9, డిసెంబర్ 2021, గురువారం

సమస్య - 3926

10-12-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్వ్యాసంగ మ్మశాంతి సాధకము గదా”
(లేదా...)
“సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్”

21 కామెంట్‌లు:

  1. సద్వ్యాఖ్యలురుచియింపక
    పద్వ్యూహంబులసభలనుపాలనసేయన్
    విద్వ్యాసంగముకుహనా
    సద్వ్యాసంగమ్మశాంతిసాధకముగదా

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. సద్వ్యాపారమయినను బృ
      హద్వ్యాపారమ్మయినను హర్షముగూర్చున్
      హృద్వ్యాసంగమవనిచో
      సద్వ్యాసంగ మ్మశాంతి సాధకము గదా

      తొలగించండి
  3. కందం
    మద్వ్యాకులతకు మందగు
    సద్వ్యాసం గమ్మశాంతి సాధకము గదా
    హృద్వ్యా సంగంమ్మిచ్చును
    తద్వ్యాపారమ్ము చింత తనరుచు జేయన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  4. సద్వ్యాసంగమె పూరణ,
    సద్వ్యాసంగ మ్మశాంతి సాధకము గదా!
    సద్వ్యాసంగము రాతిరి,
    సద్వ్యాసంగమె మనసుకు సంతసమొసగున్.

    రిప్లయితొలగించండి
  5. సద్వ్యాసంగ మె శ్రేష్ఠము
    విద్వ్యాసంగ ము వలనను విద్వాంసు డగున్
    హృద్వ్యా సంగము మెచ్చ ని
    సద్వ్యాసంగ మ్మ శాంతి సాధ కము గదా !

    రిప్లయితొలగించండి
  6. శుక్రాచార్యుఁడు బలిచక్రవర్తితో...

    కందం
    మద్వ్యాఖ్యానము వినుమయ!
    త్వద్వ్యాజ్యమ్మున నజుండు వామనుఁడు బలీ!
    సద్వ్యక్తిగ తలవంచెడు
    సద్వ్యాసంగమ్మశాంతి సాధకము గదా!

    శార్దూలవిక్రీడితము
    మద్వ్యాఖ్యానము శౌరి వామనుడనన్ మన్నించి దాతృత్వమున్
    సద్వ్యాపారమటంచు మూడడుగులన్ క్ష్మానీయగా నొప్పితే!
    త్వద్వ్యాజ్యమ్మున వ్యూహమేమిటొ బలీంద్రా? వైరికర్పించెడున్
    సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్!

    రిప్లయితొలగించండి
  7. మద్వ్యాపకమగు వ్రాయుట
    సద్వ్యాసంగ మ్మ , శాంతి సాధకము గదా
    సద్వ్యక్తత లేకుండిన ,
    సద్వ్యాకరణంబు వాడి సమకూ ర్చవలెన్

    రిప్లయితొలగించండి
  8. హృద్వ్యాకులతకు మందగు
    సద్వ్యాసంగమ్ము; శాంతి సాధకము గదా
    హృద్వ్యాకులతయు మించిన
    తద్వ్యాప్తిని మదినణచగ తగు గురువొందన్

    రిప్లయితొలగించండి
  9. సద్వ్యసనంబగు పఠనము
    హృద్వ్యాకులములనణంచి హితమును గూర్చున్
    సద్వ్యూహముతో నెరపని
    సద్వ్యాసంగమ్మశాంతి సాధకము గదా

    రిప్లయితొలగించండి
  10. కందము

    సద్వ్యూహము యుద్ధంబున
    సద్వ్యాఖ్యానంబు కావ్య శాస్త్రపఠనలో
    సద్వ్యాపారము విపణి,న
    సద్వ్యాసంగమ్మశాంతి సాధకము గదా.

