13-4-2021 (వారం)
కవిమిత్రులారా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్”
(లేదా...)
“ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్”
కవిమిత్రులారా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్”
(లేదా...)
“ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవనికి కరోన దెచ్చెను
రిప్లయితొలగించండిభవదీయుడు "శార్వరి"యను వత్సరమపుడున్
భువికిని నీవై నను"వి
ప్లవ సంవత్సరమ! తెత్తువా సేమమ్ముల్
https://youtu.be/kEK4y_BQiTI
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభువిలో కరోన వలనన్
చవియున్ మాయుచు విభవమె చాగఱ మయ్యెన్
పవిదిని దాని నడంచుచు
ప్లవ సంవత్సరమ! తెత్తువా సేమమ్ముల్?
నవతను బెంచుచు శుభములు
రిప్లయితొలగించండిభువిలో కలిమియు బలిమియు ముదముల నొసఁగన్
దవిలియు గోరుచు నుండగ
ప్లవ సంవత్సరమ తెత్తు వా సేమమ్ముల్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవనికివసంతమోచ్చెను
రిప్లయితొలగించండిచవులూరింపగచివురులుచాటునకూసెన్
కవులకుదీటుగకోకిల
ప్లవసంవత్సరమతెత్తువాసేమమ్ముల్
రిప్లయితొలగించండిజవనాడులుడుగుచుండెను
భవితవ్యంబేమిటో యెవరికి తెలియదే!
అవసర మీ సమయమ్మున !
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్?
తెప్పై మమ్ము కడతేర్చవే
ప్లవనామ వత్సరమా
కరోనా కోరల నుండి!
జిలేబి
కవులున్ బూవులకారు పుష్పలిహముల్ కామాంగముల్ కాకలీ
రిప్లయితొలగించండిరవముల్ చంద్రికలెల్ల మున్నెరికతో ప్రాధేయమున్ బిల్వగా
ప్రవిభాసింపగ ధాత్రి జేరుమనుచున్ బ్రార్థింతు కైమోడ్చి హే
ప్లవనామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్?
శివమొసగక తా జేరుచు
రిప్లయితొలగించండిజవసత్త్వమ్ముల హరించె శార్వరి, మరినీ
వవనిని కాలిడితివి యో
ప్లవ సంవత్సరమ, తెత్తువా సేమమ్ముల్.
కవితా గోష్ఠికి యాంక్ష, కాంక్షలకు శిక్షల్ మూతికిన్ గోచితో
రిప్లయితొలగించండినవ సంవత్సర మేగు దెంచెనని సన్మానింప రీ కావ్యులన్
భవితవ్యం బెటులున్నదో భయముతో భాషింప
రాశీస్సిడన్
*“ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్”*
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి"నవనీతామృతవారిరాశిని వెసన్ నవ్యంపుఁ బాషాణమన్
నవరోగమ్ము "కరోన" పేరిట నిటుల్ నర్తింప లోకమ్మునన్,
’దవులంబెట్టు’మటంచు శార్వరిని శ్రద్ధం గోరఁ, బాఱెంగదా!
ప్లవ నామాబ్దమ! రమ్ము! మా కిఁకను సంప్రాప్తించునా సేమముల్?"
అవుగాభ్రాంతిగనయ్యెనేనిదియుమాయామేయలోకంబులో
రిప్లయితొలగించండిఅవకాశంబులనాసమానవుడుభావావేశముల్తోడుగా
భవితన్జూడగనాకరోనమదినాభావంబుతాద్రుంపెనే
ప్లవనామాబ్దమ! రమ్ముమాకికనుసంప్రాప్తించునాసేమముల్
రిప్లయితొలగించండిజవసత్వమ్ములు కృంగె నయ్యొ బతుకుల్ జంజాటమయ్యెన్! కరో
న విరామమ్మిక లేక యుమ్మలముతో నట్టేటముంచెన్! వెసన్
ప్లవ నామాబ్దమ రమ్ము! మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్
లవలే శమ్ము? జనాళి బాగుపడునా? లాభమ్ము పెంపొందునా ?
