26, డిసెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3943

27-12-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలసర్పమున్ మ్రింగెను కప్ప యొకటి”
(లేదా...)
“సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో”

48 కామెంట్‌లు:

 1. తేటగీతి
  నల్లగోపన్న యెత్తులు చెల్లెననఁగ
  నస్త్రసన్యాసమొనరింప నాపగేయుఁ
  బిల్లకాకి యర్జునుఁడహో వ్రేటువైచె
  కాలసర్పమున్ మ్రింగెను కప్ప యొకటి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   అర్పణ జేసి జీవితము నందరి నింతటివారి జేసెనన్
   గార్పటికుండు శాంతనవుఁ గవ్వడి జంపె శిఖండి సాయమై
   నేర్పిదె సవ్యసాచికిది? నీచము కాదొకొ! శౌరి సాక్షిగన్
   సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. ఆటవెలది

  సఖి!నకులము//కాల సర్పమున్ మ్రింగెను,
  కప్ప యొకటి//బెకబెక మని కూయ
  సాగె,పిల్లియెలుకఁజంపె,నేను
  పెరటి లోని కడుగు పెట్టి నంత.

  రిప్లయితొలగించండి
 3. పరమధార్మికశక్తినిపాటుబడుచు
  వైిసైన్యముదునుమాడవెంబడించె
  మోకరిల్లెనుశత్రువుమోదికంత
  కాలసర్పముమ్రింగెనుకప్పయొకటి

  రిప్లయితొలగించండి
 4. దర్పముమీఱద్రోణుననిద్రౌపదియన్నయువిక్రమించుచున్
  కూర్పనుకౌరవాగ్రణికకుంఠితఖేదముయుద్ధమందుతా
  నర్పణజేసినట్టిగురునాయువుదీసెనునల్పబుద్ధితో
  సర్పముకప్పనోటబడిచచ్చెనయోయిదియేమిచిత్రమో

  రిప్లయితొలగించండి
 5. కలను గాంచియు దిగ్గున కలవరము న
  లేచి యొక్కండు సతియగు లీల తోడ
  తాను పల్కుచు నిట్లనె తడయ కుండ
  "కాల సర్పమున్ మ్రింగెను కప్ప యొకటి "

  రిప్లయితొలగించండి
 6. దర్పముతోడ బోయె గడు ధైర్యము
  మీరగ దమ్మిమొగ్గరం
  బేర్పడ జీల్చనెంచి కడు భీకరు
  డై యభిమన్యుడేగగా
  గూర్పుగ నందరేకమయి కూల్చిరి
  యాతని గౌరవాధముల్
  సర్పము కప్పనోటబడి సచ్చెనయో
  యిది యేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 7. ముంగిస భయము నొందక మొత్తులాడె
  కాలసర్పమున్ ; మ్రింగెను కప్ప యొకటి
  పురుగులను వెదకి వెదకి ముదము తోడ ,
  నుదకమందునను మరియు నుర్విపయిన

  రిప్లయితొలగించండి
 8. సాముగరిడీలు నిత్యము సలుపుజోదు
  కుట్టి చిరుదోమ యంతలో మట్టిగరచె
  కాలసర్పమున్ మ్రింగెను కప్ప యొకటి
  విధిబలీయంబు తప్పింప వీలుకాదు

  రిప్లయితొలగించండి
 9. ఏర్పడ దైవనిర్ణయము నెవ్వరికైననెరుంగ శక్యమే
  నేర్పరియై సముద్రమున నీదగజాలిన నావికుండు తా
  నర్పణ యయ్యెనక్కట తటాకమునందున నీదబోవగన్
  సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  శశము రేచుకుక్క నెగచె సందడించి
  కాలసర్పమున్ మ్రింగెను కప్ప యొకటి
  పౌరుషముతోడ వఱలిన వసుధ నచటె
  విజయనగర రాజ్య మమరె పెనుపుగ తొలి.

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెఓకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  దర్పము జూపి పౌరులను తల్లడ బెట్టిన తెల్లవారినిన్
  నేర్పుగ పంపి దేశమున నేతగ వెల్గిన గాంధితాత తా
  నర్పణ జేసె ప్రాణమును యల్పుడు గాడ్సె కరమ్ములందునన్
  సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో!

  రిప్లయితొలగించండి
 12. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  మృగపతి నెదిర్చె నడవిలో మేకపోతు
  కాలసర్పమున్ మ్రింగెను కప్ప యొకటి
  కాలజ్ఞాన మహిమమంత కాంచి జూడ
  నిట్టి వింతల నెన్నియో నెఱుగ వచ్చు.

  రిప్లయితొలగించండి
 13. గద్ద యొక్కటికబళించె కనులముందు
  కాలసర్పమున్, మ్రింగెను కప్ప యొకటి
  పురుగునత్యంత వేగాన, తరచిచూడ
  సృష్టియందలి సంగతుల్ స్పష్టమగును

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "లేదనన్" అనవచ్చు.

   తొలగించండి
  2. ధన్యవాదములార్యా.
   సవరించెద.
   ఉత్పలమాల:
   ఓర్పును చేతగాని తన మొద్దికనుండ బలమ్ము లేదనన్
   దర్పము జూపు నైజమున దంభము లాడుచు చేయు పెత్తనం
   బేర్పడ తెల్లనౌను విసుగెత్తిన బంటు విదిల్చినంతనే
   “సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో”
   --కటకం వేంకటరామశర్మ

   తొలగించండి
 15. దర్పము జూపినట్టి ఫణి దారిని తప్పుచు తిర్గు చుండగన్
  నేర్పరి బోయవాడటుల నెత్తిన కొట్టగ హింసవృత్తితో
  మార్పుల గాంచలేనిదయి,మ్రాన్పడి నిల్చియె నేలగ్రూలగన్
  సర్పము గప్పనోట బడి చచ్చెనయో! యిది యేమి చిత్రమో!!

  రిప్లయితొలగించండి
 16. తాడు పామైకఱుచువేళ తనువు ముగియు
  పగిది,కాలరీతులు మార కదనమట్లు
  కాయమటులను కూలగా కర్మ ఫలమె
  కాల సర్పము మ్రింగెను కప్ప యెకటి!!

  రిప్లయితొలగించండి
 17. ఈనాట శంకరాభరణము వారి సమస్య


  కాల సర్పమున్ మ్రింగెను కప్ప యొకటి


  నా పూరణ. సీసములో


  పాలను పట్టెద పాపడి కనుచు యశోదమ్మ ముద్దుల సుతుని ముదము

  తో గొని పూతన తోడ్కొని నోటిలో కుచమును జొనుపగ గుటక వేసి

  రక్కసి ప్రాణములను పీల్చ భీకరాకారముతో పడె ఖలము‌పైన

  నంద కిశోరుడా నందముగా దాన వాంగన కాయము పైన తిరుగు


  చుండ కాంచిన జనులకు గుండె లెల్ల

  పగుల, పలికి రిటుల, "బలవంత మైన

  (కాలసర్పము‌న్ మ్రింగెను కప్ప యొకటి)

  రయము తో చూడగా రమ్ము భయము లేక"

  రిప్లయితొలగించండి
 18. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  మృగపతి నెదిర్చె నడవిలో మేకపోతు
  కాలసర్పమున్ మ్రింగెను కప్ప యొకటి
  మంజులమగు కాలజ్ఞాన మహిమ జదువ
  నిట్టి వింతల నెన్నియో నెఱుగ వచ్చు.

  రిప్లయితొలగించండి
 19. వాడిచూపుల గృధ్రము నేల పాఱు
  కాలసర్పమున్ మ్రింగెను,కప్పయొకటి
  బెకబెకయనుచు నఱచెను విషధరంబు
  తనను మ్రింగయత్నించగదల్లడిల్లి

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు
  1. పెద్ద కను గ్రుడ్లు త్రిప్పుచు భీతి కొలుపఁ
   బురుగు నొకదానిఁ బరికించి పరవశించి
   చాచి తన నాలుకను మించఁ జలన మందుఁ
   గాలసర్పమున్ మ్రింగెను గప్ప యొకటి


   అర్పిత మల్ప జీవి ధర యందు నవశ్యము పెద్ద ప్రాణికిన్
   నేర్పున వర్ష కాలమున నీరజ మో యన నుద్భవించి తా
   నోర్పున గట్టునం దిరుగు చుండెను మెల్లగ వాన పామె యా
   సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో

   తొలగించండి
 21. సర్పము గప్పనోటబడి చచ్చెనయో యిదేమి చిత్రమో
  సర్పము గప్పనోటబడసాధ్యమె నీవది చూచితే యెటన్
  సర్పమునోట యాహరియె జన్మవిహీనత నొందుగా వనిన్
  సర్పము గప్పగూ రిచిటుచయ్యన బల్కుట న్యాయమే రమా!

  రిప్లయితొలగించండి
 22. దర్పముతో చెలంగుచు సతమ్మును పేదల నోసరించుచున్
  సర్పి కొఱంత రైతులును సంకటముల్ బడ, ప్రాత నేతకున్
  నేర్పు ఘటిల్లలేదనుచు నేరుగ క్రొత్త యధీశునెన్నగా
  సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో

  రిప్లయితొలగించండి

 23. అగ్ని కణజాలములవంటి యస్త్రములను
  శత్రువులపైన కురిపించు శాంతనవుని
  హనువుకా శిఖండియె హేతువనుట గాంచ
  కాలసర్పమున్ మ్రింగెను కప్పయొకటి.

  రిప్లయితొలగించండి

 24. మార్పునుగోరి సేద్యమును మాని యధేష్టియె మంత్రవిద్యలన్
  నేర్పరియైన మాంత్రికుడు నేర్పగ నేర్చి పురంబు నాతడే
  యోర్పువహించి చూపెనట యూరిజనాళియె మెచ్చ నందునన్
  సర్పము గప్పనోటబడి చచ్చెనయో యదియేమి చిత్రమో.

  రిప్లయితొలగించండి
 25. విజయనగర నిర్మాణ పూర్వగాథ

  సర్పము గప్ప నోటఁబడి చచ్చె నయో!యిది యేమి చిత్రమో!
  దర్పము మీఱగా శశము దార్కొనె నిచ్చట వేటకుక్కలన్
  నేర్పున సింగముంబొడిచె నిఱ్ఱియు నీస్థలమెంత గొప్పదో!
  తూర్పుగ ప్రోలు గట్టుడని తొల్లి వచించెను స్వామి రాయలున్.

  రిప్లయితొలగించండి
 26. దర్పము జూపి లోకులను దాసులుగా గణియించు నేతలో
  మార్పును గోర యొజ్జకవమానమొనర్ప జనాళి యోర్వకన్
  తీర్పు లిఖించిరెన్నికల దింపిరి కూళను మట్టు వెట్టిరే
  సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో

  రిప్లయితొలగించండి