13, డిసెంబర్ 2021, సోమవారం

సమస్య - 3930

14-12-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల"
(లేదా...)
"పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో"
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

47 కామెంట్‌లు:

  1. మంచిఁజూడగనెంచినమాయలేక
    నిలచుజన్మలయందుననిలుకడగను
    కట్టెలందునకాయముకాలునయ్య
    పోయెడిదిపోయెఁబోనిదిపోవుటేల

    రిప్లయితొలగించండి
  2. ధర్మజుఁడు జూదములో ద్రౌపదిని యొడ్డునపుడు భీముని అంతరంగము...

    తేటగీతి
    భ్రాత! చంచలమైన సంపదలు జారె!
    జూదమందున నోడితె సోదరులను
    పరువునెంచక యొడ్డుదె బత్నిఁ గూడ?
    పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల?

    ధర్మజుఁడు జూదములో ద్రౌపదిని సైతము నోడిపోయిన తర్వాత భీముని అంతరంగము...

    ఉత్పలమాల
    మాయలమారి యా శకుని మానము దీయఁగ జూదమెంచెనో?
    కాయగ పందెముల్ సిరులు గాదిలి తమ్ముల నోడిపోతిరే!
    సాయక సోదరా! సతిని సైతము నొడ్డగఁ బోయె గారమే
    పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  3. ఉన్న జలుబుకు మందీయ నూ డె ముక్కు
    జలుబు రోగము బోయెను జక్కనైన
    నంగమే పోయె ననియె తా నార్తి తోడ
    "పోయెడిది పోయె బోనిది బోవు టే ల? "

    రిప్లయితొలగించండి
  4. రాతల,తలపై గీతల, చేత, చేత
    పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల
    మానుము రణమనుచు జెప్ప మంత్రులు,పది
    తలల రావణుడది మది తలపడయ్యె.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి:
    కాశి గయ వెళ్ళివదలితి కాయగూర
    బెండ కనిపించినపుడెల్ల పీకుచుండు
    తినకయున్నను కాంక్షయు తీరలేదె
    "పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెళ్ళి' వ్యావహారికం. 'గయకేగి' అందామా?

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. ఓహో అలాగేనండీ..ధన్యవాదములు.
      తేటగీతి:
      కాశి గయ కేగి వదలితి కాయగూర
      బెండ కనిపించినపుడెల్ల పీకుచుండు
      తినకయున్నను కాంక్షయు తీరలేదె
      "పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల"

      తొలగించండి

  6. ద్యూతమందున రాజ్యమ్ము తొలగనేమి
    సంపదలశాశ్వతమనంద్రు జగతియందు
    కలికినోడుటదియె యతఖ్యాతి కాదె
    పోయెడిదిపోయె బోనిది పోవుటేల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అని+అంద్రు' అన్నపుడు సంధి లేదు. "అటంద్రు" అనండి.

      తొలగించండి
  7. పోయిన బోవు గాక యిల పొందిన సొమ్ము ధనమ్ము గీములున్,
    పాయని యర్ధదేహ సహవాసి సతీమణి పోయె,సత్యవా
    గ్ధ్యేయఫలమ్మొ? సత్యవిభుకీర్తులకున్ బలి యయ్యె సంతు, కో
    ల్పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో?

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ

      న్యాయము దప్పి కేకయ వినాశము గోరి సుతాధికారవాం
      ఛాయమితాంతరంగయయి సన్నుతరాఘవు నంప కానకున్
      పోయె ధరాధిపాలనము పోయె నటన్ సహధర్మపత్నియున్
      పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో?

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. రోయక వక్రమార్గమున రూడిగ
    బెంచెను సర్వ సంపదల్
    పాయక శాశనంబు గని వైచెను
    దాడిని వాని యింటిపై
    పోయెను దొంగిలించినది పోయెను
    న్యాయ ధనార్జనంతయున్
    పోయెడి దేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  9. కాయమశాశ్వతంబదియుకాలముముందుగనిర్ణయించుగా
    దాయలుమాయమౌదురనుతాపమువీడుమువీరుడామదిన్
    ఛాయలభీరులక్షణముజారగఁజేయుముసౌఖ్యమందగన్
    పోయెడిదేదోపోయినదిపోనిదిపోయెనదేమిచిత్రమో
    భగవానుడు అర్జునునితో

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. సరిగ ప్రత్యేక హోదాకు సాటియైన
      కీల కంబగు ప్యాకేజి కేంద్ర మిత్తు
      ననగ చట్టము సేయంగ నడుగలేర
      పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల

      తొలగించండి

  11. ఖాయము గానిసంపదలు కైతనమందున నోడ నేమిరా
    శ్రేయము గాదు సత్యమిది శీలవతిన్ పణమందు నిల్పుటే
    మాయని మచ్చయే కద సమజ్ఞ నశించెనదెంత ఘోరమో
    పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  12. వ్యక్తికి ధనముడుగు గాని ప్రథితి పోదు ,
    దుష్టుడని దెలిసిన గూడ దుడ్డునీయ
    పోయెడిది పోయెఁ ; బోనిది పోవుటేల
    వాడు దానితోడ దగని పనులు జేయ

