10, ఏప్రిల్ 2021, శనివారం

సమస్య - 3689

11-4-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్”
(లేదా...)
“అలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే”

29 కామెంట్‌లు:

 1. విలయము కలుగును ఇంటన్
  మలయజమగు కాంత మిరప మంటగ మారున్
  వలచిన చీరలు దొరకక
  అలిగిన సతులుడుగరుదగు వ్యాపారములన్

  రిప్లయితొలగించండి
 2. కలుగునదూరినయెలుకల
  విలువలుతెలిసినమగువలువెఱగందకనే
  కలగకధీరతయుందురు
  అలిగినసతులుడుగరుదగువ్యాపారములన్

  రిప్లయితొలగించండి
 3. పలు విధముల హింసించుచు
  పలుకుల ములుకుల వలనను ముదితల సతమున్
  బలి సేసెడు తరుణంబున
  నలిగిన సతులు డుగ రు దగు వ్యాపారములన్

  రిప్లయితొలగించండి
 4. వలువల్ దప్పును స్థానముల్ రుసరుసల్ వర్ధిల్లగా మేనిపై
  జ్వలితంబై ముఖపద్మమెంత మెరయున్ చన్దోయు జ్వాజ్వల్యమై
  వెలుగన్ జేయ కటిప్రదేశమును సేవింపంగ శృంగారమౌ
  *నలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారులై మించరే*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 5. Work from home

  నెలవున పిల్లల యల్లరి,
  నిలకడ లేనట్టి కొలువు, నిరవధికముగా
  పిలుపుల మధ్యన నిజపతు
  లలిగిన, సతులుడుగరు దగు వ్యాపారములన్

  పిలుపులు = office calls

  రిప్లయితొలగించండి
 6. ఖలుడగు పతితో విసిగిన
  పలుబాధల బొందినట్టి భామలిక విడా
  కుల నాశించు తరుణమం
  దలిగిన సతులుడుగరు దగు వ్యాపారములన్.


  ఖలుడై భోగపు వాడలన్ దిరుగెడిన్ గామాంధునిన్ భర్తగా
  వలదంచున్ సతి తా విడాకులనుచున్ వాపోయెడిన్ వేళలో
  పలుబాధల్ దరిజేరకుండ ధనమున్ బంతంబు నార్జింపగా
  నలకంజెందిన యట్టి కాంతలుచిత వ్యాపారులై మించరే.

  రిప్లయితొలగించండి
 7. కలతల కాపురమందున
  నెలఁతలు పైచేయి కోరి నిరతము పతులన్
  కలవర పరతురు పతులపు
  డలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్

  రిప్లయితొలగించండి
 8. కందం
  సలుపంగ 'రాజకీయము'
  కలిమికొరకు వేరువేరు గమ్యములన లో
  కుల భ్రమియింప పతులపై
  యలిగిన సతు లుడుగరు దగు 'వ్యాపారము' లన్!

  మత్తేభవిక్రీడితము
  పలుకుల్ మార్చరె రాజకీయమున సంపాదించ విత్తమ్ము చె
  ల్లెలు భేదించినటుల్ సహోదరునితో ప్రేలున్ గదా వాక్కు, లో
  కుల నమ్మింప విభేదమున్నటులుగన్ గొంగ్రొత్తగా భర్తపై
  యలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే!

  రిప్లయితొలగించండి
 9. మ:

  చిలుకల్ జుట్టుచు గోముగన్ వలపుతో చిత్రాలు వల్లించుచున్
  నొలకన్ బోసెను ప్రేమమున్ నటనగా నొడ్డాణమున్బొందనై
  పలుకన్నేరక యున్న నాపతిని కోపావేశమున్ చెండుచున్
  అలుకం జెందినయట్టి కాంత లుచితవ్యాపారలై మించరే

  చెండు=ఖండించు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 10. విలువల్వీడి చరించి దుశ్చరితులై వేధించి పాంచాలినిన్
  వలువల్ దూయగ రోసి మానవతి దుర్వారాగ్ని కీలంబులన్
  కలతం జెందియు పంతమంది యరులన్ కాల్పించెనే యుద్ధమం
  దలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే

  రిప్లయితొలగించండి
 11. సమస్య :
  అలుకే జెందిన యట్టి కాంత లుచిత
  వ్యాపారలై మించరే

  ( లలనామణులకు అలుకే అదనపు అందం అనటంలో అతిశయోక్తి లేదు )

  మత్తేభవిక్రీడితము
  .........................
  పలుకుల్ బల్కుచు బారవశ్యకలనన్
  వక్తోక్తివైదగ్ధ్యలై ;
  కలధౌతాంచితదంతకాంతితతితో
  గందామరల్ వాల్చుచున్ ;
  వలపుల్ గుప్పుచు సౌకుమార్యవతులై ;
  వాల్లభ్యసంలభ్యలై
  యలుకం జెందిన యట్టి కాంత ; లుచిత
  వ్యాపారలై మించరే !!

