24-12-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని”(లేదా...)“దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్”
విష్ణుచిత్తుని సుతయైన విజ్ఞురాలుపాలమున్నీటి యల్లుడా పావనుడనునమ్మి కొలిచె గోదాదేవి, నాగధరునినామమున్ స్మరియించును నందుడెపుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనసుమందిరమయ్యెగామాధవునికిచెలియనిలిచెనుగోపికైచెన్నుమీరపరమపదమునుతానంటభాసురముగనమ్మికోలిచెనుగోదాదేవినాగధరునినాగము-కోండ
తేటగీతిమానసంబున నిండంగ మాధవుండులోకమందున సర్వమా రూపమట్లుతా శివాలయమునకేగి కేశవుఁడనినమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని! శార్దూలవిక్రీడితముసేవింపంగ రమేశుఁ బాశురములన్ జిందించి భక్త్యాత్మయైజీవంబాత్మనివేదనమ్మున గనన్ శ్రీవిష్ణునన్నింటిలోశైవుల్గొల్చెడు నాలయాన నయినన్ సాకారమౌ శౌరిగన్దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఆటవెలదినలిననాభు //నమ్మి కొలిచె గోదాదేవినాగధరుని//గౌరి,నలినభవునివాణి,సుగుణ రామ భద్రు జానకి,సురపతిని శచియు,నలుని భైమి యట్లు.
తేటగీతి సమస్యను ఆటవెలదిలో చక్కగా పూరించారు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తేటగీతిరంగనాథుని ప్రేమించి రక్షకునిగదలచి త్రికరణ శుద్ధిగ దానవారి ,పార్వతి తపించి పరిణయంబాడె విభుడునమ్మి కొలిచె గోదాదేవి, నాగధరునిప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
రంగ నాథుని మనసార రమ్య శీలి నమ్మి కొలిచె గోదాదేవి : నాగధరుని వలచి వరియింప దపమున వాంఛ దీర పరిణయం బాడె పార్వతి ప్రమద మలర
భావంబందునభాగ్యశాలిగనుతాపారంబునన్వేషణన్చేవంగల్గినపాశురంబులనుచింతించెన్సదాస్నానయైయావన్కామనపారవశ్యగనునేయామంబుజీవాత్మయైదైవంబన్నఁద్తినేత్రుడేయనుచుగోదాదేవినమ్మెన్మదిన్
శైవంబంచును వైష్ణవంబనుచు వైషమ్యంబులన్ మానుమా తా వాచించును సంతతమ్ము హరియే ధ్యానించుచున్ సృష్టిలో దైవంబన్న ద్రినేత్రుఁడే యనుచు, గోదాదేవి నమ్మెన్ మదిన్ శ్రీవత్సుండను భక్తితో గొలుచునా సీమంతినీ నిత్యమున్.
భావంబందున గొల్తురెల్ల రెపుడున్బ్రార్థించుచున్ మాకు మాదైవంబన్న త్రినేత్రుడే యనుచు, గోదా దేవి నమ్మెన్ మదిన్జీవాత్ముండు పరాత్పరుండయినయా శేశాచలేశున్ సదాలేవయ్యా! యని పాశురంబులునుదా లేపన్ లిఖించెంగదా
రంగనాధ సామియె తన రమణుడనుచునమ్మి కొలిచె గోదాదేవి ; నాగధరునికొలిచె బర్వతరాజుని కొమరిత యుమ ,తానతనని భర్తగ బొందు తగులు తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'రంగనాథుడె తనయొక్క...' అనండి.
రంగనాథుడే తనయంతరంగమందుతాండవంబాడ నాతడే తనపతియనినమ్మి కొలిచె గోదాదేవి; నాగధరునిగౌరి వరియించి తపియించి కోరినటుల
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: హరిహరాద్వైత మంతయు నరసి తాను హరియు హరుడొక్కడే యను స్మరము తోడ హరిని హరునందు గనుచుండి అరుసమొంది నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని.
