7, డిసెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3924

8-12-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని”
(లేదా...)
“పతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై”

27 కామెంట్‌లు:

  1. బాల్యచాపల్యవశమునబాలకుంతి
    సూర్యువరమునబోందెనుసూనుకర్ణు
    పాణిగ్రహణంబులేనిదౌపడతిగాగ
    పతినిఁగూడకసచ్ఛీలవడసెసుతుని

    రిప్లయితొలగించండి
  2. అతివ కుంతియె లావణ్య మతియసింప
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని
    మతిని దలచిన మంత్రంబు మహిమ వలన
    పాండు రాజుకు పుత్రుని పడతియొసగె.

    రిప్లయితొలగించండి

  3. పింగళాక్షుని ప్రార్థించి విధవరాలు
    పొందె గాదె భీమకవిని నందనునిగ
    నట్టి గాధను చదివిననబ్బురంబె
    పతిని గూడక సచ్చీల పడసె సుతుని.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. తేటగీతి
      సమయపాలనమెంచెడు సతినిఁ గాంచి
      మోహమందున మితిమీఱి పొందుఁ గోరఁ
      బ్రాజ్ఞురాలిగఁ దా నపరాహ్ణవేళ
      పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని!

      మత్తేభవిక్రీడితము
      రతిపై మోహము పొంగులెత్తఁగనె వేళాపాళలే మీరుచున్
      గుతుకమ్మై సతి పొందుకోరు మగనిన్ గుర్తించి లాలించుచున్
      మతిమంతమ్ముగ మోజుదీర్చి, యపరాహ్ణంబైన వేళైనచోఁ
      బతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై!

      తొలగించండి
    2. మత్తేభవిక్రీడితము
      యతి సేవన్ తరియించి మంత్రమిడగా నందంగ తా నార్కినిన్
      వెతలన్ జింతనఁ గుంతి మంజసమునన్ వీడంగ స్రోతస్వినిన్
      సుతులన్ బొందఁగలేని రాధ నదిలో సొంపార వీక్షించుచున్
      బతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై!

      తొలగించండి
  5. మునియొసంగిన మంత్రాన ముదిత కుంతి
    సూర్య దేవుడు వరమీ య సుదతి యపుడు
    పతిని గూడక సచ్ఛీ ల వడసె సుతుని
    యతఁడె కర్ణుడై యశమందె నవని యందు

    రిప్లయితొలగించండి
  6. అతులంబైనదిశాస్త్రసంపదయఁజూనావిర్భవింపంగజా
    గ్రుతితోవాదమువీడుచున్వనితతాక్రుత్యంబువిజ్ఞానియై
    సతిగానాధునిమెప్పుతోసదమలశ్యామాంగిగర్భంబుతో
    పతిసంపర్కములేకపుత్రునిఁగనెన్వామాక్షిసచ్ఛీలయై
    ఆధునికపద్ధతిద్వారా

    రిప్లయితొలగించండి

  7. అతివల్ నవ్విరి యామె కోర్కెవిని ప్రేయాంసుండె లేకుండగా
    సతికేరీతి జనించు బొట్టెయని హాస్యంబాడిరే కాని శా
    శ్వతుడివ్వన్ వరమావితంతువునకున్ బ్రాప్తించె గా పుత్రుడే
    పతిసంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై.

    రిప్లయితొలగించండి
  8. కుంతిభోజుని పుత్రిక కుంతి సహన
    శీలి దూర్వాస మునియొక్క సేవలోన
    తరుణి తరియించి వింతైనవరముబొందె
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని

    రిప్లయితొలగించండి
  9. పెనిమిటికి వింత తెగులు కోవిడు దగులగ
    కొన్ని దినములకాతడు గుశలమొందె
    నీమము విధముగ కొలది నెలల దనుక
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది

    అంద చందములకు నాకర్షితుండయి
    పరుని భార్య యనెడు భయము లేక
    కోరిననర/పతినిఁగూడక సచ్ఛీల
    వడసె సుతుని/తనదు భర్త వలన.

    మత్తేభము

    సతి యెన్నో వ్రతముల్ సదా ముదముతో సంతానముంగోరియున్
    ప్రతి మాసంబును జేయబూనె నకటా! వాంఛార్థముందీరునే
    పతి సంపర్కము లేక,పుత్రునిగనెన్ వామాక్షి సచ్ఛీలయై
    పతి సంపర్కముఁజేసి తత్కులము విభ్రాజిల్ల తారార్కమున్.

