16, ఏప్రిల్ 2021, శుక్రవారం

సమస్య - 3695

17-4-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్”
(లేదా...)
“పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్”

72 కామెంట్‌లు:

  1. వర గర్వమ్ముననసురుడు

    హరి నామ స్మరణ వలదని హఠమున్జెప్పెన్

    వెరవని దేశపు ప్రజలున్

    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    హరి సంకీర్తన సేసి, సేసి, కొనెఁ బ్రహ్లాదుండు కష్టంబులన్!
    హరి సఖ్యానఁ గుచేలకుండు గొనెఁ గా నత్యంత దుఃఖం బిలన్!
    హరినే నమ్మిన పాండవుల్ వెసనుఁ దా మారణ్యముం బొందరే?
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్!

    రిప్లయితొలగించండి
  3. విరివిగ భక్తిన గొల్వగ
    కరోన విషయముతెలియక ఘనముగ నొప్పన్
    మరపేలన కలివిడిగా
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్!!


    రిప్లయితొలగించండి
  4. చెరసాలఁజేరెగోపన
    సరసుండైరాముతలచిసాధనఁజేయన్
    అరిగాఁజూచెనుప్రభువును
    పరమాత్మునిభజనసేబాధలెకల్గున్

    రిప్లయితొలగించండి
  5. తరగని పెన్నిధి మాదిరి
    కరగించి జనుల మనసులు కనకము దోచే
    బరి తెగిచెనగెడు దుర్గురు
    పరమాత్ముని భజన చేయ బాధలె కల్గున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దోచే' అనడం వ్యావహారికం. మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారం ఇలా మార్చాను తప్పులు సూచించ ప్రార్థన!

      తరగని పెన్నిధి మాదిరి
      కరగించి జనుల మనసులు కనికట్టులతో
      దురితము చేసెడు దుర్గురు
      పరమాత్ముని భజన చేయ బాధలె కల్గున్

      తొలగించండి
  6. నిరతాభ్యాసముతోడుతన్హ్రుదినితానేకాగ్రతన్బ్రహ్మమున్
    అరిషడ్వర్గముదాడినాపుచునుపాయన్మానవీబంధముల్
    కరముల్మోడ్చినబాలుడాయెడనుతాకాఠిన్యశిక్షన్గనెన్
    పరమాత్మన్భజియించువారలకుసంప్రాప్తంబులౌకష్టముల్

    రిప్లయితొలగించండి


  7. సరియగు జీవన గమనము
    పరమాత్ముని భజన సేయ! బాధలె కల్గున్
    చరమాంకమున చిదాత్మను
    మరువంగాననుదినమున మహిని జిలేబీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. శరణమనుచు నిజ భక్తుడు
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్
    తరుణమునుజూచి తనకు
    త్వరితగతిన మోక్షమార్గ వరమును యిచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "తనకున్" అనండి.

      తొలగించండి
  10. హరినామము వదలని యా
    చిరుతడు ప్రహ్లాదు గాథ చెప్పెడు విషయం
    బెరుగక పలికితివా? యే
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్?


    కరినాలాస్యపు బారినుండి యిభమున్ గాపాడె వాడే కదా
    హరినామంబును వీడనట్తి చొఱ ప్రహ్లాదుండ రక్షించెనే
    మరినీవిట్టుల వాగుచుండుటదియే మద్యంపు మత్తంటినే
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌ గష్టముల్?

    రిప్లయితొలగించండి
  11. అందరికీ నమస్సులు🙏

    తరుణుల మానము దోచెడి
    సరణిని దాపించి కపట సాధులు ఖలులై
    పరులను మోసము చేయుచు
    *పరమాత్ముని భజన సేయ బాధలు గల్గున్*

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  12. సమస్య :
    పరమాత్మన్ భజియించు వారలకు సం
    ప్రాప్తంబులౌ గష్టముల్

    ( సంశయాత్ములై డోలాందోళిత భావంతో పరమాత్మను
    సేవిస్తే కష్టాలు తప్పవుగా మరి )

    మత్తేభవిక్రీడితము
    ..........................

    స్థిరమౌ బుద్ధిని బూని దీపకళికల్
    దేదీప్యమానంబుగా
    ధరలో వెల్గినయట్టులన్ మనమునే
    తాదాత్మ్యమందింపకే
    గరువంబందుచు , స్వీయశక్తితతిసం
    ఘాతాత్మలోలత్వతన్ ,
    బరమాత్మన్ భజియించు వారలకు , సం
    ప్రాప్తంబులౌ గష్టముల్ .

