12-12-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్”(లేదా...)“రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే”
కందంగంగాధరా శివా యనిజంగమ దేవుని ఘనముగ సంకీర్తించేడింగరి మొఱపెట్టెనుమధురంగా కావుమన, శివుడు రయమున బ్రోచెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
డింగరి-భక్తుడు
జంగమ దేవర గొలుచుచు ముంగిటి దేవళము జేరి పూజించుచు దా వంగియు దండంబిడి మధు రంగా కావుమన శివుడు రయమున బ్రోచెన్
సంగమువీఁడుచుభక్తినిగంగనుదుముకుచుమునుగగకాశీలోనన్చెంగుననక్రముననుఁజేరంగాకావుమనశివుఁడురయమునఁబ్రోచెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బంగారయ్యను భక్తుడురంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్,శింగారి సౌరి వెళ్ళగ,దొంగాటాడగ యమునకు,దోచగ చీరెల్
కందంక్రుంగుచు మార్కండేయుఁడుమ్రింగగఁ వచ్చెను యముడని శ్రీకంఠునికైలింగము సుట్టుచు భక్తి పరంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్శార్దూలవిక్రీడితముమ్రింగన్ వచ్చిన మిత్తివోలె నగుచున్ రేపంగ నాందోళనన్గంగారెత్తుచు ధర్మజున్ గనుచు మార్కండేయు డల్లాడుచున్లింగా! పాహి దయాంతరంగ! యని మున్నీరట్లు బాష్పమ్ము జారంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే!
అంగంబందువిభూతిరేఖలనునాయానంబుకాశీగనన్గంగాధారినిపార్వతీపతినినాగాలంక్రుతుధ్యాసలోజంగాలన్గనివేగడాసియునునేశంభున్సదాముక్తికోరంగాకావఁగరమ్మురమ్మనగఁదారక్షించెశ్రీకంఠుడే
అంగజ హరుడా! రుద్రా గంగాధర నిన్ను కొలుతు కాలంజరుడా!పింగాక్షా! భవుడా! సారంగా! కావుమన శివుడు రయమున బ్రోచెన్.
భృంగేశా! పురశాసనా! భవహరా! భీష్మా! యనంగాహితా!పింగాక్షా! మదనాంతకా! విషధరా! ప్రేతాస్థిధారీ! భవా! లింగా! జంగమదేవరా! పశువుడా! శ్రీవర్ధనా! శూలి! సా రంగా! కావగరమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుడే.
అంగజహర పరమేశ్వరగంగాధర లింగరూప గౌరీరమణాపొంగిలు కరుణాజలధితరంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
భగీరధుడు సురగంగను వహించగలిగే వాడు శివుడనేకం॥సంగతి నెరింగి యా సురగంగ భువనమందు నుండి గంతుకొన భువిన్కృంగ కుండ చమత్కారంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
గంగాధర గౌరీపతిజంగమ దేవర విడువను జయము నొసగు భారంగా తలవక మమకారంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్గొర్రె రాజేందర్సిద్దిపేట
సంగమ్మును వీడి ధృతినిపింగాక్షుని జేరదలచి వెదకుచు లోలోగంగాధర! దయ యేపారంగా కావుమన శివుడు రయమున బ్రోచెన్
రంగత్తుంగతరంగనిర్జరనదీభ్రాత్కపర్దీ! శివా!లింగాకారకృపాపయోధివిలసల్లిప్తాంగభక్తావనా!శృంగారాంగహిమాద్రిజారమణ! హే శ్రీరంగరాజన్మనోరంగా! కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుడేకంజర్ల రామాచార్య.
గంగను మునుగుచు నుంటినిరంగా!కావుమన శివుడు రయమున బ్రోచెన్ రంగడు శివుడును నొకరేరంగమ్మా!యందువలన రక్షణ జేసెన్
రంగా తెలిపెద విను వివరంగా గంగాధరుండు రక్షకుడు భువిన్రంగారిపుష్పమిడి సారంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్(రంగారి=గన్నేరు; సారంగుడు=శివుడు)
జంగము దేవర నారసి యంగజ నాశకుని సంత తానత నిజ ముఖ్యాంగమ్మునఁ గరుణాబ్ధి తరంగా కావు మన శివుఁడు రయమునఁ బ్రోచెన్పింగాక్షా వృషభేంద్ర వాహన హరా భృంగీశ్వరా నిర్జి తానంగా నాగ విభూషణా గరళ కంఠా పార్వతీనాథ భస్మాంగా ఫాలవిలోచనా త్రినయనా హస్తాబ్జ విన్యస్త సారంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే
అంగన!”మును చిఱుతొండడుగంగాధర!శూలపాణి!గౌరీపతి!భస్మాంగా!వృషభధ్వజ!భద్రంగా కావు”మన శివుడు రయమున బ్రోచెన్.కంగారుంబడు బాలభక్తుడగు మార్కండేయుడున్భక్తితోలింగాకార!హరా!శివా!పశుపతీ!శ్రీగౌరి చిత్తాబ్జ సద్బంగా!కామహర!త్రినేత్ర!శశిధారీ!భస్మలిప్తాంగ!భద్రంగా కావగ రమ్ము రమ్మనగఁదా రక్షించె శ్రీ కంఠుడే.