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: వైవశ్యంబగు భక్తితో హరిహరాద్వైతంబు సంపూర్తిగా తా వాచించి గ్రహించి నీ యిలను పద్మాక్షుండె నీశుండనన్ భావంబున్ సతతంబు దల్చె ఘనమౌ భంగిన్ హరిన్ గన్న నా దైవంబన్న ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్.
నెమ్మితో హరి నెపుడుతా నెమ్మనమ్మునందు నెలకొల్పి యారాధనమ్ముజేసి“నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరునిసతము ధ్యానించు శ్రీహరి సంతసింప
ఆవేశంబును హెచ్చ పార్వతియు మాయా వర్ణితో పల్కెగాఆవాసంబు శ్మశానమైన,ఫణులే హారంబులై యొప్ప,నాదైవంబన్న త్రినేత్రుడే యనుచు,గోదాదేవి మెచ్చెన్ మదిన్ఆవైకుంఠుఁడెనాదునాథుడని,తానాముక్తమాల్యాలిడెన్
శ్రీవత్సాంకితవిష్ణుచిత్తుడటుశ్రీసేవాంబుదిన్ మున్గుచున్శ్రీవైకుంఠపువాకిలిన్దెఱువసుశ్రీశంఖుచక్రంబులున్భావింపన్మదినామమున్గదిలెశైవంబౌచుగన్నుల్వలెన్దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
అన్యు నొల్లంగ నే నేర నంచు భక్తినిలిపి స్వీయ మనమ్మున నీరజాక్షు వెన్నునిఁ బతిగ నిమ్మని మిన్నగ సతి నమ్మి కొలిచె గోదాదేవి నాగధరునిఏ వామాక్షి యొసంగె మాల మును తానే వాడి యా భామయేనా వాఁడై సతతమ్ము నిల్చి మదిలో నారాయణుండే ననుంగావంగా నిల దైవ మైన పగిదిం గాత్యాయనీ దేవికిన్ దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్
రంగనాధుని మహిమలు మదిని మిగులనమ్మి గొలిచె గోదాదేవి,నాగధరుని కఠిన తపమునమెప్పించి గలుగ ప్రేమపెండ్లియాడెను దీవనల్ బెద్దలిడగ
దైవంబన్న ద్రినేత్రుడేయనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్ దేవా!సత్యము బల్కితీవిచట యాదేవేరి విశ్వాసమున్ నీవున్ నమ్ముచు మానసంబున నికన్నెయ్యమ్ముబెంపొందగాదైవంబౌశివుడన్న భావమునదాదాత్మ్యంబుతో నుండుమా
భావింతుర్ శివభక్తకోటి నిరతంబత్యంత శ్రద్ధాళురైదైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు, గోదాదేవి నమ్మెన్ మదిన్దైవంబొక్కడె రంగనాథుడిలలోతథ్యంబుగా నెల్లరన్బ్రోవంగాతగువాడటంచు పతిగాపూజించె నాదైవమున్
భావాతీతుననాదిమధ్యలయునభ్యర్చించెనా తిన్నడే దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు; గోదాదేవి నమ్మెన్ మదిన్దైవంబన్నఁ బరాత్పరుండు హరి సత్యంబంచు ముమ్మాటికిన్Qత్రోవల్ వేరులు గాని నిక్కమెరుగన్ లోకేశుడొక్కండెగా
సేవల్ జేసెను సర్వమంగళ హరున్ చిత్తమ్మునన్ నిల్పుచున్దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు, గోదాదేవి నమ్మెన్ మదిన్శ్రీవస్తున్ ధృతితోడ, నిత్యమును సంసేవించె సద్భక్తితోనావైకుంఠనివాసుడే పుడమిపై నాత్మీయుడంచెంచుచున్
రిప్లయితొలగించండివిష్ణుచిత్తుని సుతయైన విజ్ఞురాలు
పాలమున్నీటి యల్లుడా పావనుడను
నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని
నామమున్ స్మరియించును నందుడెపుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనసుమందిరమయ్యెగామాధవునికి
రిప్లయితొలగించండిచెలియనిలిచెనుగోపికైచెన్నుమీర
పరమపదమునుతానంటభాసురముగ
నమ్మికోలిచెనుగోదాదేవినాగధరుని
నాగము-కోండ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిమానసంబున నిండంగ మాధవుండు
లోకమందున సర్వమా రూపమట్లు
తా శివాలయమునకేగి కేశవుఁడని
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని!
