22, డిసెంబర్ 2021, బుధవారం

సమస్య - 3939

 23-12-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్”
(లేదా...)

“జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్”

54 కామెంట్‌లు:

 1. తమతమ కలలను గూరిచి
  సుమధురముగ చెప్పుకొనిరి చొరవగ సఖులా
  భ్రమలో! సుర రంభాతే
  జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్.

  రిప్లయితొలగించండి
 2. కందం
  రమణీయమైన వనమున
  సమర్పణము జేసుకొనెడు సమయము దెలుపన్
  దమయంతి నిలిచిన నికుం
  జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్

  చంపకమాల
  కుముదము వోలు నేత్రముల కోమలి త్రిప్పుచుఁ గన్ను గీటగన్
  నిముషము జాగుచేయకను నేరుగ జారిణి వెంట నంట తా
  ప్రమదమునన్ వనాంతరపు రంజిలు చోటని యాగ తన్నికుం
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
 3. సుమమైవిరియగశోభను
  అమరెనుపద్మముసరసునయామినిపోగా
  భ్రమరమురూపువడిసరజి
  జముఁగామచినవిటుఁడుపరవశత్వమునందెన్

  రిప్లయితొలగించండి
 4. సమపీనస్తని,సుజఘన
  సుమధుర భాషిణి,సుకేశి,సుందరమౌ హా
  సము ,వికసిత వదనాంభో,
  జముఁగని విటుడు పరవశత్వమునొందెన్.

  రిప్లయితొలగించండి


 5. ప్రమదను పొందదలచి భో
  గము చానను జేరెనతడు కలయిక వేళన్
  శమనరిపునిగ సతి యురో
  జముఁ గాంచినవిటుడు పరవశత్వము నందెన్.

  రిప్లయితొలగించండి
 6. సుమధురశాంతనీరములశోభనుఁజిమ్ముచువిచ్చెపద్మమే
  అమరిననేడుగుఱ్ఱములహంగునసూర్యుడుకానవచ్చెసం
  భ్రమమునసిగ్గుదోంతరలరంజిలుమోముననూగునాసరో
  జముఁగనిమోహమున్బరవశత్వమునందెవిటుండుచెచ్చెరన్

  రిప్లయితొలగించండి

 7. ప్రమదల పొందుకూడదని వారిజనేత్రలు మూర్ఖులంచు నీ
  మమతలు బూటకమ్మనుచు మైత్రులతోడ వచించు వానినిన్
  సుముఖయె జేరవచ్చి తన సొంపుల జూపగ చొక్కటంపు తే
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చచ్చెరన్.

  రిప్లయితొలగించండి
 8. ప్రమదము దోడుత వెడలియు
  సుమధుర రూపము గలిగిన సుందర తరుణీ
  తమ కంబున వద నా o భో
  జము గాంచిన విటుడు పర వ శత్వ ము నందెన్

  రిప్లయితొలగించండి
 9. తమకముతోనరకన్నుల
  తమవిటులకుగాలమేసి దరిచేరెడునా
  రమణుల హొయలొలికెడు నై
  జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్

  రిప్లయితొలగించండి
 10. కమనీయంబుగ రమణి య
  నుమోదములభింప మిగుల నుత్సాహముతో
  తమకంపుకనుల నుత్తే
  జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్

  రిప్లయితొలగించండి
 11. సుమధుర మందహాసమును సుందర రూపము సోగ కన్నులున్
  సుమముల బోలు మార్దవముసోయగమొల్కెడు మేని వన్నెతో
  రమణి లలామ గాంచి యనురక్తిగ రమ్మని సైగచేయు నై
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
 12. తమకము నొందిన యాతడు
  తమమున నాటవెలదిని జతపడగ నెంచన్
  కొమరాలి యానన సరో
  జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  కొమరున వఱలుచు నెదురుగ
  తమకము గొలుపుచు నిలుచుని దరహాసము నా
  రమణి యుసిగొలుపునౌ నై
  జము గాంచిన విటుడు పరవశత్వము నందెన్.

  రిప్లయితొలగించండి
 14. తమకము హెచ్చగా దగిన ధామమునందున దామరాక్షితో
  సమయము నింపుగాగడుప చక్కనిపూవుల చేతదాల్చి యా
  సుమలత బోలెడున్ సుదతి సోయగమొప్పెడు నల్లనౌ శిరో
  జముగని మోహమున్ బరవశత్వమునొందె విటుండు చెచ్చెఱన్

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  కొమరున వెల్గులీనుచు నగుర్వుగ చొక్కును గల్గ జేయుచున్
  కమనుని పత్ని వోలెను ప్రకాశము నొందుచు కామదేవతై
  మమతయె జూపు దృక్కులు క్రమమ్ముగ పెంచెడి యా భుజిష్య నై
  జము గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్.

