21, డిసెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3938

22-12-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె”
(లేదా...)
“కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్”

28 కామెంట్‌లు:


  1. సూతపుత్రుడైన శూరుడే యతగాడు
    శతమఖ సుతున కని సాటి యతడె
    విగ్రహమున మనకు విజయమందించెడే
    కైక వీరుడనుచు గర్ణు మెచ్చె.

    రిప్లయితొలగించండి
  2. అస్త్రశస్త్ర విద్యలందాతడేమేటి
    యెట్టివీరునైన మట్టిగరపు
    దురమునందుపార్థుతోపోరి గెలుచు నే
    కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె

    రిప్లయితొలగించండి
  3. అస్త్రవిద్యలందునారితేరినయట్టి
    పార్థుగురుడునంతపలుకమేటి
    కలతతోడయోధకౌరవాగ్రజుడే
    కైకవీరుడనుచుకర్ణుమెచ్చె

    రిప్లయితొలగించండి
  4. కౌరవసభలో రారాజు:

    ఆటవెలది
    కన్నకొడుకుఁ గావ ఖదురుడె దిగివచ్చి
    కవచకుండలముల గైకొనంగఁ
    జేయిఁ జాచ నొసఁగఁ జింతించ నట్టి లో
    కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె!

    ఉత్పలమాల
    ఆకట! దేవరాజు సుతు నాదుకొనంగను నేల డిగ్గుచున్
    గోకుచుఁ గోరఁగన్ కవచకుండలముల్ గొనఁ జింతఁ జేయకే
    ప్రాకట దానశీలుఁడనఁ బంచెనటంచును రాజరాజు లో
    కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్!

    రిప్లయితొలగించండి

  5. పోకిరి వాడు నీలమణి మూర్ఖపు మాటల బల్కుచున్ సఖుం
    డా కపికేతువున్ పొగిడెనా సభలో నని భీతియేల? దై
    వాకరి యున్నచాలతడె పార్థుని మించిన వాడతండె యే
    కైక మహాధనుర్ధరుడుగా సభలోనుతియించెఁ గర్ణునిన్.

    రిప్లయితొలగించండి
  6. కలతతోడయోధకౌరవాగ్రజుడునే
    కైకవీరుడనుచుకర్ణుమెచ్చె

    రిప్లయితొలగించండి
  7. పార్థు నెదుట నిలిచి బవరమ్ము సల్పo గ
    దగిన వాడ వీవు దక్షు డనుచు
    కౌరవ పతియు పొగడె గా మిత్రుగనియు నే
    కైక వీరు డనుచు గర్ణు మెచ్చె

    రిప్లయితొలగించండి
  8. తాకుచు మిత్రమా! యనుచు, తన్మయ మానస చిత్తుడౌచు,పే
    ర్మిన్,కురురాజు రాజ్య మిడి,మిక్కిలి శ్రద్ధను జూపి,నుర్విలో
    నీకును సాటిరాగలుగు నేర్పరి లేడని మింటి కెత్తె,యే
    కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్.

    రిప్లయితొలగించండి
  9. రాకొమరుల మించి రాధేయుడు మిహిగ
    బాణవిద్య యందు ప్రతిభజూప
    వీక్షసలుపువారు విలువిద్య యందు నే
    కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె

    రిప్లయితొలగించండి
  10. రాకుల వంశజుల్ తమరి రాజకుటుం
    బ సమక్షమందునన్
    భీకర బాణ విద్యలను భీతిని గొల్పగ
    జూపి రందరున్
    తేకువ తోడ సూర్యసుతు తేజము
    జూసి సుయోధనాఢ్యు డే
    కైక మహాధనుర్ధరుడుగా సభలో నుతి
    యించె గర్ణునిన్

    రిప్లయితొలగించండి
  11. ఎవరి కోర్కెదీర్చ యిక్కట్ల పాలాయె
    రామడడవి కేగె రమణి తోడ
    నంగరాజ్యమిచ్చి యలరుచు కురురాజు
    కైక; వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె;

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    పాశుపతము తోడ ఫల్గుణు డున్నను
    భయము వలదు మనకు భ్రాతలార
    యనుచు రాజరాజు అంగరాజు గని లో
    కైక వీరు డనుచు గర్ణు మెచ్చె.

    రిప్లయితొలగించండి
  13. ఆ కురురాట్సభాంగణమునర్జునుడద్భుతరీతి విద్యలన్
    ప్రాకటమొప్ప వెల్వఱచి పారగులందరి మెప్పునొందగా
    డీకొని సాటినంచు ప్రకటింప సుయోధనుడాదరించి లో
    కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్

    రిప్లయితొలగించండి
  14. పాటవంబుజూపి పాండవులలరింప
    సూతపుత్రుడేగె స్ఫురణతోడ
    తనదు మేటి ప్రతిభ కనుగొన్న జనులు లో
    కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    పాకముతో ధనుంజయుడు పాశుపతమ్మును వేయగల్గినన్
    నాకును మీకు సఖ్యుడు దినప్రణి పుత్రుడు అంగరాజిలన్
    చేకలవాడు ఫల్గుణుని చెండెడి వాడని రాజరాజు లో
    కైక మహాధనుర్థరుడుగా సభలో నుతియించె గర్ణునిన్.