శార్దూలవిక్రీడితము
సేవింపంగ రమేశుఁ బాశురములన్ జిందించి భక్త్యాత్మయై
జీవంబాత్మనివేదనమ్మున గనన్ శ్రీవిష్ణునన్నింటిలో
శైవుల్గొల్చెడు నాలయాన నయినన్ సాకారమౌ శౌరిగన్
దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండినలిననాభు //నమ్మి కొలిచె గోదాదేవి
నాగధరుని//గౌరి,నలినభవుని
వాణి,సుగుణ రామ భద్రు జానకి,సుర
పతిని శచియు,నలుని భైమి యట్లు.
తేటగీతి సమస్యను ఆటవెలదిలో చక్కగా పూరించారు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిరంగనాథుని ప్రేమించి రక్షకునిగ
దలచి త్రికరణ శుద్ధిగ దానవారి ,
పార్వతి తపించి పరిణయంబాడె విభుడు
నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరంగ నాథుని మనసార రమ్య శీలి
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి : నాగధరుని
వలచి వరియింప దపమున వాంఛ దీర
పరిణయం బాడె పార్వతి ప్రమద మలర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావంబందునభాగ్యశాలిగనుతాపారంబునన్వేషణన్
రిప్లయితొలగించండిచేవంగల్గినపాశురంబులనుచింతించెన్సదాస్నానయై
యావన్కామనపారవశ్యగనునేయామంబుజీవాత్మయై
దైవంబన్నఁద్తినేత్రుడేయనుచుగోదాదేవినమ్మెన్మదిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశైవంబంచును వైష్ణవంబనుచు వైషమ్యంబులన్ మానుమా
తా వాచించును సంతతమ్ము హరియే ధ్యానించుచున్ సృష్టిలో
దైవంబన్న ద్రినేత్రుఁడే యనుచు, గోదాదేవి నమ్మెన్ మదిన్
శ్రీవత్సుండను భక్తితో గొలుచునా సీమంతినీ నిత్యమున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావంబందున గొల్తురెల్ల రెపుడున్
రిప్లయితొలగించండిబ్రార్థించుచున్ మాకు మా
దైవంబన్న త్రినేత్రుడే యనుచు, గో
దా దేవి నమ్మెన్ మదిన్
జీవాత్ముండు పరాత్పరుండయిన
యా శేశాచలేశున్ సదా
లేవయ్యా! యని పాశురంబులును
దా లేపన్ లిఖించెంగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరంగనాధ సామియె తన రమణుడనుచు
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి ; నాగధరుని
కొలిచె బర్వతరాజుని కొమరిత యుమ ,
తానతనని భర్తగ బొందు తగులు తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రంగనాథుడె తనయొక్క...' అనండి.