  ( వాల్లభ్య సంలభ్యలు - ఆధిక్యాన్ని పొందినవారు )

  రిప్లయితొలగించండి


 12. చెలువము మీరగ సేలలు
  వలయు ననుచు ముద్దు సేసి పతిని విడువకన్
  పలువిధముల పిండుదుమయ!
  అలిగిన సతులుడుగరు దగు వ్యాపారములన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. చెలువమ్ముల్, మురిపెమ్ము, పేర్మి పలుకుల్, చేయూత, మిత్రత్వమున్,
  పలురాత్రుల్ పరిచారికా కొలువులాప్యానమ్ము, ముందావణీ
  పొలయింపుల్, పతిసేవయే ఫలముగా, పువ్వాడి కొండొక్కచో
  యలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే!  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. అలుగుటయేయెరిగిన పడ
  తులునలుగుట మాని ఆనతులనివ్వంగన్
  కలుగునటయ్య ఫలమ్ముల్
  అలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 15. అలకన్పూనెను వేణి శోషణపు భావావేశ క్రోధత్వమున్

  కులుకున్ శయ్యన చేరు నాధునిట రాకోయీ సఖాయన్చు నీ

  తులు జెప్పెన్ పతి పాద మర్ధనన హిత్యోక్తుల్ప ఠించంగనా

  అలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారులై మించరే”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 16. కలనైన మొఱకుదనమును
  నలిగిన సతులుడుగరు,దగువ్యాపారములన్
  లలనలు సేతురు చక్కగ
  విలసితమగు నేర్పుతోడ పెద్దలు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 17. కలలో సైతముదూషణంబుగను వాగ్ఢారన్ బ్రదర్శించున్
  నలుకంజెందినయట్టి కాంతలుచిత వ్యాపారలై మించరే
  లలనాశ్రేష్ఠుల జూడగాదెలియు వాలాయంపు టౌన్నత్యమున్
  వలపుల్ గుప్పుచు జేరవత్తురుగ దావాల్లభ్యమున్ జూపుచున్

  రిప్లయితొలగించండి
 18. కలవరమే గద పతులకు
  అలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్
  దలపరు గద తప్పొప్పులు
  చెలియకు పరిచర్యలు పదసేవనమైనన్

  రిప్లయితొలగించండి
 19. కలహాశి నలువచూలియె
  నలమేనిదొరకిడె నొక నన నది చెలివెసన్
  లలనామణి చెవి జేర్చగ
  నలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్

  రిప్లయితొలగించండి
 20. తలఁచిన ధర్మం బని యెడఁ
  దలఁ బుట్టింటి పయిఁ బ్రీతి తనరఁగ మిగులం
  గలనైన నౌర నిజపతు
  లలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్


  జలజా తానన వార ణాభ గమ నాశావ్రాత సంతప్త చి
  త్త లతా సన్నిభ దేహ నిత్య సద సద్భావజ్ఞ సుస్వాంతలున్
  లలితాంఘ్రిద్వయ భూష ణాంబర విలోలప్రాభ వోద్యోగలే
  యలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే

  రిప్లయితొలగించండి
 21. నిలుకడ నెరుగని వరునకు
  నలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్
  కలహాశను లిరుగు పొరుగు
  లలనల నెలుగెత్తి పిల్చి లబలబలాడన్

  రిప్లయితొలగించండి
 22. కలలన్ దేల్చి సుదూరదేశమునకున్ కార్యార్థియై పోవగా
  చెలికాడాతడు లేనిలోటు మది నిస్తేజమ్ము కల్గించగా
  చెలి కోర్కెన్ మది నెంచి భార్యకయి వేంచేయన్, వియోగమ్ముచే
  యలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారులై మించరే


  రిప్లయితొలగించండి
 23. మైలవరపు వారి పూరణ

  తలపన్ న్యాయమె నన్ను వైరినని., సత్యానాథుడన్ గానొకో!
  కలికీ! కోపమనర్థదాయకమిటుల్ గావింపగా ధర్మమా!
  తలపై తన్నితి., నిందఁ జేసితివి., కాంతా! లోకమందెంచగా
  నలుకం జెందినయట్టి కాంతలుచిత వ్యాపారలై మించరే!

  మించరే.. మించరు. అనే భావనతో పూరించితిని.

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 24. ఇలలో భర్తల కెల్లకార్యములలో నింతుల్ సహాయంబుగా
  తలలోనాలుకగా మెలంగుచు నితాంతాపారమౌ ప్రేమతో
  కలలోనైనను మేలుకోరుదురు నిష్కామంబుగా, భర్తయం
  దలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారులై మించరే

  రిప్లయితొలగించండి
 25. పలుకుచు తీయని మాటలు
  కొలువులు వీడుచు సతతము కుత్సితమతులై
  యిలలో వెతలిడు పతిపై
  యలిగిన సతులుడుగరు దగు వ్యాపారములన్.

  రిప్లయితొలగించండి