12, డిసెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3929

13-12-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే”
(లేదా...)
“నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

44 కామెంట్‌లు:

  1. కందం
    శ్రీరామాయని పలుకగ
    నోరున్నది ,మగని దిట్టి నొప్పించుటకే
    కారణము వెదకి కయ్యము
    కోరుచు ఘోరముగ వదఱె కోమలి యొకతెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  2. పారమునంటగపతియను
    వారధిదాటంగడువడిపాటునసతియున్
    గారడివిద్యనునేర్చెను
    నోరున్నదిమగనిదిట్టినోప్పించుటకే

    రిప్లయితొలగించండి
  3. తారక రామ జపము తని
    వారగ సల్పo గ గలదు వాయి యనంగా
    తీరు ను మారుట వలనను
    నోరున్నది మగని దిట్ఠి నొప్పించుటకే

    రిప్లయితొలగించండి


  4. భీరువు లనంత రకములు
    పేరిమితోడ చరియించు భీరువు లుండన్
    ధారుణి గొందరు స్త్రీలకు
    నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. నోరెత్తదత్త మాటకు
      నోరెత్తదు మామముందు నోయునుమదిలో
      నారికి మగడే సర్వము
      నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే!

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. సవరించిన పూరణలు:

      శ్రీరామచంద్రునితో లక్ష్మణస్వామి:

      కందం
      "తారకరామా! జననిగ
      దారుణమనఁ గైక మిమ్ము దవములకంపన్
      దూఱెనె తండ్రిని,సతులకు
      నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే?"

      శార్దూలవిక్రీడితము
      "శ్రీరామా! వనవాసమంప మిము నిర్దేశించె కైకమ్మయే!
      కోరన్ జూతురె మాతృమూర్తులిలలో క్రూరమ్ముగా నిట్టులున్?
      దూఱన్ దండ్రియె మాటరాక యొరిగెన్, దుర్బుద్ధి నిల్లాలికిన్
      నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్!"

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  7. దారల్ చూడగ పెక్కురీతులిలలో ధైర్యస్థులున్ జ్ఞానులున్
    భీరుల్ లోభులు భూరిదాతలుగ నీ విశ్వంబులో నుందురే
    భారంబీ మగవారటంచు దలచే పద్మాక్షు లౌ వారికిన్
    నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింపరేయింబవల్.

    రిప్లయితొలగించండి
  8. పూరణకై కైపదమిది
    “నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే”
    భీరువు లిదిగని వెఱ విడి
    నేరుగ పతులపయి వాడ నివ్వెర బడిరే

    రిప్లయితొలగించండి
  9. పోరును పతితో నెన్నఁడు
    కోరికలను తీర్చకున్న కోపమునొందున్
    నోరార పలకరించదు
    నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే

    రిప్లయితొలగించండి
  10. నోరారన్పతి నెన్నడేనిసతి యన్యోన్యంబుగా నర్మిలిన్
    రారమ్మంచు నయోక్తులన్ బలుకుచున్ లాలింపగా నేరదే
    ఘోరంబౌ పగిదిన్ గయాళితనమున్ క్రూరంబుగా వర్తిలున్
    నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్

    రిప్లయితొలగించండి
  11. కందము:
    నోరార పతినిఁబిలువగ
    నూరెదరే కత్తులకట నోర్ముయ్యనుచున్
    ఔరా ఏమి కుటుంబము?
    నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే?
    కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  12. చీరల్ సొమ్ములు కొన్నచో ముదమునన్ చెన్నార ముద్దీయగన్,
    గారాబమ్మున చూచు చో మధురసత్కమ్రోక్తులం బల్కగన్,
    క్రూరుండై నిరతమ్ము దుష్టమతియై కోపించుచో కొట్టుచో
    నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  13. రారమ్మని పిలుచుటకే
    నోరున్నది, మగనిఁదిట్టి నొప్పించుట కే
    నారీమణి సిద్ధపడదు!
    క్రూరంగా సంచరించ కోపము రాదా?

    నోరిచ్చెన్ గద బ్రహ్మ తిట్టి పతినిన్ నొప్పించ రేయింబవల్
    ఔరా!యిట్లనఁజెల్లునా!యబలలన్,హర్షాతిరేకమ్ముతో
    రారా!కౌగిటఁజేర్తు నిన్ననుచు గారాబంబుగాఁబల్కి శ్రీ
    వారిన్ ముద్దుల ముంచి యెత్తు సఖి నే వాడన్ కవీ!కానవో?

