2, డిసెంబర్ 2021, గురువారం

సమస్య - 3919

 3-12-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తను మెప్పింప విషము భామిని యొసఁగెన్”
(లేదా...)
“భర్త మనంబుఁ జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో”

32 కామెంట్‌లు:

  1. వర్తిలుప్రేమనుపార్వతి
    కర్తయజీవులకునుకఱకంఠుడుకాగా
    వర్తనతాననుగామిగ
    భర్తనుమెప్పింపవిషముభామినియొసగెన్

    రిప్లయితొలగించండి
  2. నర్తకి యొక్కతె నర్తిలె
    భర్తను మెప్పింప, విషము భామిని యొసఁగెన్
    నర్తనకు పిలిచి చెడుగ ప్ర
    వర్తించిన రాజుకు,తగు వంచనతోడన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    నర్తకి నొకతెను బూనిచి
    ధూర్తునిఁ గడతేర్చుమన్న దొరకొని వశమౌ
    వర్తిని నటనమ్ముల భూ
    భర్తను మెప్పింప విషము భామిని యొసఁగెన్

    ఉత్పలమాల
    ధూర్తుడొకండు రాజ్యమున దుఃఖమిడన్ నయవంచకుండునై
    నర్తకిఁ బూన్చి వానిదగు నాశము సూడఁగ నానతీయఁ దా
    నార్తిని వాలుకంట మరులందున ముంచియు లొంగినంత భూ
    భర్త మనంబుఁ జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో!

    రిప్లయితొలగించండి

  4. మార్తాండుడు చెలరేగగ
    మూర్తీ! దాహార్థియౌచు మొగుడేతెంచన్
    కర్తవ్యమనుచు నప్పుడు
    భర్తను మెప్పింప విషము భామిని యొసగెన్.

    రిప్లయితొలగించండి
  5. ధూర్తుని హత మార్చు మనుచు
    భర్తయె కోరంగ పత్ని పాటింపగ దా
    నర్తకి వేషమున వెడలి
    భర్తను మెప్పింప విషము భామిని యొస గెన్

    రిప్లయితొలగించండి
  6. హర్తయపాపసంఘమునకాతఁడుశంభుడదేలశంకనా
    వర్తిలుభాగ్యమందిరమువాడదునమ్మితిమానసంబునా
    భర్తగలోకకర్తగనుపావనుడౌగదరక్షకుండనన్
    భర్తమనంబుఁజూరగోనభామినియిచ్చెవిషంబుప్రేమతో

    రిప్లయితొలగించండి

  7. కర్తయు కర్మయై జగతి గాచెడు వాడె కపాలధారియే
    ధర్త యతండె శంకరుడు తారిషమందున నాభి పుట్టగా
    నార్తి సురాళి కోరిరని యంబరకేశుడు యోగ్యుడంచు నా
    భర్తమనంబు జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో.

    రిప్లయితొలగించండి
  8. వార్తలు చదువగ తెలియును
    పూర్తిగ దుష్టుల చరితలు పుష్కలమనుచున్
    భర్తను చంపి మరియొకరి
    భర్తను మెప్పింప విషము భామిని యొసఁగెన్

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి

    ఎలుక లింటిలోఁజేయగా కలకలంబు
    విసుగుఁజెందిన నాథుండు వేగ,తనను
    పిలువ,/భర్తను మెప్పింప ,విషము భామి
    ని యొసగెన్ /బిలమందున నించు మనుచు.

    రిప్లయితొలగించండి
  10. కార్తికమున భవుని గొలిచె
    భర్తను మెప్పింప , విషము భామిని యొసఁగెన్
    ఆర్తినిడగ దీర్థమనుచు
    కర్తవ్యమెరిగిన భార్య క్రమమిట్లుండున్

    విషము = జలము

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    కర్తవ్యము వీడుచు తా
    ధూర్తుడయి వెతలను బెట్టు దుర్మతి జ్ఞాతిన్
    పూర్తిగ నమ్మించి బిలిచి
    భర్తను మెప్పింప విషము భామిని యొసగెన్.

    ధూర్తుడునై నివాసమున దుర్మతి తోడ యవస్థలుంచుచున్
    ఆర్తిని గల్గజేసి నడయాడెడు జ్ఞాతిని మట్టుబెట్టగన్
    కర్తగ మారి వాని నొడికమ్ముగ బిల్చి ప్రియత్వ భావమున్
    భర్తమనంబు జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో.

