6, డిసెంబర్ 2021, సోమవారం

సమస్య - 3923

7-12-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్”
(లేదా...)
“సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్”

20 కామెంట్‌లు:

  1. కోతుల‌ గుంపెవరిని గని

    జోతలిడె,సతిపతి యెవరు, శూలధరునితో

    మాత‌ కలసేమి‌చేసెను

    సీతను గని, శంకరుడు, చిందులు‌ వేసెన్

    రిప్లయితొలగించండి

  2. దైతేయుడు తారకుని వి
    ఘాతించు సుతు గననెంచి కాత్యాయణియే
    ప్రీతిని దరిఁ జేరగ నో
    సీ, తనుఁ గని శంకరుండు చిందులు వేసెన్.

    రిప్లయితొలగించండి
  3. త్రాతగజగతికితానై
    యాతనదీరగజలధునివాగైవంకై
    భూతలవాహినిరాగా
    సీతనుగనిశంకరుండుచిందులువేసెన్
    సీత-గంగ

    రిప్లయితొలగించండి
  4. కందం
    భూతలమున వానకు నీ
    వాతను జిక్కుచు మునుగఁగ ప్రాణుల పైనన్
    ఘాతకి! దయఁజూపవనుచు
    సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్!

    ఉత్పలమాల
    భూతలమందుఁ దీవ్రముగ ముంచుచు సర్వము గాలివాన లు
    త్పాతము జంతుజాలముల ప్రాణము దీయఁగ నాస్తినష్టమై
    భూతగణాధిపా! కరుణఁ బ్రోవఁగరమ్మన నార్తనాదమై
    సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్!

    రిప్లయితొలగించండి

  5. వాతసుతుండు లంకజని బాళిని పొందిన దెప్పు డంటిరా?
    మాత మగండెవండు? కపి మారుతి జానకి గాంచినందుకా
    క్రోతులు చేసెనేమియట? క్షోణి శవాల దహింతు రెచ్చటన్?
    సీతను గాంచి, శంకరుఁడు, చిందులువేసె, బరేత భూమిలోన్.

    రిప్లయితొలగించండి
  6. ఆతతశక్తిదాయినిగనంబువుదాల్చినయమ్మగావడిన్
    భ్రాతలప్రాణరక్షయనుభాగ్యమునీయభగీరథున్గనిన్
    సాతముశీర్షమందుఘనసాంబునిముచ్చటకోల్వుదీరునా
    సీతనుగాంచిశంకరుడుచిందులువేసెపరేతభూమిలోన్

    రిప్లయితొలగించండి
  7. ప్రీతిగ మ్రొక్కెను మారుతి
    సీతను గని : శంకరుండు చిందులు వేసెన్
    గీతముల కను గుణపు పల్
    రీతుల విన్యాస ముకు తరిం చగ ప్రమథుల్

    రిప్లయితొలగించండి
  8. తాతలకుత్తమగతులకు
    యాతన కోర్చిన మనవడి యత్నముతోడన్
    ప్రీతిగ తనపై దూకిన
    సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్


    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    నీతి నెడలు కొడుకుని గని
    మాతగ నీ విధుల నెల్ల మానితి వనుచున్
    తా తామసమున సతియౌ
    సీతను గని శంకరుండు చిందులు వేసెన్.

    రిప్లయితొలగించండి
  10. *సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్.*

    భగీరథ ప్రయత్నంలో పరమశివుడు గంగ యొక్క అహంకారాన్ని అడచినాడని, నా
    ప్రయత్నం:

    పీతలు, కర్కటమ్ములును, బీవర యూధము గల్గి యుండి తా
    నాతత శక్తి జూపి యమరాపగ యెచ్చిడి బోవు విన్నదిన్
    భూతల మందు జూటమున బూర్తిగ జిక్కిన వైనమెంచుచున్,
    సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్.

    పీవర యూధము-తాబేళ్ళు.
    సీత-గంగ

    రిప్లయితొలగించండి
  11. తాత తెలుప పెండ్లాడిన
    మాతులుని సుతను సురతము మరువ వలదనన్
    మూతి బిగించెడి స్వామిని
    సీతనుఁ గని , శంకరుండు చిందులు వేసెన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    నీతిని వీడి మోసమున నీచ విమోహ గుణమ్మె ప్రబ్బగా
    చేతన లేని రావణుడు సింధుజ రూపిణి యా మహీసుతన్
    పాతియె లేని వేళ గిలుబాడుట నెంచి మదిన్ యశక్తియౌ
    సీతను గాంచి శంకరుడు చిందులు వేసె బరేత భూమిలోన్.