రంగనాథుడే తనయంతరంగమందు
రిప్లయితొలగించండితాండవంబాడ నాతడే తనపతియని
నమ్మి కొలిచె గోదాదేవి; నాగధరుని
గౌరి వరియించి తపియించి కోరినటుల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిహరిహరాద్వైత మంతయు నరసి తాను
హరియు హరుడొక్కడే యను స్మరము తోడ
హరిని హరునందు గనుచుండి అరుసమొంది
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండివైవశ్యంబగు భక్తితో హరిహరాద్వైతంబు సంపూర్తిగా
తా వాచించి గ్రహించి నీ యిలను పద్మాక్షుండె నీశుండనన్
భావంబున్ సతతంబు దల్చె ఘనమౌ భంగిన్ హరిన్ గన్న నా
దైవంబన్న ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెమ్మితో హరి నెపుడుతా నెమ్మనమ్ము
రిప్లయితొలగించండినందు నెలకొల్పి యారాధనమ్ముజేసి
“నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని
సతము ధ్యానించు శ్రీహరి సంతసింప
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆవేశంబును హెచ్చ పార్వతియు మాయా వర్ణితో పల్కెగా
రిప్లయితొలగించండిఆవాసంబు శ్మశానమైన,ఫణులే హారంబులై యొప్ప,నా
దైవంబన్న త్రినేత్రుడే యనుచు,గోదాదేవి మెచ్చెన్ మదిన్
ఆవైకుంఠుఁడెనాదునాథుడని,
తానాముక్తమాల్యాలిడెన్
శ్రీవత్సాంకితవిష్ణుచిత్తుడటుశ్రీసేవాంబుదిన్ మున్గుచున్
రిప్లయితొలగించండిశ్రీవైకుంఠపువాకిలిన్దెఱువసుశ్రీశంఖుచక్రంబులున్
భావింపన్మదినామమున్గదిలెశైవంబౌచుగన్నుల్వలెన్
దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
అన్యు నొల్లంగ నే నేర నంచు భక్తి
రిప్లయితొలగించండినిలిపి స్వీయ మనమ్మున నీరజాక్షు
వెన్నునిఁ బతిగ నిమ్మని మిన్నగ సతి
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని
ఏ వామాక్షి యొసంగె మాల మును తానే వాడి యా భామయే
నా వాఁడై సతతమ్ము నిల్చి మదిలో నారాయణుండే ననుం
గావంగా నిల దైవ మైన పగిదిం గాత్యాయనీ దేవికిన్
దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్
రంగనాధుని మహిమలు మదిని మిగుల
రిప్లయితొలగించండినమ్మి గొలిచె గోదాదేవి,నాగధరుని
కఠిన తపమునమెప్పించి గలుగ ప్రేమ
పెండ్లియాడెను దీవనల్ బెద్దలిడగ
దైవంబన్న ద్రినేత్రుడేయనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్
రిప్లయితొలగించండిదేవా!సత్యము బల్కితీవిచట యాదేవేరి విశ్వాసమున్
నీవున్ నమ్ముచు మానసంబున నికన్నెయ్యమ్ముబెంపొందగా
దైవంబౌశివుడన్న భావమునదాదాత్మ్యంబుతో నుండుమా
భావింతుర్ శివభక్తకోటి నిరతంబత్యంత శ్రద్ధాళురై
రిప్లయితొలగించండిదైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు, గోదాదేవి నమ్మెన్ మదిన్
దైవంబొక్కడె రంగనాథుడిలలోతథ్యంబుగా నెల్లరన్
బ్రోవంగాతగువాడటంచు పతిగాపూజించె నాదైవమున్
భావాతీతుననాదిమధ్యలయునభ్యర్చించెనా తిన్నడే
రిప్లయితొలగించండిదైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు; గోదాదేవి నమ్మెన్ మదిన్
దైవంబన్నఁ బరాత్పరుండు హరి సత్యంబంచు ముమ్మాటికిన్Q
త్రోవల్ వేరులు గాని నిక్కమెరుగన్ లోకేశుడొక్కండెగా
సేవల్ జేసెను సర్వమంగళ హరున్ చిత్తమ్మునన్ నిల్పుచున్
రిప్లయితొలగించండిదైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు, గోదాదేవి నమ్మెన్ మదిన్
శ్రీవస్తున్ ధృతితోడ, నిత్యమును సంసేవించె సద్భక్తితో
నావైకుంఠనివాసుడే పుడమిపై నాత్మీయుడంచెంచుచున్