20, ఏప్రిల్ 2021, మంగళవారం

సమస్య - 3699

 21-4-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వసుదేవునిఁ గాంచి వాలి పక్కున నవ్వెన్”
(లేదా...)
“వసుదేవుం గని వాలి సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్”

69 కామెంట్‌లు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి ( Synd . Bank ) , వెలుగోడు
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,

  గు రు భ్యో న మః { నిన్నటి పూరణ స్వీకరింప ప్రార్థన }


  కమఠము కాగ శ్రీవరుడు - కవ్వము కాగ నగమ్ము - పాలసం

  ద్రమును మథించి రుత్సుకత దానవులున్ సురలున్ , గ్రహింపగా

  నమృతము | మ్రింగి హాలహల మందరకున్ శివు డిచ్చె జెచ్చెరన్

  సమధిక ధైర్యసంపదను , శైలతనూభవ ప్రోత్సహించగా ! !


  **************************************

  రిప్లయితొలగించండి
 2. శిశువును నది దాటించిన

  వసుదేవునిఁ గాంచి వాలి పక్కున నవ్వెన్

  రసికుల స్వర్గపు కాంతిన్

  పసి వాడే కంసు జంపు పాపిని మామన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. ముసిముసినవ్వులగడసరి
  పసిబిడ్డడుజిష్ణుబలముభావింపకనే
  మోసెనుతలపైననువుగ
  వసుదేవునిగాంచివాలిఫక్కుననవ్వెన్

  రిప్లయితొలగించండి


 4. ఇసుమంతైనను తలచక
  వసుదేవునిఁ గాంచి, వాలి, పక్కున నవ్వెన్
  కిసుకాటముతో గార్ధభ
  ము, సుఖము గా మ్రొక్కు పాదములకనుచు సుమీ  జిలేబి

  రిప్లయితొలగించండి

 5. వసుదేవుడు నాటకమం
  దు సుయోధన పాత్రవేయ ద్రోవదిగా వా
  లి సుదంతుడు, మయసభలో
  వసుదేవుని గాంచి వాలి ఫక్కున నవ్వెన్.

  రిప్లయితొలగించండి
 6. వసుదేవుడు యమునను దాటి కృష్ణుని నందుని ఇంటికి చేరుస్తుండగా చూసిన ఋషులు....
  కం.
  అసురారి యగుపరాత్పరు
  పసివానిగ వచ్చినిల్వ పరులకిడుటయా?
  వసమటె యనిమునిగణములు
  వసుదేవునిఁ గాంచి వాలి పక్కున నవ్వెన్

  వాలి(క్రియ), వసము = సాధ్యము

  రిప్లయితొలగించండి
 7. పసికందునుకరమునిడుచు
  అసువులువీడివితనవను అహము కలుగగన్
  నసురుడు, మదమ్ముతోడన్
  వసుదేవునిఁ గాంచి, వాలి, పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 8. ముసిముసి నగవుల బుడుతను
  పొసఁగఁగ మో యుచును దాను పోయెడి వేళన్
  వెస ఖరమును వేడ నొకడు
  వసుదేవుని గాంచి వాలి ఫక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రసితము మానెను కరభము
  వసుదేవుని గాంచి; వాలి ఫక్కున నవ్వెన్
  అసహాయుడైన తమ్ముని
  దెసనెంచుచు గేలిచేసి దెప్పెడి తీరున్.

  రిప్లయితొలగించండి
 10. పసికందాయెనుపారమున్దెలిసితాభాసిల్లరేపల్లెలో
  అసికిన్దక్కనిరాముఁడీతడునునీయానంబునీకెందుకో
  నసిగెన్వాలియుబేలయైయరుగునానారాయణుందండ్రితో
  వసుదేవుంగనివాలిసేసెనటదుర్వారాట్టహాసమ్మునున్

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. గండడై ధీర కీ
   శ సమూహంబున మేటియై వర మహా శాఠత్వమున్ బొంది తా
   కసితో రావణు గర్వమున్ దునిమి బోకాడంగ ద్వీపేశుడౌ
   వసుదేవుంగని వాలి సేసెనట దుర్వారాట్టహాసమ్మునున్

   శశిభూషణ సిద్ధాంతి నంద్యాల

   తొలగించండి
 12. కందం
  పసివాడు పుట్టెనన విని
  కసితోడను మట్టు బెట్ట కంసుడు 'చెరలో'
  రుసరుసల భయమున వడకు
  వసుదేవునిఁ గాంచి 'వాలి' పక్కున నవ్వెన్

  మత్తేభవిక్రీడితము
  పసివానిన్ గనె నంచు దేవకి యహో! ప్రాణాంతకమ్మంచుఁ దాఁ
  గసితోడన్ దునుమంగ నెంచి భయుఁడై కంసుండు వేంచేయుచున్
  బిసతో ఖడ్గము నెక్కుఁబెట్టి 'చెరలో' భీతావహుండైన నా
  వసుదేవుం గని 'వాలి' సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏

   గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు 🎉🎉🎉🎉

   తొలగించండి
 13. కేవల ఊహ

  కుసుమాకరమున దేవకి
  కుసుమించిన ప్రేమతోడ గుసగుసలాడెన్
  కుసుమాస్త్రుని బాణమహిమ
  వసుదేవుని గాంచి వాలి, ఫక్కున నవ్వెన్!

