ఉ:స్వర్ణపు కుండలమ్ములను బట్టి యనెన్ హరిదాసు,కాంతిమ త్కర్ణుడు, జానకీ ! రమణికై నరకాసురు జంపె గాశి లోన్ గర్ణములే తరింప వినగా మును లెల్లరు కృష్ణు డంత కా మార్ణవ బాధితాళి యగు నా రమణీ నివహమ్ము గాచగన్. (ఒక హరిదాసు తన భార్య యైన జానకి తో ఇలా అన్నాడు. క్రమాలంకారం,ప్రశ్నార్థకపూరణ నాకు నచ్చక ఈ ప్రయత్నం చేశాను.)
స్వర్ణకవచధారెవ్వరు
రిప్లయితొలగించండివర్ణిని సత్య పతికెటుల ప్రాపునొసంగెన్
పూర్ణశమంబొదవునెచట
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ధారి యెవడు" అనండి.
కందం
రిప్లయితొలగించండినిర్ణయమై శివపురి నా
కర్ణించుచు దర్శకునట కన్నయ నట సం
పూర్ణుడు గతనాటకమున
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్
ఉత్పలమాల
నిర్ణయమెట్లు సేసితివి నేర్పరి గానటువంటి వాని? సం
కీర్ణము జేసి రామకథఁ గృష్ణుని గాథ భరింప లేనటుల్
కర్ణ కఠోరమై వినఁగ గక్కెను వేదినిఁ బండితుండిటుల్
"కర్ణుఁడు జానకీరమణికై నరకాసురుఁ జంపెఁ గాశిలోన్!"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివర్ణవివక్షకు బలియయె;
రిప్లయితొలగించండినిర్ణయ మయె చావు సత్య నిప్పుల శరమై;
కర్ణము లదురున్ హర!యని;
కర్ణుఁడు, నరకుని వధించెఁ, గాశీపురిలోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅర్ణవమందువంతెననుహంగునకోతులుకట్టియాడగా
రిప్లయితొలగించండివర్ణనఁజేయగాసపరివారములంకనుముట్టడించెగా
వర్ణమునీలమాయెగనవారితశోభవిశాలనేత్రుడా
కర్ణుడుజానకీరమణికైనరకాసురుఁజంపెకాశిలోన్
నరకుఁడు-దుష్టుడు
కాశి-శ్రమము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికీర్తిశేషులుఆచార్యదివాకర్లవెంకటావధానిగారికినమస్సుమంజలులు
రిప్లయితొలగించండివారితోసంభాషణఁజేసినమధురస్మ్రుతితో
రిప్లయితొలగించండినిర్ణయ దోషమున గుకవి
రిప్లయితొలగించండివర్ణన సల్పo గ బూని వక్రము గ న సం
పూర్ణ ఫణతిని ట్లనియెను
"కర్ణుడు నరకుని వధించె గాశీ పురి లోన్ "
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపూర్ణమసుడు క్రుంగగనె వి
వర్ణుడు మద్యమ్ము గ్రోలి వాచించెనిటుల్
ఘూర్ణము నందుచు మత్తుగ
కర్ణుడు నరకుని వధించెఁ గాశీ పురిలోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివర్ణువు కుంతిసంతెవడు? పావని సంద్రము నేలదాటెనో
స్వర్ణ? వచింపు నీలమణి సత్యను గూడి నెవండఁగూల్చె దృ
క్కర్ణపు భూషణుండెచట ఖ్యాతివహించెనొ విశ్వనాథుడై
కర్ణుడు, జానకీ రమణికై, నరకాసురుఁ జంపెఁ , గాశిలోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పూర్ణానందం' అనడం వ్యావహారికం.
సవరణతో...
తొలగించండివర్ణింపశక్యమా సం
పూర్ణపురాణమురచించె పులకేశుండే
నిర్ణయముగపేర్కొనెనట
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికర్ణుడు జానకీ రమణికై నరకాసురు
రిప్లయితొలగించండిజంపె గాశిలో
దుర్ణయ మిట్లు పల్కదగదో కవి
వర్య మరెక్కడేని యీ
వర్ణన కానరాదు కద వాంజ్ఞ్మయ
మందున భారతాది కా
వ్యా ర్ణవమందునన్ గనము భావ్య
ము కాదిటులాడ నేరికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిభూర్ణి నుదారుం డెవడు? అ
పర్ణ సహజుడే మొనర్చె వశ సాయమునన్?
పూర్ణ భగ మెచట కలుగును?