    రిప్లయితొలగించండి
  11. యతి మంత్రంబు బరీక్ష జేయ మన
    మందాసించి కుంతీ వెసెన్
    మతిలోనెంచి రవిన్ పఠించె నపు
    డున్ మార్తాండు డేతెంచి యా
    సతి కోర్కెన్నెర వేర్చెనపు డాశ్చర్యం
    బుగా, నట్టులన్
    పతి సంపర్కములేక పుత్రుని గనెన్
    వామాక్షి సచ్ఛీలయై

    రిప్లయితొలగించండి
  12. మతిలోనన్ తలపోయుచున్ తపసిదౌ మంత్రమ్ము సద్భక్తి గో
    పతిఁ బ్రార్థింపగ వచ్చియిచ్చెసుతు నాపద్మాక్షికిన్ నెమ్మితో
    పతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై
    సతియై వెల్గెను పాండు రాజునకుతా సత్పత్నియై యెంచగా

    రిప్లయితొలగించండి
  13. యతిశాపంబున పాండురాట్విభుఁడు తా నామంత్రణంబీయగా
    సుతులన్బొందగ కుంతి మంత్రమహిమన్ శోభిల్ల వంశంబు నా
    సతియున్బొందెను పాండునందనునిగా సాక్షాత్తు ధర్మేంద్రునిన్
    పతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    పెరిమ గల్గి దుర్వాసుడు వరము నీయ
    కుంతి యాశపడుచు దాని గొప్ప నెఱుగ
    భానుమూర్తిని ప్రార్థించె భక్తి మీఱ
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని

    రిప్లయితొలగించండి
  15. పూజ లొనరించి నిరతమ్ము పుణ్యవతియె
    చాల నిష్ఠను దా నుండి చారుమతియె
    మానవతి గర్భవతి కాఁగ మరల మరల
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని


    అతి గోప్యమ్ములు ధర్మ సూక్ష్మములు గూఢార్థమ్ములన్ వెల్గు సు
    వ్రత దుర్వాస మునీంద్ర దత్త వరయై పత్యాజ్ఞఁ గుంతీ మహా
    సతి పాటించి తలంచి మంత్రమును దా స్వాంతమ్మునన్ ధర్మజుం
    బతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై

    రిప్లయితొలగించండి
  16. వరము నొందిన యాకుంతి బ్రధ్ను బిలువ
    పుట్టెకొమరుడు కుండల పుప్రభ తోడ
    పతిని గూడక సచ్ఛీలవడసె సుతుని
    దెలియ వచ్చెను నిట్టుల కలుగు కతన

    రిప్లయితొలగించండి


  17. Creation and development pvt. ltd. a powerful group of creatives individuals advancement and Marketing Expert. We are website development company in delhi.
    We are driving IT Consulting and web arrangement supplier for custom programming, site, games, custom web application, endeavor portability, versatile applications and cloud-based application plan and advancement.

    రిప్లయితొలగించండి
  18. పతి సంపర్కములేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై
    సుతులున్బుట్టుదురీ యుగంబున రమా!చోద్యంబు లేదిందులో
    నతిగా యోచన జేయకుండకుము,మాయాలోకధర్మంబిదే
    పతియౌ వేంకట నాధునిన్ గొలుము వేభక్త్యాను రాగంబుతో

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రుడు శ్రీ చక్రవర్తిగారికి
    కృతజ్ఞతలు...


    శ్రుతిశీర్షాగ్రవిరాజమానుడు విరాడ్రూపుండునై శ్రీశ్రియః
    పతి భక్తావనదుష్టశిక్షణపరవ్యాపారనైమిత్తికో
    ద్యతగోపాబ్జముఖీసుతుండగుటచే యా నందరాడ్పత్ని త
    త్పతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  20. శాప కతమున రాజుకు సంతులేక
    వంశమునునిల్పు నిచ్చతో వనితకుంతి
    పాశి నావాహనముసేయ భక్తితోడ
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని

    రిప్లయితొలగించండి
  21. ముద్దు మురిపాలు చిందించి ముదము కూర్చ
    బాలలే నాకు లేరని బాధ నొంద
    నేటి వైద్యుల ఘనతచే మేటి గాను
    పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని

    గొర్రె రాజేందర్
    సిద్ధిపేట

    రిప్లయితొలగించండి
  22. Creation and development pvt. ltd. a powerful group of creatives individuals advancement and Marketing Expert. We are best Mobile apps development company in Delhi
    We are driving IT Consulting and web arrangement supplier for custom programming, site, games, custom web application, endeavor portability, versatile applications and cloud-based application plan and advancement.

    రిప్లయితొలగించండి



  23. website development company in delhi pretty much consistently brand and venture are picking imaginative apparatus and application to be at the highest point of the market.and this is potential reaon site devevelopment organization in delhi,india is so impertaively prestigious and mentioned.

    website development company in delhi

    రిప్లయితొలగించండి