    రిప్లయితొలగించండి
  13. నూతన పరికరములతో
    యాతనలవి లేక దున్న నైదెకరములన్
    నాతుల పాపటి వోలెడు
    సీతనుగని శంకరుండు చిందులు వేసెన్

    శంకరుడను రైతు
    సీత = నాగేటి చాలు

    సీతాదేవి


    త్రాతవు నీవెయేయనుచు తత్పరతన్ భజియింపగా
    ధృతిన్
    శీతమయూఖమౌళి యతిశీఘ్రమె జాచుచు వేణియూధమున్
    భూతదయాళువై నిలచి పొందిక జుట్టుచు
    సంభ్రమించెడున్
    సీతను గాంచి శంకరుడు చిందులువేసె పరేతభూమిలో

    రిప్లయితొలగించండి
  14. భూతలమున పాపచయం
    బాతతముగ వృద్ధినొంది యలముకొనంగన్
    భూతలమును ముంచెత్తిన
    సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్

    రిప్లయితొలగించండి
  15. ‘సీతా!కాఫీ తే’యన
    గా తేలేదని యణకువగా లేదని యౌ
    రా! తన భార్యగ తగదని
    సీతనుఁగని శంకరుండు చిందులు వేసెన్

    తేటగీతి

    రావణునిఁజంపి మురిసెను లంక లోన
    మగఁడు రాముఁడు తన/సీతనుగని,శంక
    రుండు చిందులు వేసెన్/మరుండు పూల
    బాణముల్ వేయగాను పార్వతినిఁగూడి.

    శ్రీ తనరారగా జలధి రివ్వున దాటిన వాయుసూనుడున్
    ఆతత మోదమందెగద!వ్యాకుల చిత్తను రాము భార్య నా
    సీతనుఁగాంచి, శంకరుడు చిందులు వేసె పరేత భూమిలోన్
    ప్రీతిని పార్వతింగలిసి ప్రేతగణంబులు చూచి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  16. ~~~~~~~~~~~~~~~~~~~
    నీతి విహీన రావణుడు నిర్భయుడై
    కొనిపోయి లంక భూ
    జాతన శోక పాదపము ఛాయను
    నుంచగ శోకతప్తయౌ
    సీతను గాంచి శంకరుడు , చిందులు
    వేసె బరేత భూమిలో
    నీతని చావు మూడె నని యిద్ధర
    రాము శరాసనంబుచే.
    ~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  17. కోతులను గూడి యసుర
    వ్రాతము దశకంఠుఁ జంపి రాముఁడు దైత్యా
    రాతి యనురక్తిఁ గైకొన
    సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్


    ఆతత భక్తి మ్రొక్క జనకాత్మజ వారక నిత్యమున్ జగ
    న్మాత కృపా రసేక్షణ సమాసములం గడు పేర్మిఁ గాచె లం
    కా తటి జానకిన్ గిరిజ కాంత నుమాసతి రక్షితైక త
    త్సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్

    రిప్లయితొలగించండి
  18. ప్రీతిని గలగల పాఱెడు
    సీతనుగని శంకరుండు చిందులు వేసెన్
    నాతులకవధులు లేవిక
    సీతను దాస్నా నమాడ శ్రీకరమౌటన్

    రిప్లయితొలగించండి
  19. కందం
    భ్రాతిగ దండమిడె హనుమ
    సీతను గని ,శంకరుండు చిందులు వేసెన్
    మాత గిరి నందిని కలిసి
    శీతనగము పయి జగాల క్షేమంకరుడై
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  20. సీతను గాంచి శంకరుడు చిందులు వేసె బరేతభూమిలోన్
    నీతరహా సమస్యలను నిచ్చుట భావ్యమె చింతజేయుడీ
    సీతను గాంచి మారుతియ చిందులు వేసెను సంతసంబుతో
    బ్రీతిని శంకరుండనుక రించెను గోతిని గంగరాకతో

    రిప్లయితొలగించండి