16, డిసెంబర్ 2021, గురువారం

సమస్య - 3933

17-12-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఐదుగు రయోధ్యలోన రామయ్య సతులు”
(లేదా...)
“ఒప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామపత్నులై”

26 కామెంట్‌లు:

  1. హనుమవిడువడురామునియండనుండు
    భరతశత్రుఘ్నులెప్పుడుపట్టియుండ్రు
    సీతలక్మణుండునురాముసేమమరయ
    ఐదుగురయోధ్యలోనరామయ్యసతులు

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. తేటగీతి
      రావణు వధియించి విజయలక్ష్మి నంది
      జానకీసతి తోడ యశమ్ము గూడ
      ధర్మదేవత వెన్నంట ధరణినేల
      నైదుగు రయోధ్యలోన రామయ్య సతులు

      ఉత్పలమాల
      రప్పున లంకలో విజయలక్ష్మిని జేకొని,పొంది జానకిన్,
      జొప్పడ కీర్తికాంత, విన సొంపుగ మోమున ధర్మదేవతన్
      దప్పడనన్, మహీపతిగ దైవముగన్ బ్రజ మెచ్చుచుండగన్
      ఒప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామపత్నులై!
      (రప్పున = వేగముగా)

      తొలగించండి
    2. ఉత్పలమాల
      చొప్పడి లక్ష్మి రూపమున శోభిల దాసిగ కార్యమందునన్
      మెప్పును బొంద మంత్రివలె మించగ రంభననంగ కేళిలో
      నొప్పచు దల్లిగన్ గుడుప నోర్మిని మించుచు ధాత్రి సీతలో
      నొప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామపత్నులై!

      తొలగించండి
  3. పొగడి విశ్లేష మొనరించె పుర జనాళి
    సద్గుణంబులు నాలుగు చక్క నైన
    జానకిన్ వరి యించగ సతు లైరి
    యై దుగుర యోధ్య లోన రామయ్య సతులు

    రిప్లయితొలగించండి

  4. రావణుని సంహరించిన రాముడపుడు
    తానయోధ్యజేరినతరి ధైర్యలక్ష్మి
    రాజ్యము యశము న్యాయము రమణి సీత
    లైదుగురయోధ్యలోన రామసతులు.

    రిప్లయితొలగించండి
  5. ఓప్పగుధర్మమున్వెలుగునోడకరామునిధర్మపత్నియై
    చెప్పగసత్యమున్తనదుచెంగటవంగునుసత్యవాణియున్
    మెప్పునసీతతోడగనమేదినిశాంతయుగూడిరాయెడన్
    ఓప్పులకుప్పలైదుగురయోధ్యనుఁజేరిరిరాముపత్నులై

    రిప్లయితొలగించండి

  6. చెప్పకుమిట్టిమాటలని చెప్పితి నింతకు ముందె కాని యా
    బొప్పడు చీత్కరింపదగు మూర్ఖుడెవండొ వచించెనంచు వా
    డిప్పుడు పల్కుచుండెగద హీనుడు తానిటు లాలకింపుడీ
    యొప్పులకుప్పలైదుగురయోధ్యకుజేరిరి రామపత్నులై.

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    ధర్మ పుణ్యవర్తన శౌర్య దానగుణము
    లొసగు కీర్తికాంతల తోడు లోలనయన
    జానకిని గూర్చి జూడగ సందుకొనిరి
    యైదుగురయోధ్యలోన రామయ్య సతులు.

    రిప్లయితొలగించండి
  8. పాండవులు,మసీదుకలదు,పంపె దివికి
    దునిమి రావణునియనిని,తోలు దాల్పు
    కాపురంబున,గిరిపైన,గలరిరువురు
    ఐదుగురయోధ్యలోన రామయ్య,సతులు.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    మెప్పునొసంగుచున్ సతము మెల్పుగ నంటిన ధర్మ గర్తయున్
    ఒప్పగు దానకాంతయును యుక్తమునైన ప్రవృత్తి కాంతయున్
    తప్పులడంచు శౌర్యగుణ తన్వియు జానకి తోడ గూడుచున్
    యొప్పులకుప్ప లైదుగురయోధ్యకు జేరిరి రామపత్నులై

    రిప్లయితొలగించండి
  10. మత్స్యమును గూల్చె బాండవ మధ్యముండె ,
    తల్లి మాటను పాటించ ద్రౌపది పతు
    లైదుగుర,యోధ్యలోన రామయ్య సతులు
    రాజ్య లక్ష్మికి సీత కలయనిరువురు

    రిప్లయితొలగించండి
  11. రావణుని గెలువ విజయలక్ష్మి దక్కె
    భార్య సీతమ్మ వెంట సౌభాగ్యలక్ష్మి
    రాజ్యలక్ష్మి మరియు యశోలక్ష్మి నడువ
    ఐదుగు రయోధ్యలోన రామయ్య సతులు

    రిప్లయితొలగించండి
  12. రాజ్య పాలనము‌ ఎలా‌ ఉన్నది అని‌ రాముడడిగి‌‌ నప్పుడు మంత్రులు తెలుపు సందర్భము