    రిప్లయితొలగించండి
  16. చేకొని విల్లు యుద్ధమునుచేయగ కర్ణుని గెల్చువారలీ
    లోకమునందు నెవ్వరతిలోక భయంకరు డంగరాజు తా
    నాకులమొందగా దురమునందునపార్థుని నిల్వరించు నే
    కైక మహాధనుర్ధనుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్

    రిప్లయితొలగించండి
  17. యుద్ధవిద్యలన్ని యొక్కుమ్మడిగఁజూప
    సవ్యసాచికితడె సాటి యంచు
    అంగరాజ్యమిచ్చి యౌర!రారాజు, లో
    కైక వీరుడనుచు కర్ణు మెచ్చె.

    శ్రీకర మత్స్యయంత్రమును ఛేదన సేయగ వచ్చినంతనే
    లోకువ జేయ సూతుడని లోకుల ముందర నంగరాజుగా
    ప్రాకటనంబుఁజేసి తన వాఁడని మెచ్చుచు రాజరాజు లో
    కైక మహాధనుర్ధరుడుగా సభలో నుతియించె కర్ణునిన్.

    రిప్లయితొలగించండి
  18. ఈరోజు శంకరాభరణము వారొసగిన సమస్యకు నా పూరణములు
    సమస్య
    కైక వీరుడనుచు కర్ణు మెచ్చె
    పూరణము

    ఆటవెలది

    యుద్ధ విద్యల్ని యొక్కుమ్మడిగఁజూప
    సవ్యసాచికితడె సాటి యంచు
    అంగరాజ్యమిచ్చి యౌర!రారాజు, లో
    కైక వీరుడనుచు కర్ణు మెచ్చె.

    సమస్య
    కైకమహాధనుర్ధరుడుగా సభలో నుతియించె కర్ణునిన్
    పూరణము
    ఉత్పలమాల

    శ్రీకర మత్స్యయంత్రమును ఛేదన సేయగ వచ్చినంతనే
    లోకువ జేయ సూతుడని లోకుల ముందర నంగరాజుగా
    ప్రాకటనంబుఁజేసి తన వాఁడని మెచ్చుచు రాజరాజు లో
    కైక మహాధనుర్ధరుడుగా సభలో నుతియించె కర్ణునిన్.

    ——————-దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  19. భీకరమైన యుద్ధమున వీగును కౌరవ సేన లంచు నా
    శ్రీకరుడౌ మురారి వివరింపగ, కోపము విస్ఫురింపగా
    నాకురురాజు మానసము నందున గాంచి యనుంగు మిత్రు నే
    కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్

    రిప్లయితొలగించండి
  20. రాజరాజు సైన్యమాజిలో వెనుకంజ
    వేయ కర్ణుజూచి ప్రీతినుడివె
    యుద్ధరంగ మందు గ్రుద్ధత పోరునే
    కైక వీరుడనుచు గర్ణుమెచ్చె

    రిప్లయితొలగించండి
  21. శ్రీకరభక్తకల్పకవిశిష్టవరప్రదు నండదండగా
    చేకొన నేమి! దైవకృపచే ప్రభవించిన వారలైననున్,
    ప్రాకటకౌరవాగ్రజుడు పాండవనాశకవీరవైర్యనీ
    కైకమహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  22. తేజ మందు నెంచ దినకరునకు సాటి
    దాన గుణము నందుఁ దగును శిబికిఁ
    బాటవమ్ములోఁ గిరీటికి సాటి యే
    కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె


    ప్రాకట యుద్ధ నైపుణుఁడు రాధ సుతుండు వరాంగ నాథుఁ డా
    పాక విరోధి సన్నిభుఁడు భావి మహోగ్ర రణాంతరమ్మునన్
    వీఁక నెదిర్ప నర్జునునిఁ బృథ్వి జనించిన యస్త్ర వేది లో
    కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్

    రిప్లయితొలగించండి
  23. కాకలుదీరు యోధులుగ గౌరవపక్షము నందునుర్విలో
    బ్రాకటమౌ విధంబుగను రాజసమొందియు నొక్కసారిగా
    దోకను ముడ్చి సైనికులు తూపులు వీడుచు బాఱిపోవ,యే
    కైకమహాధనుర్ధరుడుగా సభలో నుతియించె గర్ణునిన్

    రిప్లయితొలగించండి
  24. ఆటవెలది
    సహజ కవచ కుండల హరిదశ్వు సుతుడు
    దాన వీర శూర తళుకు వాని
    రాజరాజనెను, ధనుంజయ సాటి యే
    కైక వీరు డనుచు గర్ణు మెచ్చె.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  25. అస్త్రవిద్య లందు అసమాన ప్రతిభను
    కనపరచగ మెచ్చి కరము పట్టి
    ధార్త రాష్ట్రుడచట తన్మయుడగుచు లో
    *“కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె

    కవచ కుండలములు కరమొప్పుచుండగ
    సాటి లేని గొప్ప మేటి వీరు
    డనుచురాజరాజు నాదరమొప్పలో
    కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె

    రిప్లయితొలగించండి