19, ఏప్రిల్ 2021, సోమవారం

సమస్య - 3698

20-4-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమృతమున్ మ్రింగి శివుఁడిచ్చె హాలహలము”
(లేదా...)
“అమృతము మ్రింగి హాలహల మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్”

47 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    విమతులు గూలుచుండ ఘనభీషణయుద్ధమునన్ సురాసురుల్,
    గుమిఁ గొని, క్షీరవారినిధి గొబ్బునఁ ద్రచ్చఁగఁ, బుట్టి క్ష్వేడమే
    క్షమను దహించుచుండ, మనసా వచసా కృతనిశ్చయుండునై
    యమృతము, మ్రింగి హాలహల, మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్!

    రిప్లయితొలగించండి
  2. దేవతలు మురిసిరి హరి తెచ్చినట్టి

    అమృతమున్ మ్రింగి:; శివుఁడిచ్చె హాలహలము”

    నుండి జగములకున్ రక్షను సతి తాళి

    కాచుననెడి నమ్మికను నిక్కంబనుచును

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. మేధమనిషికిస్రుష్టికిమేలుకోలిపె
    కనగశోధనజగతియుకాంచెసుఖము
    దారిఁదప్పిరిజనమునుదానివలన
    అమ్రుతమునుమ్రింగిశివుడిచ్చెహాలహలము

    రిప్లయితొలగించండి


  4. ఏమి తిని వాగి నావుర యెంక టేశ
    అమృతమున్ మ్రింగి శివుఁడిచ్చె హాలహలము?
    బడిత పూజయె సరినీకు! పగుడమంత
    కూడ బుద్ధిలేదే! పలుకు ముసి ముసియె!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. అవలీలగ కథ లేనే
    యవ! అమృతము మ్రింగి హాలహల మందఱకున్‌
    శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్? తే
    ల్చవే జిలేబి యెటులన్? భళా నీ నసుకుల్!


    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. క్రమాలంకారంలో ----
    బ్రతికి రాహు కేతువు లెట్లు బయట బడిరి?
    ఎవరు గంగకు తలమీద నిచ్చె చోటు?
    కంఠమున నిల్పె శివు డేమి కాంక్ష తోడ?
    అమృతమున్ మ్రింగి : శివుడిచ్చె : హాల హలము

    రిప్లయితొలగించండి
  7. విమృషమౌనె ? వెన్నుడట వేల్పుల గాచగ వేగ పంచె నీ
    యమృతము, మ్రింగి హాలహల మందరకున్ శివుడిచ్చె జెచ్చరన్
    నమృతి సమాదరంబుగను నాకజనాళికి సత్వరంబె, ప్రా
    యి మృడుడె గూర్చు నమ్ముమిక యీశు పదాబ్జమె దిక్కు నెన్నడున్ !

    విమృషము = అబద్ధం
    అమృతి = మరణం లేకుండుట
    ప్రాయి = భాగ్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "విమృషమునౌనె" అందామా?

      తొలగించండి
    2. విమృషము నౌనె ? వెన్నుడట వేల్పుల గాచగ వేగ పంచె నీ
      యమృతము, మ్రింగి హాలహల మందరకున్ శివుడిచ్చె జెచ్చరన్
      నమృతి సమాదరంబుగను నాకజనాళికి సత్వరంబె, ప్రా
      యి మృడుడె గూర్చు నమ్ముమిక యీశు పదాబ్జమె దిక్కు నెన్నడున్ !

      విమృషము = అబద్ధం
      అమృతి = మరణం లేకుండుట
      ప్రాయి = భాగ్యము

      తొలగించండి

  8. దేవదానవుల్ కడలి మధింపు వేళ
    నుదధినుద్భవించె రమయు నుడుపతి మరి
    యమృతమున్, మ్రింగి శివుడిచ్చె హాల హలము
    నుండి రక్షణ జగతికి దండి గాను.