కర్ణుడు, నరకుని వధించె, గాశీపురిలోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:వర్ణింతు హరి యలంకృత
రిప్లయితొలగించండికర్ణుడు నరకుని వధించె ,గాశీపురిలో
నిర్ణయ మయ్యెన్ హరికథ
కర్ణామృత రీతి జెప్పగా నా కిపుడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్ణిని!కృష్ణుఁడు భూషిత
రిప్లయితొలగించండికర్ణుఁడునరకుని వధించె,కాశీపురిలోన్
వర్ణించి విశ్వనాథుని
తూర్ణంబుగ గంగ మున్గ తొలగు నఘంబుల్
కర్ణమెవండునై పరగె కౌరవ నౌకకు?రావణాఖ్యుఁడే
వర్ణినికై తపించె?యదు వల్లభుఁడెవ్వనిఁజంపె?ముక్తిసం
పూర్ణముగా లభించునెట?ముద్దియ!చెప్పు మటన్న నిట్లనెన్
కర్ణుఁడు,జానకీ రమణికై,నరకాసురుఁజంపె,కాశిలోన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిస్వర్ణపు కుండలంబులనుశక్తిగఁగల్గిన వాడునెవ్వడో
రిప్లయితొలగించండిపర్ణములన్నియున్ దెగగ బక్షిజటాయువు నిల్చెనెందుకో
నిర్ణయమందిభామ,నెటనీటనుమున్గగఁ బుణ్యమొచ్చునో
కర్ణుఁడు ,జానకీరమణికై ,నరకాసురుఁ జంపెఁ గాశిలోన్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:స్వర్ణపు కుండలమ్ములను బట్టి యనెన్ హరిదాసు,కాంతిమ
రిప్లయితొలగించండిత్కర్ణుడు, జానకీ ! రమణికై నరకాసురు జంపె గాశి లోన్
గర్ణములే తరింప వినగా మును లెల్లరు కృష్ణు డంత కా
మార్ణవ బాధితాళి యగు నా రమణీ నివహమ్ము గాచగన్.
(ఒక హరిదాసు తన భార్య యైన జానకి తో ఇలా అన్నాడు. క్రమాలంకారం,ప్రశ్నార్థకపూరణ నాకు నచ్చక ఈ ప్రయత్నం చేశాను.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిపూర్ణమసుని పుత్రుడు, వర
వర్ణిని సత్య జత గూడి వంశీధరుడున్,
కర్ణములు విను శివ భజన,
కర్ణుడు ,నరకుని వధించె, గాశీ పురి లోన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రమాలంకరం లో కూడా ఒక పూరణ
రిప్లయితొలగించండిఉ:స్వర్ణపు కుండలమ్ములను వైరికి మేలుగ నిచ్చె నెవ్వడో?
ఆర్ణవలంఘన మ్మెవరి కై ?వధియించెను కృష్ణు డేరినో?
వర్ణన కందనట్టి మన భారతతత్త్వము వెల్గు నెచ్చటో?
కర్ణుడు,జానకీరమణి కై,నరకాసురు జంపె, కాశిలోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికర్ణుడు నరకుని జంపెనె?
రిప్లయితొలగించండికర్ణకఠోరంబునయ్యె గవివర! దగునే
కర్ణుని గూరిచి యిటులన
కర్ణుడు నరకుని వధించె గాశీపురిలోన్
స్వర్ణాంగుండా! యజ్ఞా
రిప్లయితొలగించండినార్ణవ మందు మునిఁగితివె యంటివి యిట్లుం
గర్ణ కఠోరంబే యిది
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్
జీర్ణము గాఁగఁ బాఠములు చెప్ప మనంగఁ గరమ్ము చక్కనౌ
వర్ణము లిట్లు ప్రశ్నలకుఁ బన్నుగఁ బల్కిరి యొక్క యుమ్మడిం
గర్ణ ముదావహమ్ము లవికారమ శిష్యులు నల్వు రంతటం
గర్ణుఁడు, జానకీరమణికై, నరకాసురుఁ జంపెఁ, గాశిలోన్
కర్ణుడు జానకీరమణకై నరకాసురుజంపె గాశిలోన్
రిప్లయితొలగించండిగర్ణుడు జంపుటానరకు గాలిగ జెప్పుచు నుంటిరాయిటన్
బర్ణములాకులన్ జెవుల భద్రత బెట్టగ బూనుకుంటిరే
కర్ణుని గూర్చియున్ గర్ణకఠోరము న్యాయమే ప్రభూ!
వర్ణము కారణమ్ముతల వంపుల నొందిన వీరుడెవ్వరో?
రిప్లయితొలగించండిఅర్ణవమున్ తరించెను రయమ్మున నంజన పుత్రు డేలనో?
గీర్ణ దివౌకసుండు హరి చెండిన దెవ్వని? పోవు పాపముల్?
కర్ణుఁడు, జానకీరమణికై, నరకాసురుఁ జంపెఁ, గాశిలోన్
స్వర్ణకవచకుండలుడన
రిప్లయితొలగించండిశీర్ణంబగునట్లుసత్యఛేధించుచు తా
పూర్ణజ్ఞానము కలుగును
కర్ణుడు,నరకుని వధించె,కాశీపురిలోన్
[: మరొక పూరణ
స్వర్ణపు కుండలమ్ము లను చక్కగ మేనున దాల్చి పుట్టెనా
ఆర్ణవ మున్తరించెనట నా రఘు రాముడు తాను త్రేతలో
కర్ణము చెంతకున్తిగిచి కాంత,వసింపగ , కల్గు జ్ఞాన మున్
కర్ణుడు జానకీ రమణికై నరకాసురు చంపెకాశిలోన్