14, డిసెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3931

15-12-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”
(లేదా...)
“కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్”

24 కామెంట్‌లు:

 1. ఆరుబయటనువిశ్రాంతిహానికాదు
  మంచిగాలికిరోగముమాయమగును
  వేయివెలుగులఱేఁడులువెంటనుండ్రు
  ఇల్లుగూలినకష్టములేలఁగలుగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపురె! యేమి చెప్పుదును బాయక
   వచ్చుచు నుండె బాధలున్
   పాపుచు వచ్చుచున్న నవి పట్టియు
   పీడ యొనర్చుచుండె నీ
   చీకటి యెట్లు మాయమయి చింతలు
   దీరు నటంచునెంచు నా
   కాపురమందు కష్టములికన్ దరిజేరునే
   యిల్లు గూలినన్.

   తొలగించండి

 2. నూతన గృహమున్ నిర్మింప పాతదైన
  యింటినిక కూల్చ దలచుచు నిచ్ఛతోడ
  కూలివాండ్రను పిలిపించి కూల్చి వేయ
  నిల్లుగూలిన గష్టము లేల కలుగు.

  రిప్లయితొలగించండి

 3. పాపపు కార్యముల్ సలుపు వారలు కారు పరస్పరమ్ము జా
  యాపతు లిర్వురున్ గలిసి హాయిగ నుండెడి కాలమందునన్
  శాపమదేమొ చేరె నగచాటులు వెల్లువ రూపమందునన్
  గాపుర మందు కష్టమునికన్ జేరునె యిల్లుగూలినన్.

  రిప్లయితొలగించండి
 4. వాస్తు దోషము గలదని పండితు డన
  గ్రొత్త గృహమును నిర్మించు గోర్కె తోడ
  పాత యింటిని పడగొట్ట వలసి నపుడు
  నిల్లు గూలిన గష్టము లేల గలుగు?

  రిప్లయితొలగించండి
 5. తాపసులైనదంపతులుదైవముకోరగలేదుభాగ్యముల్
  ఆపగపాపచింతలనుహంగులునడ్డమువచ్చునంచుగా
  కోపములేకనత్రిమునికోమలిగూడునుకోరలేదులే
  కాపురమందుఁగష్టములిఁకన్దరిణజేరునెయిల్లుగూలినన్
  అత్రిమహాముని, అనసూయలుదైవమువరమిచ్చిననునివాసమునుకోరలేదు.
  తపస్సునకుఇల్లుఆటంకమగుననివారిఅభిప్రాయము
  కాపురమందుఁగష్టములిఁకన్దరిఁజేరునెయిల్

  రిప్లయితొలగించండి
 6. వానలతిగ కురియ నేలుబడి యిడిన
  వరద హెచ్చరికల విని వసతి మార్చ ,
  కొలది దినముల లోపల గ్రుంగు పాత
  యిల్లు గూలిన , కష్టము లేలఁ గలుగు

  రిప్లయితొలగించండి
 7. ఎన్నికష్టములెదురైన నింటియందు
  నందరొకటిగనున్నచో నదియె మేలు
  కలతలన్నవి లేనట్టి కాపురమున
  ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు

  రిప్లయితొలగించండి
 8. గోపనమున్న గేహమున గూడి వశించును శాంతి సౌఖ్యముల్
  కోపము తాపముల్విడచి కూరిమి మీరగ నెల్ల వేళలన్
  ప్రాపుగనొండొరుల్మసల పండుగయేకద యింటియందు నా
  కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్

  రిప్లయితొలగించండి
 9. సర్వసంగపరిత్యాగి సాధుజనుడు
  పూటకొకచోటబసచేయుపుంగవునకు
  భిక్షపాత్రతో తారాడుభిక్షువునకు
  ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు

  రిప్లయితొలగించండి
 10. 1.శకుని సుయోధనునితో....

  తేటగీతి
  పాండవుల తుదముట్టింప పన్నినట్టి
  వ్యూహమన్నది రారాజ! పొల్లుపోక
  కంబుధరుని కెరుకలేక కాలి లక్క
  యిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు?

  2.రామాయణ పరంగా...

  ఉత్పలమాల
  చేపడి రామచంద్రునకు శ్రీహనుమంతుడు సీతజాడకై
  కోపము నందు వ్యూహమనఁ గ్రుంగగ ముఖ్య గృహాల ద్రొక్కుచున్
  పోపడ గాల్చినన్ బిదప పోరుకు నెంచుచుఁ జేరినంత లం
  కాపురమందుఁ, గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్!

  రిప్లయితొలగించండి
 11. అకట!భూకంపములు “టీ.వి”యందుఁజూచి
  భయముఁజెందుచు పడుకొనె శయనమందు
  వాని భీతికిఁదగినట్లు స్వప్న మందు
  ఇల్లు కూలిన,కష్టము లేల కలుగు.