జిలేబి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభువిలో దుష్ట కరోన పుట్టి ధృతినిన్ పోజేసి నల్దిక్కులన్
అవరోధమ్ముల నెన్నియో పఱచుచున్ యారోగ్య భాగ్యమ్ములన్
అవలోపమ్మొనరించు వేళ దరి చేరంగన్ ప్రమోదించునౌ
ప్లవనామాబ్దమ! రమ్ము, మాకికను సంప్రాప్తించునా సేమముల్?
భవునాజ్ఞన్ భువి సాగుచున్నదట సంభావ్యంబు నారోగ్య మో
రిప్లయితొలగించండి*“ప్లవ నామాబ్దమ! రమ్ము! మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్”*
జవసత్వంబులు పూర్వవైభవము విశ్వశ్రేయ మౌన్నత్యముల్
శివమంచీవిక సింతసేయకుము నాశీర్వాదమందింపగా
రవముల హోరున రక్కసి
రిప్లయితొలగించండిశవములు జేయుచు వరుసము శార్వరి వచ్చెన్
నవనవలాడుచు క్రొత్త
ప్లవ సంవత్సరమ తెత్తువా! సేమమ్ముల్
రిప్లయితొలగించండినవ వర్షాగమ వేళ చైత్రరథ వి
న్యాసంబున న్దోచె మా
నవ హృద్గీతికలో వికల్పమయ ఖి
న్నధ్వాన సంకేతముల్
యవనింజుట్ట కరోనభూతమది, నీ
యాయాన సందీప్తిలో
ప్లవ నామాబ్దమ! రమ్ము! మాకిఁకను సంప్రాప్తించునా?! సేమముల్!
ఆయానము=రాక
జవ నవ రవ కాంతులతో
రిప్లయితొలగించండిభువి వెల్గొందు తరుణమిది, భూరి తెవులుకున్
తవులుకు చివికె, ఉగాదిన
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్
శార్వరి పడుతున్న వేదన…….
రిప్లయితొలగించండిమ౹౹
జవసత్త్వంబులు తగ్గి మేను కృశియించంగన్ తుదన్ ఫాల్గుణిన్
యవసానంబును చేరితిన్ కరొన నిన్నంతంబు నొందించగన్
ప్లవ నామాబ్దమ రమ్ము! "మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్?"
నవ వర్షంబున నిట్లు నడ్గెదరు ప్రాణంబుల్ చలించం గిలన్౹౹
సమస్య :
రిప్లయితొలగించండిప్లవ నామాబ్దమ రమ్ము మా కికను సం
ప్రాప్తించునా సేమముల్
మత్తేభవిక్రీడితము
........................
జవసత్వంబులు పోయె ; నంతట నహో !
సంబంధసూత్రమ్ము మా
నవులందున్మటుమాయమయ్యె; నకటా!
నమ్రప్రణామం బిదే !
భవతాపంబుల రూపుమాపి జగతిన్
భద్రంబుగా జేయుమా !
బ్లవ నామాబ్దమ! రమ్ము ; మా కికను సం
ప్రాప్తించునా సేమముల్ ?
