18, డిసెంబర్ 2021, శనివారం

సమస్య - 3935

19-12-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవుల నిందించువారికి ఖ్యాతి గలుగు”
(లేదా...)
“కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్”

24 కామెంట్‌లు:

  1. గులకఱాలులపదములగూర్చియాట
    ఢమఢమధ్వనిఁజేసిడమరుకమున
    వసనుపిట్టనువోలెనువదరునా, కు
    కవులనిందించువారికిఖ్యాతిగలుగు

    రిప్లయితొలగించండి

  2. దుష్ట నాయకుడతనిని శిష్టుడనుచు
    నూకదంపుడు వ్యాసాల నోపికగను
    కాసులకొరకు వ్రాసెడు కఱటులగు కు
    కవుల నిందుంచు వారికి ఖ్యాతి గలుగు.

    రిప్లయితొలగించండి
  3. కలుగునా కీర్తి, కాకులై, కైత కట్టు
    కవుల నిందించువారికి;ఖ్యాతి గలుగు
    సృజన జేయుచు మధురమౌ కృతుల వ్రాయు
    కవుల సన్మానములతోడ గౌరవింప.

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    పద్యవిద్యను నేర్పెడు పరమ గురువు
    నిటుల సవరింతుమా యని హితమొనర్ప
    సొంతముగఁ దప్పుఁ దెలియంగ సునిశితముగఁ
    గవుల నిందించు, వారికి ఖ్యాతి గలుగు!

    చంపకమాల
    అవనిని సర్వజీవులకు నాయువు నీయఁగ ధాత దైవమై
    శ్రవణము సేయుచున్ బరుల స్వార్థ ప్రలోభపు బోధలెన్నియో
    వివరము వీడి మానవులఁ బ్రేల్చుట నొప్పక యుగ్రవాదపున్
    గవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్

    రిప్లయితొలగించండి
  5. కవుల బొగడుచు పలువురు గౌరవింత్రు
    నింద లాడిన ఖ్యాతిని బొందు టెట్లు?
    కవుల నిందించువారికి ఖ్యాతి గలుగు
    ననుట యసమంజసంబగు నతిశయోక్తి

    రిప్లయితొలగించండి
  6. చివికినజీవితంబులనుచేర్పగతీరముపాటపాడునా
    కవులనుదూలనాడుటయెఖ్యాతికిహేతువుజాతికిత్తఱిన్

    సవితకుకూడనిజ్జనులచక్కగదిద్దగసాధ్యమాగనన్
    భవితకులేదుదివ్వెయికభావనఁజేయగసజ్జనంబుకున్

    రిప్లయితొలగించండి

  7. యువతకు హింసమార్గమదె యుత్తమమంచు వచించి ధాత్రిలోన్
    గవితల పైన లోకులకు గౌరవమున్ నశియింప జేసెడిన్
    వివరణులైన వారలగు వెంగలివిత్తుల వంటి వారు కా
    కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతికిత్తఱిన్.

    రిప్లయితొలగించండి
  8. కవుల నిందించు వారికి ఖ్యాతి గలుగు
    ననుట సత్యంబు గాదందు రార్యు లెపుడు
    సమ సమాజము నిర్మింప శక్తి కొలది
    పాటు పడువారు సత్కవుల్ వసుధ యందు

    రిప్లయితొలగించండి
  9. చంపకమాల:
    రవి కనలేని నిశ్చల నిరామయ జీవుల గాథ లన్ కనన్
    కవులకు సాధ్యమౌ, కులపు కత్తులకన్నులచూచు జాతికిన్
    “కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్”
    చెవులను వప్పగించి వినుచెప్పుడు మాటలవెంత కమ్మనో !
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    సంఘ సంక్షేమము చెఱపి సతతమంత
    జనుల మధ్యను కసిబెంచు చవిని గూడి
    రచన లందించి తారాడు రండులగు కు
    కవుల నిందించు వారికి ఖ్యాతి కలుగు.

    సవురునుగాని చందమున సంఘపు వృద్ధికి చేటు గూర్చుచున్
    ప్రవలెడి సాహితీక్రియ లవశ్యము వెల్లడిజేసి నిచ్చలున్
    కవుడును ద్వేషభావములు కల్పనజేసి చరించునట్టి కా
    కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్.

    రిప్లయితొలగించండి
  11. చక్కగ యతి ప్రాసలు వాడి జత బరచిన
    పద్యములలోన జొనిపిన భావమంత
    సంఘము చెడిపోవునటుల సంలిఖించు
    గవుల నిందించువారికి ఖ్యాతి గలుగు

    రిప్లయితొలగించండి
  12. యువతను మేలుకొల్పు మధురోహల మించు సమాహితైకదృ
    క్కవులను గౌరవించుటయె కారణమౌ గద దేశకీర్తికిన్
    భవిత నుదగ్రతీవ్రతరవాదపథమ్ముల జేర్చు నుగ్రవా
    క్కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  13. జ్ఞానసముపార్జనకునెట్టి గ్రంధములను
    కంటి కొననుండియైనను గాంచనట్టి
    డాంబికంబుగ కవినని దర్పమొలుకు
    కవుల నిందించువారికి ఖ్యాతి గలుగు