  రిప్లయితొలగించండి
 16. కమలదళాక్షి,సుస్మిత,సుగాత్రి,సుకేశి,సుదంతి,కోమలీ
  సమకుచభార,ముగ్ధ,నతసన్నుతనాభి,కృశోదరీ,చెలీ,
  సమదగజేంద్రగామిని,ప్రశంసిత వారవిలాసినీ సమా
  జముఁగనిమోహమున్ బరవశత్వమునందెవిటుండు చెచ్చరన్.

  రిప్లయితొలగించండి
 17. తమకపు జూపుతూపు మెయి తాక మిటారి కటారియై మదిన్
  క్రమమున కోయుచున్ సొగసు కత్తె యొకత్తుక నెమ్మొగమ్మునన్
  కొమరు విలాసపు న్నడత కోర్కెను రేప, కనత్తదీయనై
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 18. కందం
  కమలాక్షి సొగసును దలచి
  తమకము నేతెంచి తరుణి తళుకులు బెళుకున్
  గమనించి జడన గల కుట
  జము గాంచిన విటుడు పరవశత్వము నందెన్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.
  కుటజము-కొండమల్లె.

  రిప్లయితొలగించండి
 19. అమలిన రూప యవ్వనపు టందము
  కల్గిన వారిజాక్షినిన్
  కుముదపు బాంధ వాననపు కొమ్మను
  కుంబ కుచంపు జాననున్
  గమనము హంస రీతిగను గల్గిన యొక్క మనోజ్ఞ తార తే
  జము గని మోహమున్ పరవశత్వ
  మునందె విటుండు చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
 20. కుమతిని దరిజేరి,యురో
  జముగాంచిన విటుడు పరవశత్వమునందెన్
  దమకము గలిగెడు వారలు
  సతతము దుర్బుద్ధితోడ చరియింతురుగా

  రిప్లయితొలగించండి
 21. సమదగజ యాన కులుకుచు
  రమణీ మణి వచ్చుచుండ రమణీయముగా
  కమనీయ రూప మా తే
  జముఁ గాంచిన విటుఁడు పరవశత్వము నందెన్


  సమద కరీంద్ర యాన శశి సన్నిభ వక్త్ర సరోజ లోచనన్
  విమల వినీల కేశ పరివేష్టిత రూప్య సమాన పాండురో
  త్తమ రుచి దీపి తావయవ తాళ ఫలాభ వరాగ్ర భా గురో
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
 22. కుమతిని వేశ్యవాటికకు గోరికతోడను నేగి,దా యురో
  జముగని మోహమున్ పరవశత్వము నందెవిటుండు చెచ్చెరన్
  మమతను నుండువారలిక భామలవెంటను దిర్గుచుందురే
  తమకము తోడనుండునెడ ధర్మము దప్పుదురెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 23. సుమశరు పుష్పబాణహతి సోక్కిన కోమలి భంగిమన్ భళా
  సముఖమునందె నిల్చినటు చక్కగ జూపిన తైలచిత్ర రా
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్
  రమణిని కౌగలించె సుఖ లాలస దీరగ ముద్దులాడుచున్

  రిప్లయితొలగించండి
 24. కమలము వంటి కన్నులును కమ్మని గాత్రము తోడ మించుచున్
  విమలపు మాటలాడుచును వేశ్య కరమ్ముప్రియమ్ము జూపగా
  సుమపు శరమ్ములన్ విడువ సొంపుగ మారుడు, పీనమౌ యురో
  జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్

  రిప్లయితొలగించండి


 25. కం:సుమబాలవంటి నెచ్చెలి
  సముఖమ్ముననిలిచి తాను సందడిచేయన్
  అమరినతలలోనిసరో
  *“జముఁ గాంచిన విటుఁడు పరవశత్వమునందెన్”*  కం:తమకము తోడను జూచెడు
  కమలాక్షిని గాంచ హెచ్చ కాంక్షయు మదిలో
  నమలిన తన ప్రేయసి నై
  *జముగాంచిన విటుడు పరవశత్వము నందెన్*


  రిప్లయితొలగించండి