరిఁగి
యెలుక లయ్యె నా యెలిక పాము లలఁ గుక్షి
నెలుక లన నాకసమ్మున నీఁదు నవియె
విలవిల లాడరే జనులు వెఱ్ఱిగ నాకలి బాధ కోర్వకే
కలకల లాడు మోము మఱి కమ్మని భోజన మారగింపఁగాఁ
గులుకుచు సంచరించు నవి కుక్ష్యభిధాన నభోంతరమ్ములో
నెలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ
ఎలుకలు జేరి పంటలెడలింపగ జింతిలిరూరి వారలా
రిప్లయితొలగించండిఎలుకల బాధ దీరుటెటులంచు విచారము సేయుచుండగా
పలికెను వెంగళప్ప దన వాయపు మాటలు నవ్వనందరున్
"ఎలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ"
కలుగున దూరి ధాన్యము సగౌరవభంగిని దాచిగాచు పు
రిప్లయితొలగించండిష్కలమగు దంతపుష్టి కలుషాశనమున్ ఘన వస్తుసంచయం
బలుగక మెక్కు గోర్కెల నహంబును గెల్చిన వక్రతుండువౌ
*“యెలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ”*
రిప్లయితొలగించండికలుగుల లోనె కాదు తిరుగాడును మూషిక ముల్ గృహమ్ములన్
బొలములలోను పంట దిన బూనుచు కర్షకు పాలి వైరులౌ
కలవర పెట్టి యొక్క యిలికమ్ము విమానము నాపు జేసెనే
యెలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ"
(విమానంలో ఎలుక ఉన్నదన్న అనుమానం వచ్చి బయలు దేరడానికి ముందుగా విమానాన్ని పూర్తిగా పరీక్షించిన పిదపనే నడిపించిన సంఘటనను కూడా పద్యంలో గుర్తు చేసుకోవడమైనది)
-మాచవోలు శ్రీధరరావు
కలుగునందుండు నెప్పుడు కలిసిమెలిసి
రిప్లయితొలగించండిరాజహంస లు తిరుగును రాజసముగ
నీటి యందునహర్నిశల్ నెమ్మితోడ
నెలుకలన,నాకు సొమ్మును,నీదునవియె