  వాలి= వంగి , ఒరిగి

  రిప్లయితొలగించండి
 14. నుసిజేసెన్ బసికూనలార్వు రతడన్నో! హంతకుండంతలో
  బసివాడష్టమ గర్భమందున మహార్భాటంబునన్బుట్టగా
  కసిదీరన్ దన శత్రుశేషముడుగన్ గంసుండు రావచ్చి యా
  వసుదేవుం గని, వాలి, సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్.

  యజ్ఞభగవాన్

  రిప్లయితొలగించండి
 15. మిత్రులందఱకు నమస్సులు!

  [తమ తండ్రి యయాతి ముసలితనమును పొందుట కిష్టపడని పుత్రులలో రెండవవాఁడగు తుర్వసుఁడు, "నీవు, నీ వంశమువారు ధర్మాధర్మవివేక శూన్యులు కం!" డని శపింపఁబడఁగా, నతఁ డచటినుండి వెడలి, దేవుని యెదుట మోకరిల్లి, బాధతో దుర్వారాట్టహాసము చేసినాఁడనుట]

  వసుధేశుండు యయాతి కోరికనుఁ దీర్పన్ మాని, శప్తుండునై
  "రసఁ ద్వజ్జన్ములు కొండ్రుగాక ఘనధర్మాధర్మ భ్రష్టత్వమున్!
  వెస నన్ వీడు!" మటన్న, బాధఁ గొనియున్ వేవేగఁ దానేఁగి, తు
  ర్వసు, దేవుం గని, వాలి, సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్!

  రిప్లయితొలగించండి
 16. సమస్య :
  వసుదేవుం గని వాలి సేసెనట దు
  ర్వారాట్టహాసమ్మునున్

  ( యక్షలోకాధీశుడు ధనదేవుడు అయిన కుబేరుడు పుష్పకవిమానంలో వెళ్లుచుండగా ఎదురైన రావణాసురుడు పరిహసిస్తూ పుష్పకాన్ని వశపరచుకున్న సన్నివేశం )

  మత్తేభవిక్రీడితము
  ..........................

  నిసుగుల్ బోలెడి యక్షసంతతులనే
  నిర్వ్యాజభద్రాకృతి
  న్నిసుమంతైనను లోటులేక కను య
  క్షేశున్ మహాపుష్పకా
  న సుఖాసీనుని గాంచి రావణు డయో !
  నర్మంబులౌ దృష్టులన్
  వసుదేవుం గని , వాలి , సేసెనట ! దు
  ర్వారాట్టహాసమ్మునున్ .

  ( నిసుగుల్ - శిశువులు ; నర్మంబులు - పరిహాసాత్మకములు ; వసుదేవుడు - ధనాధిపతి యైన కుబేరుడు )

  రిప్లయితొలగించండి

 17. ఇసుమంతైనను జంకు చూపకయె పాత్రేదైన జీవించెడిన్
  వసుదేవుండట వాయుపుత్రునిగ నావాలేశ్వరుండేమొ తా
  నసురుండైన హిడింబరాక్షసునిగానానందమున్ వేయుచున్
  వసుదేవుంగని వాలి సేసెనట దుర్వారాట్ట హాసమ్ము నున్

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రసితమ్మెంచక గార్దభమ్ము నిలిచెన్ ప్రజ్ఞానమున్ జూపుచున్
  వసుదేవుంగని; వాలి సేసెనట దుర్వారాట్టహాసమ్మునున్
  అసహాయుండగు తమ్మునిన్ చఱచినన్ యాతండు నేమాత్రమున్
  త్రసనమ్మొందక రెచ్చగొట్టు నటులన్ రమ్మంచు బిల్వంగగా!

  రిప్లయితొలగించండి
 19. వసుధను'రాము'గ వచ్చిన
  వసుదేవునిఁగాంచి వాలి ఫక్కున నవ్వెన్
  కసుగాయలు తిను నాపై
  కసిఁబూనగ నేల?రాజ్య కాంక్షా?యనుచున్.

  రిప్లయితొలగించండి
 20. గు రు మూ ర్తి ఆ చా రి , ( Synd Bank ). వెలుగోడు  దసరాపండుగ దినమున

  వెస గ్రామమునందున దినవేషధరు లొహో !