    (అమృతము =విషము)


    అమృతము గోరిగాదుటె సురాసురు లెల్ల మధింప సంద్రమున్
    రమయు మదాంబురమ్ము తొగరాజుల తోడ పుట్టెనా యమృతము, మ్రింగి హాలహల మందరకున్ శివుడిచ్చె జెచ్చెఱన్
    ప్రమదము, లోకరక్షకుడు భాస్కరుడా మదనాంతకుండటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తం రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  9. సమస్య :

    అమృతము మ్రింగి హాలహల
    మందరకున్ శివుడిచ్చె జెచ్చెరన్

    ( క్షీరసాగరమథనము - శివపార్వతులు )

    చంపకమాల
    -------------

    కుమతులు దానవుల్ సురలు
    గోవిదులున్ జిలుకంగ సంద్రమున్
    దమతమ శక్తులన్ ; గలిగె
    దల్లడ మంద విషంబు ; పుట్టదే
    యమృతము ! మ్రింగి హాలహల
    మందరకున్ శివుడిచ్చె జెచ్చెరన్
    సమధికమైన ధైర్యమును
    జల్లని చూపుల గౌరి సాక్షిగా .

    రిప్లయితొలగించండి
  10. హాలహలధారిశివునికిహాయినిడును
    ఆభరణములైమెలగునుహారములుగ
    రాజిలుఫణులకై, తాను రామ నామ
    అమృతమున్ మ్రింగి ,శివుఁడిచ్చె హాలహలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇడును + ఆభరణము = ఇడు నాభరణము, నామ + అమృతము = నామామృతము' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
    2. శివుడుగైకొనెగరళము, శ్రేయమొసగ
      రామనామమేరక్షయైరాజిలెనుగ
      కంఠసీమలో, నతడులోకములగాచ.
      హాలహలము క్రొంతచిలుక, హాయిగగొనె
      నాభరణములైమెలిగెడి, నాగులునిల
      నాగులకటుల, తను రామనామమనెడి
      అమృతమున్ మ్రింగి ,శివుఁడిచ్చె హాలహలము

      తొలగించండి
  11. దేశసంపద తెగనమ్ము ధీరుడిపుడు
    రాజ్య బొక్కసమును నింపు లక్ష్య ముంచి
    యోడుగ సలుపు నుచితము లొసగ జాడ
    నమృతమున్ మ్రింగి శివుఁడిచ్చె హాలహలము

    రిప్లయితొలగించండి
  12. అమరులు గాగనాశపడి యన్నలుతమ్ములు దోడుగూడుచున్
    తమకము మీరగా మిగుల ద్రచ్చగ సాగరమంద తీయనౌ
    యమృతము; మ్రింగి హాలహల మందరకున్ శివుడిచ్చె చెచ్చెరన్
    సముచిత శక్తియుక్తులను సత్వరమందగ కార్యసిద్ధినిన్

    రిప్లయితొలగించండి
  13. చం:

    సమయము తోడు రాగ కొనసాగెను నేతగ బ్రహ్మరాతయే
    కుమతి యటంచు నెల్లరును కోసుడు దూరము నేగు చుండగన్
    విమతునివోలు రీతిగొని విత్తము త్రెక్కొనలోకులిట్లనన్
    నమృతము మ్రింగి హాలహలమందరకున్ శివుడిచ్చె జెచ్చెరన్.

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. చంపకమాల
    మమతను విష్ణువే కమఠమై గిరి నిల్పగ సాంత్వనమ్మునన్
    శ్రమఁగొని దేవదానవులు సాగరమున్ సుధ నెంచి జిల్కగన్
    హిమగిరి జాతబూన్చ హితమెంచుచుఁ, 'బొంగ' ,వ్యథార్తులందఁగా
    నమృతము, మ్రింగి 'హాలహల' ,మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్

    రిప్లయితొలగించండి
  15. కమఠపు రూపమున్ నిలిచి కవ్వపు గొండ భరించ శౌరి తాన్
    సమధికమౌ కుతూహలము సంద్రముఁ ద్రచ్చగ పుట్టె నంజుతో
    నమృతము, మ్రింగి హాలహల, మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్
    ప్రమదము నాసురాసురులు ప్రస్తుతి చేయగ చంద్రమౌళికిన్

    రిప్లయితొలగించండి
  16. తమకము మీరి దానవులు త్రాగుట మర్చిరి విష్ణు మాయల

    న్నమరిన మోహ రూపమున నాధుని కాంచి సురాళికిన్విడిన్

    అమృతము :; మ్రింగి హాలహల మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్”

    శమనము పార్వతమ్మ పతి సాంబడు శర్వుడు వాన్కి మొక్కెదన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  17. అమలిన దేవతల్ మరియు నాయ
    సురుల్ గుమిగూడి సంద్రమున్
    శ్రమగొని త్రచ్చగా నపుడు చంద్రు
    డు, శ్రీ రమ, కామ దేనువు,
    న్నమృతము ,కాలకూటములు
    నందు జనించెను గాంచి శీఘ్రమే
    యమృతము, మ్రింగి హాలహల,
    మందరకున్ శివుడిచ్చె జెచ్చరన్

    రిప్లయితొలగించండి
  18. వీరాభిమన్యుని గోల్పోయిన ఉత్తర ఆవేదన...

    తేటగీతి
    వీర తిలకమ్ము దిద్దుచు వేడుకొంటిఁ
    బతికి విజయమ్ము దక్కించు గతిని జూప
    మఱచి నుత్తరన్ గనక దాంపత్య సార
    మమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలము

    రిప్లయితొలగించండి
  19. అమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలము
    నిట్టి పూరణ కష్టమే యీశునకును
    శివుడు మ్రింగెను విషమును భవ్య వలన
    సైంహికుడు మ్రింగె నమృతము దేవతగను

    రిప్లయితొలగించండి
  20. మమతను దేవదానవులు మర్దన జేయగ బాలసంద్రమున్
    నమృతముబాటుగాగనట హాలహలంబును గామధేనువున్
    దమకము గల్గు నాశివుడు దద్దయుపార్వతి బ్రోత్సహించగా
    నమృతము మ్రింగి హాలహలమందఱకున్ శివుడిచ్చెజెచ్చెఱన్

    రిప్లయితొలగించండి
  21. అమృతులుసంద్రశోధననయంబుననిచ్చినఔషధంబునున్
    అమృతులుగాగదేవతలునందముమీఱగతేజమందిరే
    అమృతులుగాకమానవులయానముహీనమునయ్యెచేదుతో
    అమృతముమ్రింగిహాలహలమందఱకున్శివుడిచ్చెచెచ్చరన్

    రిప్లయితొలగించండి
  22. లోక కల్యాణము దలంచి వీఁక తనదు
    గళమునకుఁ, దడయక కంఠ కందరమును
    నింపఁ బ్రక్షాలనం బొనరింప నంత
    నమృతమున్ మ్రింగి, శివుఁ డిచ్చె హాలహలము

    [అమృతము = నీళ్లు]


    సముచిత రీతి భక్తులను శంకరుఁ డెప్పుడు గావ వచ్చునే
    యుమయు నొసంగఁ బూని ధృతి నోర్పును భర్తకు స్వీయ సమ్మతిం
    గుమిలి నిశాచ రాగ్నిముఖ కోటి సమీపము వచ్చి వేఁడ వా
    గమృతము, మ్రింగి హాలహల, మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్

    [వాగమృతము =మాట యను నమృతము (అభయము)]

    రిప్లయితొలగించండి
  23. శ్రమపడి దేవ దానవులు సాగరమున్ మథియింప ముందుగా
    నమిత భయానకంబగు విషాగ్ని జనింపగ, వారికందగా
    నమృతము, మ్రింగి హాలహల మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్
    శమము, ననంతరంబు గొనసాగెను మంథనమందగా సుధన్

    రిప్లయితొలగించండి
  24. క్షీరసాగరమధనంబుచేయువేళ
    వెడలివచ్చిన గ్రోలిరి వేల్పులెల్ల
    అమృతమున్, మ్రింగి శివుఁడిచ్చె హాలహలము
    జగములకునెమ్మి జనులెల్ల జయమనంగ

    రిప్లయితొలగించండి