గంగన్ మున్గుచు నుంటి నీదుట యిటన్ గాదాయె నాకున్ దయన్రంగా!కావగ రమ్ము రమ్మనగ దారక్షీంచె శ్రీకంఠుడేరంగమ్మా!యెఱుగంగ జెప్పుదు మఱిన్ లక్ష్మీశు డాశంభుడున్నంగం బొందిరీ వేఱుగా గన నికన్ నారాధ్యులౌ నొక్కగా
లింగాకారుడు వాడె పింగళుడు గౌరీ వల్లభుండాతడే గంగన్ జూటమునందు జాంగులవమున్ గంఠంబులో భూషగాసింగారించు నకర్ణమున్ సుబలుడా సిద్ధార్థుడౌ శూలి, సారంగా! కావగరమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుడే.
అంగమ్ముల్ నశియించు చుండెను లలాటాక్షా! దయన్ జూపుమాభంగమ్మయ్యెను జీవితమ్ముభువిపై బాలేందుమౌళీ! హరా!రంగమ్మందున నిల్వ సంతసముతో రంజిల్ల, నీచెంత చేరంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే
గంగను తలపై మోసిననంగజహరుడైనశివుని ననవరతమిలన్క్రుంగక భక్తిగ నోలయ*రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్రంగా రంగ యటంచు భక్తుడగునా ప్రహ్లాదు డావేళలో*రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే*గంగా దేవినిదాల్చుచున్ శిరముపై గాంక్షించెగౌరిన్నటన్పొంగారంగముదమ్ముతోడమురిసెన్ పొందంగనిల్లాలిగా
కందం
రిప్లయితొలగించండిగంగాధరా శివా యని
జంగమ దేవుని ఘనముగ సంకీర్తించే
డింగరి మొఱపెట్టెనుమధు
రంగా కావుమన, శివుడు రయమున బ్రోచెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
డింగరి-భక్తుడు
రిప్లయితొలగించండిజంగమ దేవర గొలుచుచు
రిప్లయితొలగించండిముంగిటి దేవళము జేరి పూజించుచు దా
వంగియు దండంబిడి మధు
రంగా కావుమన శివుడు రయమున బ్రోచెన్
సంగమువీఁడుచుభక్తిని
రిప్లయితొలగించండిగంగనుదుముకుచుమునుగగకాశీలోనన్
చెంగుననక్రముననుఁజే
రంగాకావుమనశివుఁడురయమునఁబ్రోచెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబంగారయ్యను భక్తుడు
తొలగించండిరంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్,
శింగారి సౌరి వెళ్ళగ,
దొంగాటాడగ యమునకు,దోచగ చీరెల్
కందం
రిప్లయితొలగించండిక్రుంగుచు మార్కండేయుఁడు
మ్రింగగఁ వచ్చెను యముడని శ్రీకంఠునికై
లింగము సుట్టుచు భక్తి ప
రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
శార్దూలవిక్రీడితము
మ్రింగన్ వచ్చిన మిత్తివోలె నగుచున్ రేపంగ నాందోళనన్
గంగారెత్తుచు ధర్మజున్ గనుచు మార్కండేయు డల్లాడుచున్
లింగా! పాహి దయాంతరంగ! యని మున్నీరట్లు బాష్పమ్ము జా
రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే!
అంగంబందువిభూతిరేఖలనునాయానంబుకాశీగనన్
రిప్లయితొలగించండిగంగాధారినిపార్వతీపతినినాగాలంక్రుతుధ్యాసలో
జంగాలన్గనివేగడాసియునునేశంభున్సదాముక్తికో
రంగాకావఁగరమ్మురమ్మనగఁదారక్షించెశ్రీకంఠుడే
రిప్లయితొలగించండిఅంగజ హరుడా! రుద్రా
గంగాధర నిన్ను కొలుతు కాలంజరుడా!
పింగాక్షా! భవుడా! సా
రంగా! కావుమన శివుడు రయమున బ్రోచెన్.
రిప్లయితొలగించండిభృంగేశా! పురశాసనా! భవహరా! భీష్మా! యనంగాహితా!
పింగాక్షా! మదనాంతకా! విషధరా! ప్రేతాస్థిధారీ! భవా!