    రిప్లయితొలగించండి
  13. దురితము లొనరించుచు దా
    పరులను వంచించి పైకి భక్తి నటనతో
    తిరు నామములు ధరించియు
    పరమాత్ముని భజన సేయ బాధలె గల్గున్

    రిప్లయితొలగించండి
  14. కరివరదుని కరుణామయు
    నిరతము సంసేవనంబు నిర్వృతినిచ్చున్
    పరముమరచి యితరములకు
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్

    రిప్లయితొలగించండి
  15. మ:

    హరిలో రంగ యటంచు నిత్యముగ కుయ్యాడంగ సర్వేశ్వరున్
    పరిరక్షింపగ వేచి చూచు నట నీ ప్రాణాలె బోవంగనై
    కడకున్ వేడుకొనంగ దిక్కనుచు మోకారింప కాపాడగన్
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌ గష్టముల్

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. కరములు జోడించి తనకు
    వరములు కావలె ననుచును, వైనము లేకన్
    పరులకు కీడును గోరుచు
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్

    రిప్లయితొలగించండి
  17. పరమున నమ్మక ముండియు
    కరోనబారి బడినట్టి కారణముండన్
    కరణము తోడ్పడకుండగ
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్

    రిప్లయితొలగించండి
  18. కరుణాహీనత గల్గి దుశ్చరితులై గర్వోన్నతింబొందుచున్
    వరముల్వొంది వియచ్చరాగ్ర తతినిం బాధించి పీడించుచున్
    నరలోకాగ్ర పదంబు నంది హరినిన్వారించు యత్నంబుతో
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  19. పరులందున్ దయ గల్గి వారి కొఱకై ప్రాణంబులర్పించు యా
    కరుణామూర్తికి, తల్లిదండ్రులను తాఁ కైసేయుచున్ భక్తితో
    పరమాత్మన్ భజియించు వారలకు, సంప్రాప్తంబులౌఁ గష్టముల్
    తెరలున్ వాని నెదుర్కొనంగ తగు శక్తిన్ పొంది జీవింతురే౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రాణంబు లర్పించు నా..." అనండి. 'తా కైసేయు' అన్నపుడు అరసున్న రాదు.

      తొలగించండి
  20. సీతమ్మ తల్లికి‌ చేయించి నాడను
    చింతాకు పతకము, చెలిమి తోడ


    పది వేల వరహాలు బాగుగా వెచ్చించి,సౌమిత్రికి నిడితి సంతసముగ

    ముత్యాల పతకము‌‌, మొహరీలు‌ పదివేలు‌
    పట్డెగా దానికి గట్టిగాను,

    కలికి తురాయిని‌ ఘనతతో
    నొసగితి రాఘవా ,మిసిమి బడసి

    కులుకు చుంటివి గాని యులుకు పలుకు‌ లేక
    కరుణ తో దీనుని కాచ రావు

    ప్రహ్లాదు డానాడు భక్తితో నీదు భ
    జనులను చేసియు సతము బాధ

    పడినాడు,త్యాగయ్య పరవశ మునిడుచు
    భజనలు చేసి తా‌ బాధ నొందె

    నిక్కము‌ పరమాత్ముని భజన సేయ బాధలె కల్గునెప్పుడీ ధరణి పైన

    భక్తులకు ననుచు‌ మనసు‌ భంగ పడుచు
    నుండెగా, నన్ను రక్షించ కున్న నీకు
    పూజ లేల భజన లేల రోజు నీకు
    ననుచు రామదాసు వగచె నార్తి తోడ

    రిప్లయితొలగించండి


  21. హరినామస్మరణమ్మె శర్కరయగున్ హార్దమ్ముతోచేయగా!
    పురుషుండాతడు! ప్రేమ మీర కొలువన్ పుణ్యమ్ము తధ్యమ్మగున్
    పరమాత్మన్ భజియించు వారలకు! సంప్రాప్తంబులౌఁ గష్టముల్
    హరణంబౌ వెస వీడు వారలను స్వాహాచేయకన్ వాశితా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. పరదైవంబనినమ్మినారుమునుపాపాత్ముండునౌనొక్కనిన్
    స్థిరజిత్తంబునగొల్చినారుగదనస్తిత్వంబుగోల్పోవుచున్
    సురపానంబుకుమత్తుమందులకుదాసోహంబునైదుష్టుడౌ
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. కరి రాజేంద్రుని దుష్ట నక్రము కసిన్కాఠిన్య దంష్ట్రమ్ముల

    న్నిరికించన్ సిరి భర్త రక్కసుల రాణీ నాధు సంహారియే

    కరి కాచెన్ , కుకరోన వేళ జనులొక్కన్జోట గుంపై హరిన్

    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  24. వరదుండాహరి పాదపద్మముల సంభావించి యేకాగ్రతన్
    పరమున్బొందెడు నీప్సితంబు మదిలో భవ్యంబుగా నూన్చుచున్
    శరణంబీవెయటంచు గొల్వు కరుణించన్ చక్రి వేరొండుగా
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  25. దురితంబుల్ దొలగించగా దగిన యుద్యోగంబులన్ గూర్చుచున్
    త్వరితమ్మున్ ఘనమోక్షమందగను నవ్యాజమ్మగున్
    బ్రేమతో
    పరమార్ధంబును బోధసేయ, స్థిరమౌ వైరాగ్యమేపారగా
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తించుగా కష్టముల్