    రిప్లయితొలగించండి
  14. రారా!రమ్మనటంచు బిల్వదరికిన్ రా,జంకు శ్రీ వారినిన్
    గారాబమ్ముగ ముద్దు,కౌగిలీయమనగన్,కామ్యంబులే దీర్చకన్
    క్రూరంబై,కసి మాటలన్ బలుకగా కోర్కెల్ ,ప్రకోపించగా
    నోరిచ్చెన్ గద బ్రహ్మ,దిట్టె పతినిన్,నొప్పింప రేయింబవల్!!

    రిప్లయితొలగించండి
  15. రారా యనుచును బిలువగ
    జేరన్ రాక,పతి కోర్కె జెప్పగ,జడుడన
    భారంబుదీర ,సతులకు
    నోరున్నది మగని దిట్టి నొప్పించుటకే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కందం రెండవ పాదం చివర తప్పక గురువుండాలి.

      తొలగించండి
  16. ఈరోజులలోవార్తలు
    ధారుణిలోజరుగుచున్న దౌష్ట్యపు చర్యల్
    నేరుగ వీక్షించ తెలియు
    నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే

    రిప్లయితొలగించండి
  17. చేరన్ వచ్చును చెంతకా విభునిచే చేకూర నైశ్వర్యముల్
    దూరమ్ముంచును సంపదల్ ముడిగినన్ తోరంపు ద్వేషమ్ముతో
    భారమ్మంచు తలంచినన్ గతపు సద్భావమ్ము వర్జింపగా
    నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్

    రిప్లయితొలగించండి
  18. శార్దూలము:
    భారమ్మైనది జీవనమ్ము నొసటన్ బ్రహ్మిట్లు రాసెన్గదా
    కోరన్మేడలు మిద్దెలున్ నిలువగా కొంపైన లేదే కనన్
    నారీశారద కోపగించి పతిపై నాకీ కవిత్వంబిచ్చెగా
    “నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  19. ఏరీతిన్ వచియింతునాదు వెతల
    న్నీనాడు నానోటితో
    పారావారము దాటి పోయితిని నా
    భార్యన్ సుఖింపంజేయగా
    మారన్ లేదయినన్ ,సదా గొనుగుచున్
    మాటాడు క్రోధంబుచే
    నోరిచ్చెన్ గద బ్యహ్మ దిట్టి బతినిన్
    నొపింప రేయింబవల్

    రిప్లయితొలగించండి
  20. మూరినఁ బరిపాలనమున
    నోరున్నది మగనిఁ గాంచి నుతియింపంగన్
    ఘోరుఁ డయినచోఁ బ్రజలకు
    నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే

    [మగఁడు = రాజు]


    ఔరా పూరుష పక్ష పాత మిది లోకాలిన్ సుఘోరమ్ముగాఁ
    గారే యీ మగ వారు క్రూరులు ధరం గాంతా మణుల్ క్రూరలా
    నో రీ లేదె విరించి తిట్టి సతినిన్ నొప్పింప రేయిం బవల్
    నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్

    రిప్లయితొలగించండి
  21. క్రూరపు బలుకులె యీయవి
    నోరున్నది మగనిదిట్టి నొప్పించుటకే
    వారిని దుర్మార్గులుగా
    నోరుందని పలుకసబబె నూకల సాయీ!

    రిప్లయితొలగించండి
  22. నోరిచ్చెన్ గదబ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్
    నోరిచ్చెన్ గద యంచు దిట్టుచు రమా!నొప్పింతువే ధర్మమే
    నోరున్ వాడుము దైవ చింతనకునే,నొప్పించ గాజేయకే
    వారున్ జెప్పెదరట్లు చెప్పిన వినన్ భావ్యంబు గాదోచెనే?

    రిప్లయితొలగించండి
  23. తీరుగ నడిగిననొసగక
    కోరిన దేదియునొసగక కూళుండగుచున్
    క్రూర ముగాగన ననెనిటు
    నోరున్నదిమగనిదిట్టి నొప్పించుటకే

    మరో రెండు పూరణలు

    నోరే నారికి సర్వము
    నోరే భర్తను పొగడుచు నోర్మిని చూపన్
    సారెకు తప్పులు చేయగ
    నోరన్నదిమగని దిట్టి నొప్పించుటకే.

    మారెను లోకము చూడుడు
    తీరుగ బార్యనలనాడు తిట్టుచునుండెన్
    కోరిక తీరని సతికిక
    నోరున్నది మగని దిట్టి నొప్పించుటకే

    రిప్లయితొలగించండి