లింగా! జంగమదేవరా! పశువుడా! శ్రీవర్ధనా! శూలి! సా
రంగా! కావగరమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుడే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంగజహర పరమేశ్వర
తొలగించండిగంగాధర లింగరూప గౌరీరమణా
పొంగిలు కరుణాజలధిత
రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
భగీరధుడు సురగంగను వహించగలిగే వాడు
రిప్లయితొలగించండిశివుడనే
కం॥
సంగతి నెరింగి యా సుర
గంగ భువనమందు నుండి గంతుకొన భువిన్
కృంగ కుండ చమత్కా
రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
గంగాధర గౌరీపతి
రిప్లయితొలగించండిజంగమ దేవర విడువను జయము నొసగు భా
రంగా తలవక మమకా
రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
గొర్రె రాజేందర్
సిద్దిపేట
సంగమ్మును వీడి ధృతిని
రిప్లయితొలగించండిపింగాక్షుని జేరదలచి వెదకుచు లోలో
గంగాధర! దయ యేపా
రంగా కావుమన శివుడు రయమున బ్రోచెన్
రంగత్తుంగతరంగనిర్జరనదీభ్రాత్కపర్దీ! శివా!
రిప్లయితొలగించండిలింగాకారకృపాపయోధివిలసల్లిప్తాంగభక్తావనా!
శృంగారాంగహిమాద్రిజారమణ! హే శ్రీరంగరాజన్మనో
రంగా! కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుడే
కంజర్ల రామాచార్య.
గంగను మునుగుచు నుంటిని
రిప్లయితొలగించండిరంగా!కావుమన శివుడు రయమున బ్రోచెన్
రంగడు శివుడును నొకరే
రంగమ్మా!యందువలన రక్షణ జేసెన్
రంగా తెలిపెద విను వివ
రిప్లయితొలగించండిరంగా గంగాధరుండు రక్షకుడు భువిన్
రంగారిపుష్పమిడి సా
రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
(రంగారి=గన్నేరు; సారంగుడు=శివుడు)
జంగము దేవర నారసి
రిప్లయితొలగించండియంగజ నాశకుని సంత తానత నిజ ము
ఖ్యాంగమ్మునఁ గరుణాబ్ధి త
రంగా కావు మన శివుఁడు రయమునఁ బ్రోచెన్
పింగాక్షా వృషభేంద్ర వాహన హరా భృంగీశ్వరా నిర్జి తా
నంగా నాగ విభూషణా గరళ కంఠా పార్వతీనాథ భ
స్మాంగా ఫాలవిలోచనా త్రినయనా హస్తాబ్జ విన్యస్త సా
రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే
అంగన!”మును చిఱుతొండడు
రిప్లయితొలగించండిగంగాధర!శూలపాణి!గౌరీపతి!భ
స్మాంగా!వృషభధ్వజ!భ
ద్రంగా కావు”మన శివుడు రయమున బ్రోచెన్.
కంగారుంబడు బాలభక్తుడగు మార్కండేయుడున్
భక్తితో
లింగాకార!హరా!శివా!పశుపతీ!శ్రీగౌరి చిత్తాబ్జ స
ద్బంగా!కామహర!త్రినేత్ర!శశిధారీ!భస్మలిప్తాంగ!భ
ద్రంగా కావగ రమ్ము రమ్మనగఁదా రక్షించె శ్రీ కంఠుడే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగంగన్ మున్గుచు నుంటి నీదుట యిటన్ గాదాయె నాకున్ దయన్
రిప్లయితొలగించండిరంగా!కావగ రమ్ము రమ్మనగ దారక్షీంచె శ్రీకంఠుడే
రంగమ్మా!యెఱుగంగ జెప్పుదు మఱిన్ లక్ష్మీశు డాశంభుడున్
నంగం బొందిరీ వేఱుగా గన నికన్ నారాధ్యులౌ నొక్కగా
రిప్లయితొలగించండిలింగాకారుడు వాడె పింగళుడు గౌరీ వల్లభుండాతడే
గంగన్ జూటమునందు జాంగులవమున్ గంఠంబులో భూషగా
సింగారించు నకర్ణమున్ సుబలుడా సిద్ధార్థుడౌ శూలి, సా
రంగా! కావగరమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుడే.
అంగమ్ముల్ నశియించు చుండెను లలాటాక్షా! దయన్ జూపుమా
రిప్లయితొలగించండిభంగమ్మయ్యెను జీవితమ్ముభువిపై బాలేందుమౌళీ! హరా!
రంగమ్మందున నిల్వ సంతసముతో రంజిల్ల, నీచెంత చే
రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే
గంగను తలపై మోసిన
రిప్లయితొలగించండినంగజహరుడైనశివుని ననవరతమిలన్
క్రుంగక భక్తిగ నోలయ
*రంగా కావుమన శివుఁడు రయమునఁ బ్రోచెన్
రంగా రంగ యటంచు భక్తుడగునా ప్రహ్లాదు డావేళలో
*రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే*
గంగా దేవినిదాల్చుచున్ శిరముపై గాంక్షించెగౌరిన్నటన్
పొంగారంగముదమ్ముతోడమురిసెన్ పొందంగనిల్లాలిగా