    రిప్లయితొలగించండి
  13. ఉత్పలమాల:
    సోయగమెంతమాయ!వయసున్ పెనవేసి జిగేలుమన్నదే
    ప్రాయపు రెక్క గట్టి హృది భావనలందువిహంగమయ్యె,నే
    డీయన వృద్ధుడంచు నొకటేగుచు నన్నిటు లొంటి జేసెపో
    "పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో"
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  14. దాయలు ధార్తరాష్ట్రులట ద్వైధ్యపు ద్యూతమొనర్ప దుర్విధిన్
    పోయెను పాండునందనుల పోడిమి, నిండు సభాంతరంబునం
    దా యెలనాగ ద్రౌపదికి యంకిలి యేర్పడె నివ్విధంబుగన్
    పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  15. ఎండ నెండెడు బట్టలు నెగిరి పోయె
    నుతుకు చున్నట్టి బట్టలు నుధృతమైన
    వరదలోఁగొట్టుకొని పోవగ రజకుఁడనె
    పోయెడిది పోయె పోనిది పోవుటేల?

    మాయురె!గాలి వీచగ నమాంతము నెండెడు బట్టలక్కటా!
    పోయెను,వానిఁబట్టుకొనఁబోవగ,రేవును ముంచె నీరమున్
    పోయె నదీ ప్రవాహమునమొత్తము బట్టలు రేవఁడిట్లనెన్
    పోయెడి దేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెంటికి చెడ్డ రేవడిపై మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. దాయలొనరింప ద్యూతము ద్వైధ్యముగను
    ధనము రాజ్యముగోల్పోయె ధర్మజుండు
    దుర్యశమునొందెనుసుదతి ద్రుపదపుత్రి
    పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    దుర్వ్యసనపరుండైనట్టి ధూర్తు డొకడు
    ద్యూతమున సర్వసంపద తొలగి బోవ
    తాళిబొట్టమ్మ వలదనిదార నుడివె
    పోయెడిది పోయె బోనిది పోవు టేల.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  18. మాయలు చేసి, భర్తపయి మన్నన జూపుచు చేరిచెంత న
    న్యాయపు పోకడన్ గలుగు నజ్జుక వేరొక వాని చేరగా
    రోయుచు పత్ని కోపమున క్రూరునిగా మదినెంచి వీడెతాన్
    పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  19. [14/12, 09:44] Sreedevi Aravalli: మాయ చేసిన పగిది,కాయమది కృంగె
    వయసు మీదపడగదాడి వైన మేమొ
    మనసులోని మమతలవి మాయ మవవె
    పోయెడిది పోయె బోనిది పోవుటేల?!!

    గాయము లెన్నియో మదిని కారము పూసిన మంటలే యనన్
    మాయని గుర్తులై చెలగి మానస మందున తిష్ఠ వేసినన్
    శ్రేయమ నంగ చింతనను శ్రీహరి నామము నిల్పనెంచగా
    పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  20. ప్రాయము నందురానిదన ప్రాభవ మందుచు తొంగి జూడగన్
    దాయగ లేనిదై హృదిని తాండవ మాడెడి ప్రేమభావమే
    తీయని గుర్తులై సలుప తీరము జేరని జీవితమ్మునన్
    సోయగ మెంతవాడినను శూలిని భక్తిగ గొల్వకన్
    పోయెడిదేదొ పోయెనది పోనిది పోయేనదేమి చిత్రమో!!

    రిప్లయితొలగించండి
  21. పోయెడిది పోయె బోనిది పోవుటేల
    మాయగా నుండె నీయది మహిమ యేమొ
    పరమ పురుషుని గరుణను బట్టి కలుగు
    సిరులు సంపద లన్నియు శేషసాయి!

    రిప్లయితొలగించండి
  22. పోయెడిదేదొ పోయినది పోనిది పోయె నదేమి చిత్రమో
    పోయెడి యోగమున్నపుడు పోవును దప్పక చింతయేలయా
    పోయెను నంచుబాధపడ పోయినదెట్లును రాదుగా నికన్
    నాయముపాశ ఖండునకు నార్తిని పూజను జేయగా దగున్

    రిప్లయితొలగించండి
  23. అక్క చెల్లెండ్రు చక్కంగ నాడు చుండ
    నేఁగ నగరికి దారిని నీల్గె నక్క
    చెల్లె లక్కట పోయెను దల్లడిల్లి
    పోయెడిది పోయెఁ బోనిది పోవు టేల


    ఆయత ధీర యా వినత యన్నుల మిన్నయె పెద్ద వేడ్కతో
    నో యని పిల్వ స్నేహమున సోదరి కద్రువ తోడ నత్తరిన్
    వేయఁగఁ బందెమే వినత బింకము సెల్గఁగ నోడి నంతటం
    బోయెడి దేదొ పోయినది పో నిది పోయె నదేమి చిత్రమో

    [పోను = పోయిన; ఇది (బింకము) పోయెను]

    రిప్లయితొలగించండి
  24. కపటజూదమందునజూడ కౌరవులకు
    కలిగెను జయము శకునిచే ఘనముగా ను
    పాండుతనయులకు తొలగె‌భాగ్యమదియు
    పోయెడిది పోయెఁ బోనిది పోవుటేల"*

    మరొక పూరణ

    అప్పు తెచ్చి వేసితి నాట్లు న వని యందు
    కురియ భోరన వర్షమ్ము కూలెనాశ
    కలుగు లాభమనెడి మాట కల్లయయ్యె
    పోయెడిది పోయె పోనిది పోవుటేల

    రిప్లయితొలగించండి