  పసజూపెడు సమయంబున :--

  వసుదేవుని గాంచి వాలి ఫక్కున నవ్వెన్


  ( దినవేషధరులు = పగటి వేషగాండ్రు )

  " వీరు ఒకే రోజు రామాయణ భారత ఘట్టాలు అన్నీ కలిపి

  చూపిస్తారు "


  ****************************************

  రిప్లయితొలగించండి
 21. వెస గాడిద కాళ్ళను సం
  తసమున పట్టంగనోపు ధార్మిక చరితున్
  విసుగును చూపని వానిని
  వసుదేవునిఁగాంచి వాలి ఫక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 22. దెస రాజేంద్రభవుండు వానరునిగా దివ్యత్వమొప్పార తా
  నసమానప్రతిభా విశేష బలుడై యాలోచనా హీనతన్
  వసుధాధీశుని యండతో పృధివిపై భాసించుచుండన్ విభా
  వసుదేవుం గని వాలి సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్

  రిప్లయితొలగించండి
 23. శిశువై దేవకి గర్భ వాసుడయి రాశీభూత కాలుండుగన్

  దిశ చూపున్ యమ లోక దారులను నీ దీనంపు అంతంబుకై

  ముసిగా మౌనియె చెప్పె , చంపెదను నీ ముద్దుల్సుతున్ యన్చునా

  వసుదేవుం గని , వాలి , సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 24. ఫల్గుణుండును సీత వనవాసమునకు భీ
  మునితో కలసి వెళ్లె
  ముదముగాను,

  కర్ణుని తో కుంభ కర్ణుడు‌
  యుద్ధమున్‌
  చేయగా ద్రౌపది సిగ్గు పడెను

  గణపతి కినుకతో గాంధారి
  పైబడ
  వికటము బడసి నవ్వెగ నొక యతి

  వ,వసుదేవువి గాంచి వాలి ఫక్కున నవ్వె
  నా లంక పురము లో ననుచు పలుకు

  చుంటి వేమిరా యీరోజు తుంటరి వెధ

  వా యప భ్రంశ పలుకులు పలుక పాప

  మొచ్చు ,వలదంటి మందును , ముష్టి వాడ

  యనుచు సుతుని కాంచుచు నొక యమ్మ పలికె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో నా వ్యాఖ్య చూడండి.

   తొలగించండి
 25. సిసువునిగని యాదేవకి
  యిసుమంతయు జంకులేక యిపుడీరీతిన్
  పసివానిని తలపయి నిడు
  వసుదేవునిఁ గాంచి వాలి పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 26. కసితో యుద్ధము చేయుచున్ వరుస సంఘాతమ్ములన్ దూకుచున్
  వెస సుగ్రీవుని పైన వాలి గెలువన్, వృక్షమ్ము చాటుండగా
  విసరెన్ రాముడు సాయకమ్ము వడి నా పృథ్వీశుపైనన్, పున
  ర్వసు దేవుం గని వాలి సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్
  పసలేకన్ వధియింతువా యిటులనో పద్మాక్ష యంచెంచుచున్

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. పసివాని తోడ దాటెడు
  వసుదేవుని గాంచివాలీ ఫక్కున నవ్వెన్
  రసమయ మనుచును దివిజులు
  దెసలన్నియు మారుమ్రోగ దీవనలొసగెన్

  రిప్లయితొలగించండి
 29. పసివానింగొని దాటగానదిని నవ్వారిన్ సమీక్షించగా
  వసుదేవుంగని వాలిసేసెనటదుర్వారాట్టహాసమ్మునున్
  రసముంగల్గెడునాప్రయాణమును దారానాధుడాశ్చర్యమున్
  వెసదా నొందెను నాక్షణంబునట వేవేగంపు నుత్సాహియై

  రిప్లయితొలగించండి
 30. అసమాన వీరుఁ డొక్క ది
  వసమున రావణుఁడు రాఁగఁ బవరమ్మునకై
  యసురునిఁ, దలంచి యిచ్ఛా
  వసు దేవునిఁ గాంచి వాలి పక్కున నవ్వెన్

  [ఇచ్ఛావసువు = కుబేరుఁడు]


  పసి బాలుం డట నన్ను జంపు నట నా భాషించి కంసుండు దా
  నసి వేగమ్ముగ నెత్తి గర్వమున నయ్యాకాశ వాణిన్ వినన్
  రుసి చందమ్మున మౌనియై నిలువఁ దేరుం దోలుచుం బ్రక్కకున్,
  వసుదేవుం గని, వాలి సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్

  [వాలి = ఒఱగి]

  రిప్లయితొలగించండి
 31. విసవిస నవ్వెను కంసుడు
  వసుదేవునిఁ గాంచి; వాలి పక్కున నవ్వెన్
  అసమున పోరుకు బిలుచుచు
  కసితో సుగ్రీవుడెగయగా గని గేలిన్

  రిప్లయితొలగించండి
 32. నాటకము లో భాగంగా రాముని వేషం వేయాల్సింది కృష్ణుని వేషం దరించారనే సందర్భంగా నా ప్రయత్నము.

  మ :

  కసిగా రాముని పాత్రతో నిమిడి ప్రఖ్యానమ్ముగా నిల్వడన్
  దెస మార్పొందు నటంచు వేగమున యే తేడాను వీక్షింపకై
  పసనమ్మెంచి మురారినిన్ దలచ భావాభాస ఘట్టమ్ము నన్
  వసుదేవుంగని వాలిసేసెనట దుర్వారట్టహాసమ్మునున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి