30, డిసెంబర్ 2021, గురువారం

సమస్య - 3947

31-12-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్”
(లేదా...)
“మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్”

46 కామెంట్‌లు:

  1. మాఘము నందున యెటులన్
    మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్
    లాఘవముగ విల్లెత్తుకు
    రాఘవరాముండు వరుణు రమ్మన కురుయున్

    రిప్లయితొలగించండి
  2. తాఘనుడగుశ్రీరాముని
    దాఘమునందునమెఱపుగధరణిజజేరన్
    ఓఘమువలపుననిండెను
    మేఘములేకుండవానమేదినికురిసెన్

    రిప్లయితొలగించండి
  3. శ్రీరానచంద్రుని పై అయోధ్యప్రజ కురిసిన పూలవాన...

    కందం
    శ్లాఘించి యయోధ్య జనమ
    మోఘమమనఁ రామమూర్తి యున్నతి గని వా
    రోఘములై చల్ల విరుల
    మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్!

    ఉత్పలమాల
    శ్లాఘములందయోధ్య ప్రజ రాముని పట్టము గాంచవచ్చి యు
    ల్లాఘమనంగ మేళముల రంజిలి చిందులు వేయువేళ వా
    రోఘములై ప్రసూనముల నుంచుచు దోసిట చల్లినంతటన్
    మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      శ్లాఘించి యయోధ్య జనమ
      మోఘమమనఁ రామమూర్తి ముచ్చటఁ గని వా
      రోఘములై చల్ల విరుల
      మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జనమమోఘమమన'? అక్కడ అరసున్న అవసరం లేదు కూడా.

      తొలగించండి
  4. లాఘవ మొప్పగ విజయుడు
    దా ఘన కార్ముకము వేయ తక్షణ మే నా
    శ్లాఘుని మహిమ యనంగా
    మేఘము లేకుండ వాన మేదిని గురిసెన్

    రిప్లయితొలగించండి
  5. లాఘవమింతలేకరఘురాముడుద్రుంచెనుకార్ముకంబునున్
    ఓఘమువాలుజూపులుగనోరగజానకిజూచెనంతలో
    ఆఘనుడల్లుడాయెననిహంసగసంతసమందెమామయున్
    మేఘములేకయేకురిసెమేదినిపైబెనువానవింగన్

    రిప్లయితొలగించండి

  6. శ్లాఘింపగ జనులెల్లరు
    గోఘృతమున్ గోరి మిగుల కుతిలము తోడన్
    రాఘవు డాదేశింపగ
    మేఘము లేకుండవాన మేదిని కురిసెన్.

    రిప్లయితొలగించండి

  7. రాఘవు జేరిలోకులట బ్రార్థనజేసిరి రాజ్యమందునన్
    గోఘృతమంచు లేక జనకూటము నందుచు నండి రంచు నా
    రాఘవు డాగ్రహింపగ పరంజయు డానతి నిచ్చినంతనే
    మేఘములేకయే కురిసె మేదినిపైఁ బెను వాన వింతగన్.

    రిప్లయితొలగించండి
  8. రాఘవ రామచంద్రుడును రావణు
    యుద్ధమునందు జంప సు
    శ్లాఘము జేయుచున్ సురలు చండ
    భ మార్గమునుండి పూవులు
    న్నా ఘన శూరపై జిలుక నందరు
    తోషముతోడ బల్కి రే
    మేఘము లేకయే కురిసి మేదినపై
    బెనువాప వింతగన్

    రిప్లయితొలగించండి
  9. ఓఘములుగ నాకసమున
    మేఘంబులులేక కరువు మిగుల ప్రబలనా
    వ్యాఘాతమె కన్నీరై
    మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహిమను' అనండి.

      తొలగించండి
    2. సవరణతో...

      మేఘాలసడివినబడదు
      మేఘజ్యోతికనబడదు మేఘాకృతుడౌ
      రాఘవునిబాణమహిమను
      మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్

      తొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    ఆఘోషించుచు క్రీడియె
    నా ఘోర దురమున వారుణాస్త్రము వేయన్
    యౌఘమ్ముగ నావెంటనె
    మేఘము లేకుండ వాన మేదిని గురిసెన్.

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    లాఘవమొప్ప కౌరవులె లక్ష్యముగా గొని అర్జునుండనిన్
    మేఘుని రీతి శబ్దమిడి మెల్పుగ తానట వారుణాస్త్రమున్
    శ్లాఘము జేసి వేయగ చలాచలి దాని ప్రభావమొందుచున్
    మేఘములేకయే కురిసె మేదినిపైఁ బెను వాన వింతగన్.

    రిప్లయితొలగించండి
  13. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    శ్లాఘించుచు నా వరుణుని
    లాఘవమొప్ప ఘనముగ తెలచిన క్షణమునన్
    నాఘన పూజల మహిమన్
    మేఘము లేకుండ వాన మేదిని గురిసెన్.

    రిప్లయితొలగించండి
  14. మాఘ నెలయందు లంకన
    రాఘవుడు సమరము సలిపి రావణుజంపన్
    నా ఘనతకు పూలు విసర
    మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాఘ నెల' దుష్టసమాసం. "మాఘపు నెలలో లంకను" అనండి.

      తొలగించండి

  15. ఆ ఘనకౌరవాద్భుతరణాంగణవాజిఖురోత్థభూపర
    గౌఘవినీలమేదురవికాసపయోదము లావరించె, సు
    శ్లాఘితపార్థదీప్తచపలారుచులన్ శరసాంద్రధారలన్
    మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్

    ఖుర = గిట్టెలు,ఉత్థ=పుట్టిన,చపల = మెరుపుతీగ.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ అమోఘంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'భూపరాగౌఘ...' టైపాటు.

      తొలగించండి
  16. మేఘపు వర్ణ దేహమున మేదిని పైజనియించె మర్త్యుడై
    రాఘవు డార్తి బాప పెనురక్కసి మూకల ద్రుంపి, తంపి ర
    క్తౌఘము పారె కూలగను యాతు సమూహము, పూలజల్లులై
    మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్

    రిప్లయితొలగించండి
  17. మాఘుడు జేయువర్ణనలు మానసమందున మేలి గుర్తులై
    మేఘపు దారులందునటు మిక్కిలి యందము లొల్కు చుండగా
    ఆ ఘన సూర్య చంద్రులటు నందము చిందగ కాక్షితోచగన్
    మేఘము లేకయే కురిసె మేదినిపై బెను వాన వింతగన్!!

    మోఘములైన యీ హృదిని మోహపు భావన ముంచి వేయగన్
    ఆఘన నీలి మోహనుని నాదట వీక్షణ మాదరించగా
    మేఘపు వీధుల గనగ మీగడ వెన్నల దొంగ తోచగా
    మేఘము లేకయె కురిసె మేదినిపై బెను వాన వింతగన్!!

    రిప్లయితొలగించండి
  18. మాఘపు నెలలో తానము
    ఆఘన మోహనుని కీర్తన నాకస మెగయన్
    శ్లాఘించగ కృష్ణుని హృది
    మేఘము లేకుండ వాన మేదిని కురిసెన్!!

    రిప్లయితొలగించండి
  19. కందం
    మేఘము లేవియు పొడమని
    మాఘాన పరిణయమాడ మంగళ మనుచున్
    వ్యాఘాతంబేర్పడ గన్
    మేఘము లేకుండ వాన మేదిని కురిసెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. రాఘవ! చూచితె చిత్రము
    మేఘము లేకుండ వాన మేదిని గురిసెన్
    మేఘము లేర్పడు విధముల
    మోఘములై భువిని గురిసి ముంచును జగమున్

    రిప్లయితొలగించండి
  21. రాఘవ! చూచితే చదలు రమ్యపు గాంతిని గోచరించనౌ
    మేఘము లేకయే కురిసె మేదినిపై బెనువాన వింతగన్
    మేఘము లేర్పడున్వినుము మీరపు నీరము సూర్యరశ్మిచే
    వేఘనమై చరించునిక బేలవ రూపము నొంది రోదసిన్

    రిప్లయితొలగించండి
  22. సాఘ దురాచార ఖలు న
    రౌఘ సమావృత జగమ్ము నం దవిరోధం
    బే ఘన వివాద ము లడరె
    మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్


    రాఘవుఁ డభ్ర వర్ణుఁ డట రాజ్యము నేలఁగ నిర్మలోద ధా
    రా ఘన రాశి సంభృత విరాజిత దిఙ్నిచయమ్ము దోఁపఁ బా
    పౌఘ విహీన రాజ్యమున నుగ్ర భయానక శబ్ద యుక్తమౌ
    మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్

    రిప్లయితొలగించండి
  23. రాఘవుడేల రాడిటకు రావణ సంహరణం బొనర్చగా
    నోఘములైన క్లేశములనోపగజాలనటంచు లంకలో
    రాఘవపత్ని సల్పెడు విలాపముగాంచి తలంచి రెల్లరున్
    మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్

    రిప్లయితొలగించండి
  24. ఆ ఘనుఁడప్రమేయుఁడసురాంతకుఁడా రఘురాముఁడాలమున్
    లాఘవమొప్పగా చెలఁగ రావణుఁడేసెను చిచ్చఱమ్ములన్
    రాఘవుఁడమ్మహాస్త్రములు వ్రయ్యలుగానిడ వారుణాస్త్రమున్
    మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్

    రిప్లయితొలగించండి