    రిప్లయితొలగించండి
  12. భర్తను దైవమంచునొక భామిని దుర్వ్యసనంబు లందునన్
    బూర్తిగ చిక్కుకున్న పతి పూజలు సల్పు నమాయకంబుగా
    భర్త దయావిహీనుడయి భార్యను మద్యము గోరినంతనే
    భర్త మనంబుఁ జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో

    రిప్లయితొలగించండి
  13. కందం
    పూర్తి పరిమార్పు చిత్రము
    స్పూర్తి నొసంగగ విరోధి పొరిగొను విధమున్
    వర్తన దప్పిన విసపరి
    భర్తను మెప్పింప విషము భామిని యొసగెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    పరిమార్పు-హింస ,పొరిగొను-చంపుట ,విసపరి-దుష్టస్వభావి.

    రిప్లయితొలగించండి
  14. కర్తృత్వము దాను బడయ
    భర్తను వేధించు నట్టి వైరికి సద్య
    స్స్ఫూర్తిని నుద్వేగమ్మున
    భర్తను మెప్పింప విషము భామిని యొసఁగెన్


    వర్తుల చంద్ర బింబ నిభ వక్త్ర విలాస మనోహరాంగియే
    నర్తన లీల వచ్చిన క్షణమ్మున నింపుగ మల్లికా నవీ
    నార్తవ దామ మూని జడ యందుఁ బదాంబుజ మార్జ నార్థమై
    భర్త మనంబుఁ జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో

    [విషము=జలము]

    రిప్లయితొలగించండి
  15. నర్తకి వేషము దాల్చెను
    భర్తను మెప్పింప,విషముఐభామిని యొసగెన్
    హర్తకుని జూచు భయపడు
    భర్తకు దాలేచివెళ్ళి బలవంతముగన్

    రిప్లయితొలగించండి
  16. ధూర్తుడు నైననున్ మిగుల దుర్మతియైనను భర్తగాన,దా
    భర్తమనంబు జూఱగొన భామిని యిచ్చె విషంబు బ్రేమతో
    భర్తలు దుష్టులైన నిక భార్యలు వారిని గారవంబునన్
    కర్తయు గర్మయున్ గ్రియయుగా,దగురీతిని జూడనొప్పగున్

    రిప్లయితొలగించండి
  17. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

    భర్తను మెప్పింప విషము భామిని యొసగెన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో

    హిరణ్య కశిపుడు తన భార్య లీలావతికి విషపు పాత్రను ఇచ్చి ప్రహ్లాదునికి త్రాగించ మనిన సందర్భము


    వారణముల ఘన పాదముల్ త్రొక్కినన్ బ్రతికెగా బిడ్డడు, పర్వతశిఖ

    రములపై కెక్కించి రయముగ విసరి వేసినను ప్రాణమ్ములు చెదర కుండె,

    భార్యకు గరళపు పాత్రనొసగి తనశిశువుకు నిడమన చేష్టలుడిగి ,


    తప్పక, భర్తను మెప్పింప విషము భామిని యొసగెన్ శుభమ్ములు తన

    సుతునకు నొసగమనుచు నీశునిమనమున
    తలచి, ప్రహ్లాదుడు కడు ముదముగ కాల
    కూటమును గైకొని హరిని కూర్మితోడ
    కొలుచు చున్ గ్రోలె నంతయు గుటగుటమని

    రిప్లయితొలగించండి
  18. హర్తగ మారి గ్రామమున నన్యుల సంపద కొల్లగొట్టుచున్
    పూర్తిగ మద్యపానమున మోదము పొందు విభుండు మారగా
    నార్తినొసంగి పెన్మిటికి నామము బాపగ వెజ్జు పంపునన్
    భర్త మనంబుఁ జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో
    ఆర్తి: హారతి, ఆమము: రోగము

    రిప్లయితొలగించండి

  19. పూర్తిగ నెలుకను చంపగ
    భర్తను మెప్పింప విషము భామిని యిచ్చెన్
    కర్తగ మారుచు సమయ
    స్ఫూర్తినిగనిమెచ్చెనతడుసొంపుగ గనుమా.

    రిప్లయితొలగించండి