    రక్షకభటులకు రాత్రులందు నిదుర పెరిగెను దొంగలు తరిగి పోవ,

    భక్ష్యభోజ్యములెల్ల పాకశాలల దాటి కదలకుండెను బిక్షగాళ్లు లేక,

    బంథిఖానాలెల్ల పాడు పడు చునుండె నేరముల్‌ చేసెడి వారు లేక,

    నాయుధసామాగ్రి కాయువు క్షీణించె శత్రు వుల్ లేకదేశమ్ము లోన,

    సోమరి తనమెల్ల శుష్కించ ప్రజలెల్ల సుందరా కారులై శోభ బడిసె


    దుర్భిణిన్ వేసి చూచినన్ దొరకు కుండె

    రైదుగురయోధ్య లోన రామయ్య, సతులు

    పతుల తోగూడి ముదమును బడయచుండి

    రనుచు పలికె మంత్రులువంద నము లిడుచు

    రిప్లయితొలగించండి
  13. ముగ్గురమ్మలనుంగుతమ్ముళ్లిరువురు
    నైదుగు రయోధ్యలోన రామయ్య! సతులు
    పార్వతీరమాశారదల్,ప్రజలు మెచ్చి
    సీతకును నీకు స్వాగత గీతు లిడరె.

    ఒప్పులకుప్పలైదుగురయోధ్యకుఁజేరిరి రామపత్నులై
    యొప్పిరి సీత రూపున నహో!యని యందఱు జూడ,
    రాముడున్
    చప్పున తీయ బాణమును చయ్యన నల్వురు దైత్య కాంతలున్
    తప్పయి పోయె నంచును తదాకృతులన్ విడినారు భీతితోన్.

    రిప్లయితొలగించండి
  14. చొప్పడు నీ విదేహసుత, సుందరిపంక్తిశతాంగు కోడలున్,
    మెప్పుల నొందు భూతనయ, మేల్మి రమాంశసముద్భవాంగియున్,
    దెప్పరమైన కీర్తి దృఢదీక్షుడు శ్రీరఘురాము జాయ, యీ
    యొప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామపత్నులై

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. తేటగీతి
    పాండు సుతులు ,ఘనమగు దేవాలయంబు ,
    రావణబ్రహ్మను దునిమె రణము లోన ,
    బ్రహ్మ, హరిహరులకు వాణి ,రామ ,గౌరి
    ఐదుగుర, యోధ్యలోన ,రామయ్య ,సతులు.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.(క్రమాలంకార పూరణ)
    రామ-లక్ష్మీ దేవి.

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. రఘు కులాంభోధి చంద్రుండు రాముఁ డయిన
      సత్య ధర్మానుకంపన శౌచ వినయ
      ము లను కాంతా శిరో రత్నములు ధరిత్రి
      నైదుగు రయోధ్యలోన రామయ్య సతులు


      గొప్ప ధనుర్ధరప్రవర కోటి వరేణ్యుఁడ వీవు ధాత్రి నే
      నెప్పుడు చూతు నిన్నిట నిజేశ్వరి యుండఁగ గ్రాహ్య హస్తయై
      కప్పుర గందు లోజ నిజ కాంతులఁ గూడి ముదమ్ము మీఱఁగా
      నొప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామ! పత్నులై

      తొలగించండి
  17. అరయ ధర్మము న్యాయమ్ము నార్తి జనము
    ధర్మపత్నియా సీతమ్మ నర్మ సచివు
    లైదుగురయోధ్యన రామయ్య సతులు
    మడమ తిప్పని యోధుడు మన రఘుపతి

    రిప్లయితొలగించండి
  18. నిప్పు సమాన రామునకు నిక్కము
    బాణము, మాట,పత్నియు
    న్నెప్పటి కైన నొక్కటిది యెల్లరె
    రుంగుదు రీధరాస్థలిన్
    'ఒప్పలకుప్ప లైదుగు రయోధ్యకు
    చేరిరి రామ పత్నులై'
    తప్పుడు మాట జెప్పబడె ధర్మము
    దప్పి యిదేమి చిత్రమో.
    ~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  19. ఒప్పులకుప్ప లైదుగురఋయోధ్యకు జేరిరి రామపత్నులై
    యప్పడతుల్ ననంగనిల నాయమ సీతయు ధర్మమున్నికన్
    గొప్పగుణంబుగా నలరు గూర్మియు సత్యము బ్రేమజూపుటల్
    యప్పతి రామచంద్రునకు నర్హత నొందిరి పత్నులై ధరన్

    రిప్లయితొలగించండి
  20. చెప్పెద చక్కగా వినుము శ్రీ రఘురాముని గాధనంగ నే
    చప్పున చెంత జేరితిని, చప్పగ సాగె ప్రసంగమయ్యయో
    తప్పులు కుప్పలై దొరలె తన్నులు దప్పవు వీనికింక యే
    ఒప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామపత్నులై

    రిప్లయితొలగించండి
  21. చొప్పడ పోరులో జయము శూరుని కిన్ జయ లక్ష్మి చిక్కగా
    చప్పున కీర్తి కాంతయును జానకియున్ జనుదెంచ, రామునిన్
    గుప్పున సత్యధర్మములు కూడ ప్రజాళులు పల్కి రాస్థతో
    నొప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామపత్నులై

    రిప్లయితొలగించండి
  22. వేయి కన్నుల తోడను వేచి రచట
    నైదుగురయోధ్యలోన రామయ్య, సతులు
    మాతలు ముగురు మరియు ను మాండవి శ్రుత
    కీర్తి ప్రభృతులు కాంక్షతో క్షితిజ కొరకు.

    రిప్లయితొలగించండి