వివశులను జేసె శార్వరి
రిప్లయితొలగించండియవని పయి జనులను , కోతి యాటలు వీడన్
సవరణ గావించి యిపుడు
ప్లవ సంవత్సరమ ! తెత్తువా సేమమ్ముల్
భువియందున్ గత రెండు వత్సరములై భూభారమే హెచ్చెనో
రిప్లయితొలగించండినవకీటంబులు హెచ్చి మానవులనే నాశంబు గావించెనే
జవసత్వమ్ములనిచ్చి గావవె మమున్ సమ్యగ్విధిం గాలమా
ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్
ప్రవహించెన్గదశార్వరీకతనపాపంబైనరోగంబిలన్
రిప్లయితొలగించండిజవసత్వమ్ములుగూడదీసుకొనిసుజ్ఞానంబుగోవాక్సినై
శివశక్త్యాదిగగంటిమంటలటునిశ్శేషంబుగావింపగన్
ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్”
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
🌹కందము🌹
రిప్లయితొలగించండిఅవిగో ఆరు రుచులును క
లవరమున కరోన కూడి లాస్యము జేసెన్
చవులూరెడి పచ్చడి తిని
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
🌹మత్తేభము🌹
రవి చంద్రాదులు పల్కె సాక్ష్యమును వైరంబై కరోనా , హరీ,
భువనమ్మున్ వణికించె లోకములునబ్బోయన్చు సాగిల్లగ
న్నవిగో రోజులు వచ్చు త్రోలగను ప్రాణాంతంబులా పుర్వులన్
ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
కవన కుతూహలమున నే
రిప్లయితొలగించండినవకవితలు వ్రాయబూని నవవత్సరమం
దవిరళ కృషిసల్పదలతు
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్
రవిచంద్రార బుధార్య శుక్రశని స్వర్భానుర్ధ్వజాదుల్ గృహే
రిప్లయితొలగించండిశు విధిన్ పూజన సేయుచున్ మిగుల సంశోభింప నూత్నామ్ర పు
ష్ట విపాకంబును ప్రాశనంబొదవ నిష్టార్థంబులున్ గల్గ నో
ప్లవ నామాబ్దమ రమ్ము మాకికను సంప్రాప్తించు నా సేమముల్
గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికందం
ధ్రువతారలు నేలకొరుగ
స్రవించెడు కనుల నిషీధి శార్వరి నింపెన్
నవయుగమన నీవయినను
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్?
మత్తేభవిక్రీడితము
ధ్రువతారల్ భువిరాలఁ ద్రుంచనదె కారోనా విజృంభించుచున్
స్రవముల్ శార్వరి నింపెకన్నులనహో! సంతాప మాద్యంతమై
నవరాగమ్ములు సిందు కోయిలలతో నమ్మంగ శ్రేయమ్ముకై
ప్లవ నామాబ్దమ రమ్ము! మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్?
మొదటి పద్యంలో 'నిశీధి' గా చదువుకొన మనవి
తొలగించండిఅవనిన్ భీతి కరోన కూర్చఁ, గడు నన్యాయమ్ముగా రోగులన్
రిప్లయితొలగించండిస్తవనీయమ్మగు వైద్యశాలలవి నిర్దాక్షిణ్యమున్ దోచెడిన్
భువిపైనన్ బ్రజ లాశతోడఁ గనగన్ బూజ్యంపు నీరాకకై
ప్లవ నామాబ్దమ! రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్?
జవసత్వంబులు అంతరించిన వి ఆసాంతంబు చీకట్ల తో
రిప్లయితొలగించండిప్రవహించన్ తడి కన్నులన్ మరణవిభ్రాంతిన్ కరోనా వ్యధన్
రవళించాలి సృజించి ఓషధుల ధారాళంబు గన్ ధాత్రిని న్
ప్లవనామాబ్దమ రమ్ము మాకికను సంప్రాప్తించునా సేమముల్
అవనిని వణికించెను రౌ
రిప్లయితొలగించండిరవముగ మార్చె బ్రతుకు జనులకు శార్వరియే
అవగడముల దొలగింపుమ
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్
శవముల జేయుచు మమ్ముల
రిప్లయితొలగించండిభువిలో లేకుండజేయ పుట్టితివేమో
వివరముగ జెపుమనీవో
ప్లవసంవత్సరమ!తెత్తువా సేమమ్ముల్
రిప్లయితొలగించండి--------------------------------------
*కం.*
నవకాంతులు సిరికాంతులు
భువిలో వెలుగొంద ప్రగతి భూషణ మగుచున్
రవికాంతుల చైతన్యము,
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్
--------------------------------------
*- గానుగుల*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్లవగంబై ధరకు నుప
తొలగించండిప్లవమ్ము లొనరింప కమ్మ ప్రార్థన లివియే
ప్లవమై జనులం బ్రోతువ
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్
సవికార్యబ్ద ఘనోగ్ర శార్వరి మహా సంత్రాస మిచ్చెన్ భువిం
సువిచా రాతత సౌఖ్య సంపదలు నిశ్శోకమ్ముగాఁ గూర్చుచున్
రవిచంద్రాది నవగ్రహప్రభ లిలన్ రాజిల్ల శాంతమ్మునం
బ్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్
భవముల్ నీయగ వేగమేయిటకు సంభావ్యంబునొప్పంగ నో
రిప్లయితొలగించండిప్లవనామాబ్దమ!రమ్ము మాకికను సంప్రాప్తించునా సేమముల్
వివరంబొప్పగజెప్పు నీమదిని నేభేదంబు లేకుండగా
భువికిన్ రక్షణ జేయగా మనుమయోపూతాత్మ! యోరక్షకా!