  ప్రాపుగ నుండు నాయకుఁడె పాలనఁజేయుచు నుండెగాదె,యె
  న్నో పథకాలు వెట్టుచు నొహో!యని పేదలు మెచ్చు నట్టు,ల
  క్కా!పురమందు కష్టము లిఁకన్ దరిఁజేరునె?యిల్లు కూలినన్
  బాపురె! కట్టియిచ్చునట!బాగుగ మెచ్చమె యీ ప్రభుత్వమున్ .

  రిప్లయితొలగించండి
 12. ఉత్పలమాల:
  నాపతి కష్టజీవి తను నాలుగురాళ్ళను వెన్క వేసి యే
  యాపద వచ్చినన్ సుతులు నాలియు దీనత చెందకుండ వీ
  ధిన్ బడకుండ జేసె, మగధీరుడు దక్షుడు వానిమ్రొక్కెదన్.
  “కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 13. ఓపని వర్షమందు, చలి యుగ్గడువై యసియాడ, గ్రీష్మసం
  తాపము లందు కుంది మొగి తాల్మి వహించుచు పూరిగీములో
  ప్రాపు నొసంగు నీ నవనివాసము గట్టితిమట్లు నిప్పు, డా
  కాపురమందుఁ గష్టము లికన్ దరిజేరునె యిల్లు గూలినన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 14. తేటగీతి:
  కల్లుద్రావుచు ముప్రొద్దు నిల్లు విడచి
  నాలి పుస్తెలు సొమ్ముల నమ్మివేసి
  వీధి యరుగుల దొర్లెడి 'బీరు'బలుని
  “కిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 15. ఊపగ గాలివాన పెను యుప్పెన ముట్టిన కారణమ్ముతో
  రూపఱ నిల్లు గ్రామమున రోయుచు నుండ వసించు చోటుకై
  చూపుచు ప్రేమమున్ ప్రభుత సుందర మైన గృహమ్మునియ్యగా
  కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె యిల్లు గూలినన్

  రిప్లయితొలగించండి
 16. తేటగీతి
  చెల్లు చీటి నిచ్చి కుటుంబ జీవితముకు
  కల్లు ముంతలు త్రాగుచు కైపు నూగు
  వానికి వడగళ్ల వఱద బాఱి ముంచ
  ఇల్లు గూలిన కష్టము లేల గలుగు.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 17. క్రొత్త భవనము లోనికి గూర్మి జేరి
  సుఖముగ బ్రదుకు సాగించు చుండ,పాత
  యిల్లు గూలిన కష్టము లేల గలుగు
  జింత జేయుడు సోదర శ్రేష్ఠులార!

  రిప్లయితొలగించండి
 18. నెమ్మి నుండుమ నీ వింక నిర్భయముగఁ
  గష్టములు తీరినవి నీకు దుష్టు వలన
  నీకు నీ వారి కిప్పుడు నీ విరోధి
  యిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు


  వే పుర మొండుఁ జేర వలెఁ బృథ్విని నవ్య గృహమ్ము నందఁగా
  నాపెడు వారు లేక నిర తాతత దారుణ దుష్ట కృత్యముల్
  పాపులు సేయు చుండఁ బరిపాటిగ నిత్యము వెక్కసమ్ముగం
  గాపుర మందుఁ గష్టము లిఁకన్ దరిఁ జేరునె యిల్లు గూలినన్

  [కా పురము = చెడ్డ పురము]

  రిప్లయితొలగించండి
 19. రేపులు మాపులున్ననక రెక్కలు ముక్కలు సేసిగట్టగా
  బ్రాపును నొంది బిట్టుగను భద్రత లేకను గూలిపోవగా
  గాపురమందు గష్టములికన్ దరిజేరునె యిల్లు గూలినన్
  గాపురమందు దానికిట గష్టము లబ్బుటగాదు హేతువుల్

  రిప్లయితొలగించండి
 20. సెలవు దినమున పిల్లలు చెట్టు కింద
  చేరి మట్టి తీసుకువచ్చి చిందులేసి
  కట్టుకున్నటి చక్కని మట్టి బొమ్మ
  రిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు


  🌷గొర్రె రాజేందర్🌷
  🏡సిద్దిపేట🏡

  రిప్లయితొలగించండి
 21. పాప వినాశకుండు హరి పాదములన్ నెర నమ్మి యుండగా
  కాపురమందుఁ గష్టము లిఁకన్ దరిజేరునె, యిల్లు గూలినన్
  రూపగు గాదె చక్కనగు లోగిలి వేరుగ సానుకూలమై
  లోపము గల్గనీడెపుడు లోకహితుండు నిజాశ్రితాళికిన్

  రిప్లయితొలగించండి
 22. బంధముల నిండుగానున్న బ్రతుకునందు
  మోహపాశములకులొంగబోక సతము
  దేవుని దరికి చేరెడి దేహమనెడి
  *ఇల్లు గూలిన కష్టము లేలఁ గలుగు”*

  రిప్లయితొలగించండి