4, డిసెంబర్ 2021, శనివారం

సమస్య - 3921

5-12-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా?”
(లేదా...)
“ఒప్పుగఁ బండినట్టి తల లుండినఁ జాలు మరేల పండితుల్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

42 కామెంట్‌లు:

  1. మెండుగననుభవసంపద
    యుండగబ్రతుకునకనబడుయోధులుకాగా
    రండనిపిలువగపిన్నలు
    పండినతలలున్నఁజాలుపండితులేలా

    రిప్లయితొలగించండి
  2. అండగ నిలిచెడు కొందరి
    పండిన తలలున్నఁ జాలుఁ,బండితులేలా?
    దండగ! జీవితము జదివి
    నిండుగ,తప్పు సరిజేయు నేర్పరులున్నన్

    రిప్లయితొలగించండి
  3. విప్పినజీవితంబనెడివింతనుజూడగబాటసారులై
    కుప్పలుగాగబాధలనుక్రుంగకవీడకసారమెంచుచున్
    చెప్పిననీతులన్నియునుచేవనుగల్గినవాడిబాణముల్
    ఓప్పుగఁబండినట్టితలలుండినఁజాలుమరేలపండితుల్

    రిప్లయితొలగించండి

  4. ఎండిన డొక్కలు కలిగిన
    తిండియె దొరకక తపించు దీనుడు నిర్భా
    గ్యుండను గురించి వ్రాయగ
    పండిన తలలున్న జాలు పండితులేలా?

    రిప్లయితొలగించండి
  5. మెండగు ననుభవము గలిగి
    యండగ నిలువంగఁ దగిన నాఢ్యు o డగుచున్
    నిండు మనంబున మెల్గె డి
    పండిన తలలున్న జాలు పండితులే లా?

    రిప్లయితొలగించండి

  6. చిప్పెడు కూటికై దొరల సేవలు జేసెడి వెట్టి వారికిన్
    దిప్పలవెన్నియో యనుచు దీనుల గాథ జనాళికంతకున్
    జెప్పగనెంచి ఘంటమును చేతను బట్టెడు వ్యాసకర్తలే
    యొప్పుగఁ బండినట్టి తలలుండినఁ జాలు మరేల పండితుల్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    ఉండక యాచరణమ్ములు
    దండుగ కద చదువులెన్ని దక్కిన! ఫలమే?
    గండము దాటెడు యుక్తులఁ
    బండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా?

    ఉత్పలమాల
    గొప్పగ వ్రాయుచుండిరని కూరిమినెంచ వధానివృత్తి కం
    జప్పను, విద్య మాధ్యమికమంచును వెన్నిడ, శంకరార్యులున్
    జప్పున వెన్ను దట్టుచును సాగగ బల్కెను, "పద్యవిద్యలో
    నొప్పుగఁ బండినట్టి తల లుండినఁ జాలు మరేల పండితుల్! "

    రిప్లయితొలగించండి
  8. దండుగమారి పథకముల
    మొండిగపాలనసలిపెడు మూర్ఖపు నేతన్
    ఖండించుటకై పౌరులు
    పండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    మెండైన నేర్పు తోడను
    గండము లెల్లను మడపెడి ఘనకార్యములన్
    దండిగ నొనరించుటలో
    పండిన తలలున్న జాలు బండితు లేలయా?

    రిప్లయితొలగించండి
  10. మొండి పలుకుల నణచుటకు
    పండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా?
    కొండిక యిట్లనె నయినను
    దండిగ జ్ఞానము గలిగిన దక్షుడు వలయున్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    చప్పున నేరిమిన్ కదలి సంభవమొందిన సంకటమ్ములన్
    మెప్పు నొసంగు పద్ధతిని మేలును గూర్చెడి సోయగమ్ముతో
    గొప్పగ దీర్చి నందరకు కూరిమి బంచు విభూతి గూడునౌ
    యొప్పుగ బండినట్టి తలలుండిన జాలు మరేల బండితుల్?

    రిప్లయితొలగించండి
  12. పండితు  నడిగిరి లోగడ
    నిండగు  విషయం బెరుగగ! నేటి తరమునన్
    మెండగు గూగుల్  సరణిని
    పండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా?