    శార్దూలము

    సద్వ్యాసంగము శాంతి మూలమగు
    శాస్త్రజ్ఞానమబ్బున్ సదా
    సద్వ్యూహంబు రణంబునన్ జయమహో!
    సాధ్యంబుగాఁజేసెడున్
    సద్వ్యాపారము పెంచు విత్తమును
    దుష్టాచార పాపీ కృతా
    సద్వ్యాసంగమశాంతికిన్ నిలయమౌ
    సౌజన్యమూర్తీ!కనన్.

    రిప్లయితొలగించండి
  11. మద్వ్యాపారము నిర్వహించితిని సమ్మానమ్ము తో నేడిటన్
    సద్వ్యక్తిత్వము వీడి నీవుచను టాశ్చర్యమ్మునాకున్ వినా
    సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్
    సద్వ్యూహమ్మునపోవు పాండవులకే సంపత్తి సంప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి
  12. హృద్వ్యాసంగము బెంచు జీవనగతిన్ శ్రేష్టంబుగా జేయు ధీ
    మద్వ్యూహంబులు పన్నుటం దెలియు క్షేమంబుల్ గనున్ దుష్టశ
    శ్వద్వ్యాసంగము గర్హణీయము దురాశం బెంచు, నీ హీనసం
    సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  13. సద్వ్యాఖ్యలను వినమది
    సద్వ్యసనంబుల నెరుగగ సంయమనమునౌ
    హృద్వ్యాసంగము వేరన
    సద్వ్యాసంగమ్మ శాంతి సాధనము కదా!!

    రిప్లయితొలగించండి
  14. సద్వ్యయము మేలు భృశ రా
    జద్వ్యసనము లొసఁగు కీడు సంతతమును గిం
    చిద్వ్యంగ్యముతో విడుచుట
    సద్వ్యాసంగ మ్మశాంతి సాధకము గదా


    హృద్వ్యస్తార్థ విమోహియై జనులఁ దా హింసింప సంసార చం
    చద్వ్యామోహము మీఱ డెందమున నిస్సందేహ సౌభాగ్య రా
    జద్వ్యాపార మదాంధకారమున సస్వార్థైక సంకల్పి తా
    సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్

    [సంకల్పిత + అసద్వ్యాసంగము = సంకల్పి తాసద్వ్యాసంగము]

    రిప్లయితొలగించండి
  15. తద్వ్యాఖ్యానము నే వినంగ మదిలో ధ్యానంబులే చేయ,నా
    హృద్వ్యాసంగము దుష్ట చింతనయనన్,హృద్యంబు కాదేదనన్
    మద్వ్యాఖ్యానము నే విధంబుగను ,సమ్మాళింప లేకున్న,యా
    సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయమౌ సౌజన్య మూర్తీ కనన్!!

    రిప్లయితొలగించండి
  16. సద్వ్యాసంగము మంచిది
    సద్వ్యాసంగంబు వలన సజ్జను లగునే
    హృద్వ్యాకులతనునిడునిది
    సద్వ్యాసంగమ్మ శాంతిసాధనముగదా

    రిప్లయితొలగించండి
  17. సద్వ్యాసంగమశాంతికిన్ నిలయమౌ సౌజన్యమూర్తీ కనన్
    సద్వ్యాసంగము గాద శాంతికి ధరన్ సౌఖ్యంబు నీడేర్చునే
    హృద్వ్యాసంగము జేత దృప్తియ యిడున్ నేవేళయందైననున్
    మద్వ్యాసంగము బట్టి జెప్పితి సమ్మానంబు జూపంగదే

    రిప్లయితొలగించండి
  18. సద్వ్యాసంగము గ్రంథముల్జదువ, తా సన్మార్గ సంధాయియౌ
    హృద్వ్యాపారములుజ్జగించి చదువన్ హేయంబగున్ మిత్రమా!
    సద్వ్యూహంబుగ నెంచుకోనగుసుమా సారస్వతంబుల్, వినా
    సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్

    రిప్లయితొలగించండి