    రిప్లయితొలగించండి
  26. హరిభక్త్యార్ద్రతగాంచజ్ఞానులనుభక్త్యార్థార్తజిజ్ఞాసతన్
    భరమౌయార్తిపరీక్షసేయగనునాపన్నప్రపన్నుండునై
    కరినింగాచినకైవడిన్ దొలుత నాకర్మంబునిర్జింపగా
    *“పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్”*

    రిప్లయితొలగించండి
  27. తిరుపతి కేగిన వారికి
    నరగంటయె కాక మునుపు టలసట కలుగన్
    పరమాత్ము భజన యాగుట
    పరమాత్ము భజనసేయ బాధలు గల్గున్

    రిప్లయితొలగించండి
  28. భక్త రామదాసు ఆవేదన....

    కందం
    దొరికితె వల్మీకమ్మున
    మురిసి గుడిని నగల గూర్చ ముదమున, దాసున్
    చెరనుంచ రామ! నిర్దయ
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్

    మత్తేభవిక్రీడితము
    మెరయన్ సుందర మూర్తులున్ వనపు వల్మీకమ్మునన్ రాఘవా!
    మురిపెమ్మొందుచు గూర్చి కోవెల నగల్ ముద్దార సేయించినన్
    చెరసాలన్బడ వైచ దాసునుని వైచిత్ర్యమ్ము కానేరదే?
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  29. నిరతము సద్భక్తిని నా
    హరిఁ బూజింపఁ దగును సిరు లాశింపకయే
    పరము సమకూడు లౌకిక,
    పరమాత్ముని భజన సేయ, బాధలె కల్గున్


    గురు నిష్ఠా రతి నిత్య తత్పరులు నై కొల్వంగ నిక్కమ్ముగాఁ
    బరమౌ మాయలు క్షుద్ర శక్తు లని సంభావింత్రు బోధింప మా
    రరు దుర్మార్గులు క్షుద్ర దేవతల, నారాధింప కెన్నండు నా
    పరమాత్మన్, భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  30. పరమంబిచ్చెడు తిర్పతిన్ జనగదాపాధిక్యమౌటన్ నటన్
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌ గష్టముల్
    పరమాచార్యుల సేవనున్ దనర దాభవ్యంబురీతిన్ గడున్
    నిరతిన్ జేయగఋనిచ్చుగా మనకుపానీయాదులెవ్వేళలన్

    రిప్లయితొలగించండి
  31. ~~~~~~~~~~~~~~~~~~
    అరయన్ శాంతియు, సర్వ భాగ్య
    ము లత్యంతార్తితో నిత్యమున్
    పరమాత్మున్ భజియించువార
    లకు సంప్రాప్తంబులౌ , కష్టముల్
    పరమౌ నాస్తికు లౌన వారలకు
    సంప్రాప్తించు దూర్భాగ్యముల్
    నరుడా! కొల్వుము సర్వ శక్తి మ
    యునిన్ నారాయణున్ భక్తితో.
    ~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "భాగ్యములు నత్యంతార్తితో.." అనండి. 'నాస్తికులైన' టైపాటు.

      తొలగించండి
  32. కరుణను జూపక నిరతము
    పరులను వేధించు దుష్ప్రవర్తన విడకన్
    సిరులను గోరి దపించుచు
    పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్

    హరి సేవా వ్రతమే జనాళికిల నత్యంతాభియుక్తంబుగా
    వరమౌ శాంతియు సౌఖ్యమెన్నడును సంభావ్యంబుగా నిత్యమున్
    పరమాత్మన్ భజియించు వారలకు; సంప్రాప్తంబులౌఁ గష్టముల్
    పరకాంతా రతులౌ దురాత్ములకు నిర్వాదంబుగానెన్నడున్

    రిప్లయితొలగించండి
  33. వరగర్వంబున దైత్యరాజు కొమరున్ వైగుణ్య ద్వేషంబుతో
    పరి మార్చన్ పథకంబు వేయగ మహా ప్రహ్లాద భక్తుండు నా
    హరియే దైవ మటంచు ముక్తి బడసెన్ అంత్యంబునన్, తొల్త ఆ
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  34. నిరతమ్మున్ భువి పాప కార్యములతో నీమమ్ములన్ వీడుచున్
    పరభామల్ కనుపించ కామమడరన్ బంధించుచున్ నీచులై
    చరమాంకమ్మున ముక్తినందు కొనగా స్వార్థమ్ముతో నిత్యమున్
    పరమాత్మన్ భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  35. సిరుల కొరకు సతతమ్మును
    పరులను హింసించుచుండ పాపమెకలుగున్
    పరకాంతల మది గోరుచు
    పరమాత్ముని సేవచేయ బాధలె కలుగున్

    రిప్లయితొలగించండి