    రిప్లయితొలగించండి
  13. ఉ:గొప్పగ విద్యలన్ గలిగి కొంచెము నీతియు లేని వారితో
    తిప్ప లదేల గ్రామముల తీరిచి దిద్దగ విద్య లేకయున్
    గొప్పలు పోని,యింగితము కొంచెము గల్గియు,సేద్యవృత్తిలో
    నొప్పుగ బండినట్టి తల లుండిన జాలు మరేల బండితుల్?

    రిప్లయితొలగించండి
  14. కం:పెండిలి లో పులిహోరకు
    పండిన తల లున్న జాలు పండితు లేలా?
    వండగ చైనా వంటల
    పండితులును,జదువుకొన్న వారలు వలయున్.

    రిప్లయితొలగించండి
  15. తప్పును జూపుచున్ విధివిధానము తెల్లము జేసి చిక్కులన్
    విప్పుచు ముప్పు దాటు గతి పేర్కొని జీవనయానగమ్యమం
    దెప్పటి కేది లెస్స వివరించుచు, కర్జము ధర్మమార్గమం
    ఒప్పుగఁ బండినట్టి తల లుండినఁ జాలు మరేల పండితుల్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  16. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    పండుగ దినమున చక్కగ
    అండగ నిలచుచు శుభముల నందింపంగన్
    మెండుగ దీవెన లొసగెడి
    పండిన తలలున్న చాలు పండితు లేలా?

    రిప్లయితొలగించండి
  17. చెప్ప ననర్థకమ్ములను చేరుచు గ్రామపు రచ్చబండపై
    గొప్పలు పోవుచున్ సతము కొంపకు తిప్పలు తెచ్చునట్టి యా
    త్రిప్పరి వాని మానసము తీరుగ మార్చగ నెంచి చూడగా
    నొప్పుగఁ బండినట్టి తల లుండినఁ జాలు మరేల పండితుల్

    రిప్లయితొలగించండి
  18. తేటగీతి

    జీవితానుభవమ్ములు చిన్నవారి
    కెల్ల వేళలఁజెప్పుచు నింటి యందు
    నతివలంబురుషుల “పండిన తలలున్న
    జాలుఁబండితులేలా!”వకీలులేల?

    గొప్పగు జీవితాధ్వమున గోతుల గొప్పుల నెట్లు దాటిరో
    యప్పులు తిప్పలున్ వ్యథలుహర్షము లెయ్యవి ముంచి యత్తెనో
    తప్పక పిన్నవారికిని తద్దయుఁజెప్పుచు మార్గదర్శులై
    యొప్పుగఁబండినట్టి తలలుండినచోట మరేల?పండితుల్ .

    రిప్లయితొలగించండి
  19. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. దండుగ యందురు నెలఁతలు
    మెండుగ జీవనమున కయి మేదినిఁ గాంచం
    గండ బలమ్మును దలఁపులఁ
    బండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా?


    అప్పుల నున్న జీవులకు నారయ నున్నదె జ్ఞాన ఋద్ధియే
    మెప్పుగ భూచరమ్ములకు మేధ వెలుంగునె మస్తకమ్మునన్
    గొప్ప నభశ్చరమ్ము లిల కోవిదులే పరికించి చూడఁగా
    నొప్పుగఁ బండి నట్టి తల లుండినఁ జాలు మఱేల పండితుల్

    రిప్లయితొలగించండి
  21. మొండిగ వాదన తోడను
    దండోరా వేయుఖలుని దండించుటకున్
    భండనము లేకయుంటకు
    పండిన తలలున్న జాలు బండితులేలా

    రిప్లయితొలగించండి
  22. తప్పుడు మాటలన్బలుక దారికి దెచ్చుటకై శుభంబుగా
    నొప్పుగ బండినట్టితలలుండినజాలు మరేల పండితుల్
    చెప్పుట తప్పులేదనుచు జెప్పితినిట్లుగ జింతజేయుడీ
    యెప్పుడ యైననున్బలుకు లింపుగ నుండగ బల్క యొప్పగున్

    రిప్లయితొలగించండి
  23. పండుగదినములయందున
    అండగనుండెదనటంచునక్కరతోడన్
    మెండుగపనులను చేసెడి
    పండినతలలున్నజాలుపండి తులేలా

    రిప్లయితొలగించండి