గురువులు శ్రీకంది శంకరయ్య గారికి, శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారికి, యితర కవిపుంగవులకు మరియు కవిమిత్రులకు "ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు."
రిప్లయితొలగించండినవ లావణ్య సుగంధ మాలికలు కంఠంబంధునన్ వైచి ప
ల్లవ సాదృశ్య పదప్రభావముల సల్లాపంబులన్ సల్పుచున్
జవ జీవంబులె పిల్ల తెమ్మెరలుగా సంతోషమే హాసమై
ప్లవ నామాంగన వచ్చె నేఁడు నిదె యాహ్లాదంబులన్ బంచుచున్.
కన్నీటినడగించ గల వర్ష ధారచే
.......... కర్షకవ్రజమెల్ల హర్షమొంద
ధర్మంబు నాల్గుపాదముల వెల్గెడునట్లు
.......... జననాయకులు భువిన్ జననమంద
స్వార్థంబులను వీడి సార్థకంబగు రీతి
.......... ప్రజలెల్ల సేవాపరత్వమంద
మూఢత్వమును బాపి మోహంబులను ద్రుంచి
.......... నిజతత్త్వ విజ్ఞాన నిధిని బొంద
నందఱకు భోగ సౌభాగ్య మందజేసి
నిందలకు కుందుటన్నది నీరుగార్చి
సంతసమ్మును చేకూర్చ స్వాగతంబు
వందనంబిదె "ప్లవనామ" వత్సరంబ.
కవికులముల దీపింపుము
సువిశాల జగత్తుకెల్ల శోభనమిడుచున్
నవ వారధి నిర్మింపగ
ప్లవవత్సరమా ఘటింతు వందన శతముల్
అవసాదంబున ముంచెగా జనులనౌరా శార్వరీ వర్షమే
రిప్లయితొలగించండిఅవశేషంబిక లేక నాశమొనరింపంగా కరోనా నికన్
రవణింపన్ భువి స్వాస్థ్య సౌఖ్యములు సంరక్షింపగా మమ్ములన్
ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్
🙏🏻🙏🏻
రిప్లయితొలగించండిమ.
జవసత్వంబులు గృంకె శార్వరిని నాసాంతంబు నిద్ధారుణిన్,
నవచైతన్యము నింప వేడుదును నానా స్తోత్రపాఠంబులన్
దివినందుండెడి దేవదేవు దయతో దేదీప్యమానంబుగా
ప్లవ నామాబ్దమ రమ్ము! మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్?
ప్లవ నామ సంవత్సర శుభాభినందనలు:
రిప్లయితొలగించండిమ:
కవనం బెంచితి నిన్నువేడ ప్రభువా కాపాడగా రావదే
భువినందంతట వింత రోగ మదెదో పొంగార ప్రాణాంతమై
ధ్రువమై యెప్పదె నీదు జాలి నిటగా దూరంగ వాసంతమై
ప్లవ నామాబ్దమ, రమ్ము మాకికను సంప్రాప్తిన్చు నా సేమముల్
వై. చంద్రశేఖర్
భువనంబందున జీవజాలములకున్ భోజ్యంబయెన్ కష్టముల్
రిప్లయితొలగించండిజవసత్త్వంబులు మందటిల్లినవి రక్షంజేయ లేరెవ్వరున్
ప్లవముంజేకొనినీరధిన్ మునుగు మా ప్రాణంబులన్ గావగా
ప్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్
భువిలో శార్వరి వర్షము
రిప్లయితొలగించండిదివమును రాత్రియు ననకను తిప్పల నిడియెన్
నవకాంతినిడుచు సతతము
ప్లవ సంవత్సర మ తెత్తువా సేమమ్ముల్