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    వ్యాకరణ ,ఛందముల చదువకనె తోచు
    విధము పద్య రత్నములని వింత రచన
    జేసి పుంజిత పుంఖితం జేయు దుష్ట
    కవుల నిందించు వారికి ఖ్యాతి గలుగు
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  15. చవిగల పద్యరత్నముల చక్కని శైలి రచించి మించుచున్
    కవితల తోడుతన్ బ్రజకు గమ్య మొసంగెడి వాడు మాన్యుడౌ
    ద్రవిణము కోరి దుర్మతుల దాతలటంచు స్తుతించు చుండు కా
    కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్

    రిప్లయితొలగించండి
  16. సవినయ భావమెంచకను జాతి
    విరోధపు భావ గ్రంథముల్
    భవమును బొందు దేశమును బాయక
    దూషణ జేయు కావ్యము
    ల్లవసర హీనమైన కృతులారయ
    జేసెడ యోగ్యమైన యా
    కవులను దూలనాడుటయె ఖ్యాతికి
    హేతువు జాతి కిత్తరిన్

    రిప్లయితొలగించండి
  17. జిహ్వ లేకుండ పోవును జివరి వరకు
    కవుల నిందించు వారికి ,ఖ్యాతి గలుగు
    కవుల నాదుకొనుచునుండి గౌరవించ
    కల్ల కాదిది సత్యము కవివరేణ్య!

    రిప్లయితొలగించండి
  18. దుష్ట చిత్తులఁ గాంచినఁ గష్ట మైన
    వారి వారింప కున్నచో నేర మగును
    సజ్జనుల కీయ బాధలు, సాయ మూని
    కవుల, నిందించు వారికి ఖ్యాతి గలుగు


    అవిరళ కోప తాపముల యందు మునుంగుచు మత్సరమ్మునం
    దవులుచుఁ గన్ను దోయికి సతమ్మును స్వీయ జ నాన్యు లైన మా
    నవుల వెలుంగు నట్టి సుగుణమ్ముల నారయ నొల్ల కూను నా
    కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్

    [కవి = కళ్ళెము]

    రిప్లయితొలగించండి
  19. ఆటవెలది

    నవరసంబు లొలుకు కవితలఁజెప్పుచు
    బిరుదు లెన్నొ పొంది బిరుదుకెక్కి
    నిత్య మలరు//కవుల,నిందించు వారికి
    ఖ్యాతి కలుగు//నె?యప యశము గాక!

    చంపకమాల

    కవికృత కావ్యరాజములెగా మన సంస్కృతి కాటపట్టు స
    త్కవితలెఱుంగకుండుటయె కర్మము నంతకు క్రూరకర్మమౌ
    కవులను దూలనాడుటయె ,ఖ్యాతికి హేతువు జాతికిత్తరిన్
    కవులను గౌరవించుటయె కావ్యములన్ సరిగా పఠించుటే!

    చంపకమాల

    కవులను కృష్ణరాయకవి కంటికి ఱెప్పగ కాచినాడు,స
    త్కవితకు మెచ్చి పెద్దనకు కానుకగా నిడి గండపెండెరం
    బవిరళ కీర్తి గాంచెను తదర్థమెఱుంగుట చేతకాని,కా
    కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతికిత్తరిన్.

    రిప్లయితొలగించండి
  20. తే.గీ:కవు లనిన్ జేర రెన్నడు కవిత లల్లి
    ప్రజల ప్రోత్సహింతురు పలు పవరములకు
    కవులు కీర్తి నొందక కొంత కాలమునకు
    *“కవు లనిన్ దించువారికి ఖ్యాతి గలుగు”*
    (కవులు+అనిన్ దించు వారికి ఖ్యాతి కలుగు)

    రిప్లయితొలగించండి
  21. కవనము వ్రాయనేరక ను గావ్యము వ్రాసితి జూడుమశర్మ యన్నదు
    ష్కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతికిత్తఱిన్
    గవులను జూడనొప్పును సు గౌరవమిచ్చుచు నెల్లవేళలన్
    గవులన కావ్యకర్తలిల గాధలు వ్రాసెడు జాతిరత్నముల్

    రిప్లయితొలగించండి
  22. అవమతిగాదలంత్రు పలుకాడగ నేర్వరు మాతృభాషలో
    యువతకు కైతలేల నుపయోగము లేదను వారి వైనమౌ
    కవులను దూలనాడుటయె; ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్
    యువతను మేలుకొల్పు కవినొప్పుగనెంచుచు గారవించుటే

    రిప్లయితొలగించండి
  23. పద్యములనల్ల గాలేక వాసిగా ను
    వ్యర్థపదములు విరివిగా వాడుచుండి
    ననయముసుకవులనుదిట్టునట్టియాకు
    కవుల నిందించువారికి ఖ్యాతి కలుగు

    